Politics

వ్యవసాయ బడ్జెట్‌ కేటాయింపులు బయటపెట్టాలి – TNI రాజకీయ వార్తలు

వ్యవసాయ బడ్జెట్‌ కేటాయింపులు బయటపెట్టాలి   – TNI రాజకీయ వార్తలు

* వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్థన్ రెడ్డికి దమ్ముంటే మూడేళ్లలో వ్యవసాయ బడ్జెట్‌లో లక్షా 10వేల కోట్లు ఖర్చు చేసినట్లు నిరూపించాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సవాల్ విసిరారు. రైతుల కోసం వ్యవసాయ బడ్జెట్ ఎంత కేటాయించారు? ఎంత ఖర్చు పెట్టారో సమాధానం చెప్పాలన్నారు. వ్యవసాయ బడ్జెట్ కేటాయింపులు ప్రకటిస్తే తాను చర్చకు సిద్ధమన్నారు. రూ.43వేల కోట్ల ధాన్యం కొనుగోళ్లు కూడా రైతుల కోసం పెట్టిన ఖర్చుగా చూపడం సిగ్గుచేటన్నారు. వ్యవసాయ మోటర్లకు మీటర్ల బిగింపు అమ్మఒడి పథకం తరహాలో మరో మోసమని, తొలుత మీటర్లు అని తర్వాత ఆంక్షల పేరుతో రైతుల్నిమోసగించే కుట్ర దాగి ఉందన్నారు.

*కోనసీమ క్రాప్ హాలీడే పాపం వైసీపీదే: Pawan
కోనసీమ క్రాప్ హాలిడే పాపం వైసీపీ దే అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. రైతాంగం పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే పంట విరామ నిర్ణయం తీసుకున్నారని మండిపడ్డారు. ధాన్యం అమ్మిన రైతులకు సకాలంలో డబ్బులు చెల్లించరని… దాదాపు రూ.475 కోట్ల బకాయిలు ఉన్నాయని తెలిపారు. రైతుల క్రాప్ హాలీడే ప్రకటనతో రాత్రికి రాత్రే..వారి ఖాతాల్లో రూ.139కోట్లు జమ చేస్తున్నట్లు ప్రకటించారని తెలిపారు.క్రాప్ హాలీడే ప్రకటించిన మండలాల్లో సాగు నీరు అందుబాటులో అనేక ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు. రైతులపై వైసీపీ నేతలవి చౌకబారు విమర్శలన్నారు. ఏ సమస్య వచ్చినా రాజకీయ కోణంలో చూడడం తప్ప వైసీపీ నేతలకు సమస్యను పరిష్కరించే మనస్తత్వం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోనసీమ రైతులకు జనసేన అండగా ఉంటుందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

*గౌతు శిరీషకు మళ్లీ సిఐడీ నోటీసులు
టీడీపీ రాష్ట్ర నాయకురాలు గౌతు శిరీషకు సిఐడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఐటీ చట్టం కింద నమోదు చేసిన కేసులో ఈ నెల 20వ తేదీ ఉదయం 10 గంటలకు గుంటూరు సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో హాజరు కావాలని నోటీసులో పేర్కొంది. ఇప్పటికే ఒకసారి గౌతు శిరీష మంగళగిరిలోని సిఐడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. తాము రాసిన దానిపై సంతకం పెట్టాలని కోరడంతో శిరీష తిరస్కరించారు. వాట్సాప్‌ మెసేజ్‌ను లోకేష్‌, అచ్చెనాయుడు చెబితే ఫార్వర్డ్‌ చేశామని చెప్పాల్సిందిగా ఒత్తిడి తెచ్చారని శిరీష ఆరోపించారు. కనీసం లాయర్‌తో మాట్లాడుకునేందుకు కూడా అవకాశం ఇవ్వలేదని… ఫోన్‌ తీసుకున్నారని శిరీష తెలిపింది.

