DailyDose

ఏలూరు జిల్లాలోని రెండు టోల్ గెట్ లలో భారీగా గంజాయి పట్టువేత – TNI నేర వార్తలు

ఏలూరు జిల్లాలోని రెండు టోల్ గెట్ లలో భారీగా గంజాయి పట్టువేత  – TNI  నేర వార్తలు

*ఏలూరు జిల్లాలో రెండు టోల్ గేట్లు వద్ద పోలీసులు భారీ స్థాయిలో గంజాయిని పట్టుకున్నారు. కలపర్రు టోల్ గేటు వద్ద రూ. 46. 30 లక్షల విలువచేసే 463 కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్ట్ చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. అలాగే ఉంగుటూరు టోల్ ప్లాజా వద్ద రూ. 50 లక్షల విలువచేసే 506 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ముగ్గురిని అరెస్టు చేసి లారీని సీజ్ చేశారు.

*ఉంగుటూరు టోల్ ప్లాజా వద్ద రూ. 50 లక్షల విలువచేసే 506 కేజీల గంజాయి* స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ముగ్గురిని అరెస్టు చేసి లారీని సీజ్ చేశారు.

* రాజస్థాన్ ధోల్పుర్ జిల్లాలో దారుణం జరిగింది. ఓ బాలికపై ఏడుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వీరిలో నలుగురు మైనర్లు ఉన్నారు. ఈనెల 14న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.

*పార్టీ పేరుతో గెస్ట్‌హౌస్‌లో మ‌హిళా టెకీపై సామూహిక అత్యాచారానికి పాల్ప‌డిన ఘ‌ట‌న‌లో మ‌హిళ స‌హా ముగ్గురు నిందితుల‌ను పోలీల‌సులు అరెస్ట్ చేశారు. ప‌శ్చిమ బెంగాల్‌లోని విధాన్‌న‌గ‌ర్ ప్రాంతంలోని గెస్ట్‌హౌస్‌లో గ‌తవారం ఈ ఘ‌ట‌న జ‌రిగింద‌ని బీపీఓ ఎగ్జిక్యూటివ్ (30)గా ప‌నిచేసే బాధితురాలు పోలీసుల‌కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.

*సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్‌లో శుక్ర‌వారం ఆర్పీఎఫ్ జ‌రిపిన‌ కాల్పుల్లో వ‌రంగ‌ల్ యువ‌కుడు మృతిచెందాడు. అత‌డిని ఖానాపురం మండ‌లం ద‌బీర్‌పేట‌కు చెందిన రాకేశ్‌గా పోలీసులు గుర్తించారు. ఈ మేర‌కు పోలీసులు రైల్వే అధికారులు స‌మాచార‌మిచ్చారు.త్రివిధ ద‌ళాల్లో సైనిక నియామ‌కం కోసం కేంద్రం తీసుకొచ్చిన అగ్నిప‌థ్‌ స్కీంను నిర‌సిస్తూ కొంత‌మంది యువ‌కులు సికింద్రాబాద్ స్టేష‌న్‌లో ఆందోళ‌న‌కు దిగారు. రైళ్ల‌ను ద‌హ‌నం చేశారు. రాళ్ల‌తో దాడిచేశారు. ప‌రిస్థితి అదుపుత‌ప్ప‌డంతో ఆర్పీఎఫ్ కాల్పులకు దిగింది. పోలీసుల కాల్పుల్లో ఒకరు మృతి చెందగా.. 8 మందికి గాయాలైన‌ట్లు స‌మాచారం.

* ఊహించని రీతిలో గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్‌లో భారీస్థాయిలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి లోడుతో వెళ్తున్న లారీని కారు ఢీకొనడంతో బండారం బయటపడింది. పట్టుబడిన గంజాయి విలువ దాదాపు రెండు కోట్ల రూపాయల విలువ ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. వంట చెరుకు కింద గంజాయి పెట్టి తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

*శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌‌ లో బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా బంగారం స్మగ్లింగ్ జరుగుతోంది. 28లక్షల విలువైన 554 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణికుడికి ఎయిర్ పోర్టులో ఓ ప్రైవేట్ ఉద్యోగి సహకరించినట్టు గుర్తించారు. ప్రయానికుడితో పాటు ఎయిర్ పోర్ట్ ఉద్యోగిని అధికారులు విచారిస్తున్నారు.

*కొత్తపేట మండలం, మందపల్లి వద్ద శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌ను పాలవ్యాన్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో తల్లి, కుమారుడు నాయనమ్మ ఉన్నారు. కొత్తపేట నుంచి రావులపాలెం మండలం, కొమరాజులంక వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతి చెందిన వారు అప్పన మహేష్(20), అప్పన వెంకటలక్ష్మి(40), అప్పన సత్యవతి(55)గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

*సోమందేపల్లి మండలం చాలకూరు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. పెళ్లయిన ఏడాదికే యువ దంపతులు బలవన్మరణం పాలైన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. చాలకూరు గ్రామానికి చెందిన రమేష్‌కు లేపాక్షి మండలం కంచిసముద్రం గ్రామానికి చెందిన రాధతో ఏడాది కిందట వివాహమైంది. ఒకే తాడుతో ఇంటి పై కప్పుకు ఉరివేసుకుని రమేష్, రాధ ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుమారుడు, కోడలు ఉరివేసుకోవడం గమనించి రమేష్ తల్లి గుండె చెరువైంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు గ్రామానికి చేరుకుని మృతదేహలను పరిశీలించారు. వీరి ఆత్మహత్యకు గల కారణం తెలియరాలేదు.

*నెల్లూరు: జిల్లాలోని సంగం మండలం సిద్ది పురం వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. కారును వెనుక నుండి రెండు బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మూడు వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. పలువురు ప్రయాణికులు స్వల్ప గాయాలయ్యాయి. కారు సడన్ బ్రేక్ వేయడంతో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

* కృష్ణా జిల్లా మచిలీపట్నంలో దొంగలు చేతివాటం ప్రదర్శించారు. పురాతన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో చోరీకి తెగబడ్డారు. ఉత్సవ విగ్రహాన్ని దుండగులు మాయం చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆలయంలో దొంగతనంపై ఈవో ఫిర్యాదుతో పోలీసులు రంగంలో దిగారు. చివరకు దొంగను పట్టుకున్న పోలీసులు విగ్రహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

*పశ్చిమగోదావరి జిల్లాలోని పెరవలి మండలం కాపవరం గ్రామంలో కాలవలోకి స్నానానికి దిగిన ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ఇద్దరు గల్లంతు అయినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని యువకుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన ఇద్దరు కవల సోదరులని స్థానికులు చెబుతున్నారు.

*నెల్లూరు: జిల్లాలోని మర్రిపాడు మండలం పడమటి నాయుడు పల్లి గ్రామంలో ఎలుగుబంట్లు హల్‌చల్ చేస్తున్నాయి. ఎలుగుబంటి దాడిలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఎలుగుబంట్లు దాడితో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఇంత జరుగుతున్నా అటవీశాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలుగుబంట్ల హల్‌చల్‌పై అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

*ఆమెకు పెళ్లై ఇద్దరు పిల్లలున్నారు.. భర్తతో విడిపోయి మరో యువకుడితో సహజీవనం చేస్తోంది. ఆ యువకుడు పెళ్లి చేసుకుందామన్నాడు.. ఆమె నిరాకరించింది.. కలిసి జీవిద్దామని చెప్పింది.. జీర్ణించుకోలేని యువకుడు.. ఆమె రెండేళ్ల కుమారుడ్ని కిడ్నాప్‌ చేశాడు. జూబ్లీహిల్స్‌ ఠాణాలో ఆమె ఫిర్యాదు చేసింది. పోలీసుల కథనం ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన అల్లాపూర్‌లోని పిలీదర్గా సమీపంలో నివసించే మహిళ(24)కు రషీద్‌ అనే వ్యక్తితో 2017లో వివాహమైంది. ఆమెకు నాలుగేళ్లు, రెండేళ్లు ఉన్న ఇద్దరు పిల్లలున్నారు. ఏడాది క్రితం ఆమె భర్తకు విడాకులిచ్చింది. సమీపంలో నివసించే శంకర్‌(21)తో ఆమెకు పరిచయం ఏర్పడగా, మూడు నెలలుగా మోతీనగర్‌లోని బబ్బుగూడలో సహజీవనం చేస్తున్నారు. ఈనెల 14న పెళ్లి చేసుకుందామని శంకర్‌.. ఆమెతో గొడవకు దిగాడు. వద్దని ఆమె సహజీవనం చేద్దామని తేల్చిచెప్పింది. ఇందుకు నిరాకరించిన శంకర్‌.. తనతో ఉండాలంటే పిల్లల్ని తీసుకురావాలని తేల్చిచెప్పాడు. నిరాకరించడంతో అదేరోజు సాయంత్రం ఆమె స్నేహితురాలి ఇంట్లో ఉన్న మహిళ చిన్న కుమారుణ్ని తీసుకొని పరారయ్యాడు. పోలీసులు గాలిస్తున్నారు.

