NRI-NRT

ఎలన్‌ మస్క్‌ కొంపముంచిన చైనా.. లక్షల కోట్లు హాంఫట్‌!

ఎలన్‌ మస్క్‌ కొంపముంచిన చైనా.. లక్షల కోట్లు హాంఫట్‌!

ఎస్‌. ఎలక్ట్రిక్‌ కార్ల దిగజం టెస్లాకు చెందిన టెక్సాస్‌, బెర్లిన్‌ కార్ల ఫ్యాక్టరీలతో బిలియన్‌ డాలర్ల నష్టాన్ని చవిచూస్తున్నట్లు ఆ సంస్థ సీఈవో ఎలన్‌ మస్క్‌ ఆందోళన వ్యక్తం చేశారు. మే31న అస్ట్రిన్‌లోని టెస్లా అఫీషియల్‌ రికగ్నైజ్‌డ్‌ క్లబ్‌ టెస్లా ఓనర్స్‌ సిలికాన్‌ వ్యాలీ ఎలన్‌ మస్క్‌తో ఇంటర్వ్యూ నిర్వహించింది. ఆ ఇంటర్వ్యూని మూడు విభాగాలుగా విడుదల చేయగా..అందులో మస్క్‌ బిలియన్‌ డాలర్లను ఏ విధంగా నష్టపోతున్నట్లు తెలిపారు. ర్లిన్‌,ఆస్టిన్‌ ఫ్యాక్టరీల్లో బిలియన్‌ డాలర్ల మనీ వేడేకెక్కుతుంది. ఒక్కముక్కలో చెప్పాలంటే మంటల్లో డబ్బు కాలిపోతుందని వ్యాఖ్యానించారు. అంతేకాదు టెస్లా టెక్సాస్ ఫ్యాక్టరీ తన కొత్త “4680” బ్యాటరీల ఉత్పత్తిని పెంచడంలో ఎదురవుతున్న సవాళ్ల కారణంగా కొద్ది మొత్తంలో కార్లను ఉత్పత్తి చేస్తుందని అన్నారు. ఇక ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ కోసం ఎక్కువగా వినియోగించే సాంప్రదాయ 2170 బ్యాటరీలు చైనా పోర్ట్‌లో ఇరుక్కుపోయాయని మస్క్ చెప్పారు.

కొంపముంచిన చైనా
ఎలన్‌ మస్క్‌ బిలియన్‌ డాలర్లు నష‍్టపోవడానికి పరోక్షంగా చైనానే కారణమని తెలుస్తోంది. ఎందుకంటే డ్రాగన్‌ కంట్రీలో పెరిగిపోతున్న కరోనా కేసుల కారణంగా లాక్‌ డౌన్‌ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దిగ్గజ కంపెనీల కార్యకలాపాలు ఎక్కువగా నిర్వహించే షాంఘైలో సైతం షట్‌డౌన్‌ కొనసాగుతుంది.ఇతర సంస్థలతో పాటు షాంఘైలో టెస్లా కార్‌ ప్రొడక్షన్‌ ఆగిపోయింది. ఆ ప్రభావం టెస్లా షాంఘై ఫ్యాక్టరీతో పాటు కాలిఫోర్నియా ప్లాంట్‌పై పడింది. ఎందుకంటే? టెస్లా కార్ల విడిభాగాలు కొన్ని చైనాలో తయారవుతాయి. వాటిని చైనా నుంచి కాలిఫోర్నియా ప్లాంట్‌కు రవాణా చేస్తారు. అలా ఇంపోర్ట్‌ అయిన విడిభాగాలతో టెస్లా కార్లను తయారు చేస్తుంది.

ఉద్యోగులకు జీతాలు ఎలా చెల్లిస్తాం.
కరోనా కారణంగా గత రెండేళ్లుగా సప్లయ్‌ చైన్‌ సమస్యల్ని ఎదుర్కొంటున్నాం. మేం ఇంకా ఆ సమస్య నుంచి బయట పడలేదని ఇంటర్వ్యూలో ఎలన్‌ మస్క్‌ వాపోయారు. ఇన్ని సమస్యలతో సంస్థలు దివాళా తీయకుండా కార్ల తయారీని ఎలా కొనసాగించాలి. ఉద్యోగులకు జీతాలు ఎలా చెల్లించాలని ప్రశ్నించారు.

తప్పేం లేదు
ఇక ఇటీవల ఎలన్‌ మస్క్‌ టెస్లా ఉద్యోగుల తొలగింపు నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉన్న పళంగా 10శాతం మంది ఉద్యోగుల్ని ఎలా తొలగిస్తారంటూ పలువురు మస్క్‌ను ప్రశ్నిస్తున్నారు. ఈ తరుణంలో టెస్లా భారీగా నష్టపోతుందని, అందుకు గల కారణాల్ని వివరించడంతో నెటిజన్‌లు మస్క్‌కు అండగా నిలుస్తున్నారు. ఖర్చు తగ్గించుకునేందుకు ఉద్యోగుల తొలగింపు సబబేనన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.