*TDP Zoom Meetingలో వైసీపీ వాళ్లు దొంగల్లా దూరారు: చంద్రబాబు
టీడీపీ జూమ్‌ మీటింగ్‌ లో వైసీపీ వాళ్లు దొంగల్లా దూరారని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టెన్త్‌ ఫెయిలైన విద్యార్థులకు భరోసా ఇస్తుంటే వైసీపీ నేతలు వెకిలి చేష్టలు చేస్తున్నారని మండిపడ్డారు. దీన్ని ఏ2 సమర్థిస్తాడా? అని ప్రశ్నించారు. ఏ2 విజయసాయిరెడ్డికి ఎవ్వరూ భయపడరన్నారు. నేరస్తులకు నేరాలోచనలే వస్తాయని, వ్యవస్థలను నాశనం చేసి రౌడీయిజం చేస్తారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. సాగును నాశనం చేశారు కాబట్టే రైతులు క్రాప్ హాలీడే ప్రకటించారని తప్పుబట్టారు. సీఎం జగన్‌ది ఐరన్ లెగ్ అని విమర్శించారు. జగన్ ఓ దరిద్రం.. ఏపీకి పట్టిన అరిష్టం అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

*Mangalagiri నియోజకవర్గంలో ఆ అధికారిణి దారుణాలు..: MS Raju
మంగళగిరి నియోజకవర్గంలో ఆ అధికారిణి దారుణాలు అంతింత కాదని టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎంఎస్ రాజు ట్విట్టర్ వేదికగా ఆరోపించారు. తాడేపల్లి కార్పొరేషన్ అడిషనల్ కమిషనర్ హేమ మాలిని రెడ్డి స్థానిక ఎమ్మెల్యే ఆర్కేతో కుమ్మక్కై మూడేళ్లుగా ఒకే చోట పోస్టింగ్ వేయించుకుని, ఎమ్మెల్యేకు రైట్ హ్యాండ్‌గా మారి పేదల ఇళ్లు కూల్చడం, పేదల నోటి దగ్గర కూడు లాక్కోవడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. పేదల ఇళ్లు, అన్న క్యాంటీన్లు కూల్చే ఆమెకి నియోజకవర్గంలో వైసీపీ నాయకులు చెరువులను సైతం కబ్జా చేసి భవనాలు కడుతున్నా కనపడకపోవడం వింతేనన్నారు. స్థానిక ఎమ్మెల్యేతో కలిసి ఆమె చేస్తున్న అవినీతికి అంతే లేదన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత హేమ మాలిని రెడ్డి అక్రమాస్తులపై విచారణ చేయడం, వాటిని ఇదే జేసీబీతో కూల్చడం ఖాయమని ఎంఎస్ రాజు ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

*మహిళా సాధికారతపై బీజేపీ తప్పుడు ప్రచారాలు మానుకోవాలి: Kavitha
మహిళా సాధికారత పట్ల బీజేపీ నేతల ప్రచారంపై ఎమ్మెల్సీ కవిత కౌంటర్ ఇచ్చారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ… మహిళా సాధికారతపై బీజేపీ తప్పుడు ప్రచారాలు మానుకోవాలన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం వాస్తవాలను దాచేస్తున్నారని మండిపడ్డారు. ధరల నియంత్రణలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందన్నారు. అంగన్వాడీలకు 50 శాతం బడ్జెట్ను తగ్గించింది బీజేపీ ప్రభుత్వమని కవిత వ్యాఖ్యానించారు.

*జూమ్‌లో ప్రత్యక్షం ఆరంభం మాత్రమే : విజయసాయిరెడ్డి
ఏపీలో ఇటీవల ప్రకటించిన పదో తరగతి పరీక్షల ఫలితాలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ నిర్వహించిన జూమ్‌లో వైసీపీ నాయకుల ప్రత్యక్షం ఆరంభం మాత్రమేనని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వంపై అనవసరంగా ఆరోపణలు చేస్తే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతాయని తెలిపారు. టీడీపీ నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.విద్యావవస్థపై చర్చకు లోకేశ్‌ విసిరిన సవాల్‌ను స్వీకరిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. దీనిపై వైసీపీ నాయకులు ఎవరైనా, ఎప్పుడైనా చర్చకు సిద్దమేనని పేర్కొన్నారు. విద్యార్థుల ఫెయిల్‌తో ప్రభుత్వానికి సంబంధం లేదని ఆయన వెల్లడించారు. ఆత్మకూరులో టీడీపీ ఎందుకు పోటీ చేయడం లేదని ప్రశ్నించారు. టీడీపీ పోటీ చేసి ఆ ఫలితాలనే రెఫరెండంగా తీసుకోవాలని ప్రతి సవాల్‌ విసిరారు.

