Politics

రహదారుల మరమ్మతుల వేగవంతానికి సీఎం జగన్ ఆదేశం – TNI రాజకీయ వార్తలు

రహదారుల మరమ్మతుల వేగవంతానికి సీఎం జగన్ ఆదేశం – TNI రాజకీయ వార్తలు

* రోడ్ల మరమ్మతులు, బ్రిడ్జిలు, ఆర్వోబీల నిర్మాణాలను వచ్చే నెల 15 లోపు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశించినట్లు పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. ఆర్అండ్బీ, పంచాయతీరాజ్, పురపాలక శాఖల పరిధిలో రోడ్ల మరమ్మతులు, నిర్మాణంపై సీఎం సమీక్షించినట్లు తెలిపారు.రహదారుల మరమ్మతుల వేగవంతానికి సీఎం జగన్ ఆదేశంరహదారుల మరమ్మతుల వేగవంతానికి ముఖ్యమంత్రి జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పురపాలక శాఖ పరిధిలో జులై 15లోపు మరమ్మతులు పూర్తి చేయాలన్నారు. అర్ఆండ్బీ, పంచాయతీ రాజ్, పురపాలక శాఖల పరిధిలో రోడ్ల మరమ్మతుల, నిర్మాణంపై అధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. సమీక్ష అనంతరం భేటీలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి ఆదిమూలపు సురేశ్ మీడియాకు వెల్లడించారు.రోడ్ల మరమ్మతులకు అవసరమైన నిధులను వెంటనే విడుదల చేయాలని ఆర్థిక శాఖ అధికారులను సీఎం ఆదేశించినట్లు మంత్రి సురేశ్ తెలిపారు. పురపాలక శాఖ పరిధిలోని 4 వేల పైచిలుకు కి.మీ జూలై 15 లోపు పూర్తి చేయాలని సీఎం ఆదేశించినట్లు చెప్పారు. రాష్ట్రంలో 27 వేల కి.మీ పైగా పంచాయతీ రోడ్లను శాచురేషన్ పద్దతిలో అభివృద్ది చేయాలని జగన్ దిశానిర్ధేశం చేశారన్నారు. జూలై 20 లోపు మరమ్మతులు, నిర్మాణం పూర్తి చేసి నాడు-నేడు కింద ప్రదర్శించాలని సీఎం ఆదేశించారన్నారు. గిరిజన ప్రాంతాల్లో అన్ కనెక్టెడ్ హాబిట్ విలేజీలకు 5 వేల కి.మీ రోడ్లు పూర్తి చేశామని తెలిపారు.నాణ్యమైన సాంకేతిక విద్య అందించడంలో ప్రపంచ వ్యాప్తంగా బైజూస్ పేరొందిందని.., ప్రభుత్వ పాఠశాల్లోని పేద పిల్లలకు ఉచితంగా విద్యనందించేందుకు బైజూస్ ముందుకొచ్చిందని మంత్రి తెలిపారు. అలాంటి సంస్థను ‘జగన్ జూస్’ అని చంద్రబాబు వెటకారంగా మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఏటా 8 తరగతి విద్యార్థులకు రూ.500 కోట్లతో ప్రభుత్వం తరపున ట్యాబ్లు అందిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం నాణ్యమైన విద్యనందిస్తుంటే చంద్రబాబు అవాకులు, చవాకులు పేలటం శోచనీయమన్నారు.

*బీజేపీది డబుల్ ఇంజన్ కాదు ట్రబుల్ ఇంజన్ సర్కార్: Harish rao
బీజేపీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనూ వైద్యం అందట్లేదని మంత్రి హరీష్ రావు(Harish rao) అన్నారు. మంగళవారం మంథనిలో మాతా శిశు ఆరోగ్య కేంద్రం ప్రారంభోత్సవం సభలో మంత్రులు హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్, ఎంపీ వెంకటేష్ నేత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ… బీజేపీది డబుల్ ఇంజన్ కాదు ట్రబుల్ ఇంజన్ సర్కార్ అని వ్యాఖ్యానించారు. అగ్నిపథ్ పథకంతో నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లారని మండిపడ్డారు. మత విద్వేషాలు రెచ్చగొట్టడం తప్ప అభివృద్ధి ఏమి లేదన్నారు. సికింద్రాబాద్ ఘటన కేసీఆర్ చేయించారని బీజేపీ నేతలు అంటున్నారని… మరి ఉత్తర్‌ప్రదేశ్‌లో పోలీస్ స్టేషన్ తగులబెట్టారు అక్కడ ఏ ప్రభుత్వం ఉంది అని మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు.

