* మాజీ మంత్రి వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ మళ్లీ ప్రారంభమైంది. పులివెందుల ఆర్అండ్బీ అతిథి గృహంలో వివేకా ఇంట్లో పనిచేసే కంప్యూటర్ ఆపరేటర్ ఇనయతుల్లాను అధికారులు విచారిస్తున్నారు. మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ మళ్లీ ప్రారంభమైంది. పులివెందుల ఆర్అండ్బీ అతిథి గృహంలో అనుమానితులను సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. వివేకా ఇంట్లో పనిచేసే కంప్యూటర్ ఆపరేటర్ ఇనయతుల్లాను అధికారులు విచారిస్తున్నారు. ఇప్పటికే చాలాసార్లు ఇనయతుల్లాను అధికారులు విచారించారు. వివేకా హత్య జరిగిన రోజు ఆయన బెడ్ రూమ్తో పాటు, బాత్ రూమ్లో పడి ఉన్న మృతదేహాన్ని ఇనయతుల్లానే ఫొటోలు, వీడియోలు తీశారు. అతని వద్ద నుంచి కీలక సమాచారాన్ని తీసుకోవడానికి అధికారులు ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది.ఇదిలా ఉండగా.. వివేకా హత్య కేసులో అల్లుడు రాజశేఖరరెడ్డి, బావమరిది శివ ప్రకాశ్రెడ్డితో పాటు మరికొందరిని విచారించాలని శివశంకర్ రెడ్డి భార్య దాఖలు చేసిన పిటిషన్పై పులివెందుల న్యాయస్థానం విచారించింది.
* ఆత్మకూరు ఉప ఎన్నికకు టీడీపీ దూరం కానున్నట్లు సమాచారం. మేకపాటి కుటుంబ సభ్యులకే టికెట్ ఇవ్వడంతో సంప్రదాయాన్ని పాటించాలని టీడీపీ భావిస్తోన్నట్లు తెలుస్తోంది. గతంలో బద్వేలు ఉప ఎన్నికలోనూ ఇదే తరహా నిర్ణయం తీసుకుంది. త్వరలో అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.
*తెలంగాణ రాష్ట్రం సికింద్రాబాద్లో శబరి ఎక్స్ ప్రెస్‌కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు రైల్వేస్టేషన్‌లో బాంబు స్క్యాడ్‌లతో తనిఖీలు నిర్వహించారు. శబరి ఎక్స్‌ప్రెస్‌లో బాంబు పెట్టామని దుండగుల నుంచి ఫోన్‌కాల్ వచ్చినట్లు రైల్వే అధికారులు తెలిపారు.
*సస్పెండైన ఏడీజీపీ గుర్జీందర్ పాల్ సింగ్ బెయిలును సుప్రీంకోర్టులో సవాలు చేసిన చత్తీస్‌గఢ్ ప్రభుత్వానికి చుక్కెదురైంది. ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యున్నత ధర్మాసనం కొట్టివేసింది. 1994 బ్యాచ్ అధికారి అయిన గుర్జీందర్ పాల్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అవినీతి నిరోధక చట్టం కింద ఈ ఏడాది జనవరిలో అరెస్టయ్యారు. సింగ్ గతంలో ఏసీబీ అడిషనల్ డైరెక్టర్ జనరల్ (ఏడీజీ)గా, రాయ్‌పూర్ ఐజీగా పనిచేశారు. జులై 5న ఆయన సస్పెండ్ కావడానికి ముందు పోలీస్ ట్రైనింగ్ అకాడమీ హెడ్‌గా నియమితులయ్యారు.
*అఖిల భారత గౌడ సంఘం (రి1924-2014) ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడిగా డాక్టర్ దాసరి శ్యామ్ చంద్ర శేషును నియామించారు. చింతలపూడి నియోజకవర్గం, జంగారెడ్డిగూడెం మండలానికి చెందిన డాక్టర్ దాసరి శ్యామ్ చంద్ర శేషు ఆంధ్రా యూనివర్సిటీలో న్యాయశాస్త్రంలో పిహెచ్ది పట్టా పొంది యూనివర్సిటీ స్థాయిలో అనేక బీసీ ఉద్యమాలలో కీలకపాత్ర పోషించారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా గీత కార్మికులతో హితోధిక పరిచయాలు ఉండటంతో పాటు గతంలో చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని, జనాభా దామాషా ప్రకారం బీసీలకు అవకాశాలు కల్పించాలని, కుల గణన చేపట్టాలని కోరుతూ, బీసీ సంఘాలతో పాటు ఢిల్లీ వేదికగా ఉద్యమాలు చేపట్టారు. అలాగే గతంలో బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శిగా కూడా గతంలో పనిచేశారు. ఈసందర్భంగా డాక్టర్ దాసరి శేషు మాట్లాడుతూ… తనపై నమ్మకం ఉంచి తనకు ఈ బాధ్యత ఇచ్చిన అఖిల భారత గౌడ సంఘం జాతీయ అధ్యక్షుడు పేరం శివనాగేశ్వర రావు గౌడ్ కు ధన్యవాదాలు తెలిపారు. గౌడ ఉపకులాలు అయిన గౌడ, శెట్టిబలిజ, ఈడిగా, శ్రీసయన, యాత కులాలను ఐక్యం చేసి వారి అభివృద్ధికి కృషి చేస్తానని తెలియజేశారు.
*కవి దర్భశయనం శ్రీనివాసాచార్యకు ‘ఇంద్రగంటి శ్రీకాంతశర్మ సాహితీ పురస్కారం’ దక్కింది. 2022 సంవత్సరానికి గాను శ్రీనివాసాచార్యకు ఈ పురస్కారం ప్రదానం చేయాలని పురస్కార కమిటీ నిర్ణయించింది. త్వరలోనే కార్యక్రమ వివరాలు వెల్లడిస్తామని తెలిపింది. శ్రీనివాసాచార్య తమ కవిత్వానికీ, అందులోని గాఢమైన, హృద్యమైన పద వైచిత్రికీ, ఆలోచనకు, కావ్యానురక్తికి మంచి పేరు, గుర్తింపు ఇప్పటికే తెచ్చుకున్నారని పురస్కార కమిటీ అభిప్రాయపడింది. ఆ ఆనందాన్ని ఆస్వాదించే క్రమంలో ఈ పురస్కారం ఒక చిన్న బహుమానం మాత్రమే!’ అని కమిటీ సభ్యులు తెలియజేశారు. కమిటీలో ఇంద్రగంటి జానకీబాల, శీలా సుభద్రాదేవి, మోహనకృష్ణ ఇంద్రగంటి సభ్యులుగా ఉన్నారు.
