* వైసీపీ రాజ్యసభ అభ్యర్థి ఆర్. కృష్ణయ్యపై హైదరాబాద్‌లో పోలీస్ కేసు నమోదైంది. రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో నాన్‌బెయిలబుల్ కేసు నమోదైంది. రౌడీలు, గూండాలతో బెదిరిస్తున్నారంటూ రవీందర్‌రెడ్డి అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. భూకబ్జాతో పాటు హత్యకు యత్నించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆర్ కృష్ణయ్యపై 447, 427, 506, 384 రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదైంది.
*పల్నాడు: జిల్లాలోని దుర్గి మండలం జంగమేశ్వరపాడులో టీడీపీ వర్గీయుడుని హత్య చేసేందుకు వైసీపీ శ్రేణులు యత్నించారు. కంచర్ల జల్లయ్య(35) అనే వ్యక్తిపై వైసీపీ శ్రేణులు వేట కొడవళ్లతో దాడి చేశారు. వైసీపీ దాడిలో జల్లయ్య తీవ్రంగా గాయపడ్డాడు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక జల్లయ్య గ్రామం వదిలి వెళ్లిపోయాడు. మూడేళ్లుగా మాడుగుల గ్రామంలో ఉంటున్నాడు. అయితే ఈ రోజు గ్రామంలోకి వచ్చిన టీడీపీ వర్గీయుడిపై వైసీపీ కార్యకర్తలు కాపు కాచి దాడి చేశారు. జల్లయ్య పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు.
*కర్ణాటకలోని కలబురిగి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. కమలాపురలో వేగంగా వచ్చిన ఓ ప్రయివేటు బస్సు.. లారీని ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 8 మంది ప్రయాణికులు సజీవదహనం అయ్యారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. 12 మందిని రక్షించి స్థానికులు ఆస్పత్రికి తరలించారు.
*ఫోర్జరీ డాక్యుమెంట్ రాకెట్ ముఠా గుట్టు రట్టు రాచకొండ పోలీసులు…13 మంది సభ్యుల ముఠా లో 8 మంది అరెస్టు…మరో ఐదుగురు పరారీ…వారి వద్ద నుండి ఫోర్జరీ పత్రాలను స్వాధీనం చేసుకున్నా పోలీసులు
*సత్యనారాయణ పురం బి ఆర్ టి ఎస్ రోడ్డు పుడ్ జంక్షన్ వద్ద సైకో హల్చల్..రోడ్డు వెంట నడచి వెళ్తున్న మహిళలపై దాడికి యత్నం… భయాందోళనకు గురైన స్థానిక ప్రజలు.. సైకో నీ పట్టుకుని కట్టేసి దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించిన స్థానిక ప్రజలు..
*కారును ఢీకొన్న కర్ణాటక వోల్వో బస్ అక్కడికక్కడే ఇద్దరు మృతి శ్రీ సత్యసాయి జిల్లా హిందూపూర్ నియోజకవర్గం చిలమత్తూరు మండలం చిలమత్తూరు కొడికొండ చెక్పోస్ట్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది హైదరాబాద్ నుండి మైసూర్ పోతున్న వోల్వో బస్సు కొడికొండ వైపు నుంచి అడ్డంగా వచ్చిన కారును ఢీ కొనడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు మృతు ఎవరనిగుర్తించగా వారు ఓ గ్రానైట్ ఫ్యాక్టరీ ఓ యజమాని గా గుర్తించారు అందులో ఒక అమ్మాయి ఒక అబ్బాయిఉండగా దాదాపు 40 మీటర్లు ఈడ్చుకు పోగా స్థలంలోనే.ఇద్దరు మరణించారు వోల్వో బస్ డ్రైవర్ పరారీలో ఉన్నట్లుసమాచారం ఈ ఘటన సుమారు అర్ధ రాత్రి మూడుసంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులుగంటల సమయంలో జరిగినట్లు సమాచారం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
*విజయవాడ…పాయకపురం కండ్రిక లో దారుణం…తల్లిని బ్లేడ్ తో మెడ పై గాయపరిచిన కొడుకు…అత్త కోడలి మధ్య గొడవలు తట్టుకోలేక తల్లి ని గాయపరిచిన కొడుకు…తల్లి ని గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలింపు…కొడుకు ని అదుపులోకి తీసుకున్న నున్న పోలీసులు…కేస్ నమోదు చేసి దర్యాప్తు నున్న పోలీసులు…
