NRI-NRT

అమెరికాలో కాల్పులు.. నల్గొండ వాసి కన్నుమూత

Auto Draft

అమెరికా మేరీల్యాండ్‌లో జరిగిన కాల్పుల్లో నల్గొండ వాసి మృతి చెందాడు. దుండగుడి కాల్పుల్లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి నక్కా సాయిచరణ్‌ (26)మృతి చెందాడు. గత రెండేళ్లుగా సాయిచరణ్‌ అక్కడ ఉంటున్నాడు.కాల్పులకు పాల్పడింది ఓ నల్లజాతీయుడిగా తేలింది. అయితే ఇది విద్వేష నేరమా? లేదంటే రెగ్యులర్‌గా జరుగుతున్న కాల్పుల కలకలమా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది.ఆదివారం సాయంత్రం స్నేహితుడిని ఎయిర్‌పోర్ట్‌లో డ్రాప్ చేసి కారులో వస్తుండగా.. ఓ నల్లజాతీయుడు కాల్పులకు తెగబడినట్లు సమాచారం. కొడుకు మృతి సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. స్థానికంగా విషాదం అలుముకుంది. కొడుకు మృతి ఘటనపై సాక్షితో.. సాయి చరణ్ తండ్రి నర్సింహా మాట్లాడారు. సాయిచరణ్ ఉదయం జరిగిన కాల్పుల్లో మృతి చెందగా.. రాత్రి పదిన్నర గంటల ప్రాంతంలో సమాచారం వచ్చింది. సాయిచరణ్‌ ఉన్నత చదువుల కోసం రెండేళ్ల క్రితం అమెరికా వెళ్లాడు. సిన్సినాటి యూనివర్శిటీ లో ఎంఎస్ పూర్తి చేశాడు. ఆరు నెలలుగా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్గా పని చేస్తున్నాడు. కొద్ది రోజుల క్రితమే కారు కొనుగోలు చేశాడు‌. నవంబర్లో స్వదేశానికి వస్తానని‌ అన్నాడు. చివరిసారిగా శుక్రవారం మాతో మాట్లాడాడు. బ్యాంకు అకౌంట్ డిటైల్స్ అడిగితే పంపించాం. సాయి చరణ్‌ మృతదేహం త్వరగా మా దగ్గరికి వచ్చేలా చూడండి.. అంటూ విదేశాంగ శాఖను కోరుతున్నాం.