పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్ శుక్రవారం కన్నుమూశారు. దుబాయ్‌లో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన 2001 నుంచి 2008 వరకు పాకిస్థాన్ అధ్యక్షునిగా సేవలందించారు. అభిశంసనను తప్పించుకోవడం కోసం ఆయన తన పదవికి రాజీనామా చేశారు. 1943 ఆగస్టు 11న ఢిల్లీలో జన్మించిన ముషారఫ్ పాకిస్థాన్ ఆర్మీ చీఫ్‌గా పని చేశారు. 1999లో నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని ఫెడరల్ ప్రభుత్వాన్ని కూల్చేసి సైనిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కార్గిల్ యుద్దానికి ప్రధాన కారకుడు ఆయనే. పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్‌పై క్రిమినల్ చర్యలు చేపట్టారు. ముషారఫ్‌ను మిలిటరీ చీఫ్‌గా చేసిన నేత నవాజ్ షరీఫ్ కావడం గమనార్హం.