* వైఎస్ వివేకానంద హత్య కేసు నిందితులను జగన్ కాపాడే ప్రయత్నం చేస్తున్నాడని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమ ఆరోపించారు. వివేకా హత్య కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ అధికారులు పులివెందుల్లో సీఎం జగన్, ఎంపీ అవినాష్ రెడ్డి ఇంటి కొలతలు వేశారని, పులివెందులలో అన్ని ఇళ్లుంటే.. జగన్, అవినాష్ రెడ్డి ఇళ్లనే ఎందుకు కొలతేశారు..? అని ప్రశ్నించారు. మరోవైపు వివేకా హత్య కేసులో సాక్షులను చంపేస్తారని తాము మొదటి నుంచి చెబుతూనే ఉన్నామని, ఇప్పుడు అదే జరుగుతోందన్నారు. ‘‘హత్య కేసులో ప్రమేయం ఉందని అనుమానిస్తున్న కటికం శ్రీనివాసరెడ్డి చనిపోయారు. వివేకా మృతదేహానికి కుట్లు వేసిన వైఎస్ జగన్ మామ గంగిరెడ్డి చనిపోయారు. గంగాధరరెడ్డి మృతి కూడా అంతు పట్టకుండా ఉంది. అవినాష్ రెడ్డి పేరు బయటకు రాకుండా ఉండడం కోసం గంగాధర రెడ్డిని చంపేశారని ప్రచారం జరుగుతోంది. గంగాధర రెడ్డి మృతదేహానికి ఎందుకు పోస్ట్ మార్టం జరపలేదు. భుజానెత్తుకుని మోసిన బాబాయిని చంపిన హంతకులను జగన్ కాపాడే ప్రయత్నం చేస్తున్నారు.’’ అని బోండా ఉమ ఆరోపించారు.
*అట్టడుగు వర్గాల హక్కులను అణగతొక్కటం వైకాపా పాలనకు నిదర్శనం: చంద్రబాబు
తన ప్రాంతంలో అభివృద్ధిపై ప్రశ్నించినందుకు ఓ దళిత యువకుడిని వైకాపా ఎంపీటీసీ అనుచరులు చెట్టుకు కట్టేసి కొట్టారంటూ తెదేపా అధినేత చంద్రబాబు ట్విటర్లో ఓ పోస్టు పెట్టారు. అట్టడుగు వర్గాల హక్కులను అణగతొక్కటం వైకాపా పాలనకు నిదర్శనమని మండిపడ్డారు.అట్టడుగు వర్గాల హక్కులను అణగతొక్కటం వైకాపా పాలనకు నిదర్శనమని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. తన ప్రాంతంలో అభివృద్ధిపై ప్రశ్నించినందుకు ఓ దళిత యువకుడిని వైకాపా ఎంపీటీసీ అనుచరులు చెట్టుకు కట్టేసి కొట్టారంటూ చంద్రబాబు ఓ వీడియోను ట్విటర్లో పోస్టు చేశారు. ప్రశ్నించే హక్కు ఆ ఎస్సీ యువకుడికి లేదా ? అని నిలదీశారు. బలహీనవర్గంలో పుట్టడమే అతని నేరమా ? అని ప్రశ్నించారు. బాధిత కుటుంబానికి తెలుగుదేశం అండగా ఉంటూ, నిందితుల్ని శిక్షించేవరకూ పోరాడుతుందని స్పష్టం చేశారు.
*తెలంగాణ గవర్నర్ లక్ష్మణరేఖను దాటుతున్నారు : సీపీఐ నారాయణ
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్‌పై సీపీఐ నారాయణ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గవర్నర్ తమిళిసై లక్ష్మణరేఖ దాటుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్‌భవన్‌ను రాజకీయ కార్యకలాపాలకు వాడుకుంటూ దుర్వినియోగానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. మహిళా దర్బార్ ఎందు కోసం నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు.
ఎవరైనా వినతిపత్రం ఇస్తే స్వీకరించి, ప్రభుత్వానికి పంపొచ్చు. అంతే కానీ రాజ్‌భవన్‌ను రాజకీయాలకు వాడుకోవడం సరికాదన్నారు. రాష్ట్రంలో గవర్నర్ పాత్ర అగ్గి రాజేస్తున్నదని పేర్కొన్నారు. గవర్నర్ పాత్ర రాజకీయంగా ఉండటం రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఉందన్నారు. గవర్నర్ తలపెట్టిన దర్బార్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు సీపీఐ నారాయణ తెలిపారు
*ఉద్యోగాల భర్తీపై ప్‌రధాని మోదీకి మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ
దేశంలోని యువత ఉద్యోగ – ఉపాధి అవకాశాల భర్తీపై ప్రధాని నరేంద్ర మోదీకి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న 16 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న 16 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్న మోదీ.. తన హామీని నిలబెట్టుకోలేకపోయారని ధ్వజమెత్తారు. తెలంగాణ ఇప్పటికే లక్షా 32 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిందని గుర్తు చేశారు. మరో లక్ష ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నట్లు ప్రకటించారు. ప్రైవేటు రంగంలో 16 లక్షల ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించామన్నారు. కానీ కేంద్రం ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయకపోగా, ఉన్న ఉపాధి ఉద్యోగ అవకాశాలపై దెబ్బ కొడుతుందని మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడం ద్వారా శాశ్వతంగా లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఏర్పడిందన్నారు. దేశ యువతకు ఉద్యోగాలు కల్పించడంలో ప్రధానమంత్రి విఫలమయ్యారని ధ్వజమెత్తారు. తెలంగాణ యువతకు ఉద్యోగాలు కల్పించే ఐటిఐఆర్ ప్రాజెక్టు రద్దు ద్వారా పెద్ద దెబ్బ కొట్టారని ఆగ్రహం వెలిబుచ్చారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం యువతతో కలిసి టీఆర్ఎస్ ఆందోళన చేపడుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు.
