చంద్రముఖి సినిమాలో సూపర్ స్టార్ రజినీకాంత్‌తో కలిసి సిల్వర్ స్క్రీన్‌పై మెరిసి..తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది కేరళ సోయగం నయనతార. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ వన్ ఆఫ్ ది లీడింగ్ హీరోయిన్గా నిలిచింది. ఓ వైపు గ్లామర్ రోల్స్, మరోవైపు పర్ ఫార్మెన్స్ ఓరియెంట్ రోల్స్ చేస్తూ లేడీ సూపర్ స్టార్ స్టేటస్‌ను సొంతం చేసుకుంది. ఈ భామ తన ప్రియుడు విఘ్నేశ్ శివన్‌ను పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది.నయనతార ఇక యాక్టింగ్‌కు ఫుల్ స్టాప్ పెట్టనుందా..? అనే వార్తలపై స్పందిస్తూ తాను కొత్త సినిమాలకు సంతకం చేయడం ఆపనని చెప్పేసింది. ప్రస్తుతం షారుక్ ఖాన్‌తో జవాన్ , చిరంజీవితో గాడ్ ఫాదర్ చిత్రాలు చేస్తోంది నయన్. ఈ రెండు సినిమాలు విడుదలైన తర్వాత..ఇప్పటివరకు ఓ లెక్క..ఇప్పటి నుంచి ఓ లెక్క అనే డైలాగ్ అప్లై చేయబోతుందట నయన్.ఇంతకీ విషయమేంటంటే..ఇప్పటివరకు గ్లామరస్, రొమాంటిక్ టచ్ ఉన్న సినిమాలలో సిల్వర్ స్క్రీన్‌పై మెరిసిన నయన్ ఇక నుంచి అలాంటి పాత్రల్లో కనిపించడం కష్టమేనని టాక్ ఇపుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయింది. ఇండస్ట్రీ సర్కిల్లో నడుస్తున్న టాక్ ప్రకారం నయనతార ఇకపై రొమాంటిక్ సినిమాలు చేయబోదని, కంటెంట్ ఓరియెంటెడ్తోపాటు ఫీ మేల్ సెంట్రిక్ కథాంశాల్లోనే కనిపించనుందట.
అంతేకాదు తన భర్త విఘ్నేశ్ శివన్‌తో కలిసి సినిమాలను నిర్మించే పనిపై కూడా ఫోకస్ పెట్టబోతుందని ఇన్ సైడ్ టాక్. మొత్తానికి సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా ప్రొఫెషనల్ కెరీర్ విషయంలో ఏ మాత్రం తగ్గబోనని చెప్పకనే చెబుతోందంటున్నారు సినీ జనాలు.