* చింతామణి నాటక నిషేదంపై స్టే ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిరాకరించింది. నాటకాన్ని నిషేదిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై స్టే ఇవ్వాలని రఘురామకృష్ణ రాజు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు రఘురామకృష్ణ రాజు తరపు న్యాయవాది అభ్యర్థనను తోసిపుచ్చింది. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి హైకోర్టు ధర్మాసనం అంగీకరించలేదు. అయితే, నాటకానికి సంబంధించిన అసలు పుస్తకం ట్రాన్ల్సేట్ వెర్షన్ సమర్పించాల్సిందిగా ఆదేశించింది. కేసు తదుపరి విచారణను ఆగస్టు 17కు వాయిదా వేసింది.
*బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ భూముల వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. మాసాయిపేట మండలం అచ్చంపేట అచ్చంపేట గ్రామాల పరిధిలో జమున హేచరీస్ కబ్జా చేసిన భూములను రైతులకు తిరిగి ఇవ్వాలంటూ రజక సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడికి యత్నించారు. వర్షం కాలం వస్తుంది వారం పది రోజుల్లో భూములు అందించకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని రైతులు హెచ్చరిస్తున్నారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని రైతులకు నచ్చజెప్పేందుకు యత్నిస్తున్నారు.
*తెలంగాణలో ధాన్యం సేకరణ స్ధితిగతులపై ఆర్ధిక మంత్రి హరీశ్ రావు ఆధ్వర్యంలో శుక్రవారం ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్, తెలంగాణ రైతుబంధు ఛైర్మన్ పల్లా రాజేశ్వరరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, పౌరసరఫరాలశాఖ కమిషనర్ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు ధాన్యంసేకరణకు సంబంధించి ఉన్నతాధికారులు సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని ఆదేశించారు. సేకరణకు సంబంధించి ఇతర అంశాలనుకూడా వెంటనే అందజేయాలన్నారు.ధాన్యం సేకరణ పరిస్థితులపై త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారని మంత్రి హరీశ్ రావు తెలిపారు.
*కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు ఖరారు చేసే అవకాశం ఉంది. ఏపీ కేబినెట్ సమావేశంలో కోనసీమ జిల్లా మార్పుపై చర్చ జరుగుతోంది. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు మార్చే చాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో అమలాపురంలో భారీగా పోలీసుల మోహరించారు. మళ్లీ అల్లర్లు చెలరేగకుండా పోలీసుల ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. అమలాపురంలో 144 సెక్షన్ కొనసాగుతోంది.
*చింతామణి నాటకం పై హైకోర్టు లో శుక్రవారం విచారణ జరిగింది. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు ధర్మాసనం తిరస్కరించింది. చింతామణి నాటకానికి సంబంధించిన పుస్తకం తెలుగు, అనువదించిన ఇంగ్లీష్ కాపీని కోర్టు ముందు ఉంచాలని ఆదేశించింది. చింతామణి నాటకం నిషేదిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీఓను సవాల్ చేస్తూ ఎంపీ రఘురామకృష్ణరాజు, ఆర్టిస్ట్‌లు పిటీషన్‌లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. రఘురామకృష్ణరాజు తరపున ఉమేష్ చంద్ర, ఆర్టిస్ట్‌ల తరపున న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ పిటీషన్‌లు వేశారు. పుస్తకాన్ని నిషేదించకుండా, నాటకాన్ని నిషేధించడమేమిటని న్యాయవాది ఉమేష్‌చంద్ర ప్రశ్నించారు. వాక్‌స్వాతంత్రాన్ని హరించడమేనంటూ వాదనలు వినిపించారు. కేవలం రాజకీయ ప్రయోజనం కోసమే ప్రభుత్వం ఇటువంటి చర్యతీసుకుందని ఉమేష్ చెప్పారు.
*చిత్తూరు: జిల్లా టూ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. మాజీ మేయర్ కటారి హేమలతపై పోలీసు వాహనాన్ని ఎక్కించిన పోలీస్ అధికారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులపై ఆందోళనకారులు ఎదురుదాడికి దిగారు. ఈ క్రమంలో ఇరువురికి మధ్య తోపులాట తొక్కిసలాటలు చోటు చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసుల తీరుపై టీడీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బలవంతంగా పోలీసు వాహనాల్లో ఎక్కించి తరలించే ప్రయత్నాన్ని టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. పోలీసులకు వ్యతిరేకంగా ఆందోళనకారులు నినాదాలు చేశారు.
