—-వర్తమాన భారత రాజకీయ పరిస్థితుల పై ప్రవాస భారతీయులతో స్విట్జర్ల్యాండ్ లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన తెరాస ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల. ఈ సమావేశంలో స్విస్ తెలుగు ఎన్నారై ఫోరం అధ్యక్షురాలు పద్మజరెడ్డి, తెరాస స్విస్ శాఖ అధ్యక్షులు శ్రీధర్ గందె, హెచ్ ఎస్ ఎస్ స్విస్ ముఖ్యులు పవన్ దుద్దిళ్ళ, తెలంగాణ జాగృతి స్విస్ శాఖ అద్యక్షులు కిషోర్ తాటికొండ, స్విస్ తెలుగు సంఘ సభ్యులు అనిల్ జాల, అల్లు క్రిష్ణా కెడ్డి తదితరులు పాల్గొన్నారు. మహేష్ బిగాల గారు మాట్లాడుతూ జాతీయ స్థాయి ప్రశ్నించే గొంతులను నొక్కిన మోడీ-షా బీజేపీ ఒంటెత్తు పోకడ ను నిలువరించాలంటే కేసీఆర్ గారి లాంటి దార్శనికుడు జాతీయ రాజకీయాల్లో ముఖ్య పాత్ర పోషించాల్సన అవసరం ఉందన్నారు. ప్రతివక్షాలు పూర్తి గా విఫల మైన ఈ నమయంలో రాజకీయ శూన్యత ఉందనీ దానిని పూరించ గల సత్తాఉన్న నాయకుడు కేసీఆర్ అనీ అన్నారు.
రెండవ సారి అధికారం లోకి వచ్చాక బీజేపీ పరిపాలన నియంతృత్వ పోకడలు పోతున్నదని ఇది దేశానికి మంచిది కాదని స్విస్ తెలుగు సంఘ అధ్యక్షురాలు పద్మజారెడ్డి అన్నారు. హెచ్ఎస్ఎస్ స్విస్ ముఖ్యులు పవన్ దుద్దిళ్ళ ఎనిమిదేళ్ళ తెరాస పాలన ను కొనియాడుతూ తెలంగాణ కు తెరాస ప్రభుత్వ మే శ్రీరామ్ రక్ష అనీ.. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ లాంటి నేత రావడం దేశ భవిశ్యత్ కు సర్వతోముఖాభివృద్ధి కి ఎంతో మంచిది అన్నారు.
స్విస్ తెరాస అధ్యక్షులు శ్రీధర్ గందె మాట్లాడుతూ.. దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ పాత్ర ముగిసినా పోయిన అద్యాయమనీ నేడు నియంతృత్వ కేంద్ర ప్రభుత్వ అసంబద్ద విధానాలను ప్రశ్నించే సరైన గొంతుక కొరవడిందనీ.. కేసీఆర్ లాంటి ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి దేశ వనరులు, వాటి నద్వినియోగం పై అపార అవగాహన ఉన్న నాయకుడు జాతీయ రాజకీయాల్లోకి రావడం తక్షణావసరం అని తెలియజేశారు. సమావేశానికి హాజరైనా వారందరూ కేసీఆర్ గారు జాతీయ రాజకీయాలకు కావాలని, తమ అసమాన పరిపాలనా దక్షతతో తెలంగాణ లో సాధించిన విజయాలు తెలంగాణ అభివృద్ది నమూనా ను దేశమంతటికీ అందించాలనీ ఆకాంక్షించారు.
———-