*ఆంధ్రప్రదేశ్‌లోని కొత్తపేట మండలంలో రోడ్డుప్రమాదం జరిగింది. కొత్తపేట మండలంలోని మందపల్లిలో బైకును పాల వ్యాను ఢీకొట్టింది. దీంతో బైక్‌పై వెళ్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులను అప్పన సత్యవతి, వెంకట లక్ష్మి, మహేశ్‌గా గుర్తించారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన తల్లీ కుమారుడు, నానమ్మ అని పోలీసులు తెలిపారు. కొత్తపేట నుంచి రావులపాలెం వెళ్తుండగా ప్రమాదం జరిగిందని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

* ప్రేమలో విఫలమై మనస్తాపానికి గురైన ఓ యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. సికింద్రాబాద్‌ జీఆర్పీ పోలీసుల కథనం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం నాగేపల్లె గ్రామానికి చెందిన ఓదేలు కుమారుడు నారుకట్ల రమేష్‌(26) సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరు. ప్రస్తుతం ఇంటి నుంచి పనిచేస్తున్నాడు. అతడితో పాటే చదువుకున్న యువతితో 11 ఏళ్లుగా పరిచయం ఉంది. ఇద్దరూ ప్రేమించుకున్నారు. కులాలు వేరు కావడంతో ఆమె కుటుంబ సభ్యులు వివాహానికి అంగీకరించలేదు. మనస్తాపానికి గురై గురువారం మధ్యాహ్నం ఘట్‌కేసర్‌-చర్లపల్లి స్టేషన్ల మధ్య సింహపురి ఎక్స్‌ప్రెస్‌ రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. గుర్తింపు కార్డు ఆధారంగా రమేష్‌గా గుర్తించారు. ప్రేమ విఫలమైనందుకే ఆత్మహత్య చేసుకున్నట్లుగా కుటుంబ సభ్యుల ద్వారా తెలుసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

*గుజరాత్‌కు చెందిన ఓ యువతిపై.. ఆమె స్నేహితుడు అత్యాచారానికి పాల్పడ్డ సంఘటన బాచుపల్లి పోలీస్‌స్టెషన్ పరిధిలోని ప్రగతినగర్‌లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. గుజరాత్‌లోని వడోదరకు చెందిన బాధిత యువతి.. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో చదువు పూర్తయ్యాక.. ప్రగతినగర్‌లో ఉంటూ.. ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో కంటెంట్‌ రైటర్‌గా పనిచేస్తున్నారు. ఈ నెల జూబ్లీహిల్స్‌లోని రిపీట్‌ పబ్‌లో జరిగిన తన స్నేహితురాలి పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్నారు. రాత్రి ఆలస్యమవ్వడంతో.. ఆమెను ఇంట్లో దింపడానికి కొందరు స్నేహితులు వచ్చారు. రాత్రి పొద్దుపోవడంతో.. అంతా బాధితురాలి ఫ్లాట్‌లో ఉండాలనుకున్నారు. వారంతా వ తేదీ తెల్లవారుజామున వరకు కబుర్లు చెప్పుకొంటూ కూర్చున్నారు. గంటలకు కొందరు స్నేహితులు వెళ్లిపోగా.. బాధితురాలు తన గదిలో మిగతా వారు హాల్‌లో నిద్రకు ఉపక్రమించారు. స్నేహితుల్లో ఒకడు ఆమె గదిలోకి వెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు ప్రతిఘటించగా.. మెడ ఛాతీపై గాయాలు చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. నిందితుడిని అరెస్టు చేశారు.

