* ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఉద్దేశం లేదని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ విశాఖకు పరిపాలనా రాజధాని వచ్చితీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఎవరు అడ్డుకున్నా.. ఎవరు అవునన్నా.. కాదన్నా విశాఖ ఎగ్జిక్యూటీవ్ క్యాపిటల్అ వుతుందన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు తలకిందులుగా తపస్సు చేసినా దీన్ని ఆపే శక్తి ఆయనకు లేదన్నారు. కొన్ని అనివార్య కారణాలవల్ల విశాఖకు పరిపాలనా రాజధాని రావడం ఆలస్యమైందన్నారు. తప్పకుండా ఎగ్జిక్యూటీవ్ క్యాపిటల్ విశాఖకు మారుతుందని విజయసాయి రెడ్డి మరోసారి స్పష్టం చేశారు.
* అప్పుడు చర్యలు తీసుకుని ఉంటే.. ఇప్పుడు ఇలా జరిగేది కాదు: వర్ల రామయ్య
గుడివాడ క్యాసినో నేరస్థులపై పోలీసులు చర్యలు తీసుకోకపోవడం వల్లే కంకిపాడులో నిన్న (జూన్ 22) మరో క్యాసినో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారని తెదేపా నేత వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. కంకిపాడులో అక్రమ క్యాసినో నిర్వహించేందుకు ప్రయత్నించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆయన డీజీపీకి లేఖ రాశారు. ఎన్టీఆర్ జిల్లా కంకిపాడులో అక్రమ క్యాసినో నిర్వహించేందుకు ప్రయత్నించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ తెదేపా నేత వర్ల రామయ్య డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి లేఖ రాశారు. వైకాపా నాయకుల మద్దతుతో రాష్ట్రంలో కొందరు జూదం, క్యాసినో కల్చర్ను ప్రోత్సహిస్తున్నారని ఆయన మండిపడ్డారు. సంక్రాంతి సందర్భంగా కొడాలి నాని గుడివాడలో నిర్వహించిన అక్రమ క్యాసినోపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన ధ్వజమెత్తారు. గుడివాడ క్యాసినో నేరస్థులపై పోలీసులు చర్యలు తీసుకోకపోవటం వల్లే కంకిపాడులో నిన్న (జూన్ 22) మరో క్యాసినో నిర్వహించేందుకు ప్రయత్నించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కంకిపాడు క్యాసినో ఈవెంట్ వెనుక ఉన్న సూత్రధారులను వెంటనే విచారించి తగు చర్యలు తీసుకోవాలని ఆయన లేఖలో కోరారు.
* సీఎం జగన్ది సామాజిక న్యాయం కాదు.. సామాజిక ద్రోహం: పంచుమర్తి
ముఖ్యమంత్రి జగన్ చేసేది సామాజిక న్యాయం కాదని.. సామాజిక ద్రోహమని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ దుయ్యబట్టారు. రిజర్వేషన్లలో కోత విధించి 16,800 మంది బీసీలను రాజకీయంగా ఎదగకుండా అడ్డుకోవటం సామాజిక న్యాయమా ? అని ప్రశ్నించారు. పల్నాడు ప్రాంతంలో 12 మంది బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారు హత్యకు గురైతే.. నిందితులపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.పల్నాడు ప్రాంతంలో 12 మంది బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారు హత్యకు గురైతే.. నిందితులపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ ప్రభుత్వాన్ని నిలదీశారు. సామాజిక న్యాయం అంటే ఇదేనా? అని ప్రశ్నించారు.పల్నాడులో మారణహోమం సృష్టిస్తున్న పిన్నెల్లిపై చర్యలు తీసుకోకపోగా.. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళ్తున్న నారా లోకేశ్‌ను అడ్డుకుంటారా ? అని మండిపడ్డారు. పరామర్శకు వెళ్లకుండా అర్థం లేని కారణాలను సాకుగా చెప్పి నోటీసులివ్వటం దారుణమన్నారు. రిజర్వేషన్లలో కోత విధించి 16,800 మంది బీసీలను రాజకీయంగా ఎదగకుండా అడ్డుకోవటం సామాజిక న్యాయమా ? అని ప్రశ్నించారు. సీఎం జగన్ చేసేది సామాజిక న్యాయం కాదని..,సామాజిక ద్రోహమని పంచుమర్తి దుయ్యబట్టారు.
