DailyDose

ఎలన్‌ మస్క్‌ కామెంట్లు.. మీడియా సాక్షిగా బైడెన్‌ చురకలు

ఎలన్‌ మస్క్‌ కామెంట్లు.. మీడియా సాక్షిగా బైడెన్‌ చురకలు

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌.. ప్రపంచంలోనే అత్యంత ధనికుడు ఎలన్‌ మస్క్‌కు చురకలు అంటించారు. తాను ఎప్పటికీ బైడెన్‌ అభిమానిని కాదంటూ ప్రకటించుకున్న ఎలన్‌ మస్క్‌.. తాజాగా చేసిన కొన్ని వ్యాఖ్యలు రాయిటర్స్‌లో పబ్లిష్‌ అయ్యాయి. శుక్రవారం మీడియాతో ముఖాముఖి సందర్భంగా బైడెన్‌కు సదరు వ్యాఖ్యలపై ప్రశ్న ఎదురైంది. దీంతో ఆయన ఆసక్తికరంగా స్పందించారు.అమెరికా ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉందంటూ టెస్లా ఎగ్జిక్యూటివ్స్‌ వ్యాఖ్యలు చేశాడు(మెయిల్‌ ద్వారా) ఆ కంపెనీ సీఈవో ఎలన్‌ మస్క్‌. అంతేకాదు.. పది శాతం ఉద్యోగులను తగ్గించే యోచనలో ఉన్నట్లు కూడా ప్రకటించాడు. ‘ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ నియామకాలు నిలిపివేయండి’ అంటూ మెయిల్‌ చేశాడు మస్క్‌. ఈ వ్యవహారమంతా రాయిటర్స్‌లో ప్రచురితమైంది.

అయితే మస్క్‌ ఉద్దేశాన్ని జో బైడెన్‌ ముందు ప్రస్తావించింది మీడియా. దానికి బదులుగా.. ‘‘ఎలన్‌ మస్క్‌ ఇలా మాట్లాడే సమయంలో.. ఫోర్డ్‌ కంపెనీ తమ పెట్టుబడులను గణనీయంగా పెంచుకుంటూ పోతోంది’’ అంటూ పంచ్‌ వేశాడాయన. అంతేకాదు జేబులోంచి ఓ కార్డును బయటికి తీసి.. కొన్ని కంపెనీలు ఏమేర ఉద్యోగ నియామకాలు చేపట్టాయి..ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టాయనేది స్వయంగా బైడెన్‌ చదివి వినిపించారు కూడా. చివర్లో కార్డును మళ్లీ జేబులో పెట్టుకుంటూ.. ‘‘కాబట్టి, అతనికి(మస్క్‌)కు మూన్‌ ట్రిప్‌ అయినా అదృష్టాన్ని తెచ్చిపెట్టాలంటూ’’ సెటైర్‌ సంధించారు బైడెన్‌. ఇక బైడెన్‌ సలహాపై ఎలన్‌ మస్క్‌ సైతం స్పందించాడు. థ్యాంక్స్‌ మిస్టర్‌ ప్రెసిడెంట్‌ అంటూ.. నాసా తదుపరి మూన్‌ మిషన్‌కు స్పేస్‌ఎక్స్‌ కంపెనీని ఎంచుకోవడంతో ఉన్న కథనాన్ని ప్రచురించాడు