దీపికా పదుకోన్.. సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ స్టార్ ఇమేజ్ను సొంతం చేసుకున్నది. ఇటీవల కేన్స్ ఉత్సవాల్లో జ్యూరీ మెంబర్గా మాతృభూమికి ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చింది. ఇటీవలే మరో రికార్డునూ సృష్టించింది. బట్టలు, యాక్సెసరీస్ తయారు చేసే ఫ్రెంచ్ లగ్జరీ బ్రాండ్ లూయీ విటోన్కు అంబాసిడర్గా ఎంపికైంది. తాజాగా ఓ కార్యక్రమంలో దీపిక లూయీస్ విట్టన్ దుస్తులూ, యాక్సెసరీస్ ధరించి అదే బ్రాండ్ లగ్జరీ హ్యాండ్బ్యాగ్ను చేతిలో పట్టుకొని కనిపించింది. హాలీవుడ్ నటి ఎమ్మాస్టోన్, చైనీస్ నటి హు డోంగ్యూలతో కలిసి ఈ క్యాంపెయిన్లో పాలు పంచుకుంది.
బ్రాండ్ భామ దీపిక!