*జూబ్లీహిల్స్‌లో మైనర్‌బాలికపై అత్యాచారం ఘటనను మరువక ముందే.. జవహర్‌నగర్‌ కార్పొరేషన్‌ పరిధిలో మరో ఘటన చోటుచేసుకుంది. జవహర్‌నగర్‌కు చెందిన పద్నాలుగేళ్ల ఓ ఎస్టీ బాలిక తండ్రి మరణించడంతో.. తల్లి కూలి పనికి వెళ్తూ పిల్లల్ని పోషిస్తోంది. ఆమె ఇంటి పక్కనే ఉన్న ఓ వ్యక్తి ఆ బాలికపై కన్నేశాడు. రెండు నెలల క్రితం.. తల్లి కూలి పనికి వెళ్లగా.. ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎవరికైనా విషయం చెబితే చంపేస్తానని హెచ్చరించాడు. అనంతరం పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇటీవల ఆమె తీవ్ర కడుపునొప్పితో బాధపడడంతో.. ఆ దుర్మార్గుడు ఓ ఆర్‌ఎంపీ వైద్యుడికి చూపించాడు. బాలిక వయసును ఏళ్లుగా పేర్కొని స్కానింగ్‌ చేయించాడు. గర్భం దాల్చినట్లు నిర్ధారణ కావడంతో.. అబార్షన్‌ చేయించాడు. బాలిక తల్లికి విషయం తెలియడంతో.. గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

*ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఖమ్మం జిల్లాకు చెందిన మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో చిన్నారులు కూడా ఉన్నారు. సుల్తాన్‌పూర్‌ జిల్లా ఆస్పత్రివర్గాలు, లాంబువా కొత్వాలీ పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. ఖమ్మం జిల్లా రాపర్తినగర్‌తో పాటు పలు ప్రాంతాలకు చెందిన వెంకటేశ్‌, నాగేశ్వరరావు భద్రయ్య, ఆర్‌.నాగేశ్వరరావు, సరస్వతి, వెంకటరమణమ్మ, శ్రీదేవి, వెంకటమ్మ, శ్రీకుమారి, వెంకటరామన్‌, గణేశ్‌, శ్రీలక్ష్మి, సవిత, లక్ష్మీనారాయణ, వెంకటయ్య, ఉపేంద్ర, చిన్నారులు సాయి, జ్ఞానశ్రీ.. మొత్తం 26 మంది ఈ నెల 10న ఉత్తరప్రదేశ్‌లోని తీర్థయాత్రలకు బయలుదేరారు. ఎక్కడికక్కడ ప్రైవేటు మినీబస్సులు, టెంపోట్రావెలర్స్‌ మాట్లాడుకుని ఆలయాల దర్శనాలు చేసుకుంటున్నారు. ఈ నెల 13న అయోధ్యకు చేరుకున్న వీరంతా.. అక్కడి రామ్‌లల్లాను దర్శించుకుని, బుధవారం కాశీకి బయలుదేరారు. ‘‘బుధవారం రాత్రి 10.30కు ఓ మినీ బస్సును మాట్లాడుకున్నాం. 50 కిలోమీటర్ల దూరం ప్రయాణించాక.. మరమ్మతుల కారణంగా డ్రైవర్‌ ముందుకు రాలేనన్నాడు.