*ఏపీ ప్రభుత్వ తీరుపై మరోసారి విరుచుకుపడ్డ పవన్‌
జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఏపీ ప్రభుత్వ తీరుపై మరోసారి విరుచుకుపడ్డారు. అధికారంలో ఉన్న మంత్రుల వ్యాఖ్యలు, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే అన్నపూర్ణ లాంటి కోనసీమలో క్రాప్‌ హాలీడే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. రైతులు తమ గోడును వెల్లబుచ్చుకుంటుంటే వైసీపీ నాయకులు రైతులపైనే విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు. టెన్త్‌లో విద్యార్థులు ఫెయిల్‌ అయితే తల్లిదండ్రుల మార్గనిర్దేశం సరిగా లేదని ఆరోపించడం బాధకరమని అన్నారు.

*కోరుట్లలో డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌
మంత్రి కేటీఆర్‌ ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో పర్యటిస్తున్నారు. జగిత్యాల జిల్లాలోని కోరుట్ల నియోజకవర్గం మెట్‌పల్లిలో నిర్మించిన 110 డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను ప్రారంభించారు. లబ్ధిదారులతో గృహ ప్రవేశం చేయించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొప్పుల ఈశ్వర్, వేముల ప్రశాంత్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్, ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు పాల్గొన్నారు. అనంతరం మెట్‌పల్లిలో ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించనున్నారు. అనంతరం మంత్రి కేటీఆర్‌ రాజన్న సిరిసిల్లకు చేరుకుంటారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు

*ఉద్యమ నినాదానికి అనుగుణంగా పనిచేస్తున్నాం: మంత్రి కేటీఆర్‌
అన్ని రాష్ట్రాల వారికి పనికల్పిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి కేటీఆర్‌ అన్నారు. చదువు ఎప్పుడూ వృథా కాదని, కష్టపడి చదివితే ఉద్యోగం సాధించడం సులువేనని చెప్పారు. భారతదేశం అతిపెద్ద శక్తి యువతరం అని పేర్కొన్నారు. జగిత్యాల జిల్లాలోని కోరుట్లలో నిరుద్యోగ యువతకోసం ఏర్పాటు చేసిన ఉచిత కోచింగ్‌ సెంటర్‌ను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటు జరిగిందే నీళ్లు, నిధులు, నియామకాల కోసమన్నారు. ఉద్యమ నినాదానికి అనుగుణంగా ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు.

*కేసీఆర్ డౌన్ ఫాల్ మొదలైంది: Bandi sanjay
సీఎం కేసీఆర్ డౌన్ ఫాల్ మెదలైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్అ న్నారు. శుక్రవారం ఉదయం ఆర్టీసీ ఛార్జీల పెంపుపై జేబీఎస్‌లో ప్రయాణికులతో ముఖాముఖి నిర్వహించేందుకు బండిసంజయ్ బంజారాహిల్స్ నుంచి జేబీఎస్‌కు బయలుదేరారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఎందుకు హౌస్ అరెస్ట్ చేస్తున్నారో అర్థం కాలేదన్నారు. రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టిస్తున్నారని… అరెస్ట్‌లు, జైళ్లకు భయపడమని స్పష్టం చేశారు. ఆర్టీసీ చార్జీలు పెంచితే ప్రశ్నించకూడదా? అని నిలదీశారు. అర్ధరాత్రి జిట్టాను అరెస్ట్ చేయటాన్ని ఖండిస్తున్నానన్నారు. ఉద్యమకారులను అరిగోసా పెడుతున్నారని, ద్రోహులను సంకన వేసుకొని తిరుగుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని అన్నారు. ఆర్టీసీ ప్రయాణీకులతో మట్లాడేందుకే జూబ్లీ బస్టాండుకు వెళ్తున్నట్లు బండి సంజయ్ తెలిపారు.

*చంద్రబాబుకు, బాలకృష్ణకు వారసులున్నారు.. మరి జగన్‌కు?: Farooq
టీడీపీ అధినేత చంద్రబాబు కు వయస్సు అయిపోయిందంటూ సీఎం జగన్ మోహన్ రెడ్డి మాట్లాడటం మంచి పద్ధతి కాదని ఎమ్మెల్సీ ఫరూక్అ న్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ… చంద్రబాబు, బాలకృష్ణకు వారసులున్నారని.. జగన్‌కు వారసుడు ఎవరూ లేరన్నారు. టీడీపీకి 65 లక్షల కార్యకర్తలు, ఎన్టీఆర్, బాలయ్య అభిమానులు ఉన్నారని తెలిపారు. జగన్ ఇలాంటి వ్యాఖ్యలు చేసేముందు ఆలోచించుకోవాలని ఫరూక్ హితవుపలికారు.

*మంగళగిరిలో అన్న క్యాంటీన్ తెరుస్తాం: లోకేష్
మంగగళగిరి ఎన్టీఆర్ విగ్రహం వద్ద టీడీపీ ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని మున్సిపల్ అధికారులు తొలగించడాన్ని టీడీపీ నేత నారా లోకేష్ తీవ్రంగా ఖండించారు. రోజూ త్రాగునీరు, మజ్జిగ అందిస్తూ వందలాది మంది దాహార్తిని తీరుస్తున్న చలివేంద్రాన్ని తొలగించడం స్థానిక ఎమ్మెల్యే ఫ్రస్ట్రేషన్ ని బయటపెట్టిందన్నారు. చలివేంద్రం ఉన్న ప్రదేశంలోనే రేపటి నుండి అన్న క్యాంటీన్ ప్రారంభించాలి అనుకున్నామని తెలిపారు. రోజుకి రూ.2 కే పేదలకు భోజనం అందించాలి కూడా అనుకున్నట్లు తెలిపారు. పేదల నోటి దగ్గర కూడు లాక్కునే వైసీపీ మరోసారి అదే పని చేసిందన్నారు. మున్సిపల్ అధికారులను పంపి దౌర్జన్యం చెయ్యడం దారుణమన్నారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా మంగళగిరిలో అన్న క్యాంటీన్ తెరుస్తాం పేదలకు తక్కువ ధరకే భోజనం అందిస్తామన్నారు.

*సరైన అంచనాలు లేకుండా వరికి మద్దతు ధర రూ.100 పెంచారు..: Somireddy
వరికి కనీస మద్దతు ధర పెంపును స్వాగతిస్తున్నామని టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ సరైన అంచనాలు లేకుండా వరికి రూ.100 పెంచారని విమర్శించారు. మిగతా పంటలదీ అదే పరిస్థితని అన్నారు. కనీస మద్దతు ధర రూ.500 పెంచి ఉంటే.. రైతులకు కొంతైనా ఉరట లభించేదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. కౌలు రైతులైతే ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ రాష్ట్రంలో అయితే రైతుకు మద్దతు ధర లభించదో అక్కడి ప్రభుత్వంపై చర్యలు తీసుకునే పరిస్థితి రావాలని సోమిరెడ్డి అన్నారు.

*ఏం అభివృద్ధి జరిగిందని ప్రజలకు చెబుతారు?: Shailajanath
ఆంధ్రప్రదేశ్‌ లో ఏం అభివృద్ధి జరిగిందని ప్రజలకు చెబుతారని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ గడప దాటని జగన్ రెడ్డి హిత బోధ చేయడమా?.. ఎన్నికలకు రెండేళ్ల ముందే హడావుడి ఎందుకని నిలదీశారు. సామాజిక న్యాయ బస్సు యాత్ర తుస్సుమందని ఎద్దేవా చేశారు. మూడేళ్ళయినా ఒక్క డీఎస్సీ ప్రకటించారా? అని ప్రశ్నించారు. పది పాపం జగన్ రెడ్డి సర్కారుదేనన్నారు. జాబ్ క్యాలెండర్ ప్రకటన సరే… ఉద్యోగాలు ఏవన్నారు. జగన్‌ను ఎప్పుడు సాగనంపుదామా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని శైలజానాథ్ వ్యాఖ్యానించారు.

