తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌లోని ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ జూలై 3న ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు బంగారు బోనం సమర్పించనుంది. కమిటీ సభ్యులు బుధవారం విజయవాడలో దుర్గగుడి ఈవో భ్రమరాంబతో సమావేశమై చర్చించారు. కార్యక్రమ వివరాలను ఆలయ ఈవో, ఇంజనీరింగ్ అధికారులకు వివరించారు. ఈ ఏడాది బంగారు బోనం సమర్పించే కార్యక్రమాన్ని మరింత వైభవంగా నిర్వహించేలా కార్యాచరణ రూపొందించినట్లు కమిటీ ప్రతినిధులు ఈవోకు వివరించారు. ఈవోను కలిసిన వారిలో వైస్ చైర్మన్ ఆనందరావు, గాజుల అంజయ్య, మధుసూదన్‌గౌడ్, అన్సరాజ్ తదితరులున్నారు.