Kids

బ్లేడ్ ను ఈ డిజైన్ లోనే ఎందుకు తయారు చేసారు..? దీనిని ఎవరు తయారు చేసారో తెలుసా?

Auto Draft

దైనందిన జీవితంలో బ్లేడు అవసరం తప్పకుండ ఉంటుంది. ముఖ్యంగా ట్రిమ్మర్లు ఉపయోగించని వారు.. షేవింగ్ చేసుకోవడానికి బ్లేడుని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. అయితే.. మీరెప్పుడైనా గమనించారా..? ఏ కంపెనీ బ్లేడ్ అయినా.. మధ్యలో వచ్చే డిజైన్ మాత్రం ఒకలానే ఉంటుంది. అది కూడా మూడు రంధ్రాలు ఉన్నట్లుగా ఈ డిజైన్ ఉంటుంది. అయితే.. బ్లేడును ఈ డిజైన్ లోనే ఎందుకు తయారు చేసారు..? దీనిని మొదటగా తయారు చేసింది ఎవరో తెలుసా..? ఈ విషయాలు తెలియాలంటే.. ఈ ఆర్టికల్ చదివేయండి మరి.

ఈ బ్లేడ్ డిజైన్ ను మొట్టమొదటి సారిగా 1904 లో ప్రారంభించారు. అదే సంవత్సరంలో బ్లేడ్ తయారీని ప్రారంభించారు. బ్లేడ్ సంస్థ వ్యవస్థాపకుడు జిల్లెట్. విలియం నికర్సన్ సహాయంతోనే కింగ్ క్యాంప్ మొదటి బ్లేడ్ ను తయారు చేసాడు. కాగా.. కింగ్ క్యాంప్ పేటెంట్ ను పొంది అదే సంవత్సరం మొదటి ఉత్పత్తి లో 165 బ్లేడ్ లను తయారు చేసాడు. ఈ బ్లెడ్స్ కు మూడు రంధ్రాలు ఉండేలా డిజైన్ చేసారు. ఇలా ఉండడం వల్ల ఈ బ్లేడ్ షేవింగ్ రేజర్ లో బాగా ఫిట్ అయ్యి కదలకుండా ఉండేది. ఈ డిజైన్ లో ఉన్న బ్లేడ్ షేవింగ్ రేజర్ లో ఫిట్ అవ్వడం వల్ల షేవింగ్ చేసుకోవడం సౌకర్యవంతంగా మారింది. అయితే.. ఆ తరువాత ఎన్ని కంపెనీలు వచ్చినా.. సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని అన్ని కంపెనీలు ఇదే డిజైన్ ను ఫాలో అయ్యాయి. జిల్లెట్ కంపెనీ ఇప్పటికే బ్లేడ్, షేవింగ్ రేజర్ పై పేటెంట్ పొంది ఉంది. ప్రస్తుతం.. ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల బ్లేడ్ లను తయారు చేస్తున్నప్పటికీ.. డిజైన్ మాత్రం అదే కొనసాగుతోంది.