*వైసీపీ ప్రభుత్వ గూండాగిరిని ఎదుర్కొంటాం: సోము వీర్రాజు
వైసీపీ ప్రభుత్వ గూండాగిరిని దీటుగా ఎదుర్కొంటామని బీజేపీ నేత సోము వీర్రాజు ప్రకటించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అధికారుల అంతు చూస్తానని బెదిరిస్తే ఆయనపై ఎందుకు కేసు పెట్టలేదని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం గూండాగిరిని చెలాయిస్తూ, పోలీసులను ఉసిగొల్పుతోందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని సోము వీర్రాజు తెలిపారు.

*జగన్, బొత్సపై టీడీపీ మాజీ మంత్రి Ayyanna ఫైర్ఏ
పీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణపై టీడీపీ మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు మండిపడ్డారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక విద్యావిధానం సర్వ నాశనమైందని ఆరోపించారు. చంద్రబాబు హయాంలో 2018, 2019లో పదో తరగతి విద్యార్థులు 97%,94% ఉత్తీర్ణత సాధిస్తే…ఇప్పుడు 67 శాతం సాధించడం సిగ్గుచేటని పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా బెండపూడికి చెందిన విద్యార్థిని ఇంగ్లీషులో మాట్లాడితే.. అది తమ ప్రభుత్వ గొప్పదనమని వైసీపీ నాయకులు చెప్పుకున్నారని, అయితే అదే విద్యార్థిని పది ఫెయిల్ అవ్వడంతో విద్యా విధానం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోందన్నారు. 2.70 లక్షల మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారని, వీరికి అమ్మ ఒడి ఇవ్వాల్సి వస్తుందని ఫెయిల్ చేశారా? అని అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. ఫీజు కట్టించుకోకుండా రీ వాల్యువేషన్ చేయాలన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్‌ను తాము సమర్థిస్తున్నామన్నారు. పాఠశాలల్లో నాడు – నేడు పేరుతో రూ.16 వేల కోట్లు ఖర్చు చేశారని, అయితే ఈ పనులన్ని కడపకు చెందిన కాంట్రాక్టర్లే చేశారని తెలిపారు.

*అప్పలరాజుకు చట్టం వర్తించదా?: బీజేపీ
అధికార పార్టీకి చెందిన మంత్రి పోలీసులపై దాడి చేస్తే చట్టం వర్తించదా? ప్రతిపక్ష బీజేపీ అధ్యక్షుడు ప్రశ్నిస్తే మాత్రం కేసులు పెడతారా? అంటూ రాష్ట్ర డీజీపీని బీజేపీ ప్రశ్నించింది. విశాఖలోని ఓ ఆశ్రమం వద్ద సీఐపై దాడికి దిగిన మంత్రి అప్పల్రాజు బూతులు తిట్టారు. పశ్చిమ గోదావరి జిల్లాలో వాహన పార్కింగ్‌ విషయంలో ఇంచార్జి మంత్రిగా ఉన్న పేర్ని నాని పోలీసులపై రంకెలేశారు. డీజీపీ గారూ.. వీరిపై కేసులు పెట్టారా.? అప్పల్రాజు, పేర్ని నానికి ఐపీసీ చట్టాలు వర్తించవా? సోము వీర్రాజుకు మాత్రమే వర్తిస్తాయా? అంటూ బీజేపీ ఈ రెండు ఘటనల వీడియోలుసోషల్‌ మీడియాలో వైరల్‌ చేశారు.

*వైసీపీ ప్రభుత్వ గూండాగిరిని ఎదుర్కొంటాం: సోము
వైసీపీ ప్రభుత్వ గూండాగిరిని దీటుగా ఎదుర్కొంటూ, రాష్ట్ర ప్రభుత్వ చర్యలను బీజేపీ ఎండగడుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని త్రికోటేశ్వర కల్యాణ మండపంలో గురువారం బీజేపీ నేతల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ అమలాపురం పర్యటనలో తనను పోలీసులు అడ్డుకుని కేసు కూడా బనాయించడం ఈ ప్రభుత్వ చేతగాని తనానికి నిదర్శనమన్నారు. ఆత్మకూరు ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థి భరత్‌కుమార్‌ను గెలిపించాలని ప్రజల్ని కోరారు.

*వైసీపీది అధర్మయుద్ధం: చంద్రబాబు
వైసీపీది అధర్మయుద్ధమని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ విలువలున్న పార్టీలా వైసీపీ ఎప్పుడూ పోరాడలేదని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను తూర్పారబట్టాలని టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తప్పుడు ప్రచారాలతో ప్రజలను నమ్మించడమే వైసీపీ సిద్ధాంతమన్నారు. నాడు అధికారం కోసం తప్పుడు ఆరోపణలు, అసత్య ప్రచారాలు చేశారాని దుయ్యబట్టారు. ఇప్పుడూ అదే పంథాలో వైసీపీ వెళ్తోందని మండిపడ్డారు. వైసీపీ సర్కార్ వైఫల్యాలపై మీడియా, సోషల్‌ మీడియాలో విస్తృత ప్రచారం చేయాలన్నారు. ఫేక్ పోస్టులతో వైసీపీ గందరగోళం సృష్టిస్తోందని చంద్రబాబు మండిపడ్డారు

*జగన్, బొత్సపై టీడీపీ మాజీ మంత్రి Ayyanna ఫైర్
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణపై టీడీపీ మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు మండిపడ్డారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక విద్యావిధానం సర్వ నాశనమైందని ఆరోపించారు. చంద్రబాబు హయాంలో 2018, 2019లో పదో తరగతి విద్యార్థులు 97%,94% ఉత్తీర్ణత సాధిస్తే…ఇప్పుడు 67 శాతం సాధించడం సిగ్గుచేటని పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా బెండపూడికి చెందిన విద్యార్థిని ఇంగ్లీషులో మాట్లాడితే.. అది తమ ప్రభుత్వ గొప్పదనమని వైసీపీ నాయకులు చెప్పుకున్నారని, అయితే అదే విద్యార్థిని పది ఫెయిల్ అవ్వడంతో విద్యా విధానం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోందన్నారు. 2.70 లక్షల మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారని, వీరికి అమ్మ ఒడి ఇవ్వాల్సి వస్తుందని ఫెయిల్ చేశారా? అని అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. ఫీజు కట్టించుకోకుండా రీ వాల్యువేషన్ చేయాలన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్‌ను తాము సమర్థిస్తున్నామన్నారు. పాఠశాలల్లో నాడు – నేడు పేరుతో రూ.16 వేల కోట్లు ఖర్చు చేశారని, అయితే ఈ పనులన్ని కడపకు చెందిన కాంట్రాక్టర్లే చేశారని తెలిపారు.

*మంగళగిరిలో అన్న క్యాంటీన్ తెరుస్తాం: లోకేష్
మంగగళగిరి ఎన్టీఆర్ విగ్రహం వద్ద టీడీపీ ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని మున్సిపల్ అధికారులు తొలగించడాన్ని టీడీపీ నేత నారా లోకేష్ తీవ్రంగా ఖండించారు. రోజూ త్రాగునీరు, మజ్జిగ అందిస్తూ వందలాది మంది దాహార్తిని తీరుస్తున్న చలివేంద్రాన్ని తొలగించడం స్థానిక ఎమ్మెల్యే ఫ్రస్ట్రేషన్ ని బయటపెట్టిందన్నారు. చలివేంద్రం ఉన్న ప్రదేశంలోనే రేపటి నుండి అన్న క్యాంటీన్ ప్రారంభించాలి అనుకున్నామని తెలిపారు. రోజుకి రూ.2 కే పేదలకు భోజనం అందించాలి కూడా అనుకున్నట్లు తెలిపారు. పేదల నోటి దగ్గర కూడు లాక్కునే వైసీపీ మరోసారి అదే పని చేసిందన్నారు. మున్సిపల్ అధికారులను పంపి దౌర్జన్యం చెయ్యడం దారుణమన్నారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా మంగళగిరిలో అన్న క్యాంటీన్ తెరుస్తాం పేదలకు తక్కువ ధరకే భోజనం అందిస్తామన్నారు.