*అలాగైతేనే అమ్మఒడి అందుతుంది : మంత్రి బొత్స
విజయనగరంలో “అమృత్” పథకంలో భాగంగా.. 196 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన 1500 కేఎల్ లీటర్ల సామర్థ్యం గల వాటర్ స్టోరేజ్ ట్యాంక్ను విద్యాశాఖ మంత్రి బొత్స ప్రారంభించారు. గత మూడేళ్లలో 7,600 కేఎల్ లీటర్ల సామర్థ్యం గల స్టోరేజ్ ట్యాంకులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే లక్ష్యంతో ఉన్నామని స్పష్టం చేశారు. విజయనగరంలో ప్రతి ఇంటికీ కొళాయి కనెక్షన్ మంజూరు చేయాలనే లక్ష్యంతో నగర పాలక సంస్థ, ప్రజా ప్రతినిధులు పనిచేస్తున్నారని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. నగరంలో అమృత్ పథకంలో భాగంగా 196 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన 1500 కేఎల్ లీటర్ల సామర్థ్యం గల వాటర్ స్టోరేజ్ ట్యాంక్ను మంత్రి ప్రారంభించారు. గత మూడేళ్లలో 7600 కేఎల్ లీటర్ల సామర్థ్యం గల స్టోరేజ్ ట్యాంకులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇప్పటి వరకు నగరంలో గత మూడేళ్లలో 4800 కేఎల్ లీటర్ల సామర్థ్యం గల ఐదు స్టోరేజ్ ట్యాంక్లను ప్రారంభించామన్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే లక్ష్యంతో ఉన్నామని స్పష్టం చేశారు.అలాగైతేనే అమ్మఒడి అందుతుందిఅమ్మ ఒడి లబ్ధిదారులు సంఖ్య తగ్గిందనడం అవాస్తమని.. పాఠశాల హాజరు ఆధారంగానే లబ్దిదారుల ఎంపిక జరిగిందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. పిల్లలను సక్రమంగా బడికి పంపితేనే పథకం వర్తిస్తుందని.. 75 శాతం హాజరు తప్పనిసరిగా ఉండాలని ముందుగానే చెప్పామని స్పష్టం చేశారు.ఇంటర్లో ఫలితాలు ఏమాత్రం తగ్గలేదని.. 2019 కంటే మెరుగైన ఫలితాలే వచ్చాయన్నారు. పాఠశాల, కళాశాల్లో అధ్యాపకుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి, ఎమ్మెల్సీ రఘు వర్మ, మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్లు కోలగట్ల శ్రావణి, రేవతి, కమిషనర్ శ్రీరాములు నాయుడు తదితరులు పాల్గొన్నారు.