*ఏపీ వ్యాప్తంగా వేలాది మంది ఎస్సీ, ఎస్టీ రైతులు రోడ్డునపడే అవకాశం: శ్రవణ్‌కుమార్
ఎస్సీ, ఎస్టీ రైతుల సబ్సిడీ రుణ ట్రాక్టర్స్ అండ్ టైలర్స్ స్కీం ఉపసంహరణతో ఏపీ వ్యాప్తంగా వేలాది మంది ఎస్సీ, ఎస్టీ రైతులు రోడ్డునపడే అవకాశం ఏందపి శ్రవణ్‌కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆగస్టులో సబ్సిడీ డబ్బులు ఇవ్వాల్సి వస్తుందనే స్కీం ఉపసంహరణ చేశారని పేర్కొన్నారు. కేంద్ర నిధులతో సబ్సిడీ రుణ ట్రాక్టర్స్ పథకం పెట్టారని ఆయన ఆరోపించారు. స్కీమ్ రద్దు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. ప్రభుత్వ నిర్ణయంపై త్వరలో రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడతామన్నారు.
*వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు 2 సీట్లే వస్తాయి: అర్వింద్
వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు 2 సీట్లే వస్తాయని ఎంపీ అర్వింద్ జోస్యం చెప్పారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తనపై పోటీ చేసే ధైర్యం ఎమ్మెల్సీ కవితకు లేదన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌కు భంగపాటు తప్పదని జోస్యం చెప్పారు. జాతీయస్థాయిలో కేసీఆర్‌ను పట్టించుకునే నాథుడే లేడని ఎద్దేవాచేశారు. బీజేపీపై మంత్రి కేటీఆర్ విమర్శలు మాని.. రేప్ కేసు సంగతేంటో చూడాలని అర్వింద్ సూచించారు.
*సడెన్‌గా KCRకు ఎన్టీఆర్‌పై ప్రేమ పుట్టుకొచ్చింది: రేవంత్‌రెడ్డి
ఎయిర్‌పోర్ట్ టెర్మినల్‌కు మాజీ సీఎం ఎన్టీఆర్ పేరును మార్చింది సీఎం కేసీఆరేనని టీపీసీసీ అధ్యక్ష్యుడు రేవంత్‌రెడ్డి తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికారికంగా ఎన్టీఆర్ జయంతి, వర్ధంతి చేయడం లేదని తప్పుబట్టారు. కేసీఆర్ చర్యలను ఎన్టీఆర్ అభిమానులు మరిచిపోరన్నారు. ఎన్టీఆర్ జయంతి రోజు బారులు కట్టి ఎన్టీఆర్‌ని పొగిడితే చరిత్ర మారదు కదా అని ప్రశ్నించారు. సడెన్‌గా సీఎం కేసీఆర్‌కి ఎన్టీఆర్‌పై ప్రేమ పుట్టుకొచ్చిందని విమర్శించారు. ఎన్ని వేషాలు వేసినా.. సీఎం కేసీఆర్‌ని ప్రజలు నమ్మరని తెలిపారు. హైదరాబాద్‌లో సమావేశాలు పెట్టినంత మాత్రాన బీజేపీ బలపడదని రేవంత్‌రెడ్డి జోస్యం చెప్పారు.
*కొడాలి పాల్గొనాల్సింది జూమ్ మీటింగ్‌లో కాదు, పది పరీక్షల్లో: జవహర్
తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీ నారా లోకేష్ తమ పార్టీ నాయకులతో నిర్వహించిన జూమ్ మీటింగ్‌లో మాజీ మంత్రి కొడాలి నాని ప్రత్యక్షమై మాట్లాడారు. దీనిపై టీడీపీ మాజీమంత్రి జవహర్ స్పందించారు. కొడాలి నాని పాల్గొనాల్సింది జూమ్ మీటింగ్‌లో కాదు, పది పరీక్షల్లో అని అన్నారు. వేలి ముద్రగాళ్ళు రాజకీయాల్లో ఉంటే ఇలాగే ప్రవర్తిస్తారని పేర్కొన్నారు. జగన్‌తో పాటు ఆయన సహచరులకు చదువుంటే చులకన భావం ఉందన్నారు. లోకేష్ విద్యార్థుల కోసం యజ్ఞం చేస్తే.. మీరు రాక్షసుల్లా అడ్డుకుంటున్నారని విమర్శించారు. అసలు రాష్ట్రంలో చదువులు ఎటు పోతున్నాయో అర్దం కాని పరిస్థితి నెలకొందన్నారు.
