NRI-NRT

ఈ నెల 24న USAలో జస్టిస్ వెంకట రమణను ఘనంగా సన్మానించనున్న తెలుగు సంఘాలు

ఈ నెల 24న USAలో జస్టిస్ వెంకట రమణను ఘనంగా సన్మానించనున్న తెలుగు సంఘాలు

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకట రమణ అమెరికా పర్యటన చేయనున్నారు. ఈ క్రమంలో ప్రముఖ ప్రవాస తెలుగు సంఘాలన్నీ ఏకమై భారత ప్రధాన న్యాయమూర్తిని ఘనంగా సన్మానించాలని నిర్ణయం తీసుకున్నాయి. జూన్ 24 నాడు అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలో ఎడిసన్ నగరంలోని మిరాజ్ బాంక్వెట్ హాల్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా బుధవారం న్యూ జెర్సీ నార్త్ బ్రున్స్విక్ లోని బిర్యానీ జంక్షన్ రెస్టారంట్ లో తెలుగు సంఘాల నాయకులు సమావేశమయ్యారు. ప్రముఖ ఎన్నారై బ్రహ్మాజీ వలివేటి ఆధ్వర్యంలో జరిగిన ఈ సన్నాహక సమావేశంలో పాల్గొన్న నాయకులంతా జస్టిస్ వెంకట రమణను సన్మానించడం ప్రతి తెలుగు వారు తమ భాద్యతగా భావించాలన్నారు. ప్రతి ఒక్కరూ కారక్రమానికి హాజరై దిగ్విజయం చేయాలని కోరారు. అన్ని తెలుగు సంఘాలు ఒకే వేదిక మీద నుంచి తెలుగు జాతి ముద్దుబిడ్డ జస్టిస్ వెంకట రమణను సన్మానించడం అరుదైన కార్యక్రమమని అన్నారు. అందరం కలిసికట్టుగా కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు