నందమూరి తారక రామారావు శత జయంతి కార్యక్రమం రాలీ, నార్త్ కరోలినాలో ఘనంగా నిర్వహించారు. NTR అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్ నినాదాలు చేసి NTR కాంస్య విగ్రహాన్ని ప్రతిష్టించారు. అనంతరం నివాళులర్పించారు. NRI TDP USA కన్వీనర్ జయరాం కోమటి, పశ్చిమగోదావరి జిల్లా MLC మంతెన వెంకట సత్యనారాయణ రాజు, ఎల్.విజయలక్ష్మి, దర్శకుడు YVS చౌదరి, తానా ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ నిరంజన్ శృంగవరపులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎన్టీఆర్ ఫ్యాన్స్ వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. ఎన్టీఆర్ నటించిన సినిమాల్లో సూపర్ డూపర్ హిట్ సాంగ్స్‌ను, దుర్యోధనాది పాత్రలను నటించి అలరించారు. ఈ కార్యక్రమానికి శ్రీనివాస్ ఆరెమండ నేతృత్వం వహించారు. సభ్యులు శ్రీధర్ గొట్టిపాటి, మాధవి మార్తాల, పూర్ణచంద్ర కండ్రగుంట, మోహన్ కోడె, హరి నాదెండ్ల, క్రిష్టారెడ్డి, శ్రీనివాస్ అనంత,శిరీష్ గొట్టిముక్కల, శ్రీనివాస్ మార్తాలలు సహకరించారు.
ర్యాలీ నార్త్ కరోలినాలో NTR100
Related tags :