*బెజవాడలో దారుణ హత్య…నగరంలోని గురు నానక్ కాలనీ లో హత్య…ఫుట్ బాల్ ప్లేయర్ ఆకాష్ దారుణంగా హత్య చేసిన దుండగులుకత్తులతో పొడిచి చంపిన ప్రత్యర్థులు…నిందితులు గుణదల గంగిరెద్దుల దెబ్బకు చెందినవారుగా గుర్తింపు…కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పటమట పోలీసులు..నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసిన పోలీసులు..
*స్క్రు బ్రిడ్జి వద్ద అదుపుతప్పి కెమికల్ లోడ్ లారీ బోల్తా.ఫైర్ అయ్యే అవకాశం ఉండటంతో ఉదయం వాహనాలను నిలిపివేసిన పోలీసులు.ఘటనా స్థలం వద్దకు చెరుకున్న ఫైర్ సిబ్బంది.విశాఖట్నంలోని ఇండస్ట్రియల్ ఏరియా నుండి జగ్గయ్యపేట వస్తున కెమికల్ లోడ్.సకాలంలో చేరుకొని ట్రాఫిక్ క్లియర్ చేసి రాకపోకలకు ఎటువంటి ఇబ్బందీ లేకుండా చర్యలు చేపట్టిన కృష్ణలంక పోలీసులు.కెమికల్ డ్రమ్స్, పౌడర్ ఉన్న లోడును వేరొక లారీలో లోడ్ చేస్తున్న వర్కర్స్.
*వత్సవాయి మండలం కంభంపాడు గ్రామం లోడ్రీకొడుకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.ఇంట్లో ఎవరు లేని సమయంలో శ్రీను (45) త్రాడుకు వెలడుతూ బలవన్మరణానికి పాల్పడ్డ వైనం.బలవన్మరణం పై గ్రామ ప్రజల్లో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి గ్రామస్తుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రి కి పంచనామా కు తరలించిన పోలీసులు.
* ఇంద్రకీలాద్రిపై యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఘాట్ రోడ్డు మొదటి మలుపు దగ్గర యువతి చాకుతో గొంతు కోసుకుంది. పెనమలూరు మండలం యనమలకుదురు వాసి త్రివేణిగా గుర్తించారు. రక్తపుమడుగులో పడిఉన్న బాధితురాలిని గుర్తించిన భక్తులు పోలీసులకు సమాచారమిచ్చారు. బాల్యంలోనే ఆ యువతి తల్లిదండ్రులను కోల్పోయింది. తల్లిదండ్రులు గుర్తుకు రావడంతో చనిపోవాలనుకున్నట్టు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు.
*హనుమకొండ: జిల్లా కలెక్టరేట్ ఎదుట ఉద్రిక్తత చోటు చేసుకుంది. బుధవారం ఉదయం కలెక్టరేట్ వద్ద సీపీఎం(CPM) ఆధ్వర్యంలో మహాధర్నాకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో సీపీఎం కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. మహిళలు ఎర్రటిఎండలో రోడ్డుపై బైఠాయించారు. కాగా… ధర్నాకు వస్తున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, మరోనేత పోతినేని సుదర్శన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
*చిత్తూరు జిల్లాలో ఎర్ర చందనాన్ని అక్రమంగా తరలిస్తున్న ప్రధాన స్మగ్లర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కళ్లుగప్పి తప్పించుకుని తిరుగుతున్న స్మగ్లర్ పెరుమాళ్ తిరుపతి నుంచి వేలూరుకు కారులో వెళ్తుండగా పట్టుకున్నారు. అతడి వద్ద నుంచి రూ. 3 కోట్ల విలువైన వంద ఎర్రచందనం దుంగలను, నాలుగు వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డి తెలిపారు. మరో వాహనంలో ఎర్రచందనం తరలిస్తుండగా పట్టుకున్నామని వివరించారు
* విజయవాడ జాతీయ రహదారిపై ఆగి ఉన్న కంటైనర్‌ను కారు ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకున్నది.
