DailyDose

కడియం నర్సరీలకు రతన్‌ టాటా ప్రశంసలు

కడియం నర్సరీలకు రతన్‌ టాటా ప్రశంసలు

కడియం విశిష్టతలు ఎల్లలు దాటుతున్నాయ్‌. గతంలో ముకేశ్‌ అంబానీ సైతం పెద్ద ట్రక్కుల్లో ఇక్కడి నుంచి చెట్లను తీసుకెళ్లడం అప్పట్లో సంచలనంగా మారింది, ఇప్పుడు ఈ జాబితాలో మరో పారి‍శ్రామికవేత్త రతన్‌ టాటా చేరారు. దేశవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన కడియం నర్సరీలను టాటా గ్రూప్ సంస్థ చైర్మన్ రతన్ టాటా ప్రశంసలు అందించారు. కడియం గౌతమీ నర్సరీ అధినేత వీరబాబు మార్గాని కుటుంబ సభ్యులు ముంబైలోని రతన్ టాటా స్వగృహంలో కలిశారు. ఈ విషయం ఇప్పుడు సోషల్‌ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది.
g8
lool emoticons
మర్గానిక కుటుంబ సభ్యులు కడియం నర్సరీలు విశిష్టతను రతన్‌టాటాకు వివరించారు. నాణ్యమైన మొక్కలు ఉత్పత్తి చేస్తూ విశ్వవ్యాప్తంగా కడియం రైతులు గుర్తింపు పొందడాన్ని ఆయన అభినందించారు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం ద్వారా విశేష గుర్తింపు పొందిన రతన్ టాటా కలవడం ఎంతో ఆనందంగా ఉందని వీరబాబు కుటుంబ సభ్యులు తెలిపారు.