*కొడాలి నాని, వంశీ ప్రొగ్రెస్ రిపోర్ట్ CM దగ్గర బాగోలేదు: Ashok Babu
టీడీపీ నేత, ఎమ్మెల్సీ అశోక్ బాబు వైసీపీ ప్రభుత్వం (YCP Govt.)పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం.. సీఎం ఫేక్ అని తాము చెబుతూనే ఉన్నామన్నారు. లోకేష్జూ మ్ కార్యక్రమం నిర్వహిస్తే వైసీపీ నేతలు ఫేక్ ఐడీలతో జొరబడ్డారని మండిపడ్డారు. నాని, వంశీ ప్రొగ్రెస్ రిపోర్ట్ సీఎం దగ్గర బాగోలేదన్నారు. సీఎం దగ్గర మార్కులు వేయించుకోవాలని జూమ్‌లో జొరబడ్డారన్నారు. జూమ్‌లోకి జొరబడడం ద్వారా సీఎం దగ్గర మార్కులు పడొచ్చేమో కానీ.. ప్రజలు ఉమ్మేస్తున్నారన్నారు. కొడాలి నాని.. వంశీలకు దమ్ముంటే వాళ్ల నియోజకవర్గాల్లో పదో తరగతి పరీక్షల్లో తప్పిన విద్యార్థులు, పేరెంట్సుతో సమావేశం పెట్టాలని అశోక్ బాబు సవాల్ చేశారు.
*మంగళగిరిలో అన్న క్యాంటీన్ తెరుస్తాం: లోకేష్మం
గగళగిరి ఎన్టీఆర్ విగ్రహం వద్ద టీడీపీ ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని మున్సిపల్ అధికారులు తొలగించడాన్ని టీడీపీ నేత నారా లోకేష్ తీవ్రంగా ఖండించారు. రోజూ త్రాగునీరు, మజ్జిగ అందిస్తూ వందలాది మంది దాహార్తిని తీరుస్తున్న చలివేంద్రాన్ని తొలగించడం స్థానిక ఎమ్మెల్యే ఫ్రస్ట్రేషన్ ని బయటపెట్టిందన్నారు. చలివేంద్రం ఉన్న ప్రదేశంలోనే రేపటి నుండి అన్న క్యాంటీన్ ప్రారంభించాలి అనుకున్నామని తెలిపారు. రోజుకి రూ.2 కే పేదలకు భోజనం అందించాలి కూడా అనుకున్నట్లు తెలిపారు. పేదల నోటి దగ్గర కూడు లాక్కునే వైసీపీ మరోసారి అదే పని చేసిందన్నారు. మున్సిపల్ అధికారులను పంపి దౌర్జన్యం చెయ్యడం దారుణమన్నారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా మంగళగిరిలో అన్న క్యాంటీన్ తెరుస్తాం పేదలకు తక్కువ ధరకే భోజనం అందిస్తామన్నారు.
*మంత్రి రోజా సినిమా నటి….: సోము వీర్రాజు
మంత్రి రోజా సినిమా నటి.. ఆమెకి రాజకీయాలపై అవగాహన లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్టు చదివే మంత్రి రోజా అని ఆయన విమర్శించారు. తిరుపతి, బద్వేలు ఉపఎన్నికల్లో ప్రజలు బీజేపీకి ఓట్లు వేసిన విషయం రోజాకి తెలియదా? అని సోము వీర్రాజు ప్రశ్నించారు.
*APలో ఏం అభివృద్ధి జరిగిందని ప్రజలకు చెబుతారు?: Shailajanath
ఆంధ్రప్రదేశ్ లో ఏం అభివృద్ధి జరిగిందని ప్రజలకు చెబుతారని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ గడప దాటని జగన్ రెడ్డి హిత బోధ చేయడమా?.. ఎన్నికలకు రెండేళ్ల ముందే హడావుడి ఎందుకని నిలదీశారు. సామాజిక న్యాయ బస్సు యాత్ర తుస్సుమందని ఎద్దేవా చేశారు. మూడేళ్ళయినా ఒక్క డీఎస్సీ ప్రకటించారా? అని ప్రశ్నించారు. పది పాపం జగన్ రెడ్డి సర్కారుదేనన్నారు. జాబ్ క్యాలెండర్ ప్రకటన సరే… ఉద్యోగాలు ఏవన్నారు. జగన్‌ను ఎప్పుడు సాగనంపుదామా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని శైలజానాథ్ వ్యాఖ్యానించారు.