*జూబ్లీహిల్స్‌లో జూ.ఆర్టిస్ట్ సునీత హంగామా సృష్టించింది. గీతా ఆర్ట్స్ ఆఫీస్ గేట్ ముందు సునీత నిరసన వ్యక్తం చేసింది. నిర్మాత బన్నీ వాసు మోసం చేశాడంటూ బైఠాయించింది. తనకు రావాల్సిన డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జూ.ఆర్టిస్ట్ సునీత పోలీసులను ముప్పుతిప్పలు పెడుతుంది. గీతా ఆర్ట్స్ హామీ ఇచ్చినా ఆమె ఆందోళన విరమించలేదు.
*గుజరాత్‌కు చెందిన పటీదార్ ఉద్యమ నేత, కాంగ్రెస్ మాజీ నేత హార్దిక్ పటేల్ జూన్ 2న బీజేపీలో చేరనున్నట్లు ధ్రువీకరించారు. హర్దిక్ ఈ నెల 18న కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ముందు హార్దిక్ పార్టీని విడడంతో కాంగ్రెస్‌కు పెద్ద ఎదురుదెబ్బగా రాజకీయ నిపుణులు పేర్కొంటున్నారు. 2019లో కాంగ్రెస్‌లో చేరిన హార్దిక్ పటేల్.. 2020, జూలై 11న గుజరాత్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియామకమయ్యారు. ఆ తర్వాత పార్టీ అధిష్టానం, నాయకత్వం తీరుపై విసుగు చెంది రాజీనామా చేశారు.
*జగన్ ప్రభుత్వం జూలైలో కొత్త బార్ పాలసీని ప్రవేశపెట్టనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 840 బార్లు కొనసాగుతున్నాయి. ఎన్ని సంవత్సరాలు రెన్యువల్ ఇస్తారనేదే కీలకం. ఐదేళ్లకిస్తే ఇక మద్య నిషేధం లేనట్లే!.. ఒకట్రెండు సంవత్సరాలంటే ఎవరూ ముందుకు రారు. దీంతో పాతవారికే మళ్లీ అవకాశం ఉందా? లేదా? అనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈసారి ఎక్సైజ్ అధికారులు లైసెన్సు ఫీజులు భారీగా పెంచే అవకాశం ఉన్నట్లు సమాచారం. 50 వేల లోపు జనాభా ఉన్నప్రాంతాల్లో రూ. 20 లక్షలు, 50 వేల నుంచి 3 లక్షలలోపైతే రూ. 30 లక్షలు, 3 లక్షలకు పైగా జనాభా ఉంటే రూ. 50 లక్షలకు పెంచే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది.
*ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేయడంపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తొలిసారి పెదవి విప్పారు. ఇది పూర్తిగా తప్పుడు కేసని, రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నదని అన్నారు. ఆప్ నిజాయితీ కలిగిన పార్టీ అని తెలిపారు. కేసులో కనీసం ఒక్క శాతం విషయం ఉన్నా జైన్‌పై తానే స్వయంగా చర్య తీసుకుని ఉండేవాడినని చెప్పారు. అవినీతిని సహించడం కానీ, అవినీతికి పాల్పడటం కానీ తమ ప్రభుత్వం ఎన్నడూ సహించదని, తమది నిజాయతీ కలిగిన ప్రభుత్వమని కేజ్రీవాల్ చెప్పారు.”జైన్‌పై కేసును పూర్తిగా అధ్యయనం చేశాను. ఇది పూర్తిగా తప్పుడు కేసు. రాజకీయ కారణాలతో ఆపాదించిన కేసు. న్యాయవ్యవస్థపై మాకు నమ్మకం ఉంది. సత్యమార్గాన్ని జైన్ అనుసరిస్తుంటాడు. ఆయన పూర్తిగా క్లీన్‌చిట్‌తో బయట పడతారు”అని కేజ్రీవాల్ ధీమా వ్యక్తం చేశారు.
*పుత్తూరు మున్సిపాలిటీ సమావేశంలో రసాబాస జరిగింది. కోరం లేక పోయినా బిల్లులు పాస్ చేసుకునేందుకు వైసీపీకి చెందిన మున్సిపల్ కౌన్సిల్ ఛైర్మన్ హరి యత్నించారు. దీన్ని టీడీపీ ఫ్లోర్ లీడర్ జీవరత్నం నాయుడు అడ్డుకున్నారు. వైసీపీ మున్సిపల్ ఛైర్మన్ హరి తీరుపై అసంతృప్తితో 9 మంది వైసీపీ సభ్యులు సమావేశానికి గైర్హాజరయ్యారు. “రెండు రేపులే కదా” అని మంత్రి రోజా.. మహిళలను కించపరుస్తూ మాట్లాడటంపై నిరసనగా… మహిళలకు మంత్రి క్షమాపణ చెప్పాలని టీడీపీ కౌన్సిలర్లు బాయ్ కాట్ చేశారు. అయితే కోరం లేక పోయినా బిల్లులను కోరం ఉన్నట్టు పాస్ చేసుకోవాలని పుత్తూరు కౌన్సిల్ చూసింది. విషయం తెలిసిన టీడీపీ ఫ్లోర్ లీడర్ జీవరత్నం నాయుడు… పుత్తూరు మున్సిపాలిటీ ఛైర్మన్ హరిని నిలదీశారు. దీంతో పుత్తూరు మున్సిపాలిటీ కౌన్సిల్ సమావేశం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.
*నందిగామ వైసీపీలో వర్గ పోరు మరింత ముదిరింది. స్థానిక నాయకత్వంపై అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్లు తిరుగుబాటు చేశారు. నిన్న జరిగిన మున్సిపల్ సమావేశానికి కూడా కౌన్సిలర్లు హాజరు కాలేదు. ఓ రహస్య ప్రాంతంలో వైసీపీ కౌన్సిలర్లు సమావేశమయ్యారు. వార్డ్‌లో జరిగే అభివృద్ధి పనుల విషయంలో కూడా ఎటువంటి సమాచారం తెలియడం లేదని ఆవేదన చెందుతున్నట్లు సమాచారం. నిన్నటి నుంచి సోషల్ మీడియాలో కొన్ని వీడియోలను కౌన్సిలర్లు పోస్ట్ చేస్తున్నారు. రాజీనామాకు కూడా వెనకాడం అని చెబుతున్నారు. ఈ వీడియోలన్నీ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నందిగామలో మున్సిపల్ రాజకీయం చర్చనీయాంశంగా మారింది.
*మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో ట్విస్ట్ వెలుగు చూసింది. వివేకా కూతురు సునీత, అల్లుడు రాజశేఖర్‌రెడ్డి, అలాగే వివేకా బావమరిది శివప్రకాష్‌రెడ్డిపై ప్రైవేట్ కేసు నమోదైంది. దేవిరెడ్డి శంకర్‌రెడ్డి భార్య వీరిపై ప్రైవేట్ కేసు వేశారు. వివేకా హత్య కేసులో వైసీపీ నేత దేవిరెడ్డి శంకర్ రెడ్డి నిందితుడిగా ఉన్నారు. ఇక వివేకా హత్య కేసును విచారిస్తున్న సీబీఐ బృందం నేడు పులివెందుల ఆర్అండ్‌బీ గెస్ట్ హౌస్‌కు చేరుకుంది. వైఎస్ వివేకా పీఏ ఇనయతుల్లాను విచారిస్తోంది. గతంలో పలుమార్లు సీబీఐ బృందం ఇనయతుల్లాను విచారించిన విషయం తెలిసిందే.
*మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో వైసీపీ (YCP) అంతర్గత కుమ్ములాట జరిగింది. హిందూపురంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, ప్రజల్లోకి ఏం ముఖం పెట్టుకుని వెళ్లాలంటూ ఎంపీ గోరంట్ల మాధవ్ ను వైసీపీ మహిళా కౌన్సిలర్లు నిలదీశారు. దీంతో సమావేశం రసాభాసగా మారింది. శ్రీ సత్యసాయి జిల్లా, హిందూపురం మున్సిపల్ కార్యాలయంలో చైర్ పర్సన్ ఇంద్రజ, ఎంపీ గోరంట్ల మాధవ్ అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేశారు. ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు గడుస్తున్నా.. హిందూపురం మున్సిపాలిటీ ప్రాంతంలో డ్రైనేజ్, లైటింగ్, రోడ్లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అధికారపార్టీ మహిళా కౌన్సిలర్లు సమస్యలు లేవనెత్తారు. హిందూపురంలో ఏ ప్రభుత్వం వచ్చినా పీఏల రాజ్యం సాగుతోందని మహిళా కౌన్సిలర్ ఆరోపించారు. దీంతో కోపంతో ఊగిపోయిన ఎంపీ.. మహిళా కౌన్సిలర్ మాట్లాడుతున్న మైక్ కట్ చేయించారు. ప్రజల సమస్యలు పరిష్కరించలేనప్పుడు కౌన్సిలర్, కమిషనర్ ఎందుకంటూ వైసీపీ మహిళా కౌన్సిలర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఎంపీ గోరంట్ల చేసేదేమీ లేక సమావేశాన్ని ముగించారు
*నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సీ) అధ్యక్షుడు, శ్రీనగర్ లోక్‌సభ ఎంపీ ఫరూక్ అబ్దుల్లా మంగళవారంనాడు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ముందు హాజరయ్యారు. మనీ లాండరింగ్ కేసులో విచారణను ఎదుర్కొనేందుకు ఆయన మధ్యాహ్నం 11 గంటల ప్రాంతంలో రాజ్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయానికి వచ్చారు. జమ్మూకశ్మీర్ అసోసియేషన్‌లో గతంలో ఆర్థిక అవకతవకలు జరిగాయన్న ఆరోపణలకు సంబంధించిన కేసు ఇది.ఈడీ కార్యాలయానికి బయలుదేరే ముందు మీడియా అడిగిన ప్రశ్నలకు ఫరూక్ అబ్దుల్లా సమాధానమిస్తూ, సమన్ల గురించి చెప్పేందుకు పెద్దగా ఏమీ లేదని, ఎన్నికలు (జమ్మూకశ్మీర్‌లో) జరిగే అవకాశాలున్నందున అప్పటి వరకూ వాళ్లు తమను చిక్కులు పెట్టవచ్చని అన్నారు. మనీ లాండరింగ్ కేసుకు సంబంధించిన ఈనెల 27న ఆయనకు ఈడీ ఆయనకు సమన్లు పంపింది. ఈ కేసులో 2019లో ఆయన స్టేట్‌మెంట్‌ను కూడా రికార్డు చేశారు. గతంలో మాదిరిగానే అధికారులకు తమ నేత సహకరిస్తారని నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ తాజా సమన్లపై వ్యాఖ్యానించింది. దేశంలోని విపక్ష పార్టీల నేతలకు సమన్లు పంపడం సర్వసాధారణ విషయమేనని జమ్మూకశ్మీర్‌లోని పలువురు విపక్ష నేతలు చెబుతున్నారు. కాగా, అప్పటి జమ్మూకశ్మీర్ రాష్ట్రానికి ఫరూక్ అబ్దుల్లా మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు.
*యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన మెయిన్స్ పరీక్షలలో కర్ణాటకకు చెందిన 25 మంది ఉత్తమ ప్రతిభ చాటారు. 30లోపు ర్యాంకులు ఎవరికీ దక్కలేదు. యూపీఎస్సీ ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. దావణగెరెకు చెందిన అవినాష్ 31వ ర్యాంకు సాధించగా బెనక ప్రసాద్-92 నిఖిల్ బి. పాటిల్-139, వినయ్‌కుమార్ గాడిగ-151, చిత్తరంజన్-155, కె. మనోజ్‌కుమార్- 157, అపూర్వబసూర్-191, నిత్యా- 207, మంజునాథ్-219, రాజేష్ పొన్నప్ప-222, సాహిత్య ఆలదకట్టి-250, కల్పశ్రీ- 291, అరుణా- 308, దీపక్ రామచంద్ర సేఠ్- 311, హర్షవర్ధన్ – 318, వినయ్‌కుమార్ – 352, మేఘన- 425, సవితా గూట్యాల్- 479, మహమ్మద్ సిద్దికి షరీఫ్- 516, చేతన్. కే- 532, ఎన్‌ఎస్ ప్రకాష్- 568, ప్రశాంత్‌కుమార్ – 641, సుచిన్ కేవీ- 682 ర్యాంకులు సాధించారు.కవలల్లో అవినాష్ ర్యాంకర్.. అర్పిత ఎంబీబీఎస్ దావణగెరెకు చెందిన విఠల్‌రావుకు కవలలు కాగా వీరిలో అవినాష్ ప్రస్తుతం యూపీఎస్సీ ర్యాంకు సాధించగా అర్పిత ఇటీవలే ఎంబీబీఎస్ పూర్తీ చేసి ఎండీ కోర్సుకు సిద్ధమవుతున్నారు. అవినాష్ తాత ఆనందరావు ఉడుపి జిల్లాకు చెందినవారు. దావణగెరెలోనే పీయూ దాకా చదివిన అవినాష్ తర్వాత బెంగళూరులోని నేషనల్ లా యూనివర్సిటీలో ఐదేళ్ల కోర్సు చేశారు. లా కోర్సులో బంగారు బహుమతి సాధించిన అవినాష్ తొలి ప్రయత్నంలోనే యూపీఎస్సీలో 31వ ర్యాంకు సాధించారు. తొలి ప్రయత్నంలోనే ఇండియన్ ఫారిన్ సర్వీసును ఎంపిక చేసుకున్నారు. కుమారుడి సాధనపై విఠల్‌రావు మాట్లాడుతూ ఫారిన్ సర్వీసును ఎంపిక చేసుకోవడం ద్వారా అంతర్జాతీయ స్థాయిలో పనిచేయాలని కలలు కన్నారన్నారు. కుమారుడు యూపీఎస్సీలో ర్యాంకు రావడం, కుమార్తె డాక్టర్ కోర్సు పూర్తీ చేసి ఎండీకు సిద్ధం కావడం సంతోషంగా ఉందని తండ్రి విఠల్‌రావు, తల్లి స్మితారావు మీడియాకు తెలిపారు.
