ఈ నెల 18 నుంచి అమెరికాలోని 7 ప్రాంతాల్లో శ్రీవారి కల్యాణోత్సవాలు నిర్వహిస్తున్నామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. టీటీడీ ఆధ్వర్యంలో జులై 3 వరకు ప్రధాన నగరాల్లో వీటిని నిర్వ హిస్తున్నామని వెల్లడించారు. తిరుమల ఆలయం నుంచే స్వామివారి విగ్రహాలను,అర్చకులను అమెరికాకు తీసుకెళ్లనున్నట్లు వివరించారు. తిరుమలలో తయారైన లడ్డూలను అక్కడ అందజేస్తామని పేర్కొన్నారు.వేసవి సెలవులు ముగుస్తుండడంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శనివారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో అన్ని కంపార్టుమెంట్లలో భక్తులతో నిండిపోయాయి. వెలుపల కూడా భక్తులు దర్శనానికి బారులు తీరారు. దర్శనానికి 25 గంటల సమయం పడుతుంది. నిన్న శుక్రవారం 67,949 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా 39,837 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా శ్రీవారి హుండీ ఆదాయం 3.70 వచ్చిందని టీటీడీ వర్గాలు వెల్లడించారు.