*తెదేపా అధికారంలోకి వస్తే అన్న క్యాంటీన్లు మళ్లీ తెరుస్తాం: అశోక్‌గజపతి
తెదేపా అధికారంలోకి వస్తే అన్న క్యాంటీన్లు మళ్లీ తెరుస్తామని తెదేపా సీనియర్ నేత అశోక్ గజపతి రాజు అన్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో అన్న క్యాంటీన్ సంచార వాహనాన్ని ప్రారంభించిన ఆయన.. గత ప్రభుత్వ పథకాలను జగన్ సర్కారు నిలిపివేయటం దారుణమన్నారు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి రెండూ పోయాయని తెదేపా సీనియర్ నేత అశోక్ గజపతి రాజు వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వ పథకాలను నిలిపివేయడం దారుణమన్నారు. తెదేపా అధికారంలోకి వస్తే అన్న క్యాంటీన్లను తిరిగి తెరుస్తామన్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గ తెదేపా ఇంచార్జి బేబీ నాయన జన్మదినాన్ని పురస్కరించుకుని రేపటి నుంచి బొబ్బిలిలో అన్న క్యాంటీన్ నిర్వహించనున్నారు.ఈ కార్యక్రమం నిర్వహణ కోసం ప్రత్యేక రూపొందించిన మొబైల్ వాహనాన్ని జిల్లా తెదేపా కార్యాలయంలో అశోక్ గజపతిరాజు, బేబీ నాయన ప్రారంభించారు. బొబ్బిలి నియోజకవర్గంలో అన్న క్యాంటీన్ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణకు ముందుకొచ్చిన బేబీ నాయన, వారి సహచర బృందాన్ని ఆయన అభినందించారు. ఇది ఒక్క బొబ్బిలికే పరిమితం కాకుండా అన్ని నియోజకవర్గాల్లోనూ అమలు చేస్తే బాగుటుందని అశోక్ అభిప్రాయపడ్డారు.
* మహా సర్కార్‌ను కూల్చేందుకు కాషాయ పార్టీ కుట్ర : మల్లికార్జున్ ఖర్గే
మహారాష్ట్ర పరిణామాలపై కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే కాషాయ పార్టీ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. మహారాష్ట్రలోని మహా వికాస్ అఘడి (ఎంవీఏ) సర్కార్‌ను అస్ధిర పరిచేందుకు బీజేపీ కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఎంవీఏ ప్రభుత్వం సుపరిపాలన అందిస్తూ సుస్ధిరంగా కొనసాగుతుంటే ప్రభుత్వాన్ని అస్ధిరపరిచేందుకు బీజేపీ ప్రతి అవకాశాన్నీ వాడుకుంటోందని దుయ్యబట్టారు. మహారాష్ట్రలో తమ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు బీజేపీ ఎంవీఏ సర్కార్‌ను కూలదోస్తోందని మండిపడ్డారు.
*శివసేన ఎవరితోనైనా వెళ్లవచ్చు… కాంగ్రెస్‌కు సమస్య లేదు: నానా పటోలే
మహారాష్ట్ర రాజకీయాలు పలు ములుపులు తిరుగుతున్నాయి. శివసేన మంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలో ఆ పార్టీకి చెందిన 40 మందికిపైగా ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసి అస్సాం రాజధాని గౌహతిలో మకాం వేశారు. దీంతో శివసేన చీలికదశకు చేరగా, ఆ పార్టీ చీఫ్, సీఎం ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ (ఎంవీఏ) కూటమి ప్రభుత్వం పడిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో శివసేన ఎంపీ సంజయ్ రౌత్, గురువారం కీలక ప్రకటన చేశారు. రెబల్స్ ఎమ్మెల్యేలు ముంబైకి తిరిగి వచ్చి సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో చర్చిస్తే ఎంవీఏ కూటమిని వీడేందుకు కూడా సిద్ధమని అన్నారు.
