* ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాలనలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ… దేశ రక్షణలో రాజీ లేదని.. పాక్, చైనాలకు ధీటుగా జవాబు చెప్పారని తెలిపారు. పేదరిక నిర్మూలన మోదీ ఆచరణలో చూపారన్నారు. ప్రజా వైద్యం విషయంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారని అన్నారు. ఆత్మనిర్బర్ భారత్ కింద 20 లక్లల కోట్లు ప్యాకేజీగా ఇచ్చారన్నారు. పెట్రో ధరల భారం ప్రజలకు పడకుండా పన్నులు తగ్గించారని కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.
* యూపీలో రూ.80వేల కోట్ల ప్రాజెక్టులకు మోదీ శ్రీకారం
భారత శక్తి సామర్థ్యాలను చూసి ప్రపంచ దేశాలు ప్రశంసిస్తున్నాయన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. గ్లోబల్ రిటైల్ ఇండెక్స్లో మనం రెండో స్థానంలో ఉన్నట్లు చెప్పారు. యూపీ ఇన్వెస్టర్ల మూడో విడత సదస్సును ప్రారంభించి రూ.80,000 కోట్లు విలువ చేసే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. సంస్కరణలు, పనితీరు, పరివర్తన అనే మంత్రంతోనే గత 8 ఏళ్ల పాలనలో గొప్ప పురోగతి సాధించినట్లు చెప్పారు ప్రధాని నరేంద్ర మోదీ. స్థిరత్వం, సహకారం, సులభతర వాణిజ్య విధానంపైనే దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. ఉత్తర్ప్రదేశ్ ఇన్వెస్టర్ల మూడో సదస్సును ప్రారంభించిన అనంతరం ఈ మేరకు మాట్లాడారు. కార్యక్రమంలో భాగంగా వ్యవసాయం, తయారీ, పునరుత్పాదక శక్తి, ఎంఎస్ఎంఈ, ఫార్మా, పర్యటకం, రక్షణ, వాయుమార్గం, వస్త్ర పరిశ్రమలకు సంబంధించిన 1,406 ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేశారు. వీటి విలువ రూ.80,000కోట్లు. 21 శతాబ్దంలో భారత అభివృద్ధికి యూపీనే ఊతమిస్తుందని అన్నారు. వచ్చే పదేళ్లు దేశానికి ఛోదక శక్తిగా యూపీనే ఉంటుందని నమ్ముతున్నట్లు పేర్కొన్నారు.’భారత శక్తి సామర్థ్యాలను చూసి ప్రపంచ దేశాలు ప్రశంసిస్తున్నాయి. జీ-20 దేశాల్లో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ మనదే. గ్లోబల్ రిటైల్ ఇండెక్స్లో భారత్ది రెండో స్థానం. ఉత్తర్ప్రదేశ్లో గంగానది 1100కిలోమీటర్ల మేర ప్రవహిస్తుంది. 25-30జిల్లాల నుంచి వెళ్తోంది సహజ వ్యవసాయ సాధ్యాసాధ్యాలను పరిశీలించాలి. కొన్ని సంవత్సరాల క్రితం ఫుడ్ ప్రాసెసింగ్ స్కీమ్ను యూపీ ప్రభుత్వం ప్రకటించింది. వ్యవసాయ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు కార్పొరేట్ ప్రపంచానికి ఇదే సువర్ణావకాశం’- ప్రధాని మోదీ. ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి గౌతం అదానీ, కుమార మంగళం బిర్లా వంటి ప్రముఖ వ్యాపారవేత్తలు హాజరయ్యారు. ప్రారంభోత్సవంలో మోదీతో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా పాల్గొన్నారు. యూపీ ఇన్వెస్టర్ల మొదటి సదస్సు 2018 జులై 29న జరిగింది. ఈ కార్యక్రమంలో రూ.61,500కోట్లు విలువ చేసే 81 ప్రాజెక్టులను ప్రారంభించారు. 2019 జులై 28న జరిగిన రెండో విడత సదస్సులో రూ.67,000కోట్లు విలువ చేసే 290 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు.