*సికింద్రాబాద్ అల్లర్లు వెనుక సీఎం కేసీఆర్ ఉన్నారు: డీకే అరుణ
ప్రధాని మోదీ సభకు పది లక్షల మంది వస్తారని బీజేపీ నేత డీకే అరుణ చెబుతున్నారు. పరేడ్ గ్రౌండ్స్ లో బహిరంగ సభ ఏర్పాట్లను బీజేపీ బృందం పరిశీలించింది. సికింద్రాబాద్ అల్లర్లు వెనుక సీఎం కేసీఆర్ ఉన్నారని ఆరోపణలు చేశారు. తెలంగాణ సమాజం మోదీ నాయకత్వంలోని బీజేపీ వైపు చూస్తోందన్నారు. హైదరాబాద్ నగరం కాషాయ మాయంగా మారబోతుందన్నారు. సీఎం కేసీఆర్ మాటలకు విలువ లేకుండా పోయిందని మండిపడ్డారు. అగ్నిపథ్‌పై మంత్రి‌ కేటీఆర్‌వి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని చెప్పారు. నిరుద్యోగులను మోసం చేసిందే కేసీఆర్ హయాంలోని టీఆర్ఎస్ ప్రభుత్వమన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిని ఓడించే శక్తి కేసీఆర్‌కు లేదన్నారు.

*రాహుల్‌ను కావాలనే ఇబ్బందులకు గురి చేస్తున్నారు: Uttam
కావాలనే కాంగ్రెస్అ గ్రనేత రాహుల్ గాంధీ ని ఈడీ పేరుతో ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆ పార్టీ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. రాజకీయ కక్ష సాధింపులకు బీజేపీ దిగుతోందన్నారు. ఏ మాత్రం కూడా కాంగ్రెస్ నేతలు ఇలాంటి బెదిరింపులకు భయపడరని ఆయన పేర్కొన్నారు. ఇటీవల దేశంలో ఉత్పన్నమైన కోవిడ్ పెద్ద నోట్ల రద్దు అంశాలన్నీ రాహుల్ గాంధీ లేవనెత్తారని గుర్తు చేశారు. బీజేపీ చేష్టలను ప్రజలు అసహ్యించుకుంటున్నారని ఎంపీ ఉత్తమ్ విమర్శించారు.

*సంక్షేమ పథకాలను కత్తెర పథకాలుగా మార్చిన Jagan: Gouthu Sireesha
టీడీపీ నేత గౌతు శిరీష వైసీపీ ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు గుప్పించారు. మంగళవారం ఆమె ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలను కత్తెర పథకాలుగా మార్చారని ఆరోపించారు. అమ్మ ఒడి దగ్గర నుంచి మొదలు కొని చివరకు దళితులకు ఇచ్చే విద్యుత్‌ రాయితీల్లో కూడా ముఖ్యమంత్రి మోసం చేస్తున్నారన్నారు. ప్రభుత్వాన్ని, అధికారంలో ఉన్న పార్టీని ప్రశ్నించడం రాజద్రోహం కిందకు రాదన్నారు. చంద్రబాబు మీద అబద్ధ ప్రచారం చేసి జగన్ అధికారంలోకి వచ్చారన్నారు. చంద్రబాబు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నీ ఈ ప్రభుత్వం నిలిపివేసిందని, అన్ని వర్గాల వారిని జగన్మోహన్ రెడ్డి మోసం చేస్తున్నారని గౌతు శిరీష తీవ్ర స్థాయిలో విమర్శించారు.

*YCPకి చరమగీతం పాడాలి : GVLt
Nellore జిల్లా ఆత్మకూరులో బీజేపీ భారీ రోడ్ షో నిర్వహించింది. ఈ రోడ్ షోలో పాల్గొన్న బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తిని బీజేపీ ఎన్నికల్లో నిలిపి చిత్తశుద్ధి చాటుకుందన్నారు. ఒకే కుటుంబం రాజ్యమేలుతోందని.. మూడేళ్ళ పాలనలో రైతులకు అన్యాయం చేసిందన్నారు. ధాన్యం కొనుగోలు చేసి రైతులకు నగదు చెల్లించలేదన్నారు. వైసీపీ కి చరమగీతం పాడాలన్నారు. బీజేపీని గెలిపిస్తే.. రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తీసుకొస్తామని జీవీఎల్ వెల్లడించారు.

*మీ వాలంటీర్ చెప్పుతో కొట్టుకున్నాడు: నక్కా Anandababu
ఈ ఉద్యోగం వద్దంటూ వాలంటీర్త న చెప్పుతో తనే కొట్టుకున్నాడని, ఇదనే ప్రభుత్వం సమర్థత అని టీడీపీ నేత, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ప్రశ్నించారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలం, రామదాస్ నాయక్ తండాలో 50 మంది రైతులు ఈ క్రాప్ చేయిస్తే.. ఒక్క రైతుకే పంట బీమా అందిందని, రైతు ప్రభుత్వం అని చెప్పుకునే సీఎం జగన్ .. రైతులకు చేస్తున్నది ఇదేనా? అని నిలదీశారు. అవగాహనా రాహిత్యంతో అధికారులు మాట్లాడుతున్నారని ఆనందబాబు మండిపడ్డారు.

