DailyDose

సత్యసాయి జిల్లాలో పెన్షన్ సొమ్ముతో గ్రామ వాలంటీర్ పరారీ – TNI నేర వార్తలు

సత్యసాయి జిల్లాలో పెన్షన్ సొమ్ముతో గ్రామ వాలంటీర్ పరారీ   – TNI  నేర వార్తలు

*సత్యసాయి జిల్లా కదిరి తలుపుల మండలంలోని ఎనుములదొడ్డి వారి పల్లిలో ఒక 1,50,000, పెన్షన్ సొమ్ముతో పరారైన గ్రామ వాలెంటర్ కొండారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసిన పంచాయతీ అధికారులు పెన్షన్ సొమ్ముతో పరారైన గ్రామ వాలంటరీ కొండారెడ్డి వైసీపీ ముఖ్య నాయకుడి అనుచరుడు కావడంతో మీడియాకు తెలియకుండా గోప్యంగా ఉంచుతున్న పోలీసులు గ్రామ వార్డు వాలంటీర్ కొండారెడ్డి పెన్షన్ సొమ్ముతో పరారు కావడంతో ఈ నెల పెన్షన్ అందుతుందో లేదో అని ఆందోళన చెందుతున్న వృద్ధాప్య పెన్షన్ దారులు

*పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం తిమ్మాపురం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. 15 మందికి గాయాలయ్యాయి. ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం వద్ధినేని వారిపాలెం నుంచి ట్రాలీ వాహనంలో 17 మంది పెళ్లిచూపుల కోసం గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని కొలకలూరు గ్రామానికి వచ్చారు. పెళ్లిచూపుల తర్వాత బుధవారం అర్ధరాత్రి తిరిగి గ్రామానికి బయల్దేరారు. అయితే తిమ్మాపురం వద్ద జాతీయ రహదారిపై ట్రాలీని.. గుంటూరు వైపు నుంచి చిలకలూరిపేట వస్తున్న కంటైనర్ వాహనం వేగంగా వచ్చి ఢీకొట్టింది. అక్కడికక్కడే ట్రాలీ వాహనంలో ప్రయాణిస్తున్న ఈదర రమణయ్య (55), ఈదర మాల్యాద్రి(45) మరణించారు. మరో 15 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో నలుగురు చిన్నారులు ఉన్నారని పోలీసులు తెలిపారు. గాయపడినవారిని గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం చిలకలూరిపేట ప్రభుత్వాస్పపత్రికి తరలించారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

*ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగర శివారు కండ్రిక కాలనీలో దారుణం జరిగింది. దంపతులిద్దరూ గొడవ పడుతుంటే.. ఆమె ఇద్దరికీ సర్దిచెప్పేందుకు వెళ్లింది. క్షణికావేశంలో ఉన్న కుమారుడు ముందు వెనకా చూడకుండా.. కన్నతల్లి గొంతును బ్లేడుతో కోశాడు. మహిళకు తీవ్రగాయాలు కాగా… ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు… ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

*సత్యసాయి జిల్లా అమడగూరు మండలం చినగానిపల్లిలో విషాదం చోటు చేసుకుంది. పురుగుల మందు తాగి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు యత్నించారు. చినగానిపల్లి చెందిన గౌతమి.. తన ఇద్దరు పిల్లలకు పురుగులమందు తాగించి, తానూ ఆత్మహత్యకు యత్నించింది. అపస్మారకస్థితిలో ఉన్న ముగ్గురిని గుర్తించిన బంధువులు..కదిరి ప్రాంతీయ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స తర్వాత తల్లితోపాటు 14నెలల చిన్నారిని అనంతపురం తరలించారు.

* ఇంట్లో ఎవరూ లేని సమయంలో యువతి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన బాపట్ల జిల్లా కొరిసపాడు మండలం తూర్పుపాలెంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన అపర్ణ (26) బీటెక్ పూర్తి చేసి ఇంటి వద్దనే ఉంటోంది. తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చేసరికి అపర్ణ విగతజీవిగా కనిపించింది. కూతురి మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు బోరున విలపించారు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అద్దంకి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతురాలు ఆత్మహత్య చేసుకోవడానికి ఓ యువకుడి వేధింపులు కారణమని స్థానికులు చెబుతున్నారు.

*విజయవాడ వాంబే కాలనీలో రౌడీషీటర్ ఓయబాను శంకర్ అలియాస్ టోనీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. వాంబే కాలనీలోని హెచ్ బ్లాక్లోని ఇంట్లో ఉరివేసుకున్న స్థితిలో శంకర్ మృతి చెందాడు. నున్న గ్రామీణ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఓయబాను శంకర్ ఓ మహిళతో కలిసి సహజీవనం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

*తిరుపతిలో మరో బాలుడి అదృశ్యం కలకలం రేపుతోంది. తన కుమారుడు వంశీకృష్ణ కనిపించటం లేదని అలిపిరి పోలీస్ స్టేషన్లో తండ్రి సురేశ్ ఫిర్యాదు చేశారు. మంగళవారం ఉదయం 11 గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లిన వంశీకృష్ణ.. ఇంటికి తిరిగి రాలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. తితిదే టికెట్ కౌంటర్లో పని చేస్తున్న బాలుడి తండ్రి సురేశ్.. చెన్నారెడ్డి కాలనీలో నివాసం ఉంటున్నారు. సురేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

*అత్తను కర్రతో కొట్టి చంపిన అల్లుడుఎన్టీఆర్ జిల్లా: వీరులపాడు మండలం జయంతి గ్రామంలో కుటుంబ కలహాల నేపథ్యంలో రాజు అనే వ్యక్తి అత్త , భార్యపై వెదురు కర్రతో దాడి… సర్దిచెప్పేందుకు వచ్చిన అత్త శివమ్మ మృతిభార్యకు గాయాలు చికిత్స నిమిత్తం విజయవాడ ఆస్పత్రికి తరలింపు….కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

*పార్టీ పేరుతో బాలికపై యువకులు లైంగిక దాడికి పాల్పడ్డారు. జూబ్లీహిల్స్‌ పీఎస్‌లో బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మే 28న రెస్టారెంట్‌లో యువకులు సూరజ్‌, హాడీ పార్టీ నిర్వహించారు. సృహ కోల్పోయిన బాలిక మెడపై గాయాలను పోలీసులు గుర్తించారు. రెస్టారెంట్‌ నుంచి బాలికను యువకులు బయటకు తీసుకెళ్లారు.
బాలికపై ఇద్దరు యువకులు లైంగిక దాడి చేసినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా జూబ్లీహిల్స్‌ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. యువకులు సూరజ్‌, హాడీలను పోలీసులు విచారిస్తున్నారు.

*ఇన్‌స్ట్రా‌గ్రాంలో వేధింపులకు పదవ తరగతి విద్యార్థిని బలైన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. ఇచ్చోడ మండలం నర్సాపూర్ గ్రామంలో ముస్లే సాక్షి(16) అనే బాలిక… తన పేరు మీద నకిలీ ఐడీలు తయారు చేసి అసభ్యకరమైన సందేశాలు వస్తుండటంతో తీవ్ర మనోవేదనకు గురైంది. వేధింపులు తాళలేక రెండు రోజుల క్రితం ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఐ వాంట్ జస్టీస్ అంటూ తన పేరు మీద నకిలీ ఐడి తయారు చేసిన వారిని గుర్తించి శిక్షించాలని సూసైడ్ నోట్ రాసి బాలిక తనువు చాలించింది. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

*విశాఖ జిల్లా:సెంటర్: పెందుర్తి.పెందుర్తి మండలం దువ్వపాలెం క్వారీలో ప్రమాదం చోటు చేసుకుంది…..రాయి తవ్వకాల్లో ఒక్కసారిగా కొండ ఒడ్డు జారింది…ఒడ్డు జారే సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది…

*సంగారెడ్డి: జిల్లాలో భారీగా నకిలీ సోయాబీన్‌ విత్తనాలు పట్టుబడ్డాయి. మొగుడంపల్లి మండలం జాడి మల్కాపూర్‌లో ఫర్టిలైజర్‌ దుకాణాలపై అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ ఫర్టిలైజర్‌ షాప్‌లో నకిలీ సోయాబీన్‌ విత్తనాలు అమ్ముతున్నట్లు గుర్తించారు. దీంతో 3.7 టన్నుల విత్తనాలను సీజ్‌ చేశారు. వాటి విలువ రూ.4 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. విత్తనాలను మహారాష్ట్ర నుంచి తెచ్చి ఇక్కడ విక్రయిస్తున్నారని వెల్లడించారు.