*రాష్ట్రంలో మున్సిపల్ పాఠశాలలను విద్యాశాఖకు అప్పగిస్తూ శుక్రవారం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 2,114 పాఠశాలలను విద్యాశాఖకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎమ్మెల్సీల విజ్ఞప్తి మేరకు మున్సిపల్ స్కూళ్లు విద్యాశాఖకు బదిలీ అయ్యాయి. టీచర్ల పదోన్నతుల్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవని ప్రభుత్వం స్పష్టం చేసింది. జిల్లా, మండల పరిషత్ స్కూళ్ల విధానాలే అమలు కానున్నట్లు వెల్లడించింది. మున్సిపల్ పాఠశాలల ఆస్తులు మున్సిపల్ శాఖ ఆధీనంలోనే కొనసాగుతాయని ఏపీ ప్రభుత్వం పేర్కొంది.
*కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు ఖరారైంది. ఈ మేరకు ఏపీ కేబినెట్ ఆమోద ముద్రవేసింది. కోనసీమ జిల్లా పేరును డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మార్చుతూ కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారు. కోనసీమ జిల్లా పేరు మార్పుపై స్థానికంగా ఆందోళనలు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం వెలువడుతుందని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎట్టకేలకు జిల్లా పేరును మార్చుతూ ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
*టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ మహిళా నేత, చిత్తూరు మాజీ మేయర్ కఠారి హేమలతపై పోలీసుల దుశ్చర్యను ఆయన ఖండించారు. మహిళ అన్న కనికరం కూడా లేకుండా హేమలత పాదాలపై జీపుతో తొక్కించి గాయపర్చిందే కాకుండా.. తిరిగి వారిపైనే కేసులు పెట్టడం వైసీపీ ప్రభుత్వానికే చెల్లిందన్నారు. తన అత్తా మామ హత్య కేసులో సాక్షులను వైసీపీ నేతలు భయబ్రాంతులకు గురి చేస్తున్నారని, అండగా నిలవాల్సిన పోలీసులు వైసీపీ నేతల మెప్పు కోసం బాధితులపైనే అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వ దౌర్జన్యాలను ఎత్తి చూపిన టీడీపీ నేతలను లక్ష్యంగా చేసుకొని.. అక్రమ కేసులు, సంఘ విద్రోహక కేసులు బనాయించి వేధిస్తున్నారని విమర్శించారు.
*ఏపీ లో ఫైనాన్స్ సిబ్బంది ఆగడాలు మితిమీరిపోతున్నాయి. రుణాల వసూలు కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. షూరిటీ ఉన్నవారికి ఫోన్లు చేసి బండ బూతులు తిడుతున్నారు. గుంటూరు జిల్లా, మంగళగిరిలో బజాజ్ ఫైనాన్స్ సిబ్బంది బూతుల పర్యం వైరల్‌గా మారింది. నవలూరులో లోన్ తీసుకున్న ఓ వ్యక్తి సకాలంలో డబ్బు చెల్లించకపోవడంతో ష్యూరిటీ ఇచ్చిన వ్యక్తికి బజాజ్ ఫైనాన్స్ సిబ్బంది ఫోన్ చేశారు. డబ్బులు ఎందుకు చెల్లించలేదని అసభ్యంగా మాట్లాడారు. ఇప్పుడు ఆ ఆడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బాధితులు మంగళగిరి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
* తెలంగాణలో ధాన్యం సేకరణ స్ధితిగతులపై ఆర్ధిక మంత్రి హరీశ్ రావు ఆధ్వర్యంలో శుక్రవారం ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్, తెలంగాణ రైతుబంధు ఛైర్మన్ పల్లా రాజేశ్వరరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, పౌరసరఫరాలశాఖ కమిషనర్ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు ధాన్యంసేకరణకు సంబంధించి ఉన్నతాధికారులు సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని ఆదేశించారు. సేకరణకు సంబంధించి ఇతర అంశాలనుకూడా వెంటనే అందజేయాలన్నారు.ధాన్యం సేకరణ పరిస్థితులపై త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారని మంత్రి హరీశ్ రావు తెలిపారు.