*జీడిమెట్ల పరిధిలోని సుభాష్ నగర్‌లో దారుణం జరిగింది. నైట్రోజన్ గ్యాస్ ఫిల్లింగ్ చేస్తుండగా.. భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుడి శరీరం రెండు ముక్కలైంది.
*హైదరాబాద్: నగరంలోని జీడిమెట్ల సుభాష్‌నగర్‌లో పేలుడు సంభవించింది. గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. పేలుడు ధాటికి మృతుడి శరీరం ముక్కలైంది. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఇళ్ల మధ్య అక్రమంగా గ్యాస్ రీ ఫిల్లింగ్ చేస్తున్నట్టు గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
*విజయనగరం: జిల్లాలోని రాజాం మండలం పొగిరి దగ్గర బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ వ్యాపారి కాళ్లు, చేతులు కోల్పోయాడు. దుప్పట్ల వ్యాపారిని కారు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. కాగా ప్రమాదానికి కారణమైన కారులో ఓ ఎస్ఐతో పాటు కానిస్టేబుళ్లు ప్రయాణిస్తున్నారు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు నిలదీస్తున్నా పట్టించుకోకుండా పోలీసుల కారు శ్రీకాకుళం వైపు పరారైంది. సమాచారం అందుకున్న ‘స్థానిక పోలీసులు… గాయపడిన వ్యాపారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
*పల్నాడు: జిల్లాలోని ఈపూరు మండలం ఇనిమెళ్లలో సైదా అనే వ్యక్తి అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. పొలంలో సైదా మృతదేహంతో పాటు… పక్కన పురుగు మందు డబ్బా పడి ఉంది. శరీరం అంతా కాలి ఉండటంతో కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సైదా స్నేహితులే చంపి కాల్చి ఉంటారని అనుమానిస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
*Tirupathi: నగరంలో మరో వివాహిత అదృశ్యమైంది. తన కుమార్తె రేణుక (Renuka) కనిపించడంలేదని ఆమె తండ్రి ప్రసాద్ అలిపిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని మంగళం సమీపంలో నివాసముంటున్న రేణుక తల్లిదండ్రులు.. నంద్యాలకు చెందిన మహేష్ కుమార్‌తో వివాహం జరిపించారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.
*కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని జిల్లా ప్రభుత్వాస్పత్రిలో తల్లీ బిడ్డల అదృశ్యం కలకలం సృష్టించింది. మచిలీపట్నం దేశాయిపేటకు చెందిన ఆనంద్ భార్య ప్రసవం నిమిత్తం మే 21వ తేదీన ఆస్పత్రిలో జాయిన్ అవ్వగా అదే రోజున ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. కామెర్ల కారణంగా ఆ పసిబిడ్డను రోజూ ఉదయం పూట బాక్స్‌లో పెట్టి చికిత్స అందిస్తున్నారు. రోజూ మాదిరి భోజనం తెచ్చేందుకు భర్త ఇంటికి వెళ్లి వచ్చే సరికి ఆస్పత్రిలో ఉన్న పసి బిడ్డతో పాటు తన మరో బిడ్డతో భార్య కనిపించకుండా పోయింది. ఆస్పత్రి అంతా గాలించినా ప్రయోజనం లేకపోవటంతో భర్త పోలీసులను ఆశ్రయించారు. భర్త ఫిర్యాదు మేరకు అదృశ్యమైన తల్లీ పిల్లల కోసం పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు.
