తెలంగాణలో అత్యంత ఘనంగా నిర్వహించే ఆషాఢం బోనాల జాతర ఉత్సవాలు ఈనెల 30వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే ఆషాడ బోనాల ఉత్సవాలు ముందుగా గోల్కొండ కోట నుంచి బోనాల ఉత్సవాల ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లను చేయనుంది. ఏర్పాట్లపై ఈ నెల 21 వ తేదీన ఉదయం 11.00 గంటలకు పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో గోల్కొండ కోట వద్ద జరగనున్నాయి. ఈ సమావేశంలో దేవాదాయ, GHMC, వాటర్ వర్క్స్, ఎలెక్ట్రికల్, హెల్త్ తదితర శాఖల అధికారులు పాల్గొంటారు. లక్షలాది మంది భక్తులు పాల్గొననున్న నేపధ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా భక్తులకు సౌకర్యాల కల్పన,శాంతిభద్రతలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని అధికారులు తెలిపారు.