*మహారాష్ట్ర ఎమ్మెల్యేలను బెంగాల్‌కు పంపండి… మంచి ఆతిథ్యం ఇస్తాం: మమతా బెనర్జీ
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కేంద్రంలోని అధికార బీజేపీపై మరోసారి మండిపడ్డారు. మహారాష్ట్రలోని మహావికాస్ అఘాడీ (ఎంవీఏ) ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నడాన్ని విమర్శించారు. వరదలతో సతమతమవుతున్న అస్సాంకు మహారాష్ట్ర ఎమ్మెల్యేలను ఎందుకు పంపారని ప్రశ్నించారు. ‘మహారాష్ట్ర ఎమ్మెల్యేలను బెంగాల్‌కు పంపండి. వారికి మంచి ఆతిథ్యం ఇస్తాం’ అని వ్యాఖ్యానించారు. శివసేన మంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృతంలో తిరుబాటు చేసిన ఆ పార్టీ ఎమ్మెల్యేలు గౌహతిలో బస చేసిన రాడిసన్ బ్లూ హోటల్ వద్ద టీఎంసీ కార్యకర్తలు గురువారం నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ ఈ మేరకు స్పందించారు. ‘బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని బుల్డోజర్‌తో కూల్చివేసింది. ఇది నాకు చాలా బాధగా అనిపించింది. బీజేపీ ప్రభుత్వం సమాఖ్య నిర్మాణాన్ని పూర్తిగా కూల్చివేయడం దురదృష్టకరం’ అని అన్నారు.
*రోజురోజుకు Janasenaకు జనాదరణ పెరుగుతోంది: Pothina Mahesh
రోజురోజుకు జనసేనకు జనాదరణ పెరుగుతోందని, అభిమానులు, కార్యకర్తలు పండుగలా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఆ పార్టీ నేత పోతిన మహేష్అ న్నారు. గురువారం, 41 డివిజన్‌లో జనసేన పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అధికార పార్టీ నేతలు అక్రమాలు, అవినీతికి పాల్పడుతున్నారని, భూకబ్జాలు, అక్రమ నిర్మాణాలు, ఉద్యోగాల అమ్మకాలను యధేచ్చగా సాగిస్తున్నారని విమర్శించారు. మాజీ మంత్రి వెల్లంపల్లి పశ్చిమ నియోజకవర్గ అభివృద్దిని గాలికొదిలేశారని, ప్రజా సమస్యలను పట్టించుకోని ఆయన కేవలం వ్యక్తిగత అభివృద్దిపైనే దృష్టి పెట్టారని ఆరోపించారు. నాగబాబు అనే యువకుడు వెల్లంపల్లి అవినీతిని ప్రశ్నిస్తే.. అరెస్టు చేయించారని, జనసేన నాగబాబుకు అండగా ఉండబట్టే ఆయనను పోలీసులు విడిచిపెట్టారని పోతిన మహేష్ అన్నారు.
*జగన్ రెడ్డిది సిగ్గు లేని జన్మ: Nara Lokesh
సీఎం జగన్ రెడ్డి ఉన్న ఏ ఒక్క కంపెనీ జగన్ రెడ్డి తెచ్చింది కాదన్నారు. ఏపీని ఎలక్ట్రానిక్స్ హబ్‌గా మార్చేందుకు నాటి సీఎం చంద్రబాబు చేసిన కృషి ఫలితంగా ఎలక్ట్రానిక్ కంపెనీలు రాష్ట్రానికి వచ్చాయన్నారు. ‘ఎవరికో పుట్టిన బిడ్డకి తానే తండ్రి అని చెప్పుకోవడం వ్యసనంగా మారిన జగన్ రెడ్డి మరోసారి ఆ ప్రయత్నం చేసి అడ్డంగా దొరికిపోయాడని నారా లోకేష్ ట్వీట్‌లో విమర్శించారు.
*Jagan reddy చేసింది సామాజిక న్యాయం కాదు.. సామాజిక ద్రోహం: Anuradha
దేశంలోని రాజకీయ నాయకుల్లో పచ్చి అబద్దాల కోరుగా సీఎం జగన్ రెడ్డి ని గిన్నిస్ బుక్‌లో రికార్డు నమోదు చేయాలని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ అన్నారు. గురువారం ఆమె ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ సామాజిక న్యాయం చేసి బీసీలను తానే ఉద్దరించినట్టు సీఎం పచ్చి అబద్దాలు చెబుతున్నారని, జగన్ చేసింది సామాజిక న్యాయం కాదని, సామాజిక ద్రోహమని విమర్శించారు.పల్నాడులో 12 మంది బడుగు, బలహీన వర్గాలు హత్య గావించబడితే నిందితులపై ఏం చర్యలు తీసుకున్నారు?.. సామాజిక న్యాయం అంటే ఇదేనా? అని ప్రశ్నించారు. జాలయ్య యాదవ్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న లోకేశ్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించటం దుర్మార్గమన్నారు. పేరుకే బీసీలకు మంత్రి పదవులు.. పెత్తనమంతా సజ్జల, వైవీ సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డిలదేనని అనురాధ విమర్శించారు.