*వెంకయ్యను రాష్ట్రపతిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవాలి: Somireddy
భారత రాష్ట్రపతిగా వెంకయ్య నాయుడుని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ… గతంలో ఎంతో మంది ఉపరాష్ట్రపతులను, రాష్ట్రపతిగా ఎన్నుకున్న సంప్రదాయం కొనసాగించాలన్నారు. వెంకయ్య నాయుడు రాజకీయ జీవితంలో మచ్చలేని వ్యక్తి అని కొనియాడారు. వెంకయ్య నాయుడు పేరును ఎన్డీయే సిఫార్సు చేస్తే.. ఇతర పార్టీలు కూడా పోటీకి అభ్యర్థిని పెట్టేందుకు సాహసించవని తెలిపారు. రాష్ట్రపతి అభ్యర్థిగా రోజుకో అభ్యర్థి పేరు తెరపైకి వచ్చి, అంశం వివాదం కావటం తగదని సోమిరెడ్డి అన్నారు.

*జగన్ పెట్టిన నవరత్నాలు నవమోసాలు: GV
సీఎం జగన్ రెడ్డి పెట్టిన నవరత్నాలు నవమోసాలు అని టీడీపీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు విమర్శలు గుప్పించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ… ‘‘ఎన్నికల ముందు ఎన్ని ముద్దులు పెట్టాడు… ఇప్పడు ముద్దుకోక గుద్దు అన్నట్లు పాలన ఉంది’’ అని అన్నారు. జగనన్న కాలనీల పేరుతో ఎమ్మెల్యేలు దోపిడీలకు పాల్పడ్డారని ఆరోపించారు. కాలనీలలో మౌలిక సదుపాయాల పేరుతో వైసీపీ నేతలు వందల కోట్లు దోచుకున్నారన్నారు. జగనన్న కాలనీలలో ఇల్లు కట్టుకోవాలంటే పేదలు అప్పులు చేయాల్సిందే అని అన్నారు. కేంద్రం ఇచ్చే డబ్బులతో వైసీపీ ప్రభుత్వం డప్పులు కొట్టుకుంటోందని మండిపడ్డారు. ప్రభుత్వం ఇచ్చే డబ్బులు భారతి సిమెం కొనడానికే చాలవన్నారు. ‘‘మీ ఇల్లు మీరే కట్టుకోండి మేం వచ్చి మా పార్టీ రంగులు వేస్తామన్నట్లు వ్యవహారం ఉంది’’ అంటూ జీవీ ఆంజనేయులు వ్యాఖ్యలు చేశారు.

*Eknath Shinde పై శివసేన వేటు, శాసనసభాపక్ష నేత పదవి నుంచి తొలగింపు
మహారాష్ట్రలోని అధికార శివసేన పార్టీలో తలెత్తిన రాజకీయ సంక్షోభం తీవ్రమవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. కొందరు పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయి, సూరత్‌‍లో ప్రచారం సాగిస్తున్న పార్టీ నేత ఏక్‌నాథ్ షిండేపై శివసేన వేటు వేసింది. శాసనసభా పక్ష నేత పదవి నుంచి ఆయనను తొలగించింది. ఆయన స్థానంలో శివసేన లెజస్లేటివ్ పార్టీ నేతగా సెవ్రి ఎమ్మెల్యే అజయ్ చౌదరి వ్యవహరించనున్నారు. పరిణామాలపై ఏక్‌నాథ్ షిండే తక్షణం స్పందించనప్పటికీ, మహారాష్ట్రలో తలెత్తిన రాజకీయ పరిణామాలతో తమ పార్టీకి ఎలాంటి ప్రమేయం లేదని మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్ తెలిపారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనే ప్రతిపాదనతో షిండే ముందుకు వస్తే దానిని బీజేపీ తప్పనిసరిగా పరిశీలిస్తుందని చెప్పారు.