*గురజాల అక్రమమైనింగ్‌పై న్యాయపోరాటం చేస్తాం: Yarapatineni
గురజాల నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ జరుగుతోందని మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ… ప్రభుత్వ, ఫారెస్ట్ భూముల్లో యధేచ్చగా మైనింగ్ జరుగుతుందని తెలిపారు. అధికారులు వారి మెడకు చుట్టుకోకముందే మేల్కొవాలని హితవుపలికారు. అక్రమ మైనింగ్‌పై న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. రెవెన్యూ, ఫారెస్ట్ అధికారులు స్పందించాలని యరపతినేని శ్రీనివాసరావు అన్నారు.
*పేద,మధ్యతరగతి ప్రజల సంతోషమే తెలంగాణ ప్రభుత్వలక్ష్యం: Talasani
పేద, మద్య తరగతి ప్రజల సంతోషమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం అని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. శుక్రవారం కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలో నారాయణ జోపిడి సంఘంలో 22.94 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న 296 డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ పనులను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హోంమంత్రి మహమూద్ అలీతో కలిసి శాస్త్రోక్తంగా భూమిపూజ నిర్వహించి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలు అన్ని సౌకర్యాలు కలిగిన సొంత ఇంటిలో సంతోషంగా ఉండాలనే ముఖ్యమంత్రి కేసీఆర్) ఆలోచనల మేరకు దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వమే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి ఉచితంగా అందిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. ఇప్పటికే పలు చోట్ల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి లబ్దిదారులకు అందించడం జరిగిందని, లబ్దిదారులు ఎంతో సంతోషంగా ఉన్నారని అన్నారు.
*వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను: Nagababu
వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని జనసేన పీఏసీ సభ్యులు నాగబాబు ప్రకటించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జనసేన పార్టీ సేవలకే పరిమితమవుతానని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో జనసేనాని పవన్‌కల్యాణ్ఎ క్కడి నుంచైనా పోటీ చేస్తారని వెల్లడించారు. పాదయాత్రకు సమానమైన యాత్ర చేపట్టే యోచనలో పవన్ ఉన్నట్లు తెలిపారు. పొత్తులపై తమ పార్టీ అధినేత నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు. ముందస్తు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము సిద్ధమని నాగబాబు స్పష్టం చేశారు.
*రాష్ట్రం పరువు తీసే నిబంధన అది.. సిగ్గు చేటు : చంద్రబాబు
టెండర్ల నిబంధనల్లో కాంట్రాక్టర్లు కోర్టుకు వెళ్లకూడదన్న నిబంధనపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది అసమర్థ పాలనకు నిదర్శనమని ధ్వజమెత్తారు. ఈ నిబంధన రాష్ట్ర పరువు తీసేలా ఉందని మండిపడ్డారు. జగన్ మూడేళ్ల రివర్స్ పాలనతో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కివెళ్లిందని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. లక్షన్నర కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉంటే.. దాని ప్రభావమెంతో ఆలోచించారా? అని ధ్వజమెత్తారు. ధైర్యంగా టెండర్లు పిలవలేని ప్రభుత్వం 3 రాజధానులు కడుతుందా? అని చంద్రబాబు ఎద్దేవా చేశారు.కాంట్రాక్టర్లకు జగన్ ప్రభుత్వం రూ.