*ముంబైలోని చ‌ర్చిగేట్ ప్రాంతంలో నైజీరియాకు చెందిన న‌ల్ల‌జాతి వ్య‌క్తి క‌త్తితో దాడికి పాల్ప‌డ్డాడు. పాదాచారుల‌పై జ‌రిపిన దాడిలో 8 మంది గాయ‌ప‌డ్డారు. పారిస్ వెల్ వ‌ద్ద ఉన్న టాటా గార్డెన్ ద‌గ్గ‌ర ఈ ఘ‌ట‌న జ‌రిగిన‌ట్లు ఏసీపీ దిలీప్ సావంత్ తెలిపారు. క‌త్తితో దాడికి దిగిన వ్య‌క్తిని 50 ఏళ్ల జాన్‌గా గుర్తించారు. ఓ మ‌హిళ‌తో ఉన్న అత‌ను అక‌స్మాత్తుగా త‌న జేబులో ఉన్న క‌త్తిని తీసి అటుగా వెళ్తున్న పాదాచారుల‌పై దాడి చేశాడు. ఈ దాడిలో 8 మంది వ‌ర‌కు గాయ‌ప‌డ్డారు. దాంట్లో ఒక‌రి ప‌రిస్థితి ఆందోళ‌న‌క‌రంగా ఉంది. స‌మాచారం అందుకున్న పోలీసులు అక్క‌డ‌కు వ‌చ్చి అత‌న్ని అరెస్టు చేశారు. దాడి ఘ‌ట‌న జ‌రిగిన రోడ్డు వ‌ద్ద ర‌క్త‌పు మ‌ర‌క‌లు ఉన్నాయి. గాయ‌ప‌డ్డ వారిని చికిత్స కోసం హాస్పిట‌ల్‌కు తీసుకువెళ్లారు.

*వీరులపాడు మండలంలో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో భర్త రాజు..భార్య, అత్తపై కర్రతో దాడి చేశాడు. ఈ దాడిలో అత్త అక్కడికక్కడే మృతి చెందగా..భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన మహిళను స్థానికులు విజయవాడ ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

* ఉరవకొండ మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. చిన్ని ముష్టూరు వద్ద ట్రాలీ ఆటోను బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా..పలువురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

*యడ్లపాడు మండలంలో తిమ్మాపురం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన బోజనం చేస్తున్నవారిపైకి కంటైనర్ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగ్రాతులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్న పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం మద్దినేని వారిపాలెం గ్రామానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. మృతులు..ఈదర రమణయ్య ( మాల్యాద్రి ( గా పోలీసులు గుర్తించారు. కంటైనర్ డ్రైవర్ మద్యం సేవించి వాహనం నడిపినట్లుగా పోలీసులు భావిస్తున్నారు.

