DailyDose

అమెరికాలో ప్రమాదం.. ప్రకాశం జిల్లాలో విషాద ఛాయలు – TNI నేర వార్తలు

అమెరికాలో ప్రమాదం.. ప్రకాశం జిల్లాలో విషాద ఛాయలు  – TNI  నేర వార్తలు

* జీవనోపాధికోసం కువైత్‌ వెళ్లిన ఓ పేద మహిళను ఏజెంటు, అతని మిత్రుడు తమ కామవాంఛ తీరిస్తేనే మంచి ఇంట్లో పనికి కుదురుస్తామంటూ ఆమెను ఓ గదిలో బంధించి చిత్రహింసలు పెట్టారు. ఆహారం, నీరు అందించకుండా పస్తు పెట్టి.. దురాగతానికి పాల్పడ్డారు. బాధిత మహిళ తన భర్తకు సోమవారం రాత్రి తన దుస్థితిని వీడియో తీసి ఫోన్‌ ద్వారా పంపించారు. తిరుపతి జిల్లా ఎర్రావారిపాలెం మండలం బోడేవాండ్లపల్లె పంచాయతీకి చెందిన ఓ మహిళ(26) ఈనెల 24న కువైత్‌ వెళ్లారు. చెంగల్‌ రాజు అనే ఏజెంట్‌ ఆమె గల్ఫ్‌ చేరేందుకు సహకరించాడు. అక్కడికెళ్లాక ఓ ఇంట్లో పనికి కుదిర్చారు. అక్కడ బాగోలేకపోవడంతో ఇల్లు మార్చమని ఆమె కోరింది. ఏజెంట్‌ చెంగల్‌రాజు, అతడి మిత్రుడు బావాజీ ఇదే అదునుగా ఆమెను అక్కడ ఓ గదిలో బంధించారు.తమ కోరిక తీరిస్తేనే ఇంకో ఇంట్లో పనికి కుదురుస్తామని హింసించారు. నాలుగు రోజులుగా తిండి కూడా పెట్టకుండా నీళ్లు మాత్రమే ఇస్తున్నారని బాధితురాలు భోరున విలపించింది. సోమవారం రాత్రి 10 గంటలకు తిరుపతిలోని తన భర్తకు వీడియో పంపింది. తనను ఎలాగైనా తిరుపతికి తీసుకొచ్చేయమని వేడుకుంది. ఈ విషయమై బాధితురాలి భర్త మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.

*అమెరికాలో విహారయాత్రలో విషాదం చోటుచేసుకుంది. ఫ్లోరిడాలో ప్యారాచూట్ ఫ్లయింగ్ చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలడంతో బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం మక్కేనవారిపాలెం గ్రామానికి చెందిన సుప్రజ అక్కడికక్కడే మృతి చెందింది. సుప్రజ కుమారుడు అఖిల్‌ స్వల్పగాయాల బారిన పడ్డాడు. భారత కాలమానం ప్రకారం మంగళవారం వేకువజామున మూడున్నర గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాద ఘటనతో మక్కేనవారిపాలెం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

*మహారాష్ట్రలో దారుణం వెలుగు చూసింది. కన్న తల్లే తన బిడ్డల్ని కడతేర్చింది. తన ఆరుగురి చిన్నారుల్ని(ఇందులో ఐదుగురు బాలికలు) నిర్దాక్షిణ్యంగా బావి లో విసిరిందని, వారంతా మృతి చెందారని పోలీసులు తెలిపారు. ఇంట్లో జరిగిన గొడవల కారణంగా తల్లి ఇలా ప్రవర్తించిందని వారు తెలిపారు. మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లా మహద్ తాలూకాలో మంగళవారం ఈ ఘటన జరిగింది. మహిళ(30)ను భర్త తరపు బంధువులు తీవ్రంగా కొట్టారట, దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన మహిళ తన పిల్లల్ని అందరినీ బావిలో విసిరేసిందని స్థానిక పోలీసు అధికారి ఒకరు తెలిపారు. చనిపోయిన చిన్నారులంతా 18 నెలల నుంచి 10 ఏళ్ల వయసు మధ్య ఉంటారని ఆయన పేర్కొన్నారు.

* ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మరణించారు. అంబులెన్స్ ట్రక్కు ఢీకొనడంతో ఏడుగురు మృతి చెందారని పోలీసులు చెప్పారు. బాధితుల్లో పిల్భిత్‌కు చెందిన ఒక కుటుంబంలోని ఆరుగురు సభ్యులు ఉన్నారు. ఆసుపత్రిలో వైద్యపరీక్షలు చేయించుకున్న తర్వాత అంబులెన్స్‌లో ఢిల్లీ నుంచి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.ఢిల్లీ-లక్నో జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది.అంబులెన్స్ మొదట రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టి, ఆపై ట్రక్కును ఢీకొట్టింది. ఫలితంగా డ్రైవర్‌తో పాటు వాహనంలో ఉన్న మరో ఆరుగురు మరణించారని పోలీసులు తెలిపారు

*గుజరాత్‌కు చెందిన పటీదార్‌ ఉద్యమ నేత, కాంగ్రెస్‌ మాజీ నేత హార్దిక్ పటేల్ జూన్‌ 2న బీజేపీలో చేరనున్నట్లు ధ్రువీకరించారు. హర్దిక్‌ ఈ నెల 18న కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ముందు హార్దిక్ పార్టీని విడడంతో కాంగ్రెస్‌కు పెద్ద ఎదురుదెబ్బగా రాజకీయ నిపుణులు పేర్కొంటున్నారు. 2019లో కాంగ్రెస్‌లో చేరిన హార్దిక్ పటేల్‌.. 2020, జూలై 11న గుజరాత్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నియామకమయ్యారు. ఆ తర్వాత పార్టీ అధిష్టానం, నాయకత్వం తీరుపై విసుగు చెంది రాజీనామా చేశారు.

*వినుకొండ:- పట్టణంలోని మెయిన్ బజార్ బంగారపు షాపు కి బంగారపు గొలుసు, ఉంగరం కావాలని వచ్చి మోడల్స్ చూసి తమ కుటుంబ సభ్యులకు చూపించి వద్దాం అని వ్యాపారితో పాటు గొలుసులు, ఉంగరాలు తీసుకుని ఒక కాలనీలోని గృహంలోకి వెళ్లి అవి చూపించి, పక్క ఇంట్లో వారికి కూడా చూపించి వస్తానని ఆ వ్యాపారి ని అక్కడే కూర్చుని పెట్టి గొలుసులు, ఉంగరాలు తీసుకుని బయటకు వెళ్లిన వ్యక్తి ఎంత సేపటికి రాకపోవడంతో వ్యాపారికి అనుమానం వచ్చి ఆ ఇంటి వారిని అడగ్గా అతను ఏవరో తమకు తెలియదని ఏదో స్కీమ్ అని చెప్పి మాకు వస్తువులు చూపించాడని అతను ఏవరో మాకు కూడా తెలియదని చెప్పడంతో అవాక్కైన వ్యాపారి గొలుసులు, ఉంగరాలు తీసుకుని వెళ్లిన అజ్ఞాత వ్యక్తి కోసం మిత్రులతో కలిసి గాలింపు చర్యలు చేపట్టినట్లు సమాచారం.

*జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. కుల్గామ్‌ జిల్లాలోని గోపాల్‌పొరా ప్రాంతంలో హైస్కూల్‌ ఉపాధ్యాయురాలిపై కాల్పులు జరిపారు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడగా.. ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మరణించారు. సమాచారం అందుకున్న భద్రతా బలగాలు, పోలీసుల బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఈ ప్రాంతాన్ని చుట్టుముట్టి ఉగ్రవాదుల కోసం సెర్చ్‌ ఆపరేషన్‌ను ప్రారంభించాయి. మృతురాలిని రజనీ భల్లాగా గుర్తించారు.

*బీహార్‌లో గ‌తేడాది కాలం నుంచి మూడు జిల్లాల్లో 620 ఎక‌రాల్లో సాగు చేసిన న‌ల్ల‌మందు(ఓపియం) పంట‌ను ధ్వంసం చేసిన‌ట్లు ఆ రాష్ట్ర పోలీసులు మంగ‌ళ‌వారం వెల్ల‌డించారు. మావోయిస్టు ప్ర‌భావిత జిల్లాలోని జాముయి, ఔరంగాబాద్, గ‌యా జిల్లాల్లో ఈ న‌ల్ల‌మందు సాగు చేస్తున్న‌ట్లు పోలీసులు ప్ర‌క‌టించారు. ఓపియం సాగు ద్వారా మావోయిస్టులు ఆదాయాన్ని స‌మ‌కూర్చుకుంటున్న‌ట్లు తెలిపారు. 2021-22 ఏడాదిలో 620 ఎక‌రాలు, 2020-21లో 584 ఎక‌రాలు, 2019-20లో 470 ఎక‌రాల్లో ఓపియం పంట‌ను సాగు చేసిన‌ట్లు పేర్కొన్నారు.

*ఇద్దరు కుమార్తెలతో కలిసి దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాదకర ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకున్నది. ఆదిభట్ల పరిధిలోని కుర్మల్‌గూడ చెరువులో దంపతులు ఇద్దరు కుమార్తెలతో కలిసి చెరువులో దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. అయితే, ముందు పురుగుల మందు సేవించినట్లుగా సమాచారం. మంగళవారం తెల్లవారే సరికి తండ్రి, ఇద్దరు కుమార్తెల మృతదేహాలు చెరువులో తేలాయి. స్థానికులు చెరువులో గాలించగా.. మరో మహిళ మృతదేహం లభ్యమైంది.

*ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని రాయ్ బ‌రేలీలో ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. ట్ర‌క్కును అంబులెన్స్ ఢీకొన్న ఘ‌ట‌న‌లో ఏడు మంది ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీకి వెళ్లి హెల్త్ చెక‌ప్ చేసుకుని వ‌స్తున్న ఆరుగురు ఆ ప్ర‌మాదంలో మ‌ర‌ణించారు. ప్ర‌మాదం చాలా భీక‌రంగా జ‌రిగిన‌ట్లు భావిస్తున్నారు. రెండు వాహ‌నాలు ఎదురెదురుగా రావ‌డం వ‌ల్ల ఆ రెండు వాహ‌నాలు నుజ్జునుజ్‌రయ్యాయి. ప్ర‌మాదంలో మృతిచెందిన వారి కుటుంబ‌స‌భ్యుల‌కు సీఎం యోగి సంతాపం తెలిపారు. ఆ కుటుంబాల‌ను ఆదుకోవాల‌ని ప్ర‌భుత్వ అధికారుల‌ను ఆయ‌న ఆదేశించారు. గాయ‌ప‌డ్డ‌వారికి చికిత్స‌ను అందించాల‌ని సూచించారు.

*ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన ఇద్దరు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు మాదకద్రవ్యాలను తరలిస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో రాచకొండ పోలీసులకు పట్టుబడ్డారు. చౌటుప్పల్‌ పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎన్‌.శ్రీనివాస్‌ సోమవారం ఆ వివరాలను వెల్లడించారు. ఏపీలోని కాకినాడ జిల్లా పెద్దపూడి మండం గొల్లలమామిడాడకు చెందిన వట్టూరి సూర్యసంపత్‌, రాజమహేంద్రవరంలోని మోరంపూడి సాయినగర్‌కు చెందిన తీగల దీపక్‌ ఫణీంద్ర సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు. గతకొంతకాలంగా రాజమహేంద్రవరం నుంచి వర్క్‌ ఫ్రం హోం చేస్తున్న వీరు డ్రగ్స్‌కు అలవాటు పడ్డారు. ఈ నెల 25న గోవాలోని ఓ గుర్తుతెలియని వ్యక్తి వద్ద ఎండీఎంఏ డ్రగ్స్‌(25 మాత్రలు), ఎల్‌ఎస్‌డీ(2 స్ట్రిప్స్‌) కొనుగోలు చేశారు. అనంతరం అక్కడి నుంచి బస్సులో హైదరాబాద్‌కు చేరుకున్న వీరు పెద్దఅంబర్‌పేట్‌ ఔటర్‌ రింగు రోడ్డు వద్ద లారీ ఎక్కి రాజమహేంద్రవరానికి బయలుదేరారు. పక్కా సమాచారం మేరకు పోలీసులు ఈ నెల 28న మధ్యాహ్నం చౌటుప్పల్‌ బస్టాండ్‌ వద్ద లారీని ఆపి సూర్యసంపత్‌, దీపక్‌ ఫణీంద్రలను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి డ్రగ్స్‌, 2 సెల్‌ఫోన్లను స్వాధీనపరచుకుని కేసు నమోదు చేశామని, పట్టుబడిన డ్రగ్స్‌ విలువ రూ.2.35 లక్షలు ఉంటుందని ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు. నిందితులు డ్రగ్స్‌ తీసుకోవడంతో పాటు ఇతరులకు విక్రయిస్తారని వివరించారు. ఆదివారం రాత్రి చౌటుప్పల్‌ కోర్టు న్యాయమూర్తి ఎదుట నిందితులను హాజరుపరిచి నల్గొండ జైలుకు తరలించినట్లు పేర్కొన్నారు.

*నల్లగొండ జిల్లాలో ప్రైవేటు ట్రావెల్స్‌కు చెందిన బస్సు బోల్తాపడింది. వేములపల్లి వద్ద వీ కావేరి ట్రావెల్స్‌కు చెందిన అదుపు తప్పి బోల్తాపడగా.. ఈ ఘటనలో పది మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో సుమారు 38 మంది వరకు ప్రయాణీకులు ఉన్నారు.

*ఇద్దరు కుమార్తెలతో కలిసి దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకున్నది. ఆదిబట్ల పరిధిలోని కుర్మల్‌గూడ చెరువులో దంపతులు ఇద్దరు కుమార్తెలతో కలిసి పురుగుల మందు సేవించి చెరువులో దూకినట్లు సమాచారం. మంగళవారం తెల్లవారే సరికి తండ్రి, ఇద్దరు కుమార్తెల మృతదేహాలు చెరువులో తేలాయి. మరో మహిళ మృతదేహం కోసం స్థానికులు గాలిస్తున్నారు.