లక్షన్నర కోట్ల బిల్లుల పెండింగ్లో పెట్టడం రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపుతోందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ప్రభుత్వం బిల్లులు ఇవ్వని కారణంగా నిర్మాణ, వ్యాపార, సేవల రంగంలో లక్షల మంది ఉపాధి కోల్పోవడానికి జగన్ కారణమయ్యారని మండిపడ్డారు. బిల్లుల కోసం కాంట్రాక్టర్ కోర్టుకు వెళ్లకూడదని టెండర్లో నిబంధన పెట్టడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. న్యాయం కోసం కోర్టుకు వెళ్లకూడదనే హక్కు ప్రభుత్వానికి ఎవరిచ్చారని నిలదీశారు. జగన్ సర్కారు మూడేళ్ల రివర్స్ పాలనతో రాష్ట్రం 30ఏళ్లు వెనక్కిపోయిందని చంద్రబాబు మండిపడ్డారు. కాంట్రాక్టర్లను బిల్లుల కోసం కోర్టుకు వెళ్లవద్దని టెండర్ డాక్యుమెంట్లోనే నిబంధన పెట్టడం… రాష్ట్ర దుస్థితికి, అసమర్థ పాలనకు నిదర్శనమని విమర్శించారు.కృష్ణా డెల్టా కాలువల మరమ్మతుల టెండర్లో బిల్లుల కోసం ఒత్తిడి తేవొద్దని ప్రభుత్వం పేర్కొన్న నిబంధనలు రాష్ట్ర పరువు తీశాయని ఆక్షేపించారు. పాలకులకు ఇది సిగ్గుగా అనిపించిందో లేదో కానీ… రూ.13 కోట్ల టెండర్ పనిలో బిల్లుల కోసం కోర్టుకు వెళ్లవద్దనే నిబంధన పెట్టడం దేశంలో మరే రాష్ట్రంలోనూ లేదన్నారు. న్యాయం కోసం కోర్టుకు వెళ్లే హక్కు లేదంటూ నిబంధన పెట్టే హక్కు అసలు ప్రభుత్వానికి ఎక్కడిదని ప్రశ్నించారు. ఈ దుస్థితికి రాష్ట్రాన్ని తీసుకువెళ్లిన ముఖ్యమంత్రిని ఏమనాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం కారణంగా ఆయా సంస్థలు దివాళ తీయడం సమాజంపై ఎంతటి ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందో తెలుసుకోవాలని హితవు పలికారు.
*మీ అరాచకాల నుంచి రక్షించే యాప్‌ను ఆరంభించండి సీఎం సారూ!: నారా లోకేష్
‘మీరు, మీ పార్టీ నేతలు, పోలీసులు, వలంటీర్లు చేస్తున్న అరాచకాల నుంచి రక్షించే యాప్ ఏదైనా ఉంటే ఆరంభించండి సీఎం సారూ!’ అంటూ ట్విటర్ వేదికగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మొర పెట్టుకున్నారు. కర్నూలు జిల్లా గూడూరు మండలం గుడిపాడులో మహిళా పోలీసుల అమానవీయ ప్రవర్తనతో సభ్యసమాజం తల దించుకుందన్నారు. తన ఇంటిముందు స్థలాన్ని పోలీసులతో వచ్చిన రెవెన్యూ సిబ్బంది స్వాధీనం చేసుకుంటుండగా మీనాక్షమ్మ, ఆమె కుమార్తె అడ్డుపడ్డారన్నారు. వారిని సాటి మహిళలు అని కూడా చూడకుండా మహిళా పోలీసులు తమ చున్నీలతో బంధించడం అరాచక పాలనలో మరో అమానవీయ ఘటనగా అభివర్ణించారు. దుర్మార్గ ప్రభుత్వ తీరును ప్రజలంతా ఒక్కటై నిలదీయాల్సిన సమయం ఆసన్నమైంది. ఇంకెన్నాళ్లీ దౌర్జన్యపాలన?… అని నారా లోకేష్ ప్రశ్నించారు
**ఐదవ విడత పల్లెప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించిన Errabelli
రాయపర్తి మండలం, కొత్తూరులో ఐదవ విడత పల్లెప్రగతి కార్యక్రమాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సర్పంచ్‌లు ఎవరూ అధైర్య పడొద్దన్నారు. అన్ని బిల్లులూ మంజూరు చేస్తామని, సీసీ రోడ్ల బిల్లులు కూడా విడుదల చేస్తామన్నారు. గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వడం లేదని బీజేపీ, కాంగ్రెస్ నాయకులు పిచ్చికూతలు కూస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చే నిధుల విషయంలో ఇబ్బందులకు గురి చేస్తోందని, కరెంట్ మోటార్లకు మీటర్లు పెడతామని అమిత్ షా చెబుతున్నారన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మీటర్లు పెట్టనివ్వమని మంత్రి ఎర్రబెల్లి అన్నారు.