*టీటీడీ ఉద్యోగిపై వైసీపీ గుండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా: Bjp leader
టీటీడీ ఉద్యోగిపై వైసీపీ గుండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ… గది ఇవ్వకపోతే విధుల్లో ఉన్న ఉద్యోగి పై దాడి చేస్తారా అని మండిపడ్డారు. వైసీపీ అధికారంలోకి వచ్చాకా రాష్ట్రంలో ఎవరికీ భద్రతా లేకుండా పొయ్యిందన్నారు. ఈ ఘటనతో వైసీపీ గుండాయిజం దేవాలయల వద్దకు పాకిందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం చేతగాని తనం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని అన్నారు. అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో దాడికి పాల్పడిన వారిపై నామమాత్రపు కేసు నమోదు చేసి రక్షించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. దాడికీ పాల్పడిన వారిని కఠినంగా శిక్షించేలా పోలీసులు కేసు నమోదు చెయాలని భానుప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు.
*2023లో AP Assembly ఎన్నికలు వస్తాయి: రఘురామ
2023లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు వస్తాయని ఎంపీ రఘురామకృష్ణరాజు జోస్యం చెప్పారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ సర్వేలో ప్రతిపక్షానికి 115, పాలక పక్షానికి మిగతా సీట్లు వస్తాయని తేలిందని వెల్లడించారు. ఏడుగురు ఎమ్మెల్యేలు గడపగడపకు వెళ్లలేదని సీఎం జగన్ అన్నారని, ఏడుగురు కాదు 8 మంది ఎమ్మెల్యేతో పాటు జగన్ కూడా గడపగడపకు వెళ్లలేదని తెలిపారు. అమ్మఒడి ఎత్తేస్తే ఎలా అని మాజీమంత్రి బాలినేని శ్రీనివాస్ అన్నారని గుర్తుచేశారు. టీడీపీ హయాంలో 93 శాతం మంది విద్యార్థులు టెన్త్ పాస్ అయ్యారని, తమ ప్రభుత్వంలో టీచర్లపై మానసిక ఒత్తిడి తెస్తున్నారని విమర్శించారు. మాజీమంత్రి వివేకా కేసులో సీబీఐ విచారణ లేటైతే ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయన్నారు. కోనసీమ ఘటనపై హోంమంత్రికి లేఖ రాస్తానని రఘురామకృష్ణరాజు ప్రకటించారు.
*కొడాలి పాల్గొనాల్సింది జూమ్ మీటింగ్‌లో కాదు, పది పరీక్షల్లో: జవహర్
తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీ నారా లోకేష్ తమ పార్టీ నాయకులతో నిర్వహించిన జూమ్ మీటింగ్‌లో మాజీ మంత్రి కొడాలి నాని ప్రత్యక్షమై మాట్లాడారు. దీనిపై టీడీపీ మాజీమంత్రి జవహర్ స్పందించారు. కొడాలి నాని పాల్గొనాల్సింది జూమ్ మీటింగ్‌లో కాదు, పది పరీక్షల్లో అని అన్నారు. వేలి ముద్రగాళ్ళు రాజకీయాల్లో ఉంటే ఇలాగే ప్రవర్తిస్తారని పేర్కొన్నారు. జగన్‌తో పాటు ఆయన సహచరులకు చదువుంటే చులకన భావం ఉందన్నారు. లోకేష్ విద్యార్థుల కోసం యజ్ఞం చేస్తే.. మీరు రాక్షసుల్లా అడ్డుకుంటున్నారని విమర్శించారు. అసలు రాష్ట్రంలో చదువులు ఎటు పోతున్నాయో అర్దం కాని పరిస్థితి నెలకొందన్నారు.
*ఏడు నెలల్లో అధికారంలోకి వస్తాం: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
రానున్న ఏడెనిమిది నెలల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పంటలు నష్టపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం కౌలు రైతులకు శాపంగా మారిందని, కాంట్రాక్టర్ల నుంచి టీఆర్‌ఎస్ ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు దండుకుంటోందని ఆరోపించారు. దేశంలో పంటల బీమా లేని రాష్ట్ర ఒక్క తెలంగాణ అన్నారు. కేసీఆర్ మాయమాటలకు ప్రజలు మోసపోయారన్నారు. దళితులకు మూడు ఎకరాలు, డబుల్ బెడ్‌రూం ఇళ్లు మంజూరు కాలేదని, మద్యం మాత్రం రెట్టింపు ధర పెంచిందని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు.
*అత్యాచారాలు, హత్యలను అరికట్టడంతో కేసీఆర్ విఫలం: YS Sharmila
కేసీఆర్ పాలనలో మహిళలు, బాలికలపై హత్యలు, అత్యాచారాలు పెరిగిపోయాయని, వాటిని అరికట్టడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ విఫలమయ్యారని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. ఖమ్మం జిల్లా వైరా నియోజక వర్గంలో ఆమె పర్యటించారు. టీఆర్ఎస్‌ను తాగుబోతుల పార్టీగా అభివర్ణించారు. టీఆర్ఎస్ రేపిస్ట్‌ల పార్టీ అని, పనులకోసం వెళితే టీఆర్ఎస్ నేతలు మహిళల మాన ప్రాణాలను అడుగుతున్నారని ఆరోపించారు.
