Business

జూన్​లో బ్యాంకులకు 12 రోజులు సెలవులు!

జూన్​లో బ్యాంకులకు 12 రోజులు సెలవులు!

బ్యాంకులు మన నిత్య జీవితంలో భాగమైపోయాయి. దీంతో మన లావాదేవీల నిర్వహణకు బ్యాంకుకు వెళ్లాల్సి ఉంటుంది. జూన్​ నెలలో 12 రోజులు బ్యాంకులు పనిచేయవని రిజర్వ్​ బ్యాంక్ ఆఫ్​ ఇండియా తెలిపింది.ఆర్థిక లావాదేవీల కోసం బ్యాంక్‌కు వెళ్తున్నారా? అయితే ఈ సమాచారం మీకోసమే! బ్యాంకులు ఏఏ తేదీల్లో పని చేస్తాయో తెలుసుకుంటే.. ఆ మేరకు ప్రణాళికలు వేసుకోవటానికి వీలుంటుంది. లేదంటే కాస్త ఇబ్బంది పడాల్సి వస్తుంది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ప్రకారం జూన్​ నెలలో ఆయా రాష్ట్రాల్లో పండుగలకు అనుగుణంగా బ్యాంకులకు 12రోజుల సెలవులు వస్తున్నాయి.

జూన్​ 2: గురువారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం(తెలంగాణ), మహారాణా ప్రతాప్ జయంతి(హిమాచల్​ ప్రదేశ్​, హరియాణా, రాజస్థాన్​)
జూన్​ 3: శుక్రవారం శ్రీ గురు అర్జున్​దేవ్​జి వర్ధంతి (పంజాబ్​)
జూన్​ 5: ఆదివారం
జూన్​ 11: రెండో శనివారం
జూన్ 12: ఆదివారం
జూన్​ 14: మంగళవారం సంత్​ గురు కబీర్​ జయంతి(హరియణా, పంజాబ్​,హిమాచల్​ ప్రదేశ్​), పహిలి రాజ(ఒడిశా)
జూన్​ 15: బుధవారం రాజా సంక్రాంతి(ఒడిశా), గురు హర్​గోబింద్​జీ జన్మదినోత్సవం(జమ్ము కశ్మీర్​), వైఎంఏ డే(మిజోరం)
జూన్ 19: ఆదివారం
జూన్​ 22: బుధవారం ఖర్చి పూజ(త్రిపుర)
జూన్​ 25: నాలుగో శనివారం
జూన్​ 26: ఆదివారం
జూన్​ 30: బుధవారం రెమ్నా నీ(మిజోరం)