*నా నియోజకవర్గానికి తప్పకుండా వస్తా.. ఏం జరుగుతుందో చూస్తా..: Raghurama
తన సొంత నియోజకవర్గంలో పర్యటించేందుకు తప్పకుండా వెళతానని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 5వ తేదీ తర్వాత తనపై ఎన్ని కేసులు పెట్టుకున్నా పరవాలేదని, న్యాయపోరాటం చేస్తానని చెప్పానన్నారు. మరి ఏం జరుగుతుందో చూద్దామన్నారు. తానైతే నూటికి నూరు శాతం భీమవరం వస్తానని రఘురామ మరోసారి స్పష్టం చేశారు.ఏపీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటన నేపథ్యంలో తాను రాష్ట్రానికి వస్తే అరెస్టు చేయవలసి వస్తుందని హెచ్చరికలు చేసిన నేపథ్యంలో తన సొంత నియోజకవర్గంలో జరిగే కార్యక్రమానికి హాజరవ్వడానికి భద్రత కావాలని రఘురామ కృష్ణంరాజు కేంద్ర హెంశాఖకు విజ్ఞప్తి చేశారు. ఏపీలో పర్యటించేందుకు జగన్ ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తనను అక్రమంగా అరెస్టు చేయడానికి ఏపీ ప్రభుత్వం చూస్తోందన్నారు. తన అరెస్టుకు సీఎం కార్యాలయం నుంచి ఆదేశాలు ఉన్నాయని రఘురామ వ్యాఖ్యానించారు. ఒక ప్రజాప్రతినిధిని అడ్డుకునే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా? అని ప్రశ్నించారు. సొంత పార్టీ ఎంపీకే ఇలా జరిగితే.. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని రఘురామ అన్నారు.
*అప్పుడు అమ్మఒడి అన్నారు.. అధికారంలోకి రాగానే మోసం చేశారు: దేవినేని
ఎన్నికలముందు అందరికీ అమ్మఒడి అన్నారని.. అధికారంలోకి రాగానే ఒక్కరికే అంటూ మోసం చేశారని మాజీ మంత్రి దేవినేని ఉమ ట్విటర్ వేదికగా పేర్కొన్నారు. నిబంధనల పేరుతో లక్షలమందికి కోత విధించారని విమర్శించారు. ల్యాప్ టాప్ ఆప్షన్ ఎంచుకున్న 5లక్షల మంది పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వం చెయ్యాల్సిన మరుగుదొడ్ల నిర్వహణ ఖర్చు విద్యార్థుల దగ్గర వసూలు చేయడం మీ ప్రభుత్వ అసమర్థత కాదా జగన్ అని దేవినేని ఉమ ప్రశ్నించారు.
