NRI-NRT

జూన్ 11 నుండి 19 వరకు శ్రీ రామ పరివార విగ్రహ ప్రతిష్ఠ వేడుకలు

జూన్ 11 నుండి 19 వరకు  శ్రీ రామ పరివార విగ్రహ ప్రతిష్ఠ  వేడుకలు

టెక్సస్ రాష్ట్రంలోని హిందూ టెంపుల్ ఆఫ్ గ్రేటర్ ఫోర్ట్ వర్త్ ఆలోచనకి 2007 లో బీజం పడినప్పటినుండి మధ్యంతర గుడి, ఆ తర్వాత శాశ్వత గుడి ఏర్పాటు వరకు దిన దిన ప్రవర్ధమానం చెందుతూ పలు దేవ దేవాతా మూర్తుల ప్రతిష్ఠాపనతో డల్లాస్ ఫోర్ట్ వర్త్ ప్రాంతంలోని హిందువులలో భక్తి మార్గాన్ని పెంపొందించింది.ఇందులో భాగంగా వచ్చే జూన్ 11వ తారీఖు నుండి 19వ తారీఖు వరకు శ్రీ రామ పరివార విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. జీవితకాలంలో ఒకసారి మాత్రమే లభించే ఇటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని 9 రోజులపాటు నిర్వహించే పూజా వేడుకల్లో పాల్గొని స్వామి వారి తీర్ధ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా ట్రస్టీ సభ్యులు, ఈవెంట్ ఛైర్మన్ మురళి వెన్నం కోరుతున్నారు.శ్రీ రామ పరివార విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ ముహూర్త ఘడియలు జూన్ 18న ఉదయం 10 గంటల 46 నిమిషాలు కాగా, శనివారం జూన్ 11 ఉదయం 10 గంటల నుండి ఆదివారం జూన్ 19 సాయంత్రం 6 గంటల వరకు 9 రోజులపాటు పూజలు పునస్కారాలు పెద్ద ఎత్తున సంప్రదాయబద్ధంగా నిర్వహించనున్నారు.శ్రీ రామ పాదుక సేవ, సర్వ దేవతా హోమం, మూల మంత్ర హోమం, ఆధివాసమ్స్, నిత్య దర్శనం మరియు నిత్య పూజలు 9 రోజులపాటు చేయ తలపెట్టారు. స్వచ్ఛమైన మార్బుల్ తో తయారు చేసిన శ్రీ రామ పరివార విగ్రహాలను స్వచ్ఛమైన 22 కారట్ బంగారంతో అలంకరించనుండడం ప్రత్యేకం.
Sri-Rama-Parivar-Pratishta-Puja-Details-at-Hindu-Temple-of-Greater-Fort-Worth