*బీసీలను అణిచేస్తున్నారు: శేషు
వైసీపీ ప్రభుత్వం బీసీలను అణగదొక్కే ప్రయత్నం చేస్తోందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి శేషు ఆరోపించారు. జంగారెడ్డిగూడెం టీడీపీ బీసీ విభాగం అధ్యక్షుడు పాకనాటి అంజిబాబు ఆధ్వర్యంలో ఎన్‌టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించాక ఆయన మాట్లాడుతూ ప్రజలు చీదరించుకుంటున్న జగన్ పతకం ఎంతో దూరం లేదన్నారు. జంగారెడ్డిగూడెం టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ అయ్యన్నపాత్రుడి ఇంటిగోడ కూల్చడాన్ని ఖండించారు. బీసీ నాయకుడు, రాజన సత్యనారాయణ మాట్లాడుతూ పాలిటెక్నిక్ కాలేజీకి 22 ఎకరాలు ఉచితంగా ఇచ్చిన కుటుంబం 2 సెంట్లు భూమి ఆక్రమిస్తుందా? అని ప్రశ్నించారు. రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి చిట్టిబోయిన రామలింగేశ్వరావు మాట్లాడుతూ బీసీ నాయకులపై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు సత్యనారాయణ,రాష్ట్ర మహిళా కార్యనిర్వహణ కార్యదర్శి సౌభాగ్యవతి, జిల్లా కార్యనిర్వహణ కార్యదర్శి రాజ్ పాల్, కౌన్సిలర్ రమాదేవి, లక్ష్మయ్య, పట్టణ ప్రధాన కార్యదర్శి తూటికుంట రాము, ఉపాధ్యక్షుడు కిషోర్, సత్తిపండు, అల్లూరి రామకృష్ణ, మద్దిపాటి నాగేశ్వరావు, చెరుకూరి శ్రీధర్, నంగులూరి జగత్, గుమ్మడి ప్రసాద్, పట్టణ అధికార ప్రతినిధి సుబ్రహ్మణ్యం, షేక్ యాకుబ్, షేక్ నజీర్, దుర్గేష్, బీసీ సెల్ మండల అధ్యక్షులు బూసా సత్యనారాయణ రెడ్డి, శీలామంతుల రాంబాబు, ఎంపీటీసీ రాంబాబు, కొంచాడ రాజు, చిలంకూరి బాబీ, ఊదర సుబ్బారావు, రంగా, యడ్లపల్లి ఏడుకొండలు, మడ్డి రామారావు, ఆటో ఎన్.టి.ఆర్, పాకనాటి సురేష్, పాకనాటి కాశి,కాగితాల రాంబాబు, వెంకట్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

*షన్‌రెడ్డి.. దమ్ముంటే కంటోన్మెంట్‌లో ఫ్లై ఓవర్‌లు కట్టించు: కేటీఆర్
హైదరాబాద్ నగర వ్యాప్తంగా మొదటి దశ ఎస్ఆర్‌డీపీ కింద 8052 కోట్ల రూపాయలతో 47 ప్రాజెక్టులు చేపట్టామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఇప్పటి వరకూ 30 అందుబాటులోకి వచ్చాయన్నారు. 3117 కోట్ల రూపాయలతో రెండో దశ ఎస్ఆర్‌డీపీ మొదలు పెడతామన్నారు. దేశ నలుమూలల నుంచి వచ్చి హైదరాబాద్‌లో నివాసముంటున్నారు. జనాభాకు తగ్గట్టు వసతులు కల్పిస్తున్నామన్నారు. కూకట్‌పల్లి IDPLలో ఎందుకు రోడ్లు వేస్తున్నారని… ఇక్కడి కేంద్ర మంత్రి అడగటమే కాకుండా కేసులు పెడతా అంటున్నాడన్నారు. కిషన్ రెడ్డికి దమ్ముంటే.. కంటోన్మెంట్‌లో ఫ్లై ఓవర్‌లు కట్టించాలని కేటీఆర్ సవాల్ విసిరారు.

*తెలంగాణలో బీజేపీని గెలిపించి మోదీకి కానుకగా ఇస్తాం: లక్ష్మణ్‌
తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చి, ప్రధాని మోదీకి కానుకగా ఇస్తామని ఆ పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ కె.లక్ష్మణ్‌ అన్నారు. ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో సోమవారం ఆయన భేటీ అయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ తనను రాజ్యసభకు ఎంపిక చేసిన నేపథ్యంలో మర్యాదపూర్వకంగా అమిత్‌షాను కలిశానని చెప్పారు. పార్టీలో చేరిన నేతలకు సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదన్న విమర్శలు వస్తున్నాయని విలేకరులు ప్రస్తావించగా.. అది అవాస్తవమని, అందరికీ గుర్తింపు ఇస్తున్నారని చెప్పారు.

*అనంతబాబుకు వైపు మొగ్గడం దళిత వ్యతిరేక చర్యే: వర్ల రామయ్య
దళిత యువకుడిని దారుణంగా హత్య చేసిన ఎమ్మెల్సీ అనంతబాబును బెయిల్‌పై బయటకు తీసుకురావాలని ప్రభుత్వం నానా తంటాలు పడుతుందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య విమర్శించారు. సోమవారం ఆయన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని ఉద్దేశించి ట్వీట్‌ చేశారు. ‘‘దళిత ఓట్లతో అధికారంలోకి వచ్చిన మీరు ఈ వర్గాలను విస్మరించి, అనంతబాబు వైపు మొగ్గడం దళిత వ్యతిరేక చర్యే. ఇప్పటికైనా దళితులకు న్యాయం చేయండి’’ అని వర్ల రామయ్య పేర్కొన్నారు. డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం మృతి కేసులో అనంతబాబును పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆయనను పోలీసులు ఎ-1 నిందితుడిగా ప్రకటించారు. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో అనంతబాబు రిమాండ్ ఖైదీగా ఉన్నారు.