*హాఫ్ టికెట్ జగన్ ఏం చదవాడో ఎవరూ చెప్పరే: Anam
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ నేతలపై టీడీపీ రాష్ట్ర అధికార ప్రతనిధి ఆనం వెంకటరమణారెడ్డి విరుచుకుపడ్డారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ… ‘‘హాఫ్ టికెట్ జగన్ మోహన్ రెడ్డి ఏం చదివాడో చెప్పమంటే ఒక్కరూ నోరు మెడపడంలేదు. జగన్ పది కూడా పాసయ్యాడో.. లేదో? ఇంటర్ ఫెయిలయ్యాడు. చదువురాని పప్పు.. జగన్’’ అంటూ వ్యాఖ్యలు చేశారు. వ్యవసాయ శాఖ చేసే కాకాణికి టీడీపీ నేత లోకేష్ చదువు తెలుసా అని ప్రశ్నించారు. ఈ క్రమంలో అమెరికాలో లోకేష్‌కు ఇచ్చిన ఎంబీఏ సర్టిఫికెట్‌ను మీడియాకు ఆనం విడుదల చేశారు. ఆత్మకూరు ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి లేకుండానే అధికార పార్టీకి చమటలు పట్టాయన్నారు. 16 మంది మంత్రులు, 22 మంది ఎమ్మెల్యేలు ఆత్మకూరు ఉపఎన్నికలకు చమటోడ్చారని తెలిపారు. ‘‘కౌంటింగ్ రోజు మంత్రులు, ఎమ్మెల్యేలు నెల్లూరుకి రావాలని కోరుతున్నాను. లక్ష ఓట్లు మెజార్టీ వస్తే… పొట్టేళ్లు కోసి మా ఇంట్లో మంత్రులు, ఎమ్మెల్యేలకు భోజనం పెడుతా’’ అంటూ ఆనం వెంకటరమణారెడ్డి అన్నారు.
*ప్రజా ప్రభుత్వాలంటే మోదీకి ఇష్టంలేదు: తలసాని
ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రజా ప్రభుత్వాలు ఉండటం ప్రధాని నరేంద్ర మోదీకి ఇష్టం లేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బీజేపీ నేతల వైఖరి, కేంద్ర ప్రభుత్వ విధానాలతో ప్రపంచ దేశాల ముందు భారతదేశ పరువు, ప్రతిష్ఠలు దిగజారుతున్నాయని పేర్కొన్నారు. బుధవారం ఆదర్శనగర్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థను ఖూనీ చేస్తున్నారని, మధ్యప్రదేశ్‌లో వ్యవహరించిన విధంగానే మహారాష్ట్ర ప్రభుత్వాన్నీ కూల్చే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.
*పల్లె ప్రగతి హామీలను నెరవేర్చాలి: ఎర్రబెల్లి
పల్లె ప్రగతిలో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆయా శాఖల ఉన్నతాధికారులను ఆదేశించారు. బుధవారం నగరంలోని తన నివాసంలో అధికారులతో సమీక్షించిన మంత్రి.. హామీలను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని సూచించారు. సీసీ రోడ్లు, గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణాలు మొదలు పెట్టాలని, స్ర్తీ నిధి రుణాల ద్వారా ఇంటింటికీ సోలార్ ప్రాజెక్టు పనులు ప్రారంభించాలన్నారు. ప్రయోగాత్మకంగా మహిళా గ్రూపులకు కుట్టు శిక్షణ ఇప్పిస్తున్నామని, జిల్లాకు వెయ్యి మంది మహిళా లబ్థిదారులను ఎంపిక చేయాలన్నారు.
*వర్గీకరణ తేల్చకపోతే బీజేపీకి సెగ: మందకృష్ణ
ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత అంశంపై నిర్ణయం తీసుకోకుండా హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తే మాదిగల నిరసన సెగ చవిచూడాల్సి ఉంటుందని ఎమ్మార్పీఎస్ వ్యవస్ధాపక అధ్యక్షుడు మందకృష్ణమాదిగ హెచ్చరించారు. బుధవారం పార్శీగుట్ట కేంద్ర కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా జూలై 2న సడక్‌బంద్, 3న చలో హైదరాబాద్‌కు పిలుపునిచ్చామన్నారు. కర్ణాటకతో పాటు తెలుగునేలపై ఉన్న మాదిగలందరూ బీజేపీకి వ్యతిరేకంగా రోడ్ల మీద నిరసనలో పాల్గొంటారన్నారు. 28 సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణను పదే, పదే సమర్థిస్తూ మాట్లాడిన బీజేపీ పెద్దలు కేంద్రాన్ని ఒప్పించి పార్లమెంట్‌లో బిల్లు పెట్టించటంలో విఫలమయ్యారని ఆయన మండిపడ్డారు.