* పాఠశాల నిర్వాహకుల నిర్లక్ష్యం ఏళ్ల బాలిక నిండు ప్రాణాలను బలిగొంది. తోటి విద్యార్థులతో దాగుడుమూతలు ఆడుకుంటూ ప్రహరీ సందులోకి వెళ్లిన ఆ బాలిక అక్కడ ఎర్త్‌వైర్‌కు తగిలి షాక్‌ కొట్టడంతో మృతిచెందింది. వరంగల్‌ జిల్లా సంగెం మండలం తిమ్మాపురంలో గురువారం ఈ విషాదం జరిగింది. ఉదయం పుస్తకాల భుజాన సంచీ వేసుకొని ఉత్సాహంగా బడికి వెళ్లిన తమ కూతురు ఇక లేదని తెలిసి ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించడం స్థానికులనూ కంటత డి పెట్టించింది. గ్రామస్థులు కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. లింగాల సంతోష్‌- అనూష దంపతులపెద్ద కుమార్తె రాజేశ్వరి( ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది. సాయంత్రం తోటి విద్యార్థినులతో కలిసి దాగుడుమూతల ఆట ఆడుకుంటోంది. తాను దాక్కునేందుకు కం ప్యూటర్‌ గది, బడి ప్రహరీకి మధ్య ఉన్న చిన్న సందులోకి మరో స్నేహితురాలితో కలిసి వెళ్లింది. అక్కడ ఎర్త్‌వైర్‌కు రాజేశ్వరి కాలు తగలడంతో విద్యుదాఘాతానికి గురైంది. స్నేహితులు వెంటనే ఉపాధ్యాయులకు విషయం చెప్పడంతో వారు అక్కడికి చేరుకుని కర్రలతో ఎర్త్‌ వైర్‌ను విడదీశారు. స్పృహ తప్పి పడిపోయిన చిన్నారిని హుటాహుటిన హెచ్‌ఎం సత్యనారాయణ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాజేశ్వరి మృతిచెందింది.

*అప్పుల బాధకు మరో ఇద్దరు కౌలు రైతులు బలయ్యారు. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం గోకివాడ గ్రామానికి చెందిన వేమగిరి నాగేశ్వరరావు(37) 4.80ఎకరాల పొలం కౌలుకు తీసుకుని వ్యవసాయం చేశాడు. వ్యవసాయం తో పాటు ఇంటి నిర్మాణం నిమిత్తం చేసిన అప్పులు వడ్డీతో రూ.10లక్షలు దాటాయి. వ్యాపారాలు చేసినా కలిసి రాక, పంటల సాగులో నష్టాలు రావడంతో అప్పులు తీరే మార్గం కనిపించక ఈనెల 14వ తేదీన ఇంటి వద్ద పురుగులమందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అతనిని తొలుత పిఠాపురం అక్కడి నుంచి కాకినాడ ప్రభుత్వాసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. పల్నాడు జిల్లా దుర్గి మండలం ముటుకూరు గ్రామానికి చెందిన కొల్లి రామయ్య(36) తనకున్న రెండున్నర ఎకరాల పొలానికి తోడు మరో 9 ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి, మిర్చి సాగు చేశాడు. పంట దిగుబడి సరిగా లేకపోవడంతో రూ.15 లక్షల వరకు అప్పులు తేలాయి. మనోవేదనతో బుధవారం రాత్రి ఇంట్లో పురుగుమందు తాగాడు. గురువారం ఉదయం కుటుంబ సభ్యులు చూసే సరికి విగతజీవిగా పడి ఉన్నాడు.

*రద్దు చేసిన ఆర్మీ పరీక్ష తిరిగి పెట్టాలని.. అగ్నిపథ్ స్కీమ్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్మీ అభ్యర్థులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారిన విషయం తెలిసిందే. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మొత్తం రక్తసిక్తంగా మారింది. రైళ్లను తగులబెట్టడం, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను పూర్తిగా ధ్వంసం చేయడంతో రైల్వే పోలీసులు పరిస్థితిని అదుపు చేసేందుకు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒక వ్యక్తి మరణించగా పలువురికి గాయాలయ్యాయి. ఛాతీలో బుల్లెట్ దిగడంతో యువకుడిని హుటాహుటిన పోలీసులు గాంధీకి తరలించారు. కాగా.. ఆ యువకుడు మరణించినట్టు వైద్యులు ధృవీకరించారు. ఈ ఆందోళనలో గాయపడిన 11 మంది యువకులను సైతం గాంధీకి తరలించారు. అక్కడ వారికి చికిత్స జరుగుతోంది. ఒక ఆందోళనకారుడికి వెన్నెముక విరిగింది. అతని బ్లడ్ ఎక్కించి వైద్యులు చికిత్సను అందిస్తున్నారు