*తమ కొడుకు హత్య కేసును సీబీఐతో విచారణ జరిపించాలని సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు సత్యనారాయణ, నూకరత్నం డిమాండ్ చేస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు తన మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యంను హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో చంద్రబాబును కలిశారు. తమ కుమారుడి హత్య కేసులో పోలీసుల ద్వారా తమకు న్యాయం జరగదని, పోలీసులు ఆనంతబాబుని కేసు నుంచి తప్పించేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం జరిపించే విచారణ మీద తమకు నమ్మకం లేదని, సీబీఐ విచారణ జరిపించాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. ఇదే విషయాన్ని సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు చంద్రబాబును కోరారు. సీబీఐతో విచారణ జరిపించేలా తనవంతు ఒత్తిడి తీసుకొస్తామని చంద్రబాబు వారికి హామీ ఇచ్చారు. అనంతరం ఆయన వారికి రూ.5లక్షలు ఆర్థిక సాయం చేయటంతో పాటు అన్ని విధాలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
*రాజ్యసభ సభ్యులుగా వైఎస్సార్‌సీపీ నూతన ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు. ఆర్ కృష్ణయ్య, నిరంజన్ రెడ్డిలు ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు సమక్షంలో ఆర్ కృష్ణయ్య, నిరంజన్‌రెడ్డిలు ప్రమాణ స్వీకారం చేశారు.
* దేశ చరిత్రలో రాష్ట్రపతి అభ్యర్థిగా తొలిసారిగా గిరిజన మహిళ ద్రౌపది ముర్ముకు అవకాశం ఇవ్వడం శుభ పరిణామమని వైఎస్సార్‌సీపీ పేర్కొంది. గత మూడేళ్లుగా దేశంలో ఎక్కడా లేని రీతిలో సామాజిక న్యాయాన్ని మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తున్న వైఎస్సార్‌సీపీ.. రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ద్రౌపది ముర్ముకు మద్దతు తెలిపింది. రాష్ట్ర మంత్రివర్గ సమావేశాన్ని శుక్రవారం నిర్వహించాలని ముందుగా నిర్ణయించుకున్నందున ఆ రోజు రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము నామినేషన్ కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్ హాజరు కాలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఆ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, లోక్‌సభలో పార్టీ పక్ష నేత పీవీ మిథున్‌రెడ్డి పాల్గొననున్నారు.
*కాంగ్రెస్ పార్టీ అత్యున్నత నిర్ణయా త్మక కమిటీ సీడబ్ల్యూసీ శాశ్వత ఆహ్వాని తునిగా కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ టి.సుబ్బరామి రెడ్డి నియమితుల య్యారు. ఈ మేరకు కమిటీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ కె.సి.వేణుగోపాల్ నుంచి నియామకపు లేఖ అందింది. సుబ్బరామిరెడ్డి గతంలో కేంద్రమంత్రి, స్టాండింగ్ కమిటీ చైర్మన్, టీటీడీ చైర్మన్ పదవులు చేపట్టడంతో పాటు పార్టీ పరంగా కీలక బాధ్యతలు నిర్వహించారు. కాగా, సీడబ్ల్యూసీ సభ్యులుగా కేంద్ర మాజీ మంత్రులు కుమారి సెల్జా, అభిషేక్ మను సింఘ్విలకు అవకాశం ఇచ్చారు. ప్రత్యేక ఆహ్వానితునిగా యూపీ మాజీ ఎమ్మెల్యే అజయ్ కుమార్ లల్లూను నియమించారు.
*రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపతి ముర్ముపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యలపై బీజీపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్మ ట్వీట్‌ను సుమోటొగా తీసుకుని పోలీసులు వెంటనే కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. వర్మలాగా ఎవరూ అనుచిత వ్యాఖ్యలు చేయకుండా ఉండాలంటే ముందు వర్మని జైలుకి పంపాలన్నారు. అలాగే వర్మను మానసిక వైద్యుడి చూపించాల్సిన అవసరం ఉందన్నారు.