*క్రమబద్ధీకరణ జాబితా ఇవ్వండి: మంత్రి సబిత
ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లోని కాంట్రాక్ట్‌ లెక్చరర్ల క్రమబద్ధీకరణకు జాబితా ఇవ్వాలని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం అధికారులతో సమావేశమై క్రమబద్ధీకరణ ఫైలు ప్రభుత్వానికి పంపించేందుకు, ధృవపత్రాల పరిశీలనలో జరుగుతున్న జాప్యంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. జాబితా సిద్థం చేసి రెండు రోజుల్లో వివరాలు ఇవ్వాలని ఇంటర్‌ విద్యా కమిషనర్‌ను మంత్రి ఆదేశించారు. సమావేశంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, విద్యాశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

*వైఎస్సార్ ఇక్కడికి 33 సార్లు వచ్చారు: షర్మిల
నల్గొండ జిల్లాకు ముఖ్యమంత్రి హోదాలో వైఎస్సార్ 33 సార్లు వచ్చారని వైఎస్ షర్మిల గుర్తుచేశారు. కోదాడ పట్టణంలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. ఎస్ఎల్ బీసీ వైఎస్సార్ ఉంటే పూర్తయ్యేదన్నారు. 70 వేల కోట్లు ఒక్క కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోనే అందాయన్నారు. అగ్నిపథ్ అని మోడీ కాంట్రాక్ట్‌కు తెరలేపారని చెప్పారు. ఆర్మీలో చేరి ప్రాణాలు పోతే ఎవరు బాధ్యులని ప్రశ్నించారు. మోడీ అగ్నిపథ్ అని మంట పెడితే కేసీఆర్ చలి కాచుకుంటున్నారని విమర్శించారు. గౌరవెల్లి నిర్వాసితులకు న్యాయం కూడా చేయలేదన్నారు. కేసీఆర్‌కు మన రాష్ట్రంలో సమస్యలు కనిపించవని, పక్క రాష్ట్రం పోయి డబ్బులు ఇస్తారని ఆరోపించారు. BRS అంటే బార్ అండ్ రెస్టారెంట్ పార్టీ అని ప్రజలు నవ్వుకుంటున్నారని విమర్శించారు. ఈ దరిద్రం ఇక్కడితో చాలాదా.. దేశానికీ ఈ దరిద్రం కావాలా? అని ఆమె ప్రశ్నించారు.

*అగ్నిపథ్ గురించి ఆందోళనలు వద్దు: కిషన్రెడ్డి
కేంద్ర ప్రభుత్వం అమలు చేయనున్న అగ్నిపథ్ గురించి యువతలో ఎలాంటి ఆందోళనలు అవసరం లేదని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.కావాలనే కొందరు యువతను రెచ్చగొడుతున్నారని ఆయన ఆరోపించారు. యోగాడే దినోత్సవాలు జరిగే సికింద్రబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాట్లను మంత్రి సోమవారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అగ్నిపథ్ ద్వారా దేశానికి మంచి జరుగుతుందని అన్నారు.మహీంద్రా వంటి కంపెనీ అగ్నివీర్లకు జాబ్లు ఇచ్చేందుకు ముందుకు వచ్చిందని తెలిపారు.అగ్ని వీర్లకు విద్య, ఉద్యోగాల్లో అవకాశాలు వుంటాయని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో యోగా దినోత్సవంలో ముఖ్యఅతిథిగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొంటారని తెలిపారు.మైసూర్లో మోదీ.. కోయంబత్తూర్లో రాజ్నాథ్ పాల్గొంటారని చెప్పారు.

