NRI-NRT

చిన్నారి శస్త్రచికిత్సకు తానా సామినేని పౌండేషన్ సహాయం

చిన్నారి శస్త్రచికిత్సకు తానా   సామినేని పౌండేషన్ సహాయం

ఖమ్మం జిల్లా బస్వాపురానికి 14నెలల బాలిక పూర్వికకు ఈరోజు బ్రెయిన్ సిర్జరీ విజయవంతంగా జరిగింది. పూర్విక బ్రెయిన్ స్ట్రోక్ వ్యాధితో బాధపడుతోంది. ఈ చిన్నారి.. తొలి శస్త్ర చికిత్సకు వెంటనే రూ. 6 లక్షలు ఖర్చవుతున్న నేపథ్యంలో ఖమ్మానికి చెందిన దొడ్డా రవి.. చిన్నారి పరిస్థితిని తానా, సామినేని ఫౌండేషన్ సభ్యులకు వివరించడంతో స్పందించి రూ.2 లక్షలు సాయం అందించడానికి ముందుకొచ్చారు. సామినేని రవి రూ. లక్ష సాయం అందించగా, ఎన్ ఆర్ఎలు రాజా కసుకుర్తి, శశాంక్ యార్లగడ్డ, సుమంత్ రామి శెట్టి, సతీశ్ వేమూరి, శిరీష తూనుగుంట్ల కలిసి మరో రూ. లక్షను సాయంగా ప్రకటించారు. ఈ మొత్తాన్ని హైదరాబాద్ రెయిన్బో ఆసుపత్రి పేరుతో చెకు అందించారు. నిన్న హైదరాబాద్ లో చిన్నారి తల్లిదండ్రులకు రూ.2 లక్షల చెక్ను తానా మాజీ అధ్యక్షుడు జయశేఖర్ తాళ్లూరి గారి ద్వారా అందించటం జరిగింది. రాధాకృష్ణ ఆళ్ల గారు, బండి నాగేశ్వరరావు, చిరంజీవి కార్యక్రమంలో పాల్గొన్నాము. సాయం అందించనందుకు చిన్నారి తల్లి దండ్రులు దాతలకు కృతజ్ఞతలు తెలిపారు.కాగా తొలి సర్జరీ ని రెయిన్బో హాస్పిటల్ వారు బుధవారం నాడు విజయవంతం గా నిర్వహించారు..