*ప్రభుత్వ భూముల్లో పేదలు ఇళ్లు నిర్మించుకున్నారు: సత్యవతి రాథోడ్
మహబూబూబాబాద్ ప్రభుత్వ భూముల్లో పేదల ఇళ్లు నిర్మించుకున్నారని మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. ప్రతి వార్డులోనూ పేదలు ఇళ్లు నిర్మించుకున్నారన్నారు. పట్టణ అభివృద్ధికి వారు సహకరించడం లేదన్నారు. సీఎంకు మహబూబాబాద్ జిల్లాపై ప్రత్యేక శ్రద్ద ఉందన్నారు. ఇంటర్నల్ రోడ్ల నిర్మాణాలు వెంటనే పూర్తిచేయాలని ఆమె పేర్కొన్నారు. అన్నిశాఖల సమన్వయంతోనే మహబూబాబాద్ అభివృద్ధి సాధ్యమవుతుందని సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు.
*41లక్షల టన్నుల ధాన్యం కొన్నాం: గంగుల
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటివరకు 41.33 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేశామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. యాసంగి సీజన్ వరి ధాన్యం ప్రొక్యూర్మెంట్‌పై గురువారం హైదరాబాద్‌లో ఆయన శ్వేతపత్రం విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 6,579 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, 7.07 లక్షల మంది రైతుల నుంచి రూ.8 వేల కోట్ల విలువైన 41.33 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని వెల్లడించారు. రాష్ట్రంలో ధాన్యం సేకరణ ఈ నెల 15వ తేదీలోపు ముగుస్తుందన్నారు.
*కేంద్ర పెద్దలకు జగన్ మసాజ్: నారాయణ
ఇకనైనా కేంద్ర పెద్దలకు మసాజ్‌లు చేయడం మాని, విభజన హామీలపై చర్చించాలని సీఎం జగన్‌కు సీపీఐ నేత నారాయణ సూచించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓట్ల కోసమే జగన్‌ను ఢిల్లీకి పిలిపించుకున్నారని, రాష్ట్ర సమస్యలపై మాట్లాడటానికి ఇదే మంచి తరుణమని చెప్పారు. జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లడని, ఒక వేళ వెళితే ఆయనకు ఆయనే ముసుగువేసుకున్నట్టు అవుతుందని అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాకలో దివంగత టీడీపీ నేత, ఆయన స్నేహితుడు కళ్లం పానకాలరెడ్డి విగ్రహావిష్కరణకు విచ్చేసిన నారాయణ అక్కడ మాట్లాడారు. జగన్ పాలనలో ప్రజా వ్యతిరేకతకు నిదర్శనంగానే టీడీపీ సభలకు జనాలు స్వచ్ఛందంగా భారీగా విచ్చేస్తున్నారని తెలిపారు.
*దమ్ముంటే అసెంబ్లీ రద్దు చేయండి: అనిత
‘‘ఒక్క ఆత్మకూరు ఎన్నిక మాత్రమే ఎందుకు? మొత్తం అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు రండి. రాష్ట్రంలో ప్రజలంతా కలిసి తీర్పు ఇస్తారు. అది చేతగాదని అనుకొంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా తేలేకపోయినందుకు మీ ఎంపీలందరితో రాజీనామా చేయించండి. మేం కూడా మా ఎంపీలతో రాజీనామా చేయిస్తాం. ప్రజా క్షేత్రంలో తీర్పు కోరదాం. దేనికైనా మేం సిద్ధం. మీరు సిద్ధమో కాదో చెప్పండి?’’ అని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత సవాల్ చేశారు. కోనసీమ అల్లర్ల వెనుక వైసీపీ పాత్ర స్పష్టంగా ఉందన్నారు.
