Movies

టికెట్ రేట్లు తగ్గించాలి, ఓటీటీని కాస్త దూరం పెట్టాలి – అల్లు అరవింద్

టికెట్ రేట్లు తగ్గించాలి, ఓటీటీని కాస్త దూరం పెట్టాలి  – అల్లు అరవింద్

అల్లు అరవింద్ కళ్లు తెరిచి మేల్కొన్నాడు సరే..ఇండస్ట్రీ ఎప్పుడూ మేల్కొంటుంది . ముఖ్యంగా “నన్ను టార్గెట్ చేశారు..నన్ను టార్గెట్ చేశారు” అని గుక్క పెట్టి ఏడ్చే ఫ్లవర్ స్టార్ ఎప్పుడు మేల్కొంటాడు. లాభాలు వస్తే సంచుల్లో డబ్బులు తీసుకెళ్తాం..నష్టం వస్తే బస్తాల్లో నష్టం అంటూ గతంలో ఓ నిర్మాత కామెంట్ చేశాడు.

సినిమా నిర్మాణం మీద ఎప్పుడైతే నిర్మాత, దర్శకుల పట్టు పోయి హీరోల పట్టు పెరిగిందో అప్పటి నుంచే తెలుగు సినిమాకు కష్టాలు మొదలయ్యాయి. మలయాళంలో కోటి రూపాయాలు అయ్యే సినిమా బడ్జెట్ తెలుగులో రూ.100 కోట్లు దాటి పోతుంది. కారణం..హీరో రెమ్యూనరేషన్లు. తెలుగులో పెద్ద హీరోల రెమ్యూనరేషన్లు దగ్గర దగ్గరగా రూ.100 కోట్లు ఉన్నాయి. తెలుగులో సినిమా నిర్మించాలంటే రెమ్యూనరేషన్లకే రూ.200 కోట్లు పోతుంది. సినిమా నిర్మాణం పూర్తయ్యేనాటికి రూ. వందల కోట్లు దాటి పోతుంది. ఇవన్నీ..టికెట్ రేట్లు పెంచడం ద్వారా , ఏరియా బట్టి వాటాలు ఇవ్వడం ద్వారా గుంజుకోవాలని ఆలోచన.

ఈ ఆలోచన కరక్ట్ కాదు అని, సినిమా అనేది ప్రేక్షకులకు దగ్గరగా ఉండాలని…అలానే ఇండస్ట్రీ కూడా నష్టపోకుండా మధ్య మార్గం ఉండాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ ఎప్పుడో ప్రకటించారు. సీఎం వైఎస్‌ జగన్ మాటలకు టాలీవుడ్‌లో ఓ వర్గం రాజకీయ రంగు పులిమింది. పవన్ కల్యాణ్‌ అయితే..తననే సీఎం జగన్ టార్గెట్ చేస్తున్నారని రెచ్చిపోయారు. సీఎం జగన్‌ను అనరాని మాటలు అన్నారు. తనఫ్యాన్స్‌తో రచ్చ చేయించారు.

భార్య, భర్త, ఇద్దరు పిల్లలు ఉన్న ఒక చిన్న కుటుంబం సినిమాకు వెళ్తే రూ.2వేలు పక్కన పెట్టాల్సిన పరిస్థితి. సినిమా టికెట్ల దగ్గర నుంచి చిరుతిండి వరకు ఈ ఖర్చు ఉంటుంది.కారణం..సినిమా టికెట్ల ధరలు పెంచి జలగల్లా ప్రేక్షకుల రక్తాన్ని పీల్చడం. దీంతో….ప్రేక్షకులు ఓటీటీకి అలవాటు పడ్డారు. కాస్త లేటైయినా ఇంట్లో కూర్చుని చూడొచ్చు అనే ఆలోచనకు సగటు ప్రేక్షకుడు వచ్చాడు. దీంతో…పెద్ద హీరోల సినిమాలు కూడా నష్టాలు చూడాల్సిన పరిస్థితి. దీంతో…సినీ పెద్దల్లో ఒకరైన అల్లు అరవింద్ కాస్త లేటుగా అయినా…స్పందించడం ఆహ్వానించదగ్గ పరిణామం.

బంగర్రాజు రిలీజ్ సమయంలో హీరో నాగార్జున ఇదే విషయాన్ని వెల్లడించారు. ఆయన మాటలకు కూడా రాజకీయ రంగు పులిమారు.తాజాగా అల్లు అరవింద్ ..నాగార్జున అభిప్రాయాన్నే వెలిబుచ్చారు.F3 సినిమా యూనిట్ త్వరగానే మేల్కొంది. తమ సినిమా ఓటీటీలో ఇప్పట్లో రిలీజ్ చేయమని చెబుతూనే..టికెట్ల రేట్లు తగ్గించింది.

హీరో నేచరల్ స్టార్‌ నాని ” థియేటర్ కౌంటర్ కంటే కిరాణా కొట్టు కౌంటర్ ఎక్కువుగా ఉంది” అని చెప్పారు . అయ్యా…నాని నీవు కూడా రాజకీయ కోణంలో, కుల కోణంలో కాకుండా ఆలోచించు. ఎవరైనా టాలీవుడ్ బాగుండలనే కోరుకుంటారు. మీరు రెమ్యూనరేషన్లు ఎందుకు తగ్గించుకోరు.మీరు నేచరల్ స్టార్ కదా ప్రాక్టికల్‌గా ఆలోచించండి. టాలీవుడ్ బతకాలంటే..తెలుగు సినిమా వెండి తెరపై చిందులు వేయాలంటే హీరోలు కామన్ మేన్‌ బ్రెయిన్‌తో ఆలోచించాలి.

అడ్డదిడ్డంగా టికెట్లు అమ్ముకోవడం క్లోజ్‌ అవ్వాలి. బ్లాక్ టికెట్ల ధోరణికి తెర పడాలి. ఆన్ లైన్‌లో ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా టికెట్ల అమ్మకాలు పారదర్శకంగా జరగాలి. అప్పుడే థియేటర్లకు ప్రేక్షకులు వస్తారు. లాభం రావాలి అనుకోవడం తప్పుకాదు కానీ..ప్రేక్షకుల రక్తాన్ని జలగల్లా పీల్చాలి అనుకోవడం తప్పు. ఈ విషయాన్ని అల్లు అరవింద్ గ్రహించారు. ఇక గ్రహించాల్సింది టాలీవుడ్‌లో ఉన్న ఎల్లో థింకర్సే.