*వరంగల్‌లో నిర్వహించనున్న కాకతీయ ఉత్సవాలకు కాకతీయ వంశస్థుల వారసుడు, బస్తర్ మహారాజ్ కమల్ చంద్ర భంజ్‌దేవ్ హాజరుకానున్నారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌విప్ వినయ్ భాస్కర్, తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరిక్రిష్ణ, టార్చ్ సంస్థ కార్యదర్శి అరవింద్ ఆర్య ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని జగదల్పూర్‌లో కమల్ చంద్ర భంజ్‌దేవ్‌ను కలిశారు. వచ్చే నెల 7 నుంచి వరంగల్‌లో వారం రోజుల పాటు నిర్వహించే కాకతీయ ఉత్సవాలకు హాజరుకావలసిందిగా ఆహ్వానించారు. ఇందుకు భంజ్‌దేవ్ అంగీకరించారు. ఈ సందర్భంగా భంజ్‌దేవ్ మాట్లాడుతూ.. తన పూర్వీకుల పుట్టినిల్లయిన వరంగల్‌ను 7 వందల సంవత్సరాల తర్వాత సందర్శించే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. కాగా, బస్తర్‌లో మలికాకతీయ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసిన అన్నమదేవుడి వారసుడే మహారాజా కమల్ చంద్ర భంజ్‌దేవ్. 1323లో ప్రతాపరుద్రుడి మరణం తర్వాత ఆ ఏడాదే ఆయన సోదరుడు అన్నమదేవుడు దంతేవాడ కేంద్రంగా 13వేల చ.కి.మీ విస్తీర్ణంలో మలికాకతీయ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు.
*ఎగువ ప్రాంతమైన మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలోని పలు ప్రాజెక్టుల్లోకి ఇన్‌ఫ్లో క్రమంగా పెరుగుతోంది. నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టులోకి 991 క్యూసెక్కుల వరద చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా.. ప్రస్తుతం 676 అడుగుల మేర నీటి నిల్వ ఉంది. అలాగే నిజామాబాద్ జిల్లా శ్రీరామసాగర్‌లోకి గురువారం 4514 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చింది. 1091 అడుగులకుగాను ప్రస్తుతం 1065.4 అడుగుల మేర నీటి నిల్వ ఉంది. ఇక, నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 533.80 అడుగులకు చేరుకుంది. మేడిగడ్డ బ్యారేజీలోకి 14,500 క్యూసెక్కుల నీరు చేరింది.
*భాగ్యనగర పర్యటనకు వచ్చినవారు చార్మినార్ చూడాల్సిందే.. చార్మినార్ సందర్శనకు వచ్చినవారు లాడ్ బజార్‌లో రంగురంగుల గాజులు కొనాల్సిందే! అంతగా ప్రసిద్ధ చెందాయి అక్కడ తయారయ్యే లక్కగాజులు. లాడ్ అంటేనే లక్క అని అర్థం. ఆ గాజుల వల్లే లాడ్‌బజార్‌కు ఆ పేరు వచ్చింది. అలా దేశవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన ఆ గాజులు ఇక అంతర్జాతీయ పర్యాటకుల దృష్టినీ ఆకర్షించనున్నాయు. లాడ్‌బజార్ గాజులకు భౌగోళిక గుర్తింపు (జీఐ) కోసం చేసిన దరఖాస్తును చెన్నైలోని జీఐ రిజిస్ట్రీ కార్యాలయం గురువారం ఆమోదించింది. లక్కను ఉపయోగించి గాజులు తయారుచేయడం దాదాపు 500 ఏళ్ల కితం మొఘలుల కాలంలోనే ఇక్కడ ప్రారంభమైనట్టు చారిత్రక ఆధారాలను జీఐ రిజిస్ట్రీకి సమర్పించారు. ప్రత్యేక నైపుణ్యంతో తయారయ్యే ఈ తరహాగాజులు ప్రపంచంలో మరెక్కడా లేవని దరఖాస్తులో పేర్కొన్నారు. శతాబ్దాలుగా కొనసాగుతున్న ఈ పరిశ్రమలో వేలాది కుటుంబాలు తరతరాలుగా ఉన్నాయన్న ఆధారాలనూ సమర్పించడంతో జీఐ కార్యాలయం దరఖాస్తును ఆమోదించింది. జీఐ గుర్తింపు దాదాపు ఖాయమైందని, త్వరలో జీఐ కార్యాలయ బృందం ప్రాంతాన్ని సందర్శించి గుర్తింపుపై అధికారిక ప్రకటన చేస్తుందని రాష్ట్ర పరిశ్రమల శాఖ వర్గాలు తెలిపాయి. జీఐ గుర్తింపు రానుండటంతో అధికారులు ప్రత్యేకంగా లక్కగాజుల లోగోను కూడా తయారుచేశారు.
