రెండు రాజకీయ పార్టీల మధ్య గొడవలు పెట్టేందుకే వైకాపా నాయకులు.. లోకేష్ జూమ్ మీటింగ్‌లోకి వచ్చారంటూ సీఐడీ అదనపు డీజీపీకి తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు. వైకాపా నేతలపై మోసం, నేరపూరిత కుట్ర సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడంతో పాటు త్వరగా విచారించి దోషులకు శిక్షపడేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రెండు రాజకీయ పార్టీల మధ్య గొడవలు పెట్టేందుకు వైకాపా నాయకులు ప్రయత్నించారని సీఐడీ అదనపు డీజీపీకి తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు. ఆహ్వానం లేకుండానే లోకేశ్ జూమ్ మీటింగ్‌లోకి వైకాపా నేతలు చొరబడ్డారని ఫిర్యాదు చేశారు. తప్పుడు పేర్లతో మీటింగ్‌లోకి ప్రవేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు. వైకాపా నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీ, దేవేంద్ర రెడ్డి, రజనీ మీటింగ్‌లోకి అక్రమంగా చొరబడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వైకాపా నేతలపై మోసం, నేరపూరిత కుట్ర సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలన్నారు.