NRI-NRT

గల్ఫ్‌ దేశాల్లో ఘనంగా యోగా దినోత్సవం

గల్ఫ్‌ దేశాల్లో  ఘనంగా యోగా దినోత్సవం

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని గల్ఫ్‌ దేశాల్లో ఘనంగా నిర్వహించారు. ఆయా దేశాల భారతీయ రాయబార కార్యాలయాల ఆధ్వర్యంలో జరిగిన ఉత్సవాల్లో అరబ్బు మహిళలు, విదేశీయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. యోగా ద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుందని గల్ఫ్‌ కూటమిలోని మొదటిసారిగా గుర్తించిన దేశం సౌదీ అరేబియా అని సీనియర్‌ భారతీయ దౌత్యవేత్త ఎన్‌.రాంప్రసాద్‌ చెప్పారు. దుబాయిలోని వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌లో జరిగిన యోగా కార్యక్రమాన్ని భారత రాయబారి సంజయ్‌ సుధీర్‌ ప్రారంభించారు. అబుధాబి క్రికెట్‌ స్టేడియంలో జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి యూఏఈ మంత్రి షేఖ్‌ నహ్యాన్‌ ముబారక్‌ అల్‌ నహ్యాన్‌ వీడియో సందేశాన్ని ఇచ్చారు. జెడ్డాలో సౌదీ యువతులు యోగా కార్వాన్‌ పేరిట ఎర్రసముద్ర తీరంలో వేసిన ఆసనాలు ఆకట్టుకున్నాయి. కువైట్‌, బహ్రెయిన్‌, ఒమాన్‌ దేశాల్లోనూ యోగా డే ఘనంగా జరిగింది.