*2002లో గుజరాత్‌లో జరిగిన అల్లర్ల కేసులో గతంలో మోదీకి సిట్ క్లీన్ చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ తీర్పును సవాల్ చేస్తూ కాంగ్రెస్ మాజీ ఎంపీ ఈషాన్ జఫ్రీ భార్య జాకియా జఫ్రీ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఇవాళ తోసిపుచ్చింది. జస్టిస్ ఏఎం ఖాన్‌విల్కర్, దినేశ్ మహేశ్వరి, సీటీ రవికుమార్‌లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును ఇచ్చింది. సిట్ ఇచ్చిన తీర్పును సుప్రీం సమర్థించింది. సిట్ తీర్పును ఆమోదిస్తూ మెజిస్ట్రేట్ తీసుకున్న నిర్ణయాన్ని తాము సమర్ధిస్తున్నామని, ఈ కేసులో దాఖలైన నిరసన పిటీషన్‌ను తోసిపుచ్చుతున్నట్లు సుప్రీం ధర్మాసనం పేర్కొన్నది.2021, డిసెంబర్ 8వ తేదీన ఈ కేసులో విచారణ పూర్తి అయ్యింది. అయితే సుప్రీం తన తీర్పును ఇవాళ వెలువరించింది. గుజరాత్ అల్లర్ల సమయంలో కాంగ్రెస్ ఎంపీ ఈషాన్ జఫ్రీ హత్యకు గురయ్యారు. ఈ కేసులో సిట్ తీర్పును 2017లో గుజరాత్ హైకోర్టు సమర్ధించింది. గుజరాత్ అల్లర్ల సమయంలో మోదీ ఆ రాష్ట్ర సీఎంగా ఉన్నారు. మోదీతో పాటు ఇతర రాజకీయవేత్తలు, అధికారులపై 2006లో జాకియా జఫ్రీ కేసును నమోదు చేసింది. 2008లో అల్లర్లపై సిట్ దర్యాప్తు ప్రారంభమైంది.
*ఏపీ సీఎం వైఎస్ జగన్ అంతర్జాతీయ క్రీడాకారులను సన్మానించారు. ఏపీకి చెందిన భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్, ఇండియన్ డెఫిలింపియన్ టెన్నిస్ ప్లేయర్ షేక్ జాఫ్రిన్ ఇవాళ క్యాంపు కార్యాలయంలో సీఎంను, మంత్రి రోజాతో మర్యాదపూర్వకంగా కలిశారు.ఇటీవల బ్యాంకాక్‌లో జరిగిన ప్రతిష్ఠాత్మక థామస్ కప్ విజయంలో శ్రీకాంత్, బధిరుల ఒలింపిక్ క్రీడల్లో కర్నూలుకు చెందిన జాప్రిన్ కాంస్య పతకం సాధించారు. ఈ ఇద్దరిని సీఎం సన్మానించారు. షేక్‌జాఫ్రిన్‌కు అర్హతను బట్టీ ప్రభుత్వ ఉద్యోగం, నగదు ప్రోత్సాహం ఇవ్వాలని అధికారులకు సూచించారు.
*నీతి ఆయోగ్ నూతన కార్యనిర్వహణ అధికారి (సీఈవో)గా ఐఏఎస్ అధికారి పరమేశ్వరం అయ్యర్ శుక్రవారం నియమితులయ్యారు. వ్యక్తిగత, సిబ్బంది శిక్షణ విభాగం అయ్యర్ నియామకాన్ని ప్రకటించింది.రెండేండ్ల పాటు పరమేశ్వరం అయ్యర్ ఈ పదవిలో కొనసాగుతారు. నీతి ఆయోగ్ ప్రస్తుత సీఈవో అమితాబ్ కాంత్ పదవీకాలం ఈనెల 30తో ముగియనుండటంతో ఆయన స్ధానంలో నూతన సీఈవోగా అయ్యర్‌ను నియమించారు.
*ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ జిల్లా పేరును మారుస్తూ నెలరోజుల క్రితం తీసుకున్న ప్రాథమిక నిర్ణయంపై చెలరేగిన హింసాకాండ పునరావృతం కాకుండా కోనసీమ జిల్లా పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు తీసుకున్నారు. ఇవాళ ఏపీ కేబినెట్‌లో కూడా అంబేద్కర్ కోనసీమ జిల్లాకు ఆమోదం తెలుపడంతో అల్లర్లు జరుగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. గత నెల 24న ప్రభుత్వ నిర్ణయంపై నిరసనకారులు మంత్రి, ఎమ్మెల్యే ఇండ్లకు నిప్పంటించడం, బస్సులను దహనం చేయడం లాంటి ఘటనలకు పాల్పడ్డారు.
*