ఇప్పటికే నటుడిగా, వ్యాఖ్యాతగా జోరు చూపిస్తున్న హీరో బాలకృష్ణ.. ఇటీవలే ఓ పుస్తకాన్ని రాశారట. ‘భార్యను ఏమార్చడం ఎలా? 30 సూత్రాలు’ పేరుతో ఉన్న ఆ పుస్తకాన్ని.. ఒకరికి గిఫ్ట్‌గా ఇచ్చారు. ఆ కథేంటో మీరూ తెలుసుకోండి. సినిమాలతో పాటు రియాలిటీ షోలు కూడా చేస్తూ ఎంతో యాక్టివ్‌గా ఉంటారు హీరో నందమూరి బాలకృష్ణ. అప్పుడప్పుడు మిగతా షోస్‌కు కూడా అతిథిగా వెళ్తూ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తుంటారు. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’లో ప్రసారమవుతున్న తెలుగు ఇండియన్ ఐడల్ కార్యక్రమానికి బాలయ్య ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆ సమయంలోనే బాలకృష్ణ రాసిన పుస్తకం అంటూ.. ఆ ప్రోగ్రామ్ యాంకర్, సింగర్ శ్రీరామ్‌చంద్ర తీసుకొచ్చి అందరికీ చూపించారు.అసలు విషయానికొస్తే… ఆ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్న ఓ కంటెస్టంట్‌కు త్వరలో వివాహం జరగనుంది. దీంతో ఆ విషయం యాంకర్.. బాలకృష్ణకు చెప్పారు. వెంటనే బాలయ్య.. ‘ఏంటి పెళ్లి చేసుకుంటున్నావా? ఎప్పుడు అని అడగను! ఎందుకు అని అడుగుతా?’ అని సరదాగా అన్నారు. ఆ తర్వాత ఓ పుస్తకాన్ని ఆ కంటెస్టంట్‌కు గిఫ్ట్‌గా ఇస్తున్నట్లు చెప్పారు. ‘భార్యను ఏమార్చడం ఎలా? 30 సూత్రాలు… బై ఎన్బీకే’ అనే కవర్పేజ్తో ఉన్న బుక్‌ను చూడగానే ఒక్కసారిగా ఆ స్టేజ్ అంతా నవ్వులు పూశాయి.షోను కాస్త ఇంట్రెస్టింగ్గా మార్చడంలో భాగంగా ఇలా బాలయ్య పేరుతో సరదాగా ఓ పుస్తకాన్ని సృష్టించి, త్వరలో పెళ్లి చేసుకోనున్న కంటెస్టెంట్‌కు గిఫ్ట్‌గా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇదే తరహాలో మరో లేడీ సింగర్‌కు లౌడ్‌స్పీకర్‌ను కానుకగా ఇచ్చారు బాలకృష్ణ. మరో కంటెస్టెంట్‌ను పూజా హెగ్డేతో పోల్చుతూ నవ్వులు పూయించారు. ఈ ప్రోగామ్ ప్రోమో విడుదలైన కాసేపటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పూర్తి ఎపిసోడ్ జూన్ 10న ‘ఆహా’లో ప్రసారం కానుంది.