*గుంటూరులో ఉన్మాది రెచ్చిపోయాడు. తనను ప్రేమించలేదనే కారణంతో యువతి ఇంట్లోకి చొరబడి బీభత్సం సృష్టించాడు. ఆమెనూ, ఆమె తల్లినీ కత్తితో దాడిచేసి గాయపరిచాడు. తానూ గొంతుపై గీసుకున్నాడు. తప్పించుకునే ప్రయత్నంలో అపార్టుమెంటు మొదటి అంతస్థు నుంచి దూకాడు. స్థానికులు అప్రమత్తమై ఆ యువకుడిని కట్టేసి పోలీసులకు అప్పగించారు. త్రుటిలో ప్రాణాపాయం తప్పిన తల్లి, కూతురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసుల మేరకు.. దొడ్డేటి శ్రీనివాసరెడ్డి, శాంతిప్రియ దంపతుల పెద్దకుమార్తె గీతాసాయి(24) విశాఖలోని బైజ్యూస్‌ లెర్నింగ్‌ యాప్‌ కంపెనీలో పని చేస్తున్నారు. అదే కంపెనీలో తెనాలికి చెందిన రెడ్డి ధర్మతేజ కూడా పని చేస్తున్నాడు. ధర్మతేజ తనను ప్రేమించాలంటూ కొంతకాలంగా గీతాసాయిపై ఒత్తిడి తెస్తున్నాడు. కొద్దినెలల క్రితం ప్రమోషన్‌పై ఆమె విజయవాడకు బదిలీ అయి.. శిక్షణ కోసం హైదరాబాద్‌ వెళ్లారు. కంపెనీ తరఫున శిక్షణ కోసం అతడూ హైదరాబాద్‌ చేరుకున్నాడు. అక్కడ కూడా ఆమెపై వేధింపులకు పాల్పడ్డాడు.

*ఎదురింట్లో ఉండే యువకుడి వేధింపులతో బాపట్ల జిల్లా కొరిశపాడు మండల కేంద్రం శివారు తూర్పుపాలెంలో కల్లి అపర్ణ(25) అనే యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఇంజనీరింగ్‌ చదివి ఇంట్లో ఉంటున్న తనను తల్లిదండ్రులు లేనప్పుడు తమ ఇంటి ఎదురుగా ఉన్న పల్లెర్ల బాలమహేంద్రరెడ్డి వచ్చి ఫొటోలు తీశాడని, తన వద్ద తీసుకున్న డబ్బులు కూడా ఇవ్వడం లేదని సూసైడ్‌ నోట్‌లో రాసింది. తన ఫొటోలను యూట్యూబ్‌లో పెడతానని బెదిరిస్తున్నాడని పేర్కొంది. కొరిశపాడు ఎస్‌ఐ వెంకటేశ్వర్లు కేసు నమోదు చేశారు.

*నానక్ రామ్ గూడలో అర్ధరాత్రి అగ్నిప్రమాదం జరిగింది. సెల్లార్‌లోని విద్యుత్ ప్యానెల్ బోర్డు దగ్గర షార్ట్ సర్క్యూట్ కావడంతో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సెల్లార్ నుంచి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో భయాందోళనతో అపార్ట్‌మెంట్ వాసులు పరుగులు తీశారు. ఈ ఘటనపై వెంటనే ఫైర్ ఇంజన్‎కు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువరాడానికి 4 గంటలు శ్రమించారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపీరిపీల్చుకున్నారు.

*‘ఓ పసిపాప అమ్మకానికి సిద్ధంగా ఉంది. బరువు 3 కేజీలు. రూ.3 లక్షలిస్తే బర్త్‌ సర్టిఫికెట్‌తో సహా ఇచ్చేస్తాం’ అంటూ ఓ ఆర్‌ఎంపీ ఆర్‌ఎంహెచ్‌ఎస్‌ అనే వాట్సప్‌ గ్రూప్‌లో పోస్టు పెట్టాడు. పోలీసులు స్పందించి బుధవారం అతడిని అరెస్టుచేశారు. అజిత్‌సింగ్‌నగర్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అయోధ్యనగర్‌ ప్రాంతానికి చెందిన ఆర్‌ఎంపీ డాక్టర్‌ చావలి అమృతరావు జి.కొండూరు సమీప కవులూరులో ప్రాక్టీస్‌ చేస్తున్నాడు. అతడు ఓ పసిపాప ఫొటోను షేర్‌ చేసి, అమ్మకానికి ఉందంటూ పోస్టు పెట్టాడు. ఈ విషయం తెలుసుకున్న విజయవాడ చైల్డ్‌లైన్‌ 1098 జిల్లా కోఆర్డినేటర్‌ అరవ రమేశ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి అమృతరావును, మరో ఆర్‌ఎంపీని అదుపులోకి తీసుకున్నారు.

*అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలం వరదాయపల్లిలో మంగళవారం రాత్రి ఓ బాలికపై చౌడప్ప (32) అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడని ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. బాలిక తండ్రి, అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి లారీ డ్రైవర్లు. ఒకే వృత్తి కావడంతో చౌడప్ప తరచూ ఆ ఇంటికి వచ్చి వెళుతుండేవాడు. ఇంట్లో ఎవరూలేని సమయంలో బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని ఎస్‌ఐ తెలిపారు

*మైలవరంమండల తహశీల్దార్ ను దూషించిన వ్యక్తి పై కేసు నమోదుచేసినట్లు జమ్మలమడుగు ఆర్డీవో శ్రీనివాసులు తెలిపారు. జమ్మలమడుగు ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో శ్రీనివాసులు మాట్లాడుతూ మైలవరం మండలం దన్నవాడ గ్రామానికి చెందిన అల్లె చిన్న చెన్నారెడ్డి అనే వ్యక్తి మైలవరం తహశీల్దార్ కు భూముల సమస్యకు సంబంధించి ఫోన్ చేశారన్నారు. దీంతో తహశీల్దార్ అతనితో ఏవైనా సమస్యలు ఉంటే పూర్తి వివరాలతో రాతపూర్వకంగా ఇవ్వాలని తెలిపారన్నారు. కానీ ఆ వ్యక్తి అసభ్య పదజాలంతో తహశీల్దార్ ను దూషించడం జరిగిందన్నారు.ఆయన బాధపడుతు నా దృష్టికి తేవడంతో జిల్లా ఉన్నతాధికారులకు తెలిపామన్నారు. అతనిపై విధి నిర్వహణలోని ఉద్యోగి ని దూషించినందుకు కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. ఏదైనా సమస్యలు పరిష్కారం కాకుంటే ఉన్నతాధికారుల దృష్టికి తేవాలని, ఈ విధంగా ప్రవర్తిస్తే తీవ్రమైన చర్యలు ఉంటాయని తెలిపారు.

*భర్త, అత్తమామల వేధింపులు తాళలేక ఆత్మ హత్య కు పాల్పడిన ఓ వివా హిత చికిత్స పొందుతూ మృతి చెందారు. ఎస్ఐ దుర్గాప్ర సాద్ తెలిపిన వివరాల ప్రకారం తిరువూరు నగర పంచాయతీ పరిధిలో ని నడిమి తిరువూరు ప్రాంతానికి చెందిన షేక్ హసీనా (30) ను భర్త బాజీ, అత్తమామలు తరచూ అను మానిస్తూ వేధింపులకు గురిచేస్తున్నారు. ఈనే పథ్యం లో వేధింపులు తట్టుకోలేక గత నెల 30 వ తేదీన హసీనా పురుగుల మందు సేవించి ఆత్మహత్య కు పాల్పడిన ఆమె విజయ వాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ బుధ వారం మృతి చెందింది. మృతురాలి తండ్రి మహ బూబ్ ఇచ్చిన పిర్యాదు మేరకు భర్త, అత్తమామలపై కేసు నమోదుచేసినట్లు ఎస్ఐ తెలిపారు.

*గుంటూరు: జిల్లాలోని లాలాపేటలో నేరేళ్ల పద్మావతి అనే మహిళ దారుణ హత్యకు గురైంది. ఇంట్లో కాళ్లు, చేతులు కట్టేసిన స్థితిలో పద్మావతి మృతదేహం పడి ఉంది. మూర్తి ఫ్యాషన్స్ వస్త్ర దుకాణంలో మహిళ పనిచేస్తోంది. కొద్ది నెలల క్రితం భర్త చనిపోవడంతో పద్మావతి ఒంటరిగా జీవిస్తోంది. విషయం తెలిసిన పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

*బండ్లగూడలో పోలీసులు భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరు నైజీరియన్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారివద్ద ఉన్న కొకైన్ ను స్వాధీనం చేసుకుని.. బైక్‎ను సీజ్ చేశారు. నిందితులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‎కు తరలించారు. మరికొద్దిసేపట్లో నిందితులను ఏసీపీ కార్యాలయంలో మీడియా ముందు పోలీసులు ప్రవేశపెట్టనున్నారు.