DailyDose

మళ్ళీ మొదలయిందా కరోన

మళ్ళీ మొదలయిందా కరోన

గత వారం రోజులుగా కనిపిస్తున్న వార్తలు

ముంబైలో కరోన ఉధృతి

కేరళలో పెరుగుతున్న కేసులు

సోనియాగాంధీ గారికి కరోన

తెలంగాణలో పెరుగుతున్న కేసులు

రాష్ట్రాలను హెచ్చరించిన కేంద్రం

మాస్కు రూల్స్ మళ్ళీ మొదలు….

ఈ వార్తలు చదువుతుంటే కొందరిలో మళ్ళీ గుబులు మొదలయింది. పోయింది అనుకున్న దయ్యం మళ్ళీ వస్తుందేమోనని.

భయపడవలసిన అవసరమే లేదు!!నిశ్చింతగా ఉండండి!!

మూడు వేవ్స్, వాక్సిన్స్ వల్ల దేశంలో 100% మందికి కరోన ఇమ్మ్యూనిటి వచ్చింది. కానీ ఇమ్మ్యూనిటి శాశ్వతం కాదు, హెచ్చుతగ్గులు ఉంటాయి. కొందరిలో మరి తక్కువగా ఉంటుంది!!

కరోన ఇన్ఫెక్షన్లు తగ్గాయి, కానీ కరోన వైరస్ చచ్చిపోలేదు, ఎక్కడికో వెళ్లిపోలేదు…ఇక్కడే మనతోటే ఉంది!! 3 వ వేవ్ అయిపోయి చాలా కాలం అయింది కాబట్టి, వాక్సిన్స్ తీసుకుని చాలా కాలం అయింది కాబట్టి కొందరిలో ఇమ్మ్యూనిటి తగ్గింది…వారికి కరోన సోకె అవకాశం ఉంది!!

ఇప్పుడు వచ్చే కరోన కేసులు ప్రతీ సీసన్ లో వచ్చే జలుబు లాంటిదే!!కరోన సోకుతుంది, పోతుంది అంతే!! అసలు ఈ రోజు వారీ కేసుల లెక్కలు ఒక ప్రహసనం!!

తీసుకోవలసిన జాగ్రత్తలు

1. రెండు డోసుల వాక్సిన్స్ తీసుకుని ఉండాలి

2. వృద్ధులు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు మూడవ డోస్ తీసుకోవాలి

3. పబ్లిక్ ప్లేసులలో మాస్కు వాడితే మంచిది

4. వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు కాస్త అప్రమత్తంగా ఉండాలి

5. పిల్లలను స్వేచ్చగా ఉండనివ్వండి, వారికేమి ఇబ్బందులు రావు….