DailyDose

హైదరాబాద్‌లో దారుణం.. 17 బాలికపై ఇద్దరు యువకుల అఘాయిత్యం – TNI నేర వార్తలు

హైదరాబాద్‌లో దారుణం.. 17 బాలికపై ఇద్దరు యువకుల అఘాయిత్యం – TNI  నేర వార్తలు

* పాతబస్తీలో దారుణం చోటుచేసుకుంది. చత్రినకా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఉప్పగూడలో 17 ఏళ్ల మైనర్‌ బాలికపై ఇద్దరు యువకులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. గతంలో అలి అనే యువకుడితో బాలికకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంలో బాగంగా ఉప్పుగూడలో అలి సదరు బాలికను ఇంటికి పిలిచాడు. అనంతరం తన మిత్రుడు ఆర్బాస్‌తో కలిసి అలి బాలికపై లైంగిక దాడి చేశారు. బాధిత బాలిక కుటుంబ సభ్యులు పోలీసు స్టేషన్‌ ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు నిందితులు అలి, అర్బాస్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
* ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యాత్రికులతో వెళ్తున్న మినీ వ్యాన్‌ అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. దీంతో 10 మంది యాత్రికులు మరణించారు. ఈ ప్రమాదంలో మరో ఏడుగురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. మొత్తం 18 మంది హరిద్వార్‌లో స్నానం చేసి తిరిగివెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు.
* ఖమ్మం నగరంలో మాదకద్రవ్యాలు కలకలం రేపాయి. ఖమ్మం నగరానికి చెందిన యువకుల నుంచి 30 గ్రాముల డ్రగ్స్‌ను ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హైదరాబాద్‌లో విక్రయించేందుకు తీసుకొచ్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. పట్టుబడిన యువకుల్లో ఒకరిపై బెంగళూరు, హైదరాబాద్‌లో కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పట్టుబడిన యువకుల నుంచి డ్రగ్స్‌తో పాటు గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
*తమిళనాడు లోని డిండిగల్‌ లో విషాదకరమైన ఘటన జరిగింది. ఓ పటాకుల దుకాణం లో అగ్నిప్రమాదం జరిగింది. దుకాణంలోని సామాను మొత్తం కాలిబూడిదయ్యింది. షాప్ ముందున్న ఓ కారు, బైక్ పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడని స్థానిక అధికారులు వెల్లడించారు. డిండిగల్ కాలెక్టర్ కార్యాలయం ఎదురుగా ఉండే పటాకుల దుకాణంలో బుధవారం ఈ ఘటన జరిగింది. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు జరుపుతామని డిండిగల్ ఎస్‌పీ వీ.బాస్కరన్తె లిపారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అందాల్సి ఉంది.
*ఖిలావరంగల్ మండలం నాయుడు పెట్రోల్ పంపు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీని బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు ఇల్లంద గ్రామానికి చెందిన గడ్డల మధుకర్, వర్ధన్నపేటకు చెందిన గణేష్‎గా పోలీసులు గుర్తించారు.
*చిత్తూరు: జిల్లాలోని మోస్ట్ వాంటెడ్ గంజాయి ముఠాను పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి రూ.3 లక్షల విలువ చేసే 14 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు బండపల్లికి చెందిన మోస్ట్ వాంటెడ్ టీ మోహన్ బాబుతో పాటు విజయవాడకు చెందిన ఎస్.కె. సుమతి మరో ఇద్దరు టి. పృద్వి రాజ్,టి. మోహన్‌ను చిత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
*తాలిబాన్ల పాలన మొదలయ్యాక.. పేదరికం పెరిగిపోయి.. ఆకలి కేకలు మిన్నంటుతున్న అఫ్ఘానిస్థాన్‌లో భారీ భూకంపం సంభవించింది. అఫ్ఘాన్‌ తూర్పులోని ఖోస్ట్‌ ప్రావిన్స్‌ పరిధిలోని పాక్‌ సరిహద్దులో ఉన్న పర్వత ప్రాంతం పక్టికా కేంద్రంగా భూమి కంపించడంతో.. మట్టి ఇళ్లు పెళపెళా కూలిపోయాయి. పర్వత ప్రాంతం కావడంతో.. బండరాళ్లు దొర్లిపడ్డాయి.
*ఖిలావరంగల్ మండలం నాయుడు పెట్రోల్ పంపు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీని బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు ఇల్లంద గ్రామానికి చెందిన గడ్డల మధుకర్వర్ధన్నపేటకు చెందిన గణేష్‎గా పోలీసులు గుర్తించారు.