*వైసీపీ రాజ్యసభ అభ్యర్థి కృష్ణయ్యపై హైదరాబాద్లోస పోలీస్ కేసు – రాయదుర్గం పీఎస్లోన నాన్బెపయిలబుల్ కేసు – రౌడీలు, గుండాలతో బెదిరింపులకు పాల్పడుతున్నాడని రవీంద్ర రెడ్డి ఫిర్యాదు – తన భూమిని కబ్జా చేయడంతో పాటు తనను చంపడానికి ప్రయత్నించాడని రవీంద్రరెడ్డి ఫిర్యాదు – ఆర్.కృష్ణయ్యపై 447, 427, 506, 384 రెడ్ విత్ 341 సెక్షన్ల కింద కేసు నమోదు
*యువతి మెడలో రెండు బంగారు చైన్లను వెనుక నుంచి వచ్చిన దుండగులు లాక్కెళ్లారు. తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పొన్న కాలువ ఎస్‌వీటీ కాలనీలో ఘటన చోటు చేసుకుంది. రోడ్డుపై నడుస్తూ వెళుతున్న యువతి మెడలోని రెండు బంగారు గొలుసులను దుండగులు వెనుక నుంచి లాక్కెళ్లారు. నిందితుల కోసం తిరుచానూరు పోలీసుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
*అనకాపల్లి: జిల్లాలోని అచ్చుతాపురం బ్రాండిక్స్ సెజ్‌లో గ్యాస్ లీక్ అయ్యింది. సీడ్స్ యూనిట్‌లో ఒక్కసారిగా ఘాటైన వాయువు లీకైంది. దీంతో వాంతులు, తల తిరుగుడుతో తీవ్రంగా ఉద్యోగులు ఇబ్బందిపడ్డారు. వెంటనే బాధితులను యాజమాన్యం హుటాహుటిన సెజ్‌లోని ఆస్పత్రికి తరలించారు. నలుగురు మహిళలకు బ్రాండిక్స్ ఎస్ఈజేడ్‌లో ఉన్న ఆరోగ్య కేంద్రంలో చికిత్స అందజేస్తున్నారు.
* రాజస్థాన్ కరౌలి జిల్లాలోని సిమారా గ్రామంలో 119 మంది గ్రామస్థులు.. కలుషిత నీటిని తాగి అస్వస్థతకు గురయ్యారు. గురువారం గ్రామంలో ఉన్న బావిలోని నీటిని తాగిన కాసేపటికే అందరికీ వాంతులు, విరేచనాలు అయ్యాయి. వెంటనే వారందిరినీ స్థానిక ఆసుపత్రిలో చేర్చారు అధికారులు. అస్వస్థతకు గురైన వారిలో 43 మంది మహిళలు, 37 మంది పురుషులు, 39 మంది చిన్నారులు ఉన్నారు. దీంతో ఆ ఆసుపత్రిలో పడకల కొరత ఏర్పడింది. ఒకే మంచంపై ఆరుగురు చిన్నారులు చికిత్స పొందాల్సిన పరిస్థితి వచ్చింది.
* మహారాష్ట్ర పుణెలో అమానుష ఘటన జరిగింది. ముగ్గురు బిచ్చగాళ్లపై వేడినీళ్లు పోసి హత్య చేశాడు ఓ హోటల్ నిర్వాహకుడు. హోటల్ ముందు కూర్చోవద్దని చెప్పినా వినకపోవడం వల్ల ఆగ్రహానికి గురైన జయవంత్.. కర్రలతో కొట్టి తర్వాత వేడి నీళ్లు పోశాడు. తీవ్ర గాయాలపాలైన బిచ్చగాళ్లు మరణించారు. ఈ ఘటన మే 23న సస్వాద్లో జరగగా.. మే 30న కేసు నమోదు చేశారు పోలీసులు. స్థానిక ఎమ్మెల్యే ఒత్తిడితోనే నిందితుడిని వదిలేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
*కర్ణాటకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కి చెందిన 8 మంది ప్రాణాలు కోల్పోయారు. కలబురిగి జిల్లా కమలాపురలో మినీ లారీను ప్రైవేట్ ట్రావెల్స్ ఢీ కొట్టిన ఘటనలో వీరంతా సజీవదహనమయ్యారు. గోవాలో జరిగిన పుట్టిన రోజు వేడుకలకు హాజరైన రెండు కుటుంబాలకు చెందిన 32 మంది సభ్యులు తిరుగు ప్రయాణంలో ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో పలువురు గాయపడగా.. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
*కర్ణాటకలోని కలబురిగి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. కమలాపురలో వేగంగా వచ్చిన ఓ ప్రయివేటు బస్సు.. లారీని ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 8 మంది ప్రయాణికులు సజీవదహనం అయ్యారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. 12 మందిని రక్షించి స్థానికులు ఆస్పత్రికి తరలించారు.
*బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి నుపూర్ శర్మను హత్యచేస్తే రూ.కోటి ఇస్తానంటూ సోషల్ మీడియాలో ప్రకటనలు ఇచ్చిన వ్యక్తిని సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. మొఘల్‌పురకు చెందిన ఖవి అబ్బాసీ ఏఐఎంఐఎం (ఇంకిలాబ్) పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఓ మతానికి వ్యతిరేకంగా నుపూర్ శర్మ మాట్లాడారనే ఉద్దేశంతో ఖవి సోషల్ మీడియాలో ఆయన్ను చంపితే నజరానా ఇస్తానంటూ ప్రకటించారు. ఈ అంశంపై ఫిర్యాదులు అందడంతో సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు.
*శ్రీ సత్యసాయి: జిల్లాలోని చిలమత్తూరు మండలం కొడికొండ చెక్‌పోస్టు సమీపంలో కారును కర్ణాటక ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. కేఎస్ ఆర్టీసీ బస్సు హైదరాబాద్ నుండి బెంగుళూరు వెళుతుండగా ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవర్ పరారయ్యాడు. విషయం తెలిసిన పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుల వివరాలు తెలియల్సి ఉంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
*ల్లూరు: జిల్లాలోని మర్రిపాడు మండలం పడమటి నాయుడుపల్లి గ్రామ శివార్లలో చిన్నయ్య అనే వ్యక్తిపై ఎలుగుబంటి దాడి చేసింది. ఎలుగుబంటి దాడిలో చిన్నయ్య తీవ్ర గాయాలపాలయ్యాడు. వెంటనే గ్రామస్తులు అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఎలుగుబంటి సంచారంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
*ప్రకాశం: జిల్లాలోని మార్కాపురం మండలం తిప్పాయపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. జాతీయ రహదారి దాటుతున్న దంపతుల ద్విచక్ర వాహనాన్ని బొలెరో వాహనం ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. భార్య రమణమ్మ అక్కడికక్కడే మృతి చెందగా.. భర్త వెంకటరెడ్డి పరిస్థితి విషమంగా ఉంది. మార్కాపురం మండలం మాల్యవంతునిపాడు నుంచి ఉపాధిహామీ పనికి వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందిన వెంటనే
పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
*మద్యం మత్తులో ఓ యువకుడు కన్న తల్లి గొంతు కోసిన ఘటన నగరంలో చోటు చేసుకుంది. కుందవారి కండ్రికకు చెందిన సంపత్ కుమార్ అనే యువకుడు రోజూ మద్యం సేవించి ఇంటి వస్తూ తల్లిని ఇబ్బందులకు గురిచేశాడు. ఈ క్రమంలో మద్యం తాగవద్దంటూ సంపత్‌ను తల్లి భారతి మందలించింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన యువకుడు తల్లి గొంతు కోసేశాడు. అపస్మారకస్థితిలో ఉన్న భారతిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం భారతి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటనలో నిందితుడు సంపత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
*వివిధ ప్రాంతాల్లో చోరీ పాల్పడుతున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్ద నుం చి రూ.లక్ష నగదు, నాలు గు తులాల బంగారు స్వాధీనం చేసుకున్నారు. గురువారం సీఐ తేజోమూర్తి వివరాలి వెల్లడించారు. అ నంతపురానికి చెందిన ఉప్పర శ్రీనివాసులు, అమరాపురానికి చెందిన ఎరుకుల రాములు కళ్యాణదుర్గంలోని ఇందిరమ్మకాలనీలో గు మ్మగట్ట ఆంజనేయులు, రామగిరి మండలం ఎగువపల్లిలో ఓ ఇంట్లో చోరీ పాల్పడి బంగారు ఆభరణాలను అపహరించారన్నారు. పట్టణ సమీపంలోని వేబ్రిడ్జ్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా వీరు పట్టుబడ్డారనానరు. వారిని అదుపులోకి విచారించి వారి వద్ద నుంచి బంగారు, నగదు స్వాధీనం చేసుకుని కేసునమోదు చేసి రిమాండ్‌కు పంపామన్నారు.