*కేసీఆర్.. పేదల ఆకలి కేకలు వినపడవా?: Vijayashanti
బీజేపీ నాయకురాలు విజయశాంతి కేసీఆర్ సర్కారుపై విరుచుకుపడ్డారు. రేషన్ దుకాణాల ద్వారా పేదలకు బియ్యం ఆలస్యంగా అందుతోంది. రేషన్ దుకాణాలకు రావాల్సిన కోటా ఆలస్యంగా ఇస్తుండడంతో డీల‌ర్లూ ఇబ్బంది పడుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం వల్లే..‘‘తెలంగాణలో కేసీఆర్ స‌ర్కార్ నిరంకుశ పాల‌న‌ సాగుతోంది. ఏ ప‌థ‌కాన్ని స‌రిగ్గా అమ‌లు చేయ‌డం లేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఉచిత బియ్యానికీ కోత పెట్టారు. రూపాయికి కిలో బియ్యం కూడా సరిగా ఇవ్వడం లేదు. రేషన్ దుకాణాలకు సకాలంలో బియ్యం సరఫరా చేయకపోవడంతో పేదల కడుపు మాడుతోంది. సర్వర్ డౌన్, సిగ్నల్ ప్రాబ్లమ్స్, వేయింగ్, బయోమెట్రిక్ మెషీన్లు పనిచేయకపోవడం వంటి కారణాలతో రాష్ట్ర‌వ్యాప్తంగా వేలాది పేద కుటుంబాలు బియ్యం అందక తిప్పలు పడుతున్నాయి. రేషన్ దుకాణాల ద్వారా ప్రతి నెల 1 నుంచి 15వ తేదీ వరకు బియ్యం పంపిణీ చేయాల్సి ఉంది. కానీ గడువును 20వ తేదీ వరకు పొడిగించినా బియ్యం అందని పరిస్థితి నెలకొంది. ప్ర‌భుత్వం తీరు వ‌ల్ల ప్ర‌జ‌లే కాదు..డీల‌ర్లూ న‌ష్ట‌పోతున్నారు. రేషన్ దుకాణాలకు రావాల్సిన కోటాను ఆలస్యంగా ఇస్తుండడంతో డీల‌ర్లు ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి నెలా 1 నుంచి 15వ తేదీ వరకు బియ్యం పంపిణీ పూర్తి కాగానే… 20వ తేదీలోపు డీడీలు కట్టించుకుని, 30వ తేదీలోగా ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి రేషన్ షాపులకు బియ్యం సరఫరా చేయాలి. కానీ, అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం వల్ల ఇదంతా ఆలస్యమవుతోంది. కేసీఆర్.. పేద‌ల క‌డుపు మీద కొట్టడం ఎంత వ‌ర‌కు సమంజ‌సం? పేద‌ల‌కు నాలుగు వేళ్లూ నోట్లోకి వెళ్లాలంటే రేష‌న్ బియ్యమే శ‌ర‌ణ్యం. కానీ పేద బ‌తుకులతో కేసీఆర్ స‌ర్కార్ ఆడుకుంటోంది. కేసీఆర్… వీరి ఉసురు ఊరికే పోదు. నువ్వు, నీ స‌ర్కార్ మ‌ట్టి కొట్టుకుపోవ‌డం ఖాయం.’’ అని తన ఫేస్ బుక్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు.

*పాదయాత్రను అడ్డుకునేందుకే ఈడీ విచారణ: జగ్గారెడ్డి
ఉదయ్‌పూర్ చింతన్ శిబిర్ నిర్ణయం ప్రకారం ప్రజా సమస్యలపై దేశవ్యాప్తంగా త్వరలో రాహుల్ గాంధీ పాదయాత్ర చేపడతారని, రాహుల్ పాదయాత్రను అడ్డుకునేందుకే ఈడీ విచారణ పేరుతో ఇబ్బంది పెడుతుందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆరోపించారు. మోదీ ప్రధాని అయ్యాక రాజకీయ విలువలు పడిపోయాయని, ప్రజా సమస్యలపై స్పందిస్తే అధికార దుర్వినియోగంతో మోడీ, అమిత్ షా ప్రతిపక్ష పార్టీల గొంతు నొక్కుతున్నాయని విమర్శించారు. బీజేపీ నాయకులు జీహెచ్ఎమ్‌సీ ఎన్నికల్లో భాగ్యలక్ష్మి అమ్మవారిని అడ్డు పెట్టుకొని రెండు నుంచి 47 స్థానాలు గెలుచుకున్నారని, దేశంలో రాముడిని అడ్డుపెట్టుకొని విజయం సాధించారని ఆరోపించారు. రాహుల్ గాంధీకి పైసలు కావాలంటే పత్రికా డబ్బులు అవసరం లేదని, కార్యకర్తలు ఇస్తారని చెప్పారు.

*రాజీవ్‌ స్వగృహ భూముల వేలం అక్రమం: జీవన్‌రెడ్డి
రాజీవ్‌ స్వగృహ కోసం కేటాయించిన భూముల వేలం అక్రమమని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆరోపించారు.వేలంలో ఈ భూములు కొన్నవారికి భవిష్యత్‌లో ఇబ్బందులు తలెత్తుతాయని జీవన్‌రెడ్డి అన్నారు. కోర్టు వివాదాలున్న భూముల వేలం సరికాదని ఆయన చెప్పారు.కోర్టు వివాదాలు తొలగితే ఆ భూముల విలువ రూ.వెయ్యి కోట్లు వుంటుందని జీవన్ రెడ్డి తెలిపారు. ఇప్పటికైనా రాజీవ్ స్వగృహ భూముల వేలాన్ని నిలిపి వేయాలని ఆయన డిమాండ్ చేశారు.