*అఖిల భారత గౌడ సంఘం (రి1924-2014) ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడిగా డాక్టర్ దాసరి శ్యామ్ చంద్ర శేషును నియామించారు. చింతలపూడి నియోజకవర్గం, జంగారెడ్డిగూడెం మండలానికి చెందిన డాక్టర్ దాసరి శ్యామ్ చంద్ర శేషు ఆంధ్రా యూనివర్సిటీలో న్యాయశాస్త్రంలో పిహెచ్ది పట్టా పొంది యూనివర్సిటీ స్థాయిలో అనేక బీసీ ఉద్యమాలలో కీలకపాత్ర పోషించారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా గీత కార్మికులతో హితోధిక పరిచయాలు ఉండటంతో పాటు గతంలో చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని, జనాభా దామాషా ప్రకారం బీసీలకు అవకాశాలు కల్పించాలని, కుల గణన చేపట్టాలని కోరుతూ, బీసీ సంఘాలతో పాటు ఢిల్లీ వేదికగా ఉద్యమాలు చేపట్టారు. అలాగే గతంలో బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శిగా కూడా గతంలో పనిచేశారు. ఈసందర్భంగా డాక్టర్ దాసరి శేషు మాట్లాడుతూ… తనపై నమ్మకం ఉంచి తనకు ఈ బాధ్యత ఇచ్చిన అఖిల భారత గౌడ సంఘం జాతీయ అధ్యక్షుడు పేరం శివనాగేశ్వర రావు గౌడ్ కు ధన్యవాదాలు తెలిపారు. గౌడ ఉపకులాలు అయిన గౌడ, శెట్టిబలిజ, ఈడిగా, శ్రీసయన, యాత కులాలను ఐక్యం చేసి వారి అభివృద్ధికి కృషి చేస్తానని తెలియజేశారు.
*శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లో జలవిద్యుత్తు, రూల్‌కర్వ్, మిగులు జలాలకు సంబంధించి రిజర్వాయర్ మేనేజ్‌మెంట్ కమిటీ (ఆర్‌ఎంసీ) మరోసారి తెలంగాణ హాజరు కాకుండానే సోమవారం సమావేశమైంది. ఇప్పటికే ఈ నెల 20న జరిగిన సమావేశానికి కూడా తెలంగాణ అధికారులు హాజరుకాని విషయం తెలిసిందే. దీంతో ఆయా అంశాలపై తుది నిర్ణయం తీసుకోవడానికి జూన్ మొదటివారంలో మరో సమావేశం పెడతామని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ) తాజాగా సంకేతాలిచ్చింది. వానాకాలం సీజన్ సన్నాహాల్లో ఉన్నందున జూన్ 15వ తేదీ తర్వాత సమావేశాలు పెట్టాలని తెలంగాణ పదే పదే కోరినా.. కేఆర్‌ఎంబీ వెనక్కి తగ్గడంలేదు.
*జూనియర్ కళాశాలలు జూలై 1వ తేదీన ప్రారంభం కానున్నాయి. 2022-23 సంవత్సరానికి ఇంటర్ వార్షిక కేలండర్‌ను బోర్డు కార్యదర్శి శేషగిరిబాబు విడుదల చేశారు. దీనిప్రకారం సెప్టెంబరు 1 నుంచి 7 వరకు త్రైమాసిక పరీక్షలు నిర్వహిస్తారు. ఆ తర్వాత అక్టోబరు 2 నుంచి 9వ తేదీ వరకు దసరా సెలవులు ఉంటాయి. నవంబరులో హాఫ్ ఇయర్లీ పరీక్షలు జరుగుతాయి. వచ్చే ఏడాది జనవరి 11 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయి. ఫిబ్రవరిలో ప్రాక్టికల్స్ పరీక్షలు నిర్వహిస్తారు. వచ్చే ఏడాది మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు థియరీ పబ్లిక్ పరీక్షలు నిర్వహిస్తారు. మొత్తం 220 రోజుల పాటు కళాశాలలు నడుస్తాయి
*జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్డ్ నగరంలో ఆదివారం మినీ మహానాడు, ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. మహానాడుకు ముఖ్య అతిథిగా పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ హాజరయ్యారు. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి ఆచార్య జ్యోత్స్న తిరునగరి వర్చువల్‌గా హాజరై జర్మనీ టీడీపీ సభ్యుల్లో ఉత్సాహాన్ని నింపారు. నీలిమ కుడితిపూడి గీసిన తారక రాముడి చిత్రపటం అందరినీ ఆకర్షించింది.
* ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసులో కీలక నిందితుడిగా ఉన్న రాంకీ సంస్థల అధినేత, వైసీపీ ఎంపీ అయోధ్యరామిరెడ్డి సోమవారం నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరయ్యారు. జస్టిస్ బీఆర్ మధుసూదన్‌రావు సీబీఐ కోర్టు నుంచి బదిలీ కావడంతో నూతన న్యాయమూర్తిగా సీహెచ్ రమేశ్‌బాబు ఇటీవల బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో తొలిసారిగా న్యాయమూర్తి ముందు విచారణకు హాజరయ్యేందుకు అయోధ్యరామిరెడ్డి నాంపల్లి కోర్టుకు వచ్చారు. ఉమ్మడి రాష్ట్ర సీఎంగా వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కొనసాగిన కాలంలో జగతి పబ్లికేషన్స్, భారతి సిమెంట్స్ కంపెనీల్లోకి వచ్చిన పెట్టుబడులకు సంబంధించి యన ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. మరో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా కోర్టుకు హాజరవ్వాల్సి ఉండగా.. ఇతర కారణాలతో ఆయన రాలేకపోయినట్టు ఆయన తరఫున సీనియర్ అడ్వకేట్ జి.అశోక్‌రెడ్డి కోర్టుకు నివేదించారు. తదుపరి విచారణను వచ్చేనెల 12కు వాయిదా వేశారు.
*శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గ ఉపఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జేసీ హరేంధిరప్రసాద్ సోమవారం నోటిఫికేషన్‌ను విడుదల చేయగా, తొలిరోజే రెండు నామినేషన్లు దాఖలయ్యాయి. పీపుల్స్ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా గోదా రమే్‌షకుమార్, నవతరం పార్టీ అభ్యర్థిగా రావు సుబ్రహ్మణ్యం నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి మరణించడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది.
*‘వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో నెలకొన్న తీవ్ర వ్యతిరేకతతోనే మహానాడు సూపర్ హిట్ అయింది. ప్రభుత్వ అరాచక, విధ్వంస పాలనపై తిరుగుబాటుకు మహానాడు వేదికగా మారింది’’ అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన ముఖ్య నేతలతో నిర్వహించిన సమావేశంలో మహానాడు జరిగిన తీరు, భవిష్యత్ ప్రణాళికపై చర్చించారు. ‘‘గతంలో ఎన్టీఆర్ హయాంలో జరిగిన స్థాయిలో ఈ మహానాడు జరిగింది. ఎండలు తీవ్రంగా మండిపోతున్నా లక్షల మంది తరలివచ్చి కొత్త స్ఫూర్తిని నింపారు. ఒంగోలు మహానాడు ప్రజలు, పార్టీ శ్రేణుల సమష్టి విజయం’’ అని అభివర్ణించారు. ఊహించని స్థాయిలో ప్రజలు తరలివచ్చినా కష్టపడి పని చేశారని, సభను విజయవంతంగా నిర్వహించారని పార్టీ నేతలను అభినందించారు.
*ట్విటర్ వేదికగా విజయసాయిరెడ్డికి టీడీపీ నేత వంగలపూడి అనిత కౌంటర్ ఇచ్చారు. మీవి మార్ఫింగ్ బతుకులు, అడ్డంగా దొరికాక కూడా బుకాయించే బతుకులు, మీ బతుకంతా విధ్వంసమే, ప్రజావేదికతో మొదలైన విధ్వంసం మూడేళ్ళుగా కొనసాగుతోందని ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. తాము నిజంగా విధ్వంసం చేసే వాళ్ళమైతే మీరు ఊరూరా ముద్దులు పెట్టుకుంటూ పాదయాత్ర చేసే వాళ్లా? అని ప్రశ్నించారు. ఎప్పుడో ఏపీ వదిలి పారిపోయే వాళ్లని విమర్శించారు.
* శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లో జలవిద్యుత్తు, రూల్‌కర్వ్, మిగులు జలాలకు సంబంధించి రిజర్వాయర్ మేనేజ్‌మెంట్ కమిటీ(ఆర్‌ఎంసీ) మరోసారి తెలంగాణ హాజరు కాకుండానే సోమవారం సమావేశమైంది. గత(ఈ నెల 20న) సమావేశానికి కూడా తెలంగాణ అధికారులు హాజరుకాలేదు. దీంతో ఆయా అంశాలపై తుది నిర్ణయం తీసుకోవడానికి జూన్ మొదటివారంలో మరో సమావేశం పెడతామని కృష్ణానదీ యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ) సంకేతాలిచ్చింది. వానాకాలం సీజన్ సన్నాహాల్లో ఉన్నందున జూన్ 15వ తేదీ తర్వాత సమావేశాలు పెట్టాలని తెలంగాణ పదేపదే కోరినా.. కేఆర్‌ఎంబీ వెనక్కి తగ్గడంలేదు. త్వరలో మరోసారి నిర్వహించనున్న ఆర్‌ఎంసీ భేటీలో తెలంగాణతో సంబంధం లేకుండానే శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో జలవిద్యుత్తును ఎప్పుడు ఉత్పత్తి చేయాలి? దీనికి ప్రామాణికమేంటి? రిజర్వాయర్లలో ఏ సమయంలో ఎంత మేర నిల్వలు ఉండాలి? అనే అంశాలను నిర్దేశించే రూల్‌కర్వ్‌ను ఖరారు చేయనున్నారు.
*బ్యాంకు సాఫ్ట్‌వేర్‌లో తలెత్తిన సాంకేతిక లోపం వికారాబాద్‌కు చెందిన ఓ వ్యాపారిని కొన్ని గంటలపాటు కోటీశ్వరుడిని చేసింది. రూ. 2లక్షలు ఉండాల్సిన తన ఖాతాలో రూ.18.52 కోట్లకు పైగా డబ్బు ఉండటంతో ఆశ్చర్యపోయిన ఆ వ్యాపారి అది నిజమో కాదో తెలియని స్థితిలో ఉండిపోయారు. కానీ, కోటీశ్వరుడినయ్యాననే అతని ఆనందానికి బ్యాంకు అధికారులు తమ అప్రమత్తతో బ్రేకులేసేశారు. వికారాబాద్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని సెవెన్ హిల్స్ మొబైల్ షాప్ యజమాని వెంకట్‌రెడ్డికి హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంకులో ఖాతా ఉంది. తన ఖాతాలోని డబ్బును డ్రా చేసుకునే క్రమంలో ఆదివారం అతను బ్యాలెన్స్ చెక్ చేసుకున్నారు. రూ.2 లక్షల వరకు ఉండాల్సిన తన ఖాతాలో రూ.18.52 కోట్లపైగా నగదు ఉండటాన్ని చూసి ఆయన షాక్ అయ్యారు. అనంతరం అది నిజమో కాదో తేల్చుకునేందుకు రూ.50 వేలను వేరే ఖాతాకు బదిలీ చేయగా.. ఆ లావాదేవీ విజయవంతం అయ్యింది.
*తెలంగాణలో పల్లె ప్రగతి ద్వారా ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారని, ఈ వినూత్న కార్యక్రమాల వివరాలను ఇతర రాష్ట్రాలకూ అందించాలని కేంద్ర పంచాయతీరాజ్ కార్యదర్శి సునీల్ కుమార్ కోరారు. పంచాయతీరాజ్ శాఖ రాష్ట్రంలో అమలు చేస్తున్న కార్యక్రమాలపై సోమవారం ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో అమలు చేస్తున్న పలు కార్యక్రమాలను ప్రశంసించారు. గ్రామ పంచాయితీలకు కేంద్రం విడుదల చేసే గ్రాంట్లు సకాలంలో అందేలా చూస్తామని హామీ నిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మాట్లాడుతూ పల్లె ప్రగతి కింద ప్రకృతి వనాలు, సురక్షిత మంచినీటి సరఫరా, నర్సరీ, ట్రాక్టర్, వైకుంఠధామం, క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేస్తున్నటు వివరించారు.
*కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో(కేజీబీవీ) పనిచేస్తున్న ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించిన ఫైల్ సిద్ధమైందని సమాచారం. ఆమోదం కోసం మంత్రి సబితా ఇంద్రారెడ్డికి పంపించారని తెలిసింది. కాగా, తెలంగాణ ప్రొగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టీపీటీఎఫ్) నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా అశోక్‌కుమార్, ప్రధాన కార్యదర్శిగా ముత్యాల రవీందర్, అదనపు ప్రధాన కార్యదర్శిగా నాగిరెడ్డి, ఉపాఽధ్యక్షులుగా తిరుపతి, శ్రీనివాస్, నారాయణమ్మ తదితరులు ఎన్నికయ్యారు.
*డిప్లమో ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎడ్) పరీక్షల షెడ్యూల్‌ని ప్రకటించారు. జూలై 4 నుంచి 9 వరకు మొత్తం 6 పేపర్లకు సంబంధించిన పరీక్షలను నిర్వహించనున్నారు. డిప్లమో ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ పరీక్షలు కూడా జూలై 4 నుంచి 8 వరకూ కొనసాగనున్నాయి. కాగా, ఎంసెట్‌కు సోమవారం నాటికి 2,55,431 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
* కరోనా వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన అనాఽథ చిన్నారులకు రూ.10 లక్షల ఆర్థిక సాయాన్ని ఇచ్చేందుకు ఉద్దేశించిన పీఎమ్ కేర్స్ పథకానికి రాష్ట్రం నుంచి 351 మందిని అర్హులుగా గుర్తించినట్లు రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ శిరి తెలిపారు. సోమవారం ఈమేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న రూ.10 లక్షలు, రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఇస్తున్న రూ.50 వేలు ఆర్థిక సాయానికి పీఎం కేర్స్ నుంచి ఇచ్చేది అదనమని వెల్లడించారు. దీంతోపాటు పీఎం కేర్స్ కింద ఉన్నత విద్య అభ్యసించే అనాథలకు రూ.50 వేలు, ఇంటర్మీడియట్‌కు రూ.20 వేలు చొప్పున ఉపకార వేతనాలు అందించనున్నట్లు తెలిపారు.
*పల్నాడు జిల్లా రెంటచింతలలో ఆదివారం రాత్రి జరిగిన ప్రమాదంపై టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వేర్వేరు ప్రకటనల్లో విచారం వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఉదారంగా ఆదుకోవాలని కోరారు. రోడ్ల మరమ్మత్తుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నందువల్ల ఇప్పటికైనా ప్రభుత్వం కదిలి రోడ్లను బాగు చేయాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.
* కరోనా వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన అనాఽథ చిన్నారులకు రూ.10 లక్షల ఆర్థిక సాయాన్ని ఇచ్చేందుకు ఉద్దేశించిన పీఎమ్ కేర్స్ పథకానికి రాష్ట్రం నుంచి 351 మందిని అర్హులుగా గుర్తించినట్లు రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ శిరి తెలిపారు. సోమవారం ఈమేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న రూ.10 లక్షలు, రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఇస్తున్న రూ.50 వేలు ఆర్థిక సాయానికి పీఎం కేర్స్ నుంచి ఇచ్చేది అదనమని వెల్లడించారు. దీంతోపాటు పీఎం కేర్స్ కింద ఉన్నత విద్య అభ్యసించే అనాథలకు రూ.50 వేలు, ఇంటర్మీడియట్‌కు రూ.20 వేలు చొప్పున ఉపకార వేతనాలు అందించనున్నట్లు తెలిపారు.
*దేశవ్యాప్తంగా ఒక్కసారిగా బొగ్గు సంక్షోభం నెలకొనడంపై స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరపాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్తు సంస్థ(ఏపీఎ్‌సఈబీ) ఇంజనీర్స్ అసోసియేషన్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. విద్యుత్తు సవరణ బిల్లు-2021 ఉపసంహరణ, విద్యుత్తు కొనుగోలు ఒప్పందాల(పీపీఏ) సవరణ, ఇంధన సంస్థల్లో పనిచేస్తున్నవారికి పాత పింఛను విధానమే అమలు చేయాలన్న డిమాండ్లను పరిశీలించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. 2021 విద్యుత్తు బిల్లును కేంద్రం ఉపసంహరించుకోవాలని అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పి.ప్రతాపరెడ్డి విజ్ఞప్తి చేశారు.
*సీజీఎఫ్ నిధులు రూ.200 కోట్లతో త్వరలో ఆలయాల జీర్ణోద్ధరణ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు దేవదాయశాఖ మంత్రి, ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. ప్రస్తుతం రూ.322 కోట్లతో జరుగుతున్న పనులను వేగంగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం కావాలన్నా తాను ముందుండి సాధించి పెడతానన్నారు. సీజీఎఫ్ పనులు, ఇంజనీరింగ్ విభాగంపై సోమవారం విజయవాడలో ఆయన సమీక్ష నిర్వహించారు. ఇతర శాఖల్లో ఇంజనీరింగ్ పనులకు, దేవదాయశాఖలో ఇంజనీరింగ్ పనులకు చాలా తేడా ఉంటుందని, ఆలయాల నిర్మాణాలు ఆగమ శాస్ర్తాన్ని పరిగణనలోకి తీసుకుని చేపట్టాలని సూచించారు.
*కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలను రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నట్లుగా మోసం జరుగుతోందని కేంద్ర జలశక్తి సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు పేర్కొన్నారు. సోమవారం శ్రీకాకుళంలో ఆయన మాట్లాడుతూ కేంద్రం అందజేస్తున్న పఽథకాలకు ఏపీ సీఎం జగన్ పేరు పెడుతూ ప్రజలను రాష్ట్ర ప్రభుత్వం మోసగిస్తోంది. ఇప్పటికే రెండుసార్లు పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాం. గ్యాస్‌పై తగ్గించాం. రాష్ట్రాలు కూడా పన్నులు తగ్గించాలి అని అన్నారు.
*కొత్త బార్ పాలసీపై జగన్ ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. ప్రస్తుత విధానం (2017-22) కాల వ్యవధి జూన్‌తో ముగుస్తున్న తరుణంలో జూలై నుంచే కొత్త పాలసీని అమలుచేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలో ప్రస్తుతం 840 బార్లు ఉన్నాయి. ఆ సంఖ్యను యథాతథంగా కొనసాగించనున్నారు. అయితే లైసెన్సు ఫీజులు మాత్రం భారీగా పెంచుతారనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం మూడు శ్లాబుల్లో.. 50 వేల లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.10 లక్షలు.. 50వేలు-3లక్షలలోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.20 లక్షలు.. 3 లక్షలకు పైగా ఉన్న ప్రాంతాల్లో రూ.30 లక్షలు.. ఫీజులుగా ఉన్నాయి.