*గతంలో పోలిస్తే అత్యాచారాలు పెరిగిపోయాయి: వైఎస్ షర్మిల
మాట ముచ్చట కార్యక్రమంలో భాగంగా తెలంగాణ వైఎస్సార్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నడిగూడెం మండలం వల్లాపురం గ్రామస్తులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తెలంగాణలో కౌలు రైతుల పరిస్థితి అధ్వానంగా ఉందన్నారు. వారు బ్యాంకుల దగ్గర డీ ఫాల్టర్లుగా మిగిలిపోయారని పేర్కొన్నారు. రాష్ట్రంలో మహిళలపై హత్యలు, అత్యాచారాలు గతంలో పోలిస్తే నాలుగు రెట్లు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వాహనాల్లో టీఆర్ఎస్ నేతల బిడ్డలే అత్యాచారాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
*జీవోలిచ్చి డబ్బులివ్వరా: చంద్రబాబు
నీరు చెట్టు పథకం కింద చేసిన పనులకు బిల్లులు చెల్లిస్తామని జీవోలు ఇచ్చి డబ్బులు ఇవ్వకపోవడం దారుణమని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. బుధవారం ఆయనను ఇక్కడ ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో నీరు చెట్టు ఫిర్యాదుల విభాగం బాధ్యులు కలిసి చర్చించారు. సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు ఆళ్ల వెంకట గోపాల కృష్ణారావు నాయకత్వంలో ఈ బృందం కలిసింది.‘‘ హైకోర్టు ఆదేశాలను అమలు చేయకపోతే ధిక్కార పిటిషన్లు దాఖలు చేయాలి. ఈ పనులు చేసిన రైతులకు ఆఖరి రూపాయి కూడా వచ్చేవరకూ అండగా ఉండాలి. ఇప్పటికే 280 మంది రైతులు ధిక్కార పిటిషన్లు వేశారు. దాని ఫలితంగానే ప్రభుత్వం జీవోలు ఇచ్చింది. జీవోలు ఇచ్చినా రైతుల ఖాతాల్లోకి మాత్రం డబ్బులు రాలేదు’’ అని బాబు అన్నారు. చంద్రబాబును కలిసిన వారిలో సంబంధిత కమిటీ సభ్యులు జరుగుల పుల్లయ్య, కవులూరి రాజా చంద్రమౌళి తదితరులు ఉన్నారు.
*ఇంటర్ ఫెయిలయింది జగనే: డోలా
‘‘ఇంటర్ పరీక్షల్లో ఫెయిలైంది విద్యార్థులు కాదు. ముఖ్యమంత్రి జగన్‌రెడ్డే. కళాశాలల్లో విద్యా బోధన సవ్యంగా జరిపించలేని వైసీపీ ప్రభుత్వ అసమర్థత వల్లే ఉత్తీర్ణత శాతం తగ్గింది’’ అని టీడీపీ ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శించారు. బుధవారం ఇక్కడ తమ పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘‘టీడీపీ ప్రభుత్వ హయాంతో పోలిస్తే ఇంటర్‌లో ఉత్తీర్ణత శాతం తగ్గింది. ఆంధ్రప్రదేశ్‌లో బాగా చదువు చెబుతారని మొదటి నుంచి పేరు. దానికి తగినట్లుగానే ఫలితాలు వచ్చేవి. జగన్‌రెడ్డి ప్రభుత్వం చివరకు ఆ పేరు కూడా చెడగొట్టింది. విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించింది. ఇంతకు ముందు విద్యా మంత్రిగా ఉన్న ఆదిమూలపు సురేశ్ కూడా ఈ భ్రష్టత్వానికి ఒక కారకుడు. ముఖ్యమంత్రి, మంత్రి ఇద్దరూ కలసి విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేశారు’’ అని విమర్శించారు.