*తిరుమల శంఖుమిట్ట ప్రాంతంలో ఓ కారులో మంటలు చెలరేగాయి. షార్ట్‌ సర్క్యూట్‌తో ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే కారంతా మంటలు అంటుకొని దగ్ధమైంది. మంటలను గమనించిన భక్తులుంతా కారు దిగి పరుగులు తీయడంతో ప్రాణాలతో బయటపడ్డారు. పలువురు భక్తులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా.. సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పి వేశారు. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటిగంట ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకున్నది. ప్రమాదానికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.

*ఆత్మకూరు మండలం బైర్లూటి చెంచు గూడెంలో కలుషిత ఆహారం తిని ఇద్దరు మృతి చెందారు. మృతులు సూరమ్మ (60) భూమని నాగమ్మ (20)గా గుర్తించారు. మరో ఆరుగురు అస్వస్థతకు గురికావడంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని నంద్యాల డీఎమ్అండ్‌హెచ్‌వో వెంకట రమణ, ఆత్మకూరు ఎమ్మార్వో తెలిపారు.

* తాడేపల్లిగూడెం రూరల్ కడియం చెరువు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. మోటార్ సైకిల్‌పై వస్తూ ఇద్దరు వ్యక్తులు ప్రమాదవశాత్తు చెరువులో పడ్డారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. మరొకరికి గాయాలయ్యాయి. మృతుడు ప్రకాశరావు పాలెం చెందిన విప్పర్తి నాగరాజుగా గుర్తించారు. అయితే వీరిద్దరూ మద్యం సేవించి ఉన్నట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు నాగరాజు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

*గుంటూరు: జిల్లాలోని తాడేపల్లి సీతానగరంలో విషాదం చోటుచేసుకుంది. కృష్ణానదిలో ఈతకెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. మృతులు కృష్ణా జిల్లా నిడమానూరుకు చెందిన మురళీ, నాగేంద్రగా గుర్తించారు. స్థానికులు సమాచారంతో సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదానికి గల కారణాలను అడిగితెలుసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుతున్నారు.

*కరీంనగర్‌: జిల్లాలోని చింతకుంటలో రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. బొలెరో వాహనాన్ని బైకు ఢీకొన్న ప్రమాదంలో చందు, మహేష్‌బాబు అనే యువకులు మృతి చెందారు. స్థానికులు సమాచారంతో సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదానికి గల కారణాలను అడిగితెలుసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుతున్నారు.

*మహబుబాబాద్: జిల్లాలోని బయ్యారం మండలం గంధంపల్లి గ్రామంలో దుండగులు భారీ చోరీకి పాల్పడ్డారు. యాకుబ్ పాషా అనే వ్యక్తి ఇంట్లో తులాల బంగారం తులాల వెండి లక్షల రూపాయలు నగదు అపహరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు సంఘటనాస్థలాన్ని సందర్శించిన పోలీసులు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

*మహబూబాబాద్: జిల్లాలోని నర్సింహులపేట మండలం వస్రం తండ స్టేజీ సమీపంలో వరంగల్ – ఖమ్మం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. లారీని వెనక నుంచి కారు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా… మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

*చిత్తూరు జిల్లా..కర్ణాటక.. ఆంధ్ర సరిహద్దుల్లో మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామి కారు రోడ్డు ప్రమాదంకి గురైంది..ములుబగల్ జాతీయ రహదారి వద్ద ట్రాక్టర్.. కారుకి ఢీకొనడంతో ట్రాక్టర్ లోని డ్రైవర్ సంఘటన స్థలంలోనే మృతిచెందారు..ఎమ్మెల్యే తిప్పేస్వామి డ్రైవర్ కి గాయాలు… అని అనుమానంఎమ్మెల్యే ఉన్నాడా.. లేదా అని అనుమానాలుకారులో ఉన్న ప్రేయర్ తో పాటు పలువురు పరారీ.

*కరెంట్ పెండింగ్ బిల్ వసూలు చేసేందుకు వెళ్లిన జూనియర్ లైన్ మెన్‌పై కడియం సతీష్ అనే వినియోగదారుడు నాపరాయితో దాడికి పాల్పడ్డాడు. ప్రస్తుతం గవర్నమెంట్ హాస్పిటల్‌లో జూనియర్ లైన్‌మెన్‌ చికిత్స పొందుతున్నాడు. భీమవరం మండలం కరకువాడ గ్రామంలో ఘటన చోటు చేసుకుంది. పోలీసులకు ఎలక్ట్రికల్ అధికారులు ఫిర్యాదు చేశారు.