హిట్‌లతో సంబంధం లేకుండా విభిన్న పాత్రలను పోషించే బాలీవుడ్ నటి రాధికా ఆప్టే. ‘పార్చ్‌డ్’, ‘సేక్రెడ్ గేమ్స్’ , ‘గౌల్’వంటి తదితర సినిమాల్లో నటించింది. ప్రస్తుతం విక్రాంత్ మెస్సీ సరసన ‘ఫోరెన్సిక్’ చిత్రంలో కనిపించనుంది. ఈ మూవీ త్వరలోనే విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆసక్తికర కబుర్లను అభిమానులతో పంచుకుంది. సినిమా ఇండస్ట్రీలోని చాలా మంది తనను అనేక సార్లు సర్జరీలు చేయించుకోమని చెప్పారని ఈ సందర్భంగా వివరించింది. రాధికా ఆప్టే గతాన్ని గుర్తుకు చేసుకుని మనసులోని మాటలను అభిమానులతో పంచుకుంది. ‘‘సినిమా ఇండస్ట్రీకి నేను అప్పుడే ఎంట్రీ ఇచ్చాను. శరీరంలోని పలు భాగాలకు సర్జరీలు చేయించుకోమని చాలా మంది సలహా ఇచ్చారు. మొదటిసారి ఓ సమావేశానికి వెళ్లినప్పుడు నా ముక్కును మార్చుకోమన్నారు. రెండో సారి వక్షోజాలకు సర్జరీ చేయించుకోమన్నారు. మరోసారి నా కాళ్లను మార్చుకోమన్నారు. ఇటువంటి అనుభవాలు చాలా సార్లు ఎదురయ్యాయి. ప్రతిసారి శరీరంలోని ఏదో ఒక భాగానికి బొటాక్స్ ఇంజక్షన్ చేయించుకోమనేవారు. కానీ, నేను ఎవరి మాటలను వినలేదు. ఒక్క ఇంజక్షన్ కూడా తీసుకోలేదు. నిజం చెప్పాలంటే వారందరి మీద నాకు కోపం వచ్చింది. అందరు ఈ విధంగా అనడంతో నా బాడీని ఎక్కువగా ప్రేమించడం మొదలుపెట్టాను’’ అని రాధికా ఆప్టే తెలిపింది. ఇక కెరీర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం రాధికా ఆప్టే ‘ఫోరెన్సిక్’లో నటించింది. ఈ సినిమా జీ-5 ఓటీటీ ప్లాట్‌ఫాంలో విడుదల కానుంది. జూన్ 24నుంచి ప్రేక్షకులందరికి అందుబాటులో ఉండనుంది. ‘మోనికా’, ‘ఓ మై డార్లింగ్’, ‘మేడ్ ఇన్ హెవెన్- 2’ వంటి ప్రాజెక్టులు కూడా ఆమె చేతిలో ఉన్నాయి.