*కేంద్ర పెద్దలకు జగన్ మసాజ్: నారాయణ
ఇకనైనా కేంద్ర పెద్దలకు మసాజ్‌లు చేయడం మాని, విభజన హామీలపై చర్చించాలని సీఎం జగన్‌కు సీపీఐ నేత నారాయణ సూచించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓట్ల కోసమే జగన్‌ను ఢిల్లీకి పిలిపించుకున్నారని, రాష్ట్ర సమస్యలపై మాట్లాడటానికి ఇదే మంచి తరుణమని చెప్పారు. జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లడని, ఒక వేళ వెళితే ఆయనకు ఆయనే ముసుగువేసుకున్నట్టు అవుతుందని అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాకలో దివంగత టీడీపీ నేత, ఆయన స్నేహితుడు కళ్లం పానకాలరెడ్డి విగ్రహావిష్కరణకు విచ్చేసిన నారాయణ అక్కడ మాట్లాడారు. జగన్ పాలనలో ప్రజా వ్యతిరేకతకు నిదర్శనంగానే టీడీపీ సభలకు జనాలు స్వచ్ఛందంగా భారీగా విచ్చేస్తున్నారని తెలిపారు.
*ఎవరిని సంప్రదించి నిర్ణయాలు తీసుకున్నారు?: jawahart
సమాజగతిని మార్చే విద్యారంగంలో జగన్ నిర్లక్ష్యం వహిస్తున్నారని మాజీమంత్రి జవహర్ అన్నారు. ఉపాధ్యాయుల్ని లిక్కర్ షాపుల దగ్గర నిలబెట్టినప్పుడే విద్యారంగంపై జగన్ చిత్తశుద్ధి అర్థమైందన్నారు. నూతన విద్యారంగంపై జగన్ ఎవరిని సంప్రదించి నిర్ణయాలు తీసుకున్నారు? అని ఆయన ప్రశ్నించారు. మంత్రులంతా వేలిముద్రగాళ్లు కాబట్టే రాష్ట్రంలో విద్య వ్యాపారమైందన్నారు. విద్యారంగానికి 10 శాతం నిధులు కూడా కేటాయించలేదన్నారు.
*అవినీతి పరుడే.. అవినీతిని అరికడతాడంట!…: Nara Lokesh
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) ముఖ్యమంత్రి జగన్ (Jagan)పై తీవ్ర విమర్శలు గుప్పించారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ దేశంలోనే అత్యంత అవినీతి పరుడై సీబీఐ, ఈడీ కేసులు ఎదుర్కొంటోన్న జగన్‌రెడ్డి అవినీతిని అరికడతామంటూ యాప్ ఆవిష్కరించడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనన్నారు. యాప్‌కి 14400 నెంబర్ కాకుండా, 6093 అయితే యాప్ట్‌గా ఉండేదన్నారు. ‘‘అవినీతి చూస్తూ ఉండొద్దు, అవినీతి గురించి వింటూ ఉండొద్దు, అవినీతికి వ్యతిరేకంగా గొంతు విప్పండి అంటూ లెక్చర్ ఇస్తున్న అవినీతి అనకొండ జగన్ రెడ్డి గారూ.. అవినీతిపై ఈ నేతిబీరకాయ కబుర్లు మాని.. మీపై ఉన్న అవినీతి కేసుల విచారణ త్వరితగతిన పూర్తి చెయ్యాలని కోరే దమ్ముందా?’’ అని లోకేష్ సవాల్ చేశారు.
*జగన్ రెడ్డి సామాజిక న్యాయం మాటలకే పరిమితం: Yanamala
వ్యవస్థలను దోచేసిన వ్యక్తి లంచాలు తీసుకోవడం నేరమని మాట్లాడటం ఈ శతాబ్దపు అతిపెద్ద జోక్ అని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్ రెడ్డి సామాజిక న్యాయం మాటలకే పరిమితమైందని మండిపడ్డారు. మూడేళ్లలో విద్యారంగం పతనావస్థకు చేరుకుందన్నారు. అమ్మఒడి ఇవ్వకపోవడంతో కాలేజీల్లో అడ్మిషన్లు ఇవ్వడం లేదని, పిల్లల భవిష్యత్తు నాశనం అవుతోందని ఆందోళన చెందారు. ప్రజల వినిమయ వ్యయం పూర్తిగా పడిపోయిందని తెలిపారు. దావోస్ పర్యటనతో ఒరగబెట్టింది ఏంటో చెప్పకుండా లంచం అంశంతో ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని యనమల ఆగ్రహం వ్యక్తం చేశారు.
