భారత్- పాక్ స్వతంత్ర దేశాలుగా మారినా ఇరు దేశాల వ్యవహారం చర్చకు వస్తుంటుంది. భారత ప్రజలు పాకిస్థాన్ గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఇప్పుడు పాకిస్తాన్ రైల్వేకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. పాక్‌లోని రైళ్లు, రైల్వే స్టేషన్ల ఫొటోలను చూస్తే భారతదేశం, పాకిస్తాన్ దేశాల మధ్య తేడా లేదని అనిపిస్తుంది. అయితే ఇప్పుడు భారతదేశంలోని స్టేషన్లలో ఎన్నో సౌకర్యాలు ఏర్పడ్డాయి. పాకిస్తాన్ రైల్వే.. భారత్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, టర్కీ దేశాలను తన రైలు నెట్‌వర్క్‌తో అనుసంధానిస్తుంది. బ్రిటీష్ కాలంలోనే పాక్‌లో రైల్వే సేవలు మొదలయ్యాయి. 1861లో రైలు సేవలు ప్రారంభమయ్యాయి. జాతీయ పండుగలలో పాక్ రైల్వేస్టేషన్‌లను అలంకరిస్తారు. పాక్ రైల్వేలలో 72 వేల మందికి పైగా పని చేస్తున్నారు. పాక్ రైల్వేల నెట్‌వర్క్ టోర్ఖమ్ నుండి కరాచీ వరకు విస్తరించి ఉంది. పాక్ రైల్వే 70 మిలియన్ల ప్రయాణికులకు సేవలు అందజేస్తోంది.