మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో కన్నా అమెరికా దేశం లోనే తెలుగు భాష వెలిగిపోతోందని ప్రశంసించారు తెలుగు భాషాభివృద్ధికి కళలను ప్రోత్సహించడానికి ప్రవాస తెలుగు వారు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నారని కొనియాడారు. అనంతరం నిర్వాహకులు ముఖ్య అతిథులను సత్కరించారు.
free image hosting
ఆంధ్ర పీపుల్ ఆఫ్ సెంట్రల్ OHIO APCO ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం కొలంబస్ భారతీయ టెంపుల్ లో తెలుగు సాహిత్య వేదిక సభను నిర్వహించారు. ప్రముఖ సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, మాజీ మంత్రి ఏపీ మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ అతిధులుగా హాజరయ్యారు. జొన్నవిత్తుల మాట్లాడుతూ ఇప్పటివరకు తాను 28 శతకాలు రాసినట్లు తెలిపారు. వాటిలో ఆవకాయ శతకం గురించి ఆలపించి ఆకట్టుకున్నారు. కోనసీమ శతకం దివిసీమ శతకం తదితర శతకాలను గురించి వివరించారు.
ఆవకాయ శతకంతో ఆకట్టుకున్న జొన్నవిత్తుల