*తండ్రికి తగ్గ తనయులనిపిచ్చుకున్నారు: అనిత
ఛలో నర్సీపట్నం విజయవంతం చేసిన టీడీపీ శ్రేణులకు రాష్ట్ర మహిళ అధ్యక్షరాలు అనిత అభినందనలు తెలిపారు. తండ్రికి తగ్గ తనయులుగా అయ్యన్నకొడుకులు నిలిచారని కొనియాడారు. రైతులు తమ పాస్ బుక్‌లు పరిష్కరించాలని కోరితే కాలయాపన చేసే రెవెన్యూ అధికారులు అదివారం కూడా పని చేశారంటే ఏం జరుగుతుందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఆడపిల్లలుకు అన్యాయం జరుగుతుందంటే స్పందించని పోలీసులు అయ్యన్న వ్వవహరం అత్యత్సహం చుపారన్నారు. చలో నర్సీపట్నంకు మేము అయ్యన్న ఇంటికి వెళుతుంటే మీకెంటి నెప్పి? అని ఆమె ప్రశ్నించారు. గ్రామ స్థాయి నేతలు నుండి ఇంటింటికి పోలిసుల్ని పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నర్సీపట్నంలో ఒక్క జేసీబీ అడుగుపెట్టకుండా సత్తా చుపించామన్నారు. వైసీపీ కుక్కలకు బుద్ది చెప్పాలననారు. బీసీ నాయకులు మీద చేయి వేయ్యాలంటే ఈ ప్రభుత్వం వణకాలన్నారు.

*వైసీపీ ప్రభుత్వంలో అంతా అరాచకమే: పీతల సుజాత
వైసీసీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అరాచకానికి పాల్పడుతోందని మాజీ మంత్రి పీతల సుజాత మండిపడ్డారు. సోమవారం ఆమె మీడియాతో వైసీపీ ప్రభుత్వంపై రోజురోజుకు ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందన్నారు. టీడీపీకి వస్తున్న ఆదరణ చూసి సీఎం జగన్ భయపడి.. టీడీపీ నేతలపై అక్రమ కేసులు ఇళ్లపై దాడులు చేస్తున్నారని దుయ్యబట్టారు. మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు ఇంటిపై దాడిని సుజాత ఖండించారు. అధికారులు, రాజకీయ నాయకుల కోసం కాకుండా రాజ్యాంగం ప్రకారం పనిచేయాలని, లేకపోతే భవిష్యత్తులో వైసీపీతో పాటు అధికారులు కూడా భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని సుజాత హెచ్చరించారు.

*అనంతబాబుకు మద్దతు దళిత వ్యతిరేక చర్యే: వర్ల
దళిత యువకుడిని దారుణంగా హత్యచేసిన ఎమ్మెల్సీ అనంతబాబును బెయిల్‌పై బయటకు తీసుకురావాలని ప్రభుత్వం నానా తంటాలు పడుతోందని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య విమర్శించారు. సోమవారం ఆయన ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని ఉద్దేశించి ట్వీట్‌ చేశారు. ‘‘దళిత ఓట్లతో అధికారంలోకొచ్చిన మీరు ఆ వర్గాలను విస్మరించి, అనంతబాబు వైపు మొగ్గడం దళిత వ్యతిరేక చర్యే. ఇప్పటికైనా దళితులకు న్యాయం చేయండి’’ అన్నారు.

*వైసీపీ ప్రభుత్వం బరితెగించింది: టీడీపీ
‘‘వైసీపీ ప్రభుత్వం బరితెగించి చివరకు రాజ్యాంగబద్ధ సంస్థ కాగ్‌కు కూడా త ప్పుడు లెక్కలు ఇస్తోంది. తప్పుడు లెక్కలు సమర్పించడంలో ఆరితేరిన వ్యక్తులు.. అధికారంలోకి వచ్చినా ఆ అలవాటు మానడం లేదు. అన్నిచోట్లా ఇదే తంతు నడిపిస్తున్నారు’’ అని తెలుగుదేశం పార్టీ ఎద్దేవా చేసింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి సోమవారం ఇక్కడ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ‘‘జగన్‌ ప్రభుత్వం చూపిస్తున్న లెక్కల్లో మతలబు తీస్తే సుమారు రూ.66 వేల కోట్ల మేర అవకతవకలు కనిపిస్తున్నాయి. కాగ్‌ విడుదల చేసిన లెక్కల ప్రకారం గత ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి నాటికి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అప్పులు రూ.51 వేల కోట్లు ఉన్నాయి. కానీ మార్చి నెలాఖరు నాటికి ఈ అప్పులు కేవలం రూ.25 వేల కోట్లు మాత్రమే ఉన్నాయని ప్రభుత్వం చెబుతోంది. కేవలం రిజర్వు బ్యాంక్‌ ద్వారా తెచ్చిన అప్పులు మాత్రమే చూపించి తాము తక్కువే తెచ్చామని ప్రభుత్వం బుకాయిస్తోంది. అదే లెక్క కాగ్‌కు కూడా ఇస్తోంది. కార్పొరేషన్ల ద్వారా తెచ్చిన అప్పుల లెక్క ఎవరికీ చూపించడం లేదు’’ అన్నారు.