*అమరావతిలో టీటీడీ నిర్మించిన శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో జూన్4 నుంచి 9 వరకు జరగనున్న మహాసంప్రోక్షణ కార్యక్రమాలకు విస్తృతంగా ఏర్పాట్లు చేయాలని టీటీడీ ఈవో ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం తిరుపతిలో ఈ విషయమై అధికారులతో సమీక్షించారు. దూరం నుంచి చూసినా కనిపించేలా ఆలయం వద్ద శంఖుచక్ర నామాలు ఏర్పాటు చేయాలని ఇంజినీరింగ్ అఽధికారులను ఆదేశించారు. ఆలయ వైదిక కార్యక్రమాల నిర్వహణకు ఆటంకం కలగకుండా పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, ఫ్యాన్లు ఏర్పాటు చేయాలన్నారు. ఆలయాన్ని సులువుగా గుర్తించేలా అవసరమైన ప్రాంతాల్లో సైన్‌బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలన్నారు. జూన్9 న మహాసంప్రోక్షణకు ఎక్కువమంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున దానికి అనుగుణంగా షెడ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
*ఈ ఏడాది డిసెంబరులో ఐదు టీ20ల సిరీస్ ఆడేందుకు ఆస్ట్రేలియా మహిళల జట్టు భారత పర్యటనకు రానుంది. ఈమేరకు ఆస్ట్రేలియా క్రికెట్ తమ పురుషులు, మహిళల జట్ల సిరీ్‌సలను ప్రకటించింది. అయితే పూర్తిస్థాయి షెడ్యూల్ వివరాలను మాత్రం వెల్లడించలేదు. ప్రస్తుతం ఆసీస్ జట్టు మహిళల టీ20 వరల్డ్‌కప్ చాంపియన్‌గా కొనసాగుతోంది. మరోవైపు మార్చిలో జరిగిన వన్డే వరల్డ్‌క్‌పలో చివరిసారిగా బరిలోకి దిగిన భారత మహిళల క్రికెట్ జట్టు.. జూలైలో జరిగే కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొనబోతోంది. ఆ తర్వాత సెప్టెంబరులో ఇంగ్లండ్‌తో మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీ్‌సలో తలపడుతుంది.
*ఏప్రిల్ నెలలో గ్రేటర్‌లో నమోదైన రికార్డుస్థాయి విద్యుత్ వినియోగంతో బిల్లులు కూడా భారీగా వసూలయ్యాయి. మే 30 నాటికి రూ. 870 కోట్ల బిల్లులను అధికారులు వసూలు చేశారు. గ్రేటర్ జోన్ తొమ్మిది సర్కిళ్ల పరిధిలో గృహ, కమర్షియల్ కేటగిరిలో మొత్తం విద్యుత్ బిల్లులు రూ. 884.12 కోట్లు. వాటిలో రూ.870 కోట్లు ఇప్పటికే వసూలయ్యాయి. బకాయిలు పేరుకుపోకుండా విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఏప్రిల్ నుంచి బకాయిలు లేకుండా సెక్షన్ల వారీగా జాగ్రత్త వహించాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు.
*హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలను అధిగమించేందుకు ఎస్‌ఆర్‌డీపీ (స్ట్రాటజిక్ రోడ్ డెవల్‌పమెంట్ ప్రాజెక్ట్)లో భాగంగా మొదటి దశలో చేపట్టిన పనులు ఒక్కొక్కటి అందుబాటులోకి వస్తున్నాయి. ఖైతలాపూర్ రైల్వే ఓవర్ బ్రిడ్జిని జూన్‌లో ప్రారంభించే అవకాశముందని అధికారులు తెలిపారు. చాంద్రాయణగుట్ట ఫ్లై ఓవర్ కూడా అదే నెలలో అందుబాటులోకి తీసుకొస్తామని చెబుతున్నారు. ప్రతిపాదిత పనులను ఈ సంవత్సరం డిసెంబర్ చివరి నాటికి పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి పథకంలో ఇప్పటి వరకు చేపట్టిన 41 పనుల్లో 29 అందుబాటులోకి వచ్చాయి.
*పీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి రైతుగా మారారు. కొన్నేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటూ సామాన్య జీవితం గడుపుతున్నారు. వ్యవసాయ పనుల్లో మునిగి తేలుతున్నారు. మడకసిర మండలం నీలకంఠపురంలో తన పొలంలోని రాగి పంటను వ్యవసాయ కూలీలతో కలిసి కోత కోశారు. ఆధునిక యంత్రంతో స్వయంగా తానే కోత పనుల్లో పాలు పంచుకున్నారు. ఒకనాటి మంత్రి ఇప్పుడు రైతుగా మారడాన్ని అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు.
* జగన్ మూడేళ్ళ మోసకారి పాలనపై టీడీపీ సీనియర్ నేత acham naidu చార్జ్ షీట్ విడుదల చేశారు. జగన్ పాలనంతా నేరాలు, ఘోరాలమయమని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. జగన్‌ది విధ్వంసకర కక్ష పాలన అన్నారు. వైసీపీ మూడేళ్ల పాలనలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కిపోయిందని, జగన్ పాలనలో ప్రజలకు ముప్పుతిప్పలు పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజావేదిక కూల్చివేతతో విధ్వంస పాలనకు నాంది అని చెప్పారు. క్విట్ జగన్..సేవ్ ఆంధ్రప్రదేశ్ అని చంద్రబాబు అన్నారని చెప్పారు. నిత్యావసర ధరలు ఆకాశాన్నంటుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలపై రూ.46 వేల కోట్ల విద్యుత్ భారం మోపుతున్నారని ఆరోపించారు. చార్జీలు పెరిగినా కరెంట్ కోతలు తప్పడం లేదన్నారు.
*మంత్రి మల్లారెడ్డిపై దాడి ఘటనపై కేసు నమోదైంది. ఆరు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మల్లారెడ్డిపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని టీఆర్‌ఎస్ నేతల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌లో ఇద్దరు కాంగ్రెస్ నేతల పేర్లు నమోదు చేశారు. సోమశేఖర్‌రెడ్డి, హరివర్ధన్‌రెడ్డి పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. మొత్తం 16 మందిపై 6 సెక్షన్ల కింద కేసు నమోదైంది. సెక్షన్ 173, 147, 149, 341, 352, 506 కింద కేసు నమోదు చేశారు. రేవంత్‌రెడ్డి అనుచరులే దాడి చేశారంటూ టీఆర్‌ఎస్ నేతల ఫిర్యాదు చేశారు.
