పలు తెలుగు హిట్ చిత్రాల్లో నటించి మెప్పించిన సోనాలి బింద్రె నటించిన ‘ది బ్రోకెన్ న్యూస్’ అనే వెబ్‌సిరీస్‌లో జూన్ 10 నుంచి జీ5లో ప్రసారం కానుంది. క్యాన్సర్‌తో పోరాడి గెలిచిన సోనాలి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ‘ఒకానొక సమయంలో నాకు చాలా డబ్బులు అవసరమయ్యాయి. ఇంటి అద్దె కట్టాలి, బిల్లులు చెల్లించాలి. అప్పుడు నా కుటుంబం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. అందుకే ఎలాంటి పాత్రలు వచ్చినా చేసుకుంటూ పోయాను. అలా ఓ సినిమా చేసి ఇంకో సినిమాకు రెడీ అయ్యే సమయానికి అసలు ఎందుకా ప్రాజెక్ట్ ఒప్పుకున్నాను అని ఆలోచించేదాన్ని. కానీ ఆ వెంటనే నెక్స్ట్ ప్రాజెక్ట్ డబ్బులు ఎప్పుడిస్తారో అని ఎదురుచూసేదాన్ని. అందుకే అతిగా ఆలోచించకుండా కొన్ని పాత్రలు చేసుకుంటూ పోయాను. ఆ సినిమాలు మీరే కాదు నేను కూడా చూడలేదు’ అంటూ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.