*కొత్తగూడెం సూపర్బజార్ పెట్రోల్ బంక్ సిబ్బందిపై ఆకతాయిల మూక దాడికి పాల్పడింది. లక్ష్మీదేవిపల్లి మండలం ఎదురుగడ్డ గ్రామ యువకులు రూ.100 ఇచ్చి రూ.60 రూపాయల పెట్రోల్ పోయించుకున్నారు. రూ.40 కోసం కాస్త ఆగమన్నందుకు పెట్రోల్ బంక్ యువకుడిపై దాడికి పాల్పడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి సీసీ ఫుటేజ్ ఆధారంగా విచారణ నిర్వహిస్తున్నారు.
*నాగాయలంకలో రెండు బైకులు ఢీకొనడంతో నలుగురికి తీవ్ర గాయాలు అవనిగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలింపు
*మాచర్ల సెబ్ కార్యాలయం పై మహిళలు దాడిసారాయి కేసు లో ఉప్పుతోల రాజు ను అరెస్ట్ చేసిన సెబ్ పోలీసులు.అన్యాయం అరెస్ట్ చేశారంటూ స్టేషన్ పై దాడి చేసిన కుటుంబ సభ్యులుఫర్నిచర్ ద్వంసం చేసిన మహిళలు.చంటి బిడ్డి తో స్టేషన్ ఎదుట కన్నీటి పర్వాంతమైన రాజు భార్య జ్యోతి
*వివిధ ప్రాంతాల్లో చోరీ పాల్పడుతున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్ద నుం చి రూ.లక్ష నగదు, నాలు గు తులాల బంగారు స్వాధీనం చేసుకున్నారు. గురువారం సీఐ తేజోమూర్తి వివరాలి వెల్లడించారు. అ నంతపురానికి చెందిన ఉప్పర శ్రీనివాసులు, అమరాపురానికి చెందిన ఎరుకుల రాములు కళ్యాణదుర్గంలోని ఇందిరమ్మకాలనీలో గు మ్మగట్ట ఆంజనేయులు, రామగిరి మండలం ఎగువపల్లిలో ఓ ఇంట్లో చోరీ పాల్పడి బంగారు ఆభరణాలను అపహరించారన్నారు. పట్టణ సమీపంలోని వేబ్రిడ్జ్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా వీరు పట్టుబడ్డారనానరు. వారిని అదుపులోకి విచారించి వారి వద్ద నుంచి బంగారు, నగదు స్వాధీనం చేసుకుని కేసునమోదు చేసి రిమాండ్‌కు పంపామన్నారు.
*మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి గురువారం సీబీఐ అధికారులు పులివెందులలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో ఇరువురిని విచారించారు. వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరితోపాటు వివేకా ఇంటిలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేసిన ఇనయతుల్లాను అధికారులు విచారించారు. ఇనయతుల్లాను ఇప్పటికే అధికారులు పలుమార్లు విచారించారు. కాగా.. కడప సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సునీల్ యాదవ్‌ను ములాఖత్‌లో తల్లి సావిత్రి, భార్య ధనలక్ష్మి కలిశారు.
*టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు ముఖ్య అనుచరుడు, టెక్కలి నియోజకవర్గ ఐటీడీపీ కో ఆర్డినేటర్ అప్పిని వెంకటేశ్‌ను గురువారం సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2022 ఏడాదికి గాను అమ్మఒడి, వాహనమిత్ర, రెండు సంక్షేమ పథకాలు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ఇబ్బందుల కారణంగా రద్దు చేసినట్లు సోషల్ మీడియాలో వచ్చిన పోస్టింగ్‌్ేపై సీఐడీ అధికారులు గత నెల 30న కేసు నమోదు చేశారు. తనకు వచ్చిన ఆ పోస్టింగ్స్‌ను వెంకటేశ్ మరికొందరికి పంపించాడు. దీంతో సీఐడీ అధికారులు వెంకటేశ్‌ను గురువారం ఉదయం నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు సీఐడీ అధికారులు విచారించారు. ఆ పోస్టింగ్ లోకేశ్ పెట్టమన్నాడా? మిమ్మల్ని అరెస్ట్ చేస్తే లోకేశ్ వస్తాడా? అంటూ అధికారులు పదే పదే ప్రశ్నించారు. సీఐడీ సీఐ విక్టర్ వెంకటేశ్‌ను అనేక విధాలుగా విచారించారు. విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు సీఐడీ కార్యాలయంలోకి వెళ్లి సోషల్ మీడియాలో పోస్టింగ్స్ విషయంలో వెంకటేశ్‌ను పిలిపించి వేధించటం ఏమిటంటూ ప్రశ్నించారు. దీంతో వెంకటేశ్‌ను శుక్రవారం ఉదయం రావాల్సిందిగా సూచించిన సీఐడీ అధికారులు అతన్ని పంపేశారు.
*శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. దుబాయ్ నుంచి గురువారం ఏఐ 952 విమానంలో ఓ ప్రయాణికుడు శంషాబాద్ ఎయిర్‌పోర్టు చేరుకున్నాడు. విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు ప్రయాణికుడి బ్యాగులు తనిఖీలు చేయగా అందులో దాదాపు 3.14కేజీల బంగారు అభరణాలు బయటపడ్డాయి. బంగారానికి సంబంధించిన ఎలాంటి పత్రాలు లేకపోవడంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. పట్టుబడ్డ బంగారం విలువ దాదాపు రూ.1.65కోట్ల విలువ ఉంటుందని అధికారులు వెల్లడించారు. పట్టుబడ్డ బంగారాన్ని సీజ్ చేశామని నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.
*మహబూబాబాద్: జిల్లాలోని గూడూరు మండలం సీతానగరం పల్లెప్రగతిలో అపశృతి చోటు చేసుకుంది. గ్రామ పంచాయతీ ట్రాక్టర్ బోల్తా పడి జీపీ వర్కర్ సాంబయ్య మృతి చెందాడు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా భూపతిపేట నుంచి తిరిగి సీతానగరం వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
*నెల్లూరు: జిల్లాలోని మర్రిపాడు మండలం పడమటి నాయుడుపల్లి గ్రామ శివార్లలో చిన్నయ్య అనే వ్యక్తిపై ఎలుగుబంటి దాడి చేసింది. ఎలుగుబంటి దాడిలో చిన్నయ్య తీవ్ర గాయాలపాలయ్యాడు. వెంటనే గ్రామస్తులు అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఎలుగుబంటి సంచారంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
*వడ్లకొండ బైపాస్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పిన బైక్ ను చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరకున్న పోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు గానుగుపాడు గ్రామానికి చెందిన కనకరాజు (25) అజయ్, (15)గా పోలీసులు గుర్తించారు.
*దామెర మండలం పులుకుర్తిలో అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ తో ఇంట్లో మంటలు చెలరేగాయి. దీంతో ఒక్కసారిగా మంటలు పెద్ద ఎత్తున్న ఎగిసిపడ్డాయి. భారీగా మంటలు ఎగిసిపడటంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. వెంటనే ఫైర్ ఇంజన్ కు సమాచారం ఇవ్వడంతో ప్రమాద స్థలానికి చేరుకున్న అగ్నిమాపక మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ మంటల్లో మూడు ఇళ్లు దగ్ధం అయ్యాయి. ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపీరిపీల్చుకున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
*మధ్యప్రదేశ్లోని విదిశాలో దారుణం జరిగింది. నగరంలో ప్రభుత్వ కార్యాలయాలకు సమీపంలోనే ఓ ఆర్టీఐ కార్యకర్తను గుర్తు తెలియని వ్యక్తులు గురువారం సాయంత్రం కాల్చి చంపారు. విషయం తెలుసుకున్న పోలీసులు..కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతుడ్ని ముఖర్జీనగర్ నివాసి అయిన రంజిత్ సోనీగా గుర్తించారు.
*మధ్యప్రదేశ్ బైతూల్లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ కారు చెట్టును ఢీకొట్టి పూర్తిగా దగ్ధమైంది. వేగంగా వ్యాపించిన మంటల ధాటికి.. డ్రైవర్ సజీవదహనం అయ్యాడు. రాణీపుర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖమాల్పుర్ గ్రామంలో గురువారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కారులో మరికొందరు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. అందుకోసం సమీప టోల్గేట్ల వద్ద సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నారు.