*అప్పులబాధకు మరో ఇద్దరు రైతులు బలైపోయారు. పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం పట్లవీడు గ్రామానికి చెందిన తాటికొండ లక్ష్మారెడ్డి (44) తనకున్న 10 ఎకరాలతోపాటు మరో 10 ఎకరాలను కౌలుకు తీసుకొని పత్తి, మిర్చి, కంది సాగు చేశాడు. రెండేళ్లుగా పంటలు సరిగా పండకపోవడంతో అప్పులు రూ. 20 లక్షలకు చేరుకున్నాయి. దిక్కుతోచని స్థితిలో సోమవారం సాయంత్రం పొలానికి వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కర్నూలు జిల్లా చాగలమర్రి మండలం చిన్నబోదనం గ్రామానికి చెందిన రైతు శ్రీనివాసరెడ్డి (49) తనకున్న ఆరు ఎకరాల పొలంతోపాటు మరో ఆరు ఎకరాలు కౌలుకు తీసుకొని రెండేళ్లుగా పత్తి, మొక్కజొన్న, మినుము, వరి సాగు చేసి నష్టపోయాడు. మొత్తం రూ.16 లక్షల అప్పులు తీర్చలేక మంగళవారం పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
*సికింద్రాబాద్: నగరంలోని బసేరా హోటల్‌లో అశ్లీల నృత్యాలు చేస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. అక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయన్న పక్కా సమాచారంతో నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు జరిపారు.రైడ్స్‌లో భాగంగా 8 మంది యువతులు, 25 మంది కస్టమర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వెంటనే వారిని గోపాలపురం పోలీసు స్టేషన్‌కు తరలించారు.
*నిజామాబాద్: జిల్లాలోని జాక్రాన్‌పల్లి మండలం కొలిప్యాక్‌లో విషాదం చోటుచేసుకుంది. వాగు చెక్ డ్యాంలో ఈతకెళ్లి ఇద్దరు బాలికలు మృతి చెందారు. మృతులు మౌనిక(14), కృష్ణవేణి(11)గా గుర్తించారు. ఈ ఘటనతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబీకులు, బంధువులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
*మల్లాపూర్‌లోని కేంద్ర అణు ఇంధన శాఖకు చెందిన అణు ఇంధన సంస్థ (ఎన్‌ఎ్‌ఫసీ)లో మంగళవారం అగ్ని ప్రమాదం సంభవించింది. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఓల్డ్ జడ్‌ఎ్‌సపీ ప్లాంట్‌లో ఏడుగురు ఉద్యోగులు అణు ఇంధనాన్ని (జిర్కోనియం) శుద్ధి చేస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో సీనియర్ టెక్నీషియన్ ఎస్. శ్రీనివాస రావు(57), కాంట్రాక్టు కార్మికులు శ్రీను(40), కిషన్(27)లు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వీరిని ఆస్పత్రికి తరలించారు.
*ఆస్తి వివాదం ఆ కుటుంబంలో చిచ్చురేపింది. విచక్షణ మరచిన కొడుకు తల్లిదండ్రులపైనే దాడి చేసి గాయపరిచాడు. బాధితుల కథనం మేరకు… శ్రీకాళహస్తి పట్టణం కొత్తపేటకు చెందిన మన్నేపల్లి శ్రీనివాసులు బియ్యం వ్యాపారం చేస్తుంటాడు. అతని భార్యయ శోధ గృహిణి. వీరికి ముగ్గురు కొడుకులు. పెద్ద కొడుకు ఎంటెక్ పూర్తిచేసి ఓ ప్రైవేటు కళాశాలలో అధ్యాపకుడుగా పనిచేస్తుంటాడు. రెండవ కుమారుడు ఎంబీఏ, ఎంకాం, బీఈడీ చేసి నెల్లూరులోని ప్రైవేటు కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తుంటాడు. మూడవ కుమారుడు బీటెక్ పూర్తిచేసి హైదరాబాదులో ఇంజనీర్‌గా పనిచేస్తుంటాడు. రెండు రోజుల క్రితం పెద్ద కుమారుడు, రెండవ కుమారుడి మధ్య ఆస్తి పంపకాల విషయంలో వాగ్వాదం చోటుచేసుకుంది. ఇల్లు అమ్మేసి తన వాటా ఇవ్వాలని పెద్ద కుమారుడు పట్టుబట్టాడు. ఇల్లు అమ్మేందుకు తల్లిదండ్రులు నిరాకరించడంతో మంగళవారం తల్లిదండ్రులతో వాగ్వాదానికి దిగాడు. తన వాటా తనకు ఇచ్చేయాలంటూ తల్లిదండ్రులపై దాడిచేసి తీవ్రంగా గాయపరిచాడు. వారు చికిత్స కోసం శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రిలో చేరారు. ఈ ఘటనపై కేసు నమోదు కాలేదు.