*తండ్రికి తగ్గ తనయులనిపిచ్చుకున్నారు: అనిత
ఛలో నర్సీపట్నం విజయవంతం చేసిన టీడీపీ శ్రేణులకు రాష్ట్ర మహిళ అధ్యక్షరాలు అనిత అభినందనలు తెలిపారు. తండ్రికి తగ్గ తనయులుగా అయ్యన్నకొడుకులు నిలిచారని కొనియాడారు. రైతులు తమ పాస్ బుక్‌లు పరిష్కరించాలని కోరితే కాలయాపన చేసే రెవెన్యూ అధికారులు అదివారం కూడా పని చేశారంటే ఏం జరుగుతుందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఆడపిల్లలుకు అన్యాయం జరుగుతుందంటే స్పందించని పోలీసులు అయ్యన్న వ్వవహరం అత్యత్సహం చుపారన్నారు. చలో నర్సీపట్నంకు మేము అయ్యన్న ఇంటికి వెళుతుంటే మీకెంటి నెప్పి? అని ఆమె ప్రశ్నించారు. గ్రామ స్థాయి నేతలు నుండి ఇంటింటికి పోలిసుల్ని పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నర్సీపట్నంలో ఒక్క జేసీబీ అడుగుపెట్టకుండా సత్తా చుపించామన్నారు. వైసీపీ కుక్కలకు బుద్ది చెప్పాలననారు. బీసీ నాయకులు మీద చేయి వేయ్యాలంటే ఈ ప్రభుత్వం వణకాలన్నారు.

*వైసీపీ ప్రభుత్వంలో అంతా అరాచకమే: పీతల సుజాత
వైసీసీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అరాచకానికి పాల్పడుతోందని మాజీ మంత్రి పీతల సుజాత మండిపడ్డారు. సోమవారం ఆమె మీడియాతో వైసీపీ ప్రభుత్వంపై రోజురోజుకు ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందన్నారు. టీడీపీకి వస్తున్న ఆదరణ చూసి సీఎం జగన్ భయపడి.. టీడీపీ నేతలపై అక్రమ కేసులు ఇళ్లపై దాడులు చేస్తున్నారని దుయ్యబట్టారు. మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు ఇంటిపై దాడిని సుజాత ఖండించారు. అధికారులు, రాజకీయ నాయకుల కోసం కాకుండా రాజ్యాంగం ప్రకారం పనిచేయాలని, లేకపోతే భవిష్యత్తులో వైసీపీతో పాటు అధికారులు కూడా భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని సుజాత హెచ్చరించారు.

*మోదీ పాలనలో గప్పాలు, తిప్పలే: హరీశ్‌
దేశ ఆర్థిక గొప్పతనాన్ని చూపే రూపాయి, దేశ సార్వభౌమత్యాన్ని నిలిపే సిపాయి విలువ తగ్గించి, దేశ ప్రతిష్ఠను ప్రధాని నరేంద్ర మోదీ దిగజార్చారని మంత్రి హరీశ్‌రావు దుయ్యబట్టారు. రెండు దఫాలుగా కేంద్రంలో ప్రధానిగా ఉండి గప్పాలు చెప్పడం, ప్రజలను తిప్పలు పెట్టడం తప్ప చేసిందేమీ లేదని విమర్శించారు. సంగారెడ్డి జిల్లా అందోలు మండలంలోని తాలెల్మ వద్ద రూ.36.74 కోట్లతో నిర్మించిన ఎత్తిపోతల పథకాన్ని హరీశ్‌ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ మోదీ పాలనలో పెద్ద నోట్ల రద్దు వల్ల మేలు జరగకపోగా, రూపాయి విలువ అత్యంత కనిష్ఠ స్థాయికి దిగజారిందని ఆవేదన వ్యక్తం చేశారు. అగ్నిపథ్‌ పథకం కూడా ఆ బాటలోదేనని, గత కొన్నేళ్లుగా సైన్యంలో నియామకాల కోసం ఎదురు చూస్తున్న యువతకు అశనిపాతంగా మారిందని దుయ్యబట్టారు. నాలుగేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారికి రిటైర్మెంట్‌ అనంతరం, ఇస్త్రీలు చేయడం, కటింగ్‌ చేయడం నేర్పుతామంటూ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు గర్హనీయమని అన్నారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి ఈ యేడు 3 వేల డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, వచ్చే ఏడాది మరో 3 వేల ఇళ్లు మంజూరు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. త్వరలోనే ముఖ్యమంత్రి అధికారిక ప్రకటన చేయనున్నారన్నారు. అర్హులైన పేదవారికి వారి సొంత స్థలంలోనే ఇళ్లు నిర్మించుకునేలా ఈ పథకం ఉంటుదన్నారు.