*పేరుకే పబ్బులు, అందులో అన్ని…: చాడ
దేశవ్యాప్తంగా మైనర్ బాలికలపై అత్యాచారాలు పెరోగిపోతున్నాయని, హైదరాబాద్ డ్రగ్ మాఫియాకు అడ్డాగా మారిపోయిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పేరుకే పబ్బులు, అందులో అన్ని ఆ సాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని ఆరోపించారు. పబ్బుల మీద ప్రభుత్వానికి పట్టింపు ఏది? అని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ మైనర్ బాలిక ఘటన దారుణమన్నారు. అలాగే నిందితులపై చర్యలు తీసుకోవాలన్నారు. పబ్బు యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కేసు వెనుకాల పెద్ద వాళ్ళ హస్తం ఉంది..అందుకే కేసు ఆలస్యం చేశారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో పబ్బులు మూసి వేయాలన్నారు. దానికి ప్రత్యక్ష కార్యాచరణ రూపొందించాలని చెప్పారు. జూబ్లీహిల్స్ ఘటనను సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. 10 వ తేదీ మగ్ధూమ్ భవన్‌లో వామపక్ష పార్టీల సమావేశం ఉంటుందన్నారు. అందులో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. పెరుగుతున్న చార్జీలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వ్యవహారాలపై కూడ చర్చ ఉంటుందన్నారు.
*తెలంగాణ పచ్చగా ఉండడం చూసి ఓర్వలేక కేంద్రం ఇబ్బందులు:Gangula
తెలంగాణ పచ్చగా ఉండడం చూసి ఓర్వలేక కేంద్రం ఇబ్బందులు పెడుతోందని పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ మండిపడ్డారు. చిన్న చిన్న కారణాలతో ధాన్యం కొనుగోలు చేయబోమంటూ ఎఫ్.సి.ఐ. లేఖ రాసిందని ఆయన పేర్కొన్నారు.ఎఫ్.సి.ఐ. ఆరోపణలు వాస్తవాలకు దూరంగా ఉన్నాయని ఆయన అన్నారు.2020 ఏప్రిల్ నుంచి ఐదు కిలోల ఉచిత బియ్యాన్ని కేంద్రంతో పాటు ఇచ్చాము.90,46,000 కార్డుల్లో 53,00,000 కార్డులకుమాత్రమే కేంద్రం ఉచిత బియ్యం ఇస్తోందని ఆయన అన్నారు. బుధవారం తన కార్యాలయంలో మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు.రాష్ట్ర ప్రభుత్వం పై 8 నెలల పాటు 980 కోట్ల భారం పడిందిని మంత్రి చెప్పారు. 2021 జూన్ నుంచి ఏప్రిల్ 2022 వరకు కూడా ఉచితంగా బియ్యం ఇచ్చామని చెప్పారు.11 నెలలు 1134 కోట్ల భారం పడింది. 2022 మార్చిలో లేఖ రాసి ఏప్రిల్ నుంచి ఆర్నెళ్ళు ఉచితబియ్యం ఇవ్వాలని కేంద్రం లేఖలో రాసింది అన్నారు.
*అన్నిరంగాల్లో కేసీఆర్ సర్కార్ విఫలమైంది: తరుణ్‌చుగ్
అన్ని రంగాల్లో కేసీఆర్ సర్కార్ విఫలమైందని బిజెపి రాష్ట్ర ఇన్ చార్జి తరుణ్ చుగ్ విమర్శించారు. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో జంగల్‌రాజ్ నడుస్తోందన్నారు. కేసీఆర్ ఫాంహౌస్‌లో..కేటీఆర్ ట్విటర్‌లో మాత్రమే కనిపిస్తున్నారని చెప్పారు. హోంమంత్రి సెలవుల్లో ఉన్నారంటూ తరుణ్‌చుగ్ విమర్శించారు.జూబ్లీ హిల్స్ ఘటనపై ఆయన స్పందించారు. తెలంగాణలో లా అండ్ ఆర్డర్ అమలు కావట్లేదని, శాంతి భద్రతలు దిగజారాయని అన్నారు. జూబ్లీహిల్స్ ఘటనపై సీబీఐతో విచారణ జరపించాలని తరుణ్‌చుగ్ డిమాండ్ చేశారు
*ఈసారి 175 సీట్లు సాధించాలి: సీఎం జగన్
గత ఎన్నికల్లో 151 సీట్లు వచ్చాయని…ఈసారి 175 సాధించాలని పార్టీ నేతలకు సీఎం జగన్ సూచించారు. గడపగడపకు వైసీప ప్రభుత్వంపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కుప్పం మున్సిపాలిటీలో గెలుస్తామని ఎవరైనా అనుకున్నామా? అని వ్యాఖ్యానించారు. అలాగే 175కి 175 సీట్లు సాధించాలని సూచించారు. ‘‘ఇది మన లక్ష్యం..పెద్దకష్టం కాదు. ప్రతి ఇంటికీ మేలు జరిగితే మనకు ఇంకేం కావాలి. చరిత్రలో మనం ఒక ముద్ర వేశాం. సంతృప్తికరంగా మంచి చేశామని చెప్పుకోగలుగుతున్నాం. కాలర్ ఎగరేసుకుని ప్రజల్లో తిరగగలుతున్నాం. మనం చేయాల్సింది ప్రజల మద్దతు పొందడమే.’’ అని సీఎం జగన్ వ్యాఖ్యానించారు.