* పెళ్లికి నిరాకరించినందుకు ప్రేయసో, ప్రియుడో ఆత్మహత్య చేసుకున్నారనే వార్తల్ని తరచూ చూస్తుంటాం. కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లాలో ఓ విచిత్ర ప్రేమకథ వెలుగు చూసింది. ఆ ప్రేమ కథ ప్రియుడి ఆత్మహత్యతో విషాదాంతమైంది. ఆత్మహత్య చేసుకున్న వ్యక్తిని చేతన్ (31)గా గుర్తించారు. తాను ప్రేయసి కోసం ఇప్పటి వరకు చేసిన ఖర్చులను లెక్కరాసి.. ఆ మొత్తాన్ని వసూలు చేయాలంటూ ఆయన ఉత్తరం రాయడం విశేషం. పోలీసుల కథనం మేరకు.. చిక్కమగళూరు జిల్లా శంకరపురకు చెందిన చేతన్ తొమ్మిదేళ్లుగా ఓ యువతిని ప్రేమించాడు. ఇద్దరూ తరచూ కలుసుకునేవారు. ఆమె సరదాలు, సంతోషాల కోసం బాగా ఖర్చు చేయాల్సి వస్తోందంటూ స్నేహితులతో చెప్పి వాపోయేవాడు. సరకు రవాణా వాహనాన్ని నడుపుతూ జీవించే చేతన్ తన ఆదాయంలో అధిక భాగం ఆమె కోసమే ఖర్చు చేసేవాడట. ఇటీవల పెళ్లి చేసుకుందామని చేతన్ ప్రతిపాదించగా ఆమె ససేమిరా అంది. ఆమె ప్రవర్తనతో విసిగిపోయి.. చివరకు జీవితంపై విరక్తి చెంది సోమవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని స్నేహితులు పోలీసులకు తెలిపారు. అతని మృతదేహంవద్ద లేఖ ఒకటి లభించింది. అందులో తాను ప్రేయసి సరదాల కోసం రూ.4.50 లక్షలు ఖర్చు చేశానని పేర్కొన్నారు. ఆ మొత్తాన్ని ఆమె నుంచి వసూలు చేసి తన కుటుంబానికి అందించాలని పోలీసులను కోరారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
*ఎచ్చెర్ల మండలం పూడివలసలో దారుణం చోటు చేసుకుంది. కట్టుకున్న భార్యను ఆమె భర్తే గొంతు నులిమి కడతేర్చాడు. పరీదుపేట గ్రామ సచివాలయంలో జరుగుళ్ల నాగరత్నం అనే మహిళ ఏఎన్ఎంగా పనిచేస్తోంది. ఈ క్రమంలోనే కుటుంబ కలహాల కారణంగా నాగరత్నంను ఆమె భర్త రామారావు గొంతు నులిమి హత్య చేసి అనంతరం పోలీసుల ఎదుట లొంగిపోయాడు.
*కృష్ణా జిల్లా జిల్లా ప్రభుత్వాస్పత్రిలో తల్లీ బిడ్డల అదృశ్యం కలకలం…మచిలీపట్నం దేశాయిపేటకు చెందిన ఆనంద్ భార్య ప్రసవం నిమిత్తం మే 21వ తేదీన ఆస్పత్రిలో జాయిన్ అవ్వగా అదే రోజున ఆడ బిడ్డకు జన్మనిచ్చింది..కామెర్లు కారణంగా ఆ పసి బిడ్డను రోజూ ఉదయం పూట బాక్స్ లో పెడుతు చికిత్స అందిస్తున్నారు..రోజు మాదిరి భోజనం తెచ్చేందుకు భర్త ఇంటికి వెళ్లి వచ్చే సరికి ఆస్పత్రిలో ఉన్న పసి బిడ్డతో పాటు తన మరో ఇద్దరు పిల్లలతో తల్లి కనిపించకుండా పోయింది.ఆస్పత్రి అంతా గాలించినా ప్రయోజనం లేకపోవటంతో భర్త పోలీసులను ఆశ్రయించారు..భర్త ఫిర్యాదు మేరకు అదృశ్యమైన తల్లీ పిల్లల కోసం పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు.