Politics

జూమ్ మీటింగ్‌లో నాని, వంశీ వస్తే..లోకేష్ ఎందుకు పారిపోయాడు

జూమ్ మీటింగ్‌లో నాని, వంశీ వస్తే..లోకేష్ ఎందుకు పారిపోయాడు

జూమ్ మీటింగ్‌లో కొడాలి నాని, వంశీ వస్తే… లోకేష్ ఎందుకు పారిపోయాడని మంత్రి రోజా ప్రశ్నించారు. శనివారం ఉదయం తిరుమల శ్రీవారిని మంత్రి దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ… గడపగడపకు కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందన్నారు. 10వ తరగతి ఫలితాలపై కూడా టీడీపీ రాజకీయ చెయ్యడం దిగ్గజారుడుతనమని వ్యాఖ్యానించారు. జీవితంలో లోకేష్ అసెంబ్లీలోకి రాలేడని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఓడిపోతే టీడీపీని మూసేస్తామని అచ్చేం నాయుడు పదే… పదే… ప్రకటిస్తున్నారని అన్నారు. 2019 నుంచి రాష్ట్రంలో జరిగిన ప్రతి ఎన్నికలు టీడీపీ ఓడిపోతోందని మంత్రి అన్నారు.పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర ఎందుకు ప్రారంభిస్తున్నాడో ప్రజలకు చెప్పాలన్నారు. జనసేన పార్టీని పెట్టింది ఎవరి కోసమని మంత్రి ప్రశ్నించారు. చంద్రబాబుకు మద్దతు ఇవ్వడానికే పవన్ కళ్యాణ్ పాకులాడుతుంటారని విమర్శించారు. పవన్ కళ్యాణ్‌కు దమ్ము, ధైర్యం ఉంటే గత టీడీపీ మేనిఫెస్టో… వైసీపీ మేనిఫెస్టోపై ప్రజల్లోకీ వెళ్ళాలని సవాల్ విసిరారు. ‘‘పవన్ కళ్యాణ్, లోకేష్‌కు మేమే ఎక్కువ… సీఎం ఎందుకు వస్తారు. ఎక్కడికైనా చర్చకు వచ్చేందుకు మేము సిద్ధం’’ అంటూ మంత్రి రోజా స్పష్టం చేశారు.