ప్రముఖ సినీ నటి నయనతార, దర్శకుడు విఘ్నేశ్ శివన్ జంట శుక్రవారం తిరుమలలోని శ్రీవారిని దర్శించుకుని, స్వామివారి కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వీరికి ఆశీర్వవచనాలు, తీర్థ ప్రసాదాలు అందజేశారు. నిన్న తమిళనాడులోని మహాబలిపురంలో హిందూసంప్రాదాయంగా మూడుముళ్లతో ఒక్కటైన ఈ జంట శ్రీవారి సన్నిధిలోకి వచ్చిన సందర్భంగా ఈ జంటను చూసేందుకు ఆలయ ఆవరణలోకి భక్తులు భారీగా తరలివచ్చారు.