అమెరికా ప్రభుత్వంలో మరో భారత సంతతి మహిళకు అరుదైన గౌరవం దక్కనుంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన సైన్స్ సలహాదారుగా ఇండో-అమెరికన్, ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త డాక్టర్ ఆరతి ప్రభాకర్ పేరును నామినేట్ చేశారు. ఆఫీస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ(ఓఎస్‌టీపీ టీపీ) ముఖ్య సలహాదారుగా ఆరతి ప్రభాకర్ పేరుకు సెనేట్ ఆమోద ముద్ర వేస్తే వైట్‌హౌస్ ఓఎస్‌టీపీ టీపీ చీఫ్ అడ్వైజర్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి భారత సంతతి మహిళగా 63 ఏళ్ల ఆరతి ప్రభాకర్ చరిత్ర సృష్టించనున్నారు. ఆరతి ప్రభాకర్‌కు మూడేళ్ల వయసున్నప్పుడే ఆమె కుటుంబం భారత్ నుంచి అమెరికాకు వలస వెళ్లింది.