న్యూజెర్సీ రాష్ట్రంలోని(అమెరికా) ఓ భారతీయ నగల దుకాణంలో తాజాగా భారీ చోరీ జరిగింది. మిడిల్సెక్స్ కౌంటీలోని ఓక్ట్రీ రోడ్లో గల వీరానీ జ్యువెలర్స్‌లో దొంగలు దోపిడీకి పాల్పడ్డారు. దాదాపు పది మంది ఈ చోరీకి పాల్పడి ఉంటారని సమాచారం. ఘటనకు సంబంధించిన దృశ్యాలన్నీ షోరూంలోని సీసీకెమెరాల్లో రికార్డయ్యాయి. సినీఫక్కీలో గన్స్‌తో దుకాణంలోకి చొరబడ్డ దుండగులు.. సిబ్బందిని బెదిరించి భారీ మొత్తంలో నగలు, నగదును ఎత్తుకెళ్లిపోయారు. దోపిడీదారులు గాల్లో కాల్పులకు కూడా తెగబడ్డట్టు సమాచారం. మరోవైపు.. స్థానిక పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. అయితే.. ఈ ఘటనలో సిబ్బందికి ఎటువంటి సంభవించలేదని తెలుస్తోంది. కాగా.. భారతీయ వ్యాపార సముదాయాలు అధికంగా ఉండే ఓక్ ట్రీ రోడ్‌కు లిటిల్ ఇండియా అనే పేరు కూడా ఉంది.
అమెరికాలోని భారతీయ నగల దుకాణంలో భారీ దోపిడీ..!
