NRI-NRT

ఈ నెల 26న తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ‘నెలనెలా తెలుగు వెలుగు’

ఈ నెల 26న తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ‘నెలనెలా తెలుగు వెలుగు’

ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (TANA) ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ‘నెల నెలా తెలుగు వెలుగు’ 36వ సాహిత్య సదస్సు ఈ నెల 26న వర్చువల్‌గా నిర్వహించనున్నారు. ఈసారి తెలుగు భాష, సాహిత్య వికాసానికి “మేము సైతం” పేరిట ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ సాహితీ సదస్సుకు ముఖ్య అతిథిగా ఆచార్య వెల్చేరు నారాయణ రావు, ప్రత్యేక అతిథిగా జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు విచ్చేయనున్నారు. ప్రతి నెలా ఆఖరి ఆదివారం జరిగే ఈ అంతర్జాతీయ అంతర్జాల దృశ్య సమావేశం జూన్ 26న భారత కాలమానం ప్రకారం రాత్రి 8:30 గంటలకు, అమెరికా కాలమానం ప్రకారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. ఈ సదస్సుకు అందరూ ఆహ్వానితులే. తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు, తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయ కర్త చిగురుమళ్ళ శ్రీనివాస్, తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర ఆధ్వర్యంలో ఈ సదస్సు నిర్వాహణకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.

ఈ కార్యక్రమాన్ని ఈ క్రింది ప్రసార మాధ్యమాల ద్వారా వీక్షించవచ్చు:1. TANA TV Channel – in YuppTV2. Facebook: https://www.facebook.com/TANAsocial
3. YouTube: https://www.youtube.com/channel/UCwLhSy1ptf0i1CioyeZmzrw
4. https://youtube.com/teluguone
5. www.youtube.com/tvasiatelugu
6. www.youtube.com/manatv
7. https://www.etvbharat.com/telugu/andhra-pradesh
8. https://www.etvbharat.com/telugu/telangana
మిగిలిన వివరాల కోసం www.tana.org అధికారిక వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
https://i.ibb.co/St6MP4r/r6.jpg