*పోలీస్ ఉన్నతాధికారులు అధికార పార్టీ చేతుల్లో కీలుబొమ్మలు: సోము వీర్రాజు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పోలీసు శాఖపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పోలీస్ శాఖ ఉన్నతాధికారులు అధికార పార్టీ చేతుల్లో కీలుబొమ్మలా మారారని ఆరోపించారు. కొంతమంది ఐఏఎస్, ఐపీఎస్‌లు కొందరి రాజకీయ ప్రయోజనాల కోసం కొమ్ముకాయడం బాధాకరమన్నారు. కోనసీమ ప్రజలు నేడు పోలీసుల కట్టుదిట్టమైన భద్రత నడుమ ఊపిరి తీసుకునే దౌర్భాగ్య పరిస్థితికి కారకులు ఎవరని ప్రశ్నించారు. అల్లర్లకు ఆజ్యం పోసిన వారు స్వేచ్ఛగా బయట తిరుగుతుంటే.. అమాయకులు మాత్రం కేసుల్లో ఇరుక్కుని జైళ్లలో మగ్గుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు పోలీసులతో శత్రుత్వం లేదన్నారు. పోలీసులే తమను రెచ్చగొట్టారని, చట్టానికి విరుద్ధంగా వ్యవహరించారని తెలిపారు. ‘‘పోలీసులు ఆపితే ఆగుతాము. పోలీసు వాహనాలు మోహరించినా ఆగుతాము. ఒక ప్రైవేటు లారీ మా వాహనాలకు అడ్డుగా ఎలా పెడతారు? లారీ డ్రైవర్ తప్పిదం కారణంగా ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? 5 ఏళ్ళు అధికారంలో ఉండే వ్యక్తుల కోసం అధికారులు తొత్తులుగా మారొద్దు. ఫలితంగా మీ భవిష్యత్తును ఇబ్బందుల్లో పెట్టుకోవద్దు’’ అని పోలీసులను ఉద్దేశించి అన్నారు.
*ఆ దమ్ము, ధైర్యం జగన్‌రెడ్డికి ఉందా: ఎం.ఎస్ రాజు
సీఎం జగన్‌రెడ్డి మూడేళ్ల పాలనలో కనీసం ముగ్గురికి కూడా సబ్సిడీ రుణాలు ఇవ్వలేదని టీడీపీ నేత ఎంఎస్ రాజు ఎద్దేవా చేశారు. జగన్ ప్రచార ఆర్భాటాలకు ఖర్చు పెట్టినన్ని డబ్బులు కూడా దళితుల కోసం ఖర్చు చేయలేదన్నారు. వైసీపీ పాలనలో దళితులపై దాడులు పెరిగాయని చెప్పారు. కార్పొరేషన్ రుణాలపై శ్వేతపత్రం విడుదల చేసే దమ్ము, ధైర్యం జగన్‌రెడ్డికి ఉందా? అని టీడీపీ నేత ఎం.ఎస్ రాజు సవాల్ విసిరారు.
*రైతుల పట్ల పవన్ మొసలి కన్నీరు: కాకాని
రైతుల పట్ల జనసేనాని పవన్ కల్యాణ్ మొసలి కన్నీరు కారుస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన రెడ్డి విమర్శించారు. బుధవారం తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. తాము పది రకాల పంటలను చూపిస్తామని, వాటిలో ఐదు రకాల పంటల పేర్లు పవన్ చెబితే చాలన్నారు. అవగాహన లేని వ్యక్తులు కూడా వ్యవసాయం గురించి, రైతుల కష్టాల గురించి మాట్లాడడం సిగ్గుచేటన్నారు. ఆత్మకూరు ఉప ఎన్నికల్లో లక్ష ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నట్టు చెప్పారు.సార్వత్రిక ఎన్నికల్లో కూడా సింగిల్‌గానే పోటీ చేసి 175 సీట్లను గెలుస్తామని గోవర్ధన రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
*హెలీ టూరిజం కూడా అభివృద్ధి చేస్తాం: రోజా
రాష్ట్రంలో క్రూయిజ్ పర్యాటకం మొదలైందని, త్వరలో హెలీ టూరిజం కూడా అభివృద్ధి చేస్తామని పర్యాటక శాఖా మంత్రి ఆర్‌కే రోజా ప్రకటించారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ క్రూయిజ్ ట్రైలర్ మాత్రమేనని త్వరలో పూర్తిస్థాయిలో టెర్మినల్ వస్తుందని, అప్పుడు అంతర్జాతీయ క్రూయిజ్‌లు వస్తాయని వివరించారు. నౌకలో మహిళలకు రక్షణ, వైద్యం వంటి ఏర్పాట్లు బాగున్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కేసినోలకు అనుమతి లేదు కాబట్టి, ఈ నౌక సముద్రంలో అంతర్జాతీయ జలాల్లోకి వెళ్లిన తరువాత మాత్రమే కేసినోలు తెరుస్తారని వివరించారు. ఈ క్రూయిజ్ నౌక రాక గురించి ఏపీటీడీసీకి సమాచారం లేదనే విషయం తనకు తెలియదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రుషికొండపై పర్యాటక అభివృద్ధిని ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని, ప్రతి దానిపై కోర్టులకు వెళ్లి కేసులు వేస్తున్నాయని రోజా ఆరోపించారు.