*నవ్యాంధ్ర ప్రదేశ్ ఏర్పడి 8 ఏళ్లు పూర్తి: Thulasi Reddy
రాష్ట్ర విభజన జరిగి.. నవ్యాంధ్ర ప్రదేశ్ ఏర్పడి సరిగ్గా గురువారం నాటికి 8 ఏళ్లు పూర్తి అయ్యాయని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఈ 8 ఏళ్ల కాలంలో కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ, వైసీపీల వల్ల రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించారు. విభజన సంధర్భంగా కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నవ్యాంధ్ర ప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ, కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం, పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్, ఐఐటి, ఎన్‌ఐటి లాంటి 13 కేంద్రీయ సంస్థల ఏర్పాటు… ఇలా 25 వరాలు ఇచ్చిందన్నారు. ఈ వరాలు అమలై ఉంటే సీమాంధ్ర స్వర్ణాంధ్ర అయి ఉండేదన్నారు. 2014 లేక 2019లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఉంటే ఈ పాటికి ఈ వరాలన్నీ అమలై ఉండేవన్నారు. కానీ దురదృష్టవశాత్తూ 2014, 2019లో కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో 2014లో టీడీపీ, 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో పై వరాలు అమలుకు నోచుకోలేదన్నారు. రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని తులసి రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
*అవినీతి గురించి జగన్ మాట్లాడం విడ్డూరంగా ఉంది: బుద్దా వెంకన్న
అవినీతి గురించి సీఎం జగన్ మాట్లాడం విడ్డూరంగా ఉందని టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న పేర్కొన్నారు. రూ.42వేల కోట్లు ఈడీ జప్తు చేస్తే.. 16 నెలలు జైలులో ఉన్న వ్యక్తి జగన్ అని విమర్శించారు. ఏపీలో అవినీతికి కేరాఫ్ అడ్రస్ జగన్ మారారన్నారు. లిక్కర్, ఇసుక అక్రమాల ద్వారా రూ.కోట్లు జగన్కు చేరుతున్నాయని ఆరోపించారు. ఈ అక్రమాలపై ఎవరికి ఫిర్యాదు చేయాలో జగనే చెప్పాలన్నారు. ఉద్యోగులపై కక్ష సాధించేందుకే యాప్ అని బుద్దా వెంకన్న పేర్కొన్నారు.
*ప్రజలందరూ విసిగిపోయారు: lakshman
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా బీజేపీ ఓబిసీ మోర్చా అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ శుభాకాంక్షలు తెలిపారు. సకల జనుల పోరాటం, త్యాగాల ఫలితమే తెలంగాణ వచ్చిందన్నారు. తెలంగాణ పునర్నిర్మాణానికి ప్రజలంతా మరోసారి పోరాటానికి సంసిద్ధులు కావాలని ఆయన సూచించారు. టీఆర్ఎస్ 8 ఏళ్ల పరిపాలన పూర్తిగా అవినీతిమయమన్నారు. టీఆర్ఎస్ కుటుంబ పాలనతో ప్రజలందరూ విసిగిపోయారని చెప్పారు. ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా నామినేషన్ వేసి అయోధ్య రాముడి ఆశీర్వాదం తీసుకున్నానని తెలిపారు.
*బంగారు తెలంగాణ దిశగా పయనిస్తున్నాం: Gangula kamalakar
తెలంగాణ ప్రజలు కలలు కంటున్న బంగారు తెలంగాణ నిర్మాణం దిశగా పయనిస్తున్నామని బిసి, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్అ న్నారు. ఈ ఎనిమిది ఏళ్లలో బలమైన అడుగులు వేయగలిగామన్నారు. తెలంగాణకు ఉజ్వల భవిష్యత్తు ఉండే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన వివిధ అభివృద్ది సంక్షేమ పథకాలు, ప్రణాళికలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన రాష్ట్ర ముఖ్యమంత్రి ముందుచూపుతో ఎన్నో సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి రైతుల ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తున్నామన్నారు.గురువారం రాష్ట్రావతరణ దినోత్సవాలు కరీంనగర్ లో ఘనంగా జరిగాయి.