*ఈ ఏడాది ఇంటర్‌ ఫలితాలు విద్యార్థులను తీవ్రనిరాశకు గురిచేశాయి. ఎక్కువ మంది విద్యార్థులు పరీక్ష పాస్‌కాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. వీరిలో ఇద్దరు విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారు. నెల్లూరు జిల్లా రాపూరు మండలం తెగచెర్ల గ్రామానికి చెందిన ల్ల పాపయ్య చెంచమ్మల కుమార్తె పావని(16) తిరుపతిలోని పద్మావతి విశ్వవిద్యాలయంలో ఇంటర్‌ ప్రథమ సంవత్సరం చదువుతోంది. బుధవారం వెల్లడైన ఫలితాల్లో తాను ఫెయిల్‌ అయినట్లు గ్రహించింది. దీంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్మకు పాల్పడింది. అదేవిధంగా శ్రీసత్యసాయి జిల్లా మడకశిర మండలం బుల్లసముద్రం గ్రామానికి చెందిన విద్యార్థి నందకిశోర్‌(17) ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. బుధవారం వెలువడిన ఫలితాల్లో నందకిశోర్‌ ఫెయిలయ్యాడు. దీంతో మనస్తాపం చెంది, మధ్యాహ్నం గ్రామ సమీపంలోని చెరువులోకి దూకి, ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా, కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది గ్రామానికి చెందిన ఇంటర్మీడియట్‌ సెకండియర్‌ ఎంపీసీ విద్యార్థి రావి సాయిరామ్‌ బుధవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఓ ప్రైవేటు కళాశాలలో చదువుతున్న రావి సాయిరామ్‌ ఇంటర్‌ ఫెయిలయ్యాడు. దీంతో ఇంటి నుంచి బైకుపై బయటికి వెళ్లి వస్తానని చెప్పి సముద్రతీర ప్రాంతానికి చేరుకుని పెట్రోల్‌ పోసుకుని ఒంటికి నిప్పంటించుకున్నాడు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు అడ్డుకుని మంటలార్పారు. దీంతో ప్రాణాపాయం తప్పింది.
* దంతేవాడ జిల్లాలో సీఆర్పీఎఫ్ క్యాంపుపై మావోయిస్టులు దాడి చేశారు. గంట పాటు మావోయిస్టులు కాల్పులు జరిపారు. సీఆర్పీఎఫ్ జవాన్లు ఎదురు కాల్పులు జరిపారు. దర్భ డివిజన్ మలంగేర్ ఏరియా బైలాడిల్లా కొండ కింద హీరోలి గ్రామంలో నూతనంగా ఏర్పాటుచేసిన క్యాంపుపై మావోలు దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో ఎవరికీ ఎలాంటి ప్రమాదమూ జరగలేదు. దాడిని ఏఎస్పీ రాజేంద్రజైస్పాల్ ధ్రువీకరించారు.
* గన్నవరం మండలం పురుషోత్తపట్నం గ్రామ సమీపంలో నిన్న మధ్యాహ్నం రైలు కింద పడి ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మృతుడు ముదిరాజ్ పాలెం గ్రామానికి చెందిన వెంకట నాగ సాయి(గా గుర్తించారు. ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అవ్వటంతో వెంకట నాగ సాయి మానసిక ఒత్తిడికి లోనైనట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
* వికారాబాద్ జిల్లా మెమిన్ పేట్ మండలం గేట్ వనంపల్లి సమీపంలో రైలు కిందపడి ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. వీరిద్దరూ ఇద్దరు ఇంటర్ విద్యార్థులే అని పోలీసులు భావిస్తున్నారు. ఆత్మహత్యకు పాల్పడిన వారిలోఅబ్బాయి నవాబ్ పేట్ మండలం కడ్చర్లకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. బాలిక వివరాలు తెలియాల్సి ఉంది.
* మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇండోర్‌ – ఖాండ్వా మార్గంలో బస్సు 50 అడుగుల లోతున్న లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా.. 40 మంది గాయపడ్డారు. ప్రమాద సమయంలో 50 మందికిపైగా ప్రయాణికులున్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు, అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో నుంచి క్షతగాత్రులను రక్షించి, ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. బస్సు ఇండోర్‌ నుంచి ఖాండ్వా వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నది. సిమ్రోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భైరవ్ ఘాట్‌పై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు లోయలో పడిపోయిందని సమాచారం.
* తెలంగాణ రాష్ట్ర రాజధానిలో మరో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. జూబ్లీహిల్స్ ఘటన మరవక ముందే రోజుకో దారుణం బయటకు వస్తోంది. హైదరాబాద్‌ ఛత్రినాక పరిధిలో బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. బాలిక వయసు 17 సంవత్సరాలు. ఆ బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారం చేసినట్లు పోలీసుల వివరాల ప్రకారం తెలుస్తోంది.
* వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో ఇద్దరు క్రికెట్‌ కోచ్‌లు సస్పెన్షన్‌కు గురయ్యారు. కడప క్రికెట్ అసోసియేషన్కు అనుబంధంగా నడుస్తున్న ప్రొద్దుటూరు సబ్ సెంటర్లో ఓ బాలిక క్రికెట్‌లో శిక్షణ తీసుకుంటుంది. అయితే ఆ బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో క్రికెట్ అసోసియేన్ విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఇద్దరు కోచ్లను సస్పెండ్ చేసినట్లు ప్రొద్దుటూరు క్రికెట్ యూత్ క్లబ్ నాయకులు వెల్లడించారు. వారి స్థానంలో మహిళా కోచ్‌లను నియమించినట్లు తెలిపారు.
* ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో బుల్లితెర నటుడు చాన్ బాషాపై వైకాపా కౌన్సిలర్ లావణ్య దాడి చేశారు. గాయపడిన చాన్ బాషాను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఓ స్థలం విషయంలో చాన్ భాషా, కౌన్సిలర్ మధ్య నెలకొన్న వివాదం.. దాడికి దారి తీసింది.