*సోమువీర్రాజుపై కేసు నమోదు చేయడం అన్యాయం: జీవీఎల్సో
మువీర్రాజుపై కేసు నమోదు చేయడం అన్యాయమని ఎంపీ జీవీఎల్ అన్నారు. కోనసీమలో కార్యకర్త ఇంటికి సోమువీర్రాజు వెళ్లడమే నేరమా? అని ఆయన ప్రశ్నించారు. సోమువీర్రాజును అడ్డుకోవడం అప్రజాస్వామికమన్నారు. వైసీపీ ప్రభుత్వ చర్యలను ఖండిస్తున్నామన్నారు. మా రాజకీయ కార్యక్రమాలను ప్రభుత్వం ఎలా నిరోధిస్తుంది? అని జీవీఎల్ ప్రశ్నించారు.
*జగన్‌ను బీజేపీయే తొలగించి రాష్ట్రాన్ని నడిపే రోజులొస్తున్నాయి: సత్యకుమార్
‘పనితీరు బాగులేదనో, తన వర్గంలో అతడు పనికి రాని వాడనో సీఎం జగన్ తీసేసిన మంత్రుల్లో ఒకరైన పేర్ని నాని కేంద్రాన్ని విమర్శించడం ఆశ్చర్యంగా ఉంది. నిజానికి పనితీరు పేరిట తీసేయాల్సి వస్తే అసమర్థ, అస్తవ్యస్థ పాలనను అందిస్తున్న జగన్మోహన్ రెడ్డే తనను తాను స్వయంగా తొలగించుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీయే చివరకు జగన్‌ను తొలగించి సరైన దిశలో రాష్ర్టాన్ని నడిపించే రోజులు ఆసన్నమవుతున్నాయి’ అని బీజేపీ జాతీయ కార్యదర్శి వై.సత్యకుమార్ సంచలన ప్రకటన చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన ఢిల్లీలో ఓ ప్రకటన విడుదల చేశారు. కేంద్రం ఆదుకోకపోతే పూటగడవని పరిస్థితి ఏపీలో ఉన్న మాట నిజం కాదా అని నిలదీశారు.
*వివేకాను హత్య చేసి అవినాశ్ ఇంటికి వెళ్లారు: బీటెక్ రవి
ఎమ్మెల్సీ బీటెక్ రవి మాట్లాడుతూ తమకున్న సమాచారం మేరకు మాజీ మంత్రి వివేకానందరెడ్డిని హత్య చేసిన నలుగురు నిందితులూ గోడ దూకి 300 నుంచి 400 అడుగుల దూరంలో ఉన్న ఎంపీ అవినాశ్‌రెడ్డి ఇంటికి వెళ్లారన్నారు. ఆ కేసు విచారణ చేస్తున్న సీబీఐ బృందం అప్పట్లో గూగుల్ మ్యాప్ ద్వారా గుర్తించి, ఇప్పుడు సైంటిఫిక్ ఎవిడెన్స్ కోసం సర్వే చేస్తున్నట్లు తెలిపారు. వివేకా హత్య తరువాత డ్రైవర్ దస్తగిరి రాజారెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన బంధువు దగ్గరకు వెళ్లి పడుకున్నారని, ఉదయం 5.30 గంటలకు మిగతా నలుగురు వచ్చి దస్తగిరిని తీసుకెళ్లినట్లు తమకు సమాచారం ఉందని తెలిపారు. వివేకా పీఏ ఇనాయతుల్లా మూడు రోజులుగా సీబీఐ అధికారుల వద్ద ఉన్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు తధ్యమన్నారు. సమావేశంలో టీడీపీ నేతలు శ్రీనివాసరెడ్డి, లింగారెడ్డి, పుత్తా నరసింహారెడ్డి, పుట్టా సుధాకర్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
*విద్యా వ్యవస్థ సర్వనాశనం: బొండా ఉమ
జగన్ ప్రభుత్వంలో విద్యా వ్యవస్థ సర్వనాశనం అయిందనడానికి పదో తరగతి పరీక్ష ఫలితాలే నిదర్శనమని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు చెప్పారు. విజయవాడలో బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ అమ్మఒడి పథకానికి అర్హత లేకుండా చేయడానికే విద్యార్థులను ప్రభుత్వం ఫైయిల్ చేసిందన్నారు. ఫలితాలపై సమగ్ర విచారణ జరిపించి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
*3వేల ట్రాక్టర్లకు ఇంత బిల్డప్పా!: సోమిరెడ్డి
‘అధికారంలోకి వచ్చిన మూడేళ్ల తర్వాత రైతులకు సబ్సిడీపై బోడి మూడు వేల ట్రాక్టర్లు ఇచ్చి.. ప్రపంచంలో ఇంతవరూ ఎవరూ ఇవ్వనట్లుగా ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి కోట్ల రూపాయల ఖర్చుతో పత్రికా ప్రకటనలిచ్చి ఆర్భాటం చేశారు. మేం టీడీపీ ప్రభుత్వంలో కేవలం రెండేళ్లలో రైతులకు సబ్సిడీపై 23 వేల ట్రాక్టర్లు ఇచ్చాం. మేం ఇలా ప్రదర్శన పెడితే రోడ్లు సరిపోయేవి కావు’ అని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి, టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. బుధవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. అధికారిక లెక్కల ప్రకారమే గడచిన రెండేళ్లలో వ్యవసాయ యంత్ర పరికరాలు ఒక్కటంటే ఒక్కటి కూడా రైతులకు ఇవ్వలేదని ఆయన పేర్కొన్నారు. కాగా, సీఎంకు రాజకీయ భిక్షపెట్టిన కడప జిల్లాలో భూ కబ్జాలు, శాండ్ మాఫియాలు రాజ్యమేలుతున్నాయని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆరోపించారు. బద్వేలులో 2 వేల ఎకరాల భూములు కబ్జాలు చేశారన్నారు. ప్రజలకు కాపలాగా ఉండాల్సిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ప్రజల భూములను ధారాదత్తం చేశారని, అలాంటి వారిని ఉరి తీయాలన్నారు.