*అధిక ధరలను అరికట్టాలని, పన్నుల భారాలను విరమించాలని కోరుతూ సోమవారం వామపక్షాలు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేపట్టాయి. ఈ సందర్భంగా వామపక్ష పార్టీల నేతలను పోలీసులు అరెస్టు చేశారు. దీనిని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ‘‘పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర వస్తువులు వంట నూనెలు తదితరాల ధరలు భారీగా పెరిగాయి. ఈ ధరలను అరికట్టడంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం విఫలమయింది. అదే విధంగా రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం విద్యుత్, బస్సు చార్జీలను పెంచింది. ఆస్తి, నీటి, చెత్త పన్నుల భారాలను ప్రజలపై గుదిబండగా మోపింది. అధిక ధరలను అరికట్టాలని, పన్నులు తగ్గించాలని వామపక్ష పార్టీలు జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహించాయి. రాష్ట్ర వ్యాప్తంగా నేతలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. కొందరిని ముందస్తు హౌస్ అరెస్టులు చే శారు. రాష్ట్రంలో ప్రజాస్వామిక హక్కులను హరిస్తున్నారు. పోలీస్ రాజ్యం నడుస్తోంది. ప్రజాతంత్ర వాదులంతా రాష్ట్ర ప్రభుత్వ, పోలీసు చర్యలను ఖండించాలి’’ అని కోరారు.
*‘‘రాజ్యసభకు అభ్యర్థులను ఎంపిక చేస్తున్న సమయంలో తెలంగాణ పోలీసులు నాపై కేసు పెట్టారు. దీనివల్ల నాకు పూడ్చలేని నష్టం జరిగింది. నాకు సంబంధం లేదని ఆయా పార్టీల నేతలు కూడా అ న్నారు. కొంతమంది పోలీసులు కూడా పొరపాటు జరగిందని చెప్పారు’’ అని బీజేపీ ఎంపీ టీజీ వెంకటేశ్ తెలిపారు. సోమవారం ఢిల్లీలో మాట్లాడారు. ‘‘ఈ అంశంపై ఐజీకి వినతిపత్రాన్ని ఇస్తాను. ఎఫ్‌ఐఆర్‌లో పేరు పెట్టకుండా కేసు డైరీలో నా పేరు పెట్టారు. చివరికి నా ప్రమేయం లేదని చార్జిషీటులో నా ప్రస్తావనే చేయలేదు. కానీ అప్పటికే నాకు నష్టం జరిగిపోయింది. నన్ను బాధపెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి చేస్తా. అక్కడ న్యాయం జరగకపోతే న్యాయ పోరాటం చేస్తా’’ అని మీడియాతో వెంకటేశ్ అన్నారు. కేవలం అమరావతి భజన చేయడం వల్లనే ఇతర ప్రాంతాల్లో టీడీపీ దెబ్బతిన్నదన్నారు.
*తెలంగాణ నుంచి దాదాపు 3,016 మంది హజ్ యాత్రకు వెళ్లనున్నట్టు హోంమంత్రి మహమూద్ అలీ వెల్లడించారు. హజ్‌యాత్ర ఏర్పాట్లపై హాజ్‌కమిటీ, మైనార్టీ శాఖ అధికారులతో మంత్రి సోమవారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. శంషాబాద్ విమానాశ్రయంలో హజ్ యాత్రికులకు ఏర్పాట్లు, సౌకర్యాలపై చర్చించారు. జూన్ 20 నుండి 30వరకు రాష్ట్రంలో హజ్ యాత్ర కొనసాగుతుందని తెలిపారు. సమావేశంలో హజ్‌కమిటీ చైర్మన్ మహమ్మద్ సలీం, వక్ఫ్ బోర్డు చైర్మన్ మసీవుల్లా ఖాన్, మైనార్టీ సంక్షేమ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ నదీమ్, హజ్ కమిటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ షఫీవుల్లా, ఐపీఎస్ అరుణ్ బెహల్, జీఎంఆర్ సీవోవో బీబీయానా తదితరులు పాల్గొన్నారు.
*నాలుగు ఎమ్మెల్సీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో 49 మంది అభ్యర్థులు బరిలో మిగిలా రు. సోమవారం నామినేషన్ల ఉపసంహరణ ముగియడంతో బరిలో నిలిచే అభ్యర్థులు ఖరారయ్యారు. కర్ణాటక వాయువ్య పట్టభద్రుల నియోజకవర్గంలో 27 మంది నామినేషన్లు వేయగా ఉపసంహరణ తర్వాత 11 మంది మిగిలారు. కాంగ్రెస్, బీజేపీతోపాటు ఏడుగురు స్వతంత్రులు, రెండు గుర్తింపు పొందని పార్టీల అభ్యర్థులు ఉన్నారు. జేడీఎస్ ఇక్కడి నుంచి పోటీ చేయలేదు. కర్ణాటక దక్షిణ పట్టభద్రుల నియోజకవర్గంలో 33 నామినేషన్‌లు దాఖ లు కాగా చివరకు 19 మంది అభ్యర్థులు మిగిలారు. 3 ప్రధాన పార్టీలతోపాటు మిగిలినవారు స్వతంత్రులు ఉన్నారు. వాయువ్య ఉపాధ్యాయ నియోజకవర్గంలో 22 నామినేషన్లు వేయగా 12 మంది బరిలో ఉన్నారు. మూడు పా ర్టీలతోపాటు 9 మంది స్వతంత్రులు ఉన్నారు. కర్ణాటక పశ్చిమ ఉపాధ్యాయ నియోజకవర్గానికి 18 మంది నామినేషన్లు వేయగా ఏడుగురు బరిలో నిలిచారు. మూడు పార్టీలతోపాటు నలుగురు స్వతంత్రులు ఉన్నారు.
*తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లా జైనల్లీపూర్ గ్రామానికి చెందిన కృష్ణయ్య మంగళవారం తెల్లవారుజామున భార్య కళమ్మ, కూతురు సరస్వతిని రోకలిబండతో మోది హత్య చేశాడు. సరస్వతికి ఈనెల 8న మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి చెందిన వరుడితో వివాహం జరిగింది. 15 రోజల తర్వాత ఆమె తల్లిగారింటికి వచ్చింది. తిరిగి కాపురానికి వెళ్లబోనంటూ తల్లిదండ్రులకు చెప్పింది. ఈ విషయంలో తల్లి కళమ్మ సరస్వతికి అండగా నిలవగా కృష్ణయ్య మాత్రం వ్యతిరేకించారు.