*అవసరమైతే డీఎస్సీ నిర్వహిస్తాం: మంత్రి Botsa
ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి ఇప్పటికే టెట్ పరీక్ష నిర్వహించామని అవసరమైతే డీఎస్సీ నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ… ఉపాధ్యాయుల క్రమబద్ధీకరణకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయాల్లో వెనక్కి తగ్గమని స్పష్టం చేశారు. 884 హై స్కూల్స్‌ను జూనియర్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేస్తున్నామన్నారు. వాటిల్లో ఈ ఏడాది ఫస్ట్ ఇయర్ తరగతులు ప్రారంభిస్తామని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న 679 మండలాల్లో ప్రతి మండలంలో రెండు జూనియర్ కాలేజీలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. బాలికల కోసం ప్రత్యేక జూనియర్ కాలేజ్ ఉండాలనేది ప్రభుత్వ నిర్ణయమని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.
*ఏపీని మద్యం మత్తులో ముంచాలని జగన్ పధకం: Alapatii raja
ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మోసపూరిత పాలన చేస్తున్నారని మాజీ మంత్రి ఆలపాటి రాజా విమర్శించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల ముందు చెప్పిన మాటలకు అధికారంలో చేసే పనులకు పొంతన లేదన్నారు. మద్యం నిషేధంపై జగన్ రెడ్డి గొప్ప గొప్ప మాటలు చెప్పారని… మద్యపాన నిషేధం అంశం ఏమైందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. టీచర్‌లతో మద్యం అమ్మించిన ఘనత జగన్ రెడ్డికే దక్కుతుందన్నారు. 24/7 మద్యం ఏపీలో అన్ని చోట్ల అందుబాటులో ఉంటుందని అన్నారు. మద్యంతో పాటు గంజాయి కూడా విచ్చలవిడిగా అమ్ముతున్నారని మండిపడ్డారు. నవరత్నాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని తెలిపారు. మద్యం ద్వారా మగాళ్లను దోచుకుని మహిళలకు సంక్షేమ పధకాలు ఇస్తున్నారని వ్యాఖ్యానించారు. మద్యంపై అప్పులు తేవడం సిగ్గు చేటన్నారు. రాష్టాన్ని మద్యం మత్తులో ముంచాలని జగన్ పధకం చేస్తున్నారని ఆరోపించారు. ఆదాయంపై ప్రభుత్వం దొంగ లెక్కలు చూపుతోందని ఆలపాటి రాజా అన్నారు.
*తెరాస ఎమ్మెల్యేలు ఎవరు టచ్‌లో ఉన్నారో చెప్పాలి..: తలసాని
ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలు ఉండటం ప్రధాని మోదీకి ఇష్టం లేదని, అడ్డదారిలో అధికారం పొందాలనే ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేస్తూ ప్రపంచ దేశాల ముందు భారత ప్రతిష్ఠను దిగజారుస్తున్నారని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ధ్వజమెత్తారు. బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెరాస ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నట్లు భాజపా పెద్దలు చెబుతున్నారని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. ఉన్నారంటే రమ్మనండి. ఎదుర్కోడానికి మేమూ సిద్ధమే. కర్ణాటక, మహారాష్ట్ర, గోవాలలో మాదిరి డ్రామా చేయాలనుకుంటే రండి.. అని మంత్రి సవాల్ విసిరారు. ‘త్వరలో నగరంలో జరిగే భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలకు వస్తున్న ఆ పార్టీపాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు వివిధరంగాల్లో హైదరాబాద్ ప్రగతిని ప్రత్యక్షంగా చూసి తెలుసుకుంటార’ని మంత్రి బదులిచ్చారు.