*ఎంపీ నిధులను మంజూరు చేసిన raghurama krishnam raju
ఎంపీ నిధులను రఘురామకృష్ణరాజు మంజూరు చేశారు. భీమవరం పీఎస్‌ఎన్ కాలేజీ అభివృద్ధికి రూ.25 లక్షల నిధులు మంజూరు చేశారు. శ్రీకృష్ణదేవరాయ సాంస్కృతిక భవన అభివృద్ధికి రూ.25 లక్షలు, పాలకోడేరు మండలం మోగల్లులో శ్మశానవాటిక అభివృద్ధికి రూ.10 లక్షల ఎంపీ నిధులు మంజూరు చేశారు.
*టీడీపీ అధికారంలోకి వస్తే ఏడాదిలోపే ప్రాజెక్ట్‌ల పూర్తి: కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి
జగన్ ప్రభుత్వంపై టీడీపీ నాయకులు విరుచుకుపడ్డాడు. జగన్ మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్ర అభివృద్ధి పూర్తిగా పడకేసిందని ఆరోపించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే సంవత్సరంలోపే వేదావతి, గుండ్రేవుల, ఆర్డీఎస్ ప్రాజెక్ట్‌లను పూర్తి చేస్తామని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తెలిపారు. కర్నూలులో ఆయన మీడియాతో మాట్లాడారు. నిరుద్యోగులను మోసం చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుందని విమర్శించారు. టీడీపీ నంద్యాల పార్లమెంట్ అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి మాట్లాడుతూ.. సున్న వడ్డీ పథకం పేరుతో మహిళలను మోసం చేస్తున్నాడని, నిత్యావసరాల ధరలు పెరగడంతో సామాన్యుడు బతకలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ మోహన్ రెడ్డి కేసీఆర్‌తో కుమ్మక్కై ఏపీ ప్రజలను మోసం చేస్తున్నాడని ఎమ్మెల్సీ ఎన్ఎండీ షారుఖ్ ఆరోపించారు. పట్టిసీమ ద్వారా ఆంధ్ర ప్రాంతానికి సాగునీరిచ్చి, శ్రీశైలం మిగులు జలాలను రాయలసీమకు అందించాలన్నది చంద్రబాబు లక్ష్యమని తెలిపారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు సోమశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. టీడీపీ ఎంతో క్రమశిక్షణ గల పార్టీ అని, కోడుమూరు నియోజకవర్గంలో పార్టీ నాయకులు గ్రూప్ రాజకీయాలు మానుకోవాలి పార్టీ కార్యకర్తలకు సూచించారు.
*బండారు సత్యనారాయణకు భయం పట్టుకుంది: పేర్ని నాని
ప్రభుత్వ పధకాలను ప్రతీ ఇంటికి తీసుకెళ్ళడం గడపగడప కార్యక్రమ లక్ష్యమని మాజీమంత్రి పేర్ని నాని ప్రకటించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ స్ధానికంగా ఉండే సమస్యలను అక్కడికక్కడే పరిష్కారిస్తున్నామని తెలిపారు. సచివాలయ పరిధిలోని అన్ని ఇళ్ళకూ మూడు రోజుల్లో వెళుతున్నామన్నారు. ఎమ్మెల్యే, మంత్రుల పనితీరు పరిశీలిస్తామని తెలిపారు. మాజీమంత్రి బండారు సత్యనారాయణకు భయం పట్టుకుందని ఎద్దేవాచేశారు. దొడ్డి దారిన వచ్చిన ప్రజాప్రతినిధులకే భయం పట్టుకుందని పేర్ని నాని అన్నారు.