ఇండియా గేట్ వద్ద నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం ఏర్పాటు చేసేందుకు మైసూర్ నుంచి శిల్పి అరుణ్ యోగిరాజ్ న్యూఢిల్లీ చేరుకున్నారు. ఆగస్ట్ 15 కల్లా ఆయన ఈ విగ్రహాన్ని సిద్ధం చేస్తారు. సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్ డైరక్టర్ జనరల్ అద్వైత గడనాయక్ బృందం ఇప్పటికే తయారు చేసి ఫైనల్ చేసి డిజైన్ ఆధారంగా యోగిరాజ్ ఈ 30 అడుగుల విగ్రహాన్ని చెక్కుతారు. ఇందు కోసం ఆయనకు 25 మంది శిల్పులు సహకరిస్తారు. యోగిరాజ్ గతంలో కేదార్‌నాథ్ వద్ద ఏర్పాటు చేసిన 12 అడుగుల ఆదిశంకరాచార్య విగ్రహాన్ని చెక్కారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాడు ఆది శంకరాచార్యుల విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత యోగిరాజ్ ప్రధానిని జనవరి నెలలో న్యూఢిల్లీలో కలుసుకున్నారు. రెండడుగుల నేతాజీ విగ్రహాన్ని బహుకరించారు. నాడు మోదీ ట్విటర్ ద్వారా యోగిరాజ్ ప్రతిభను కొనియాడారు.
https://twitter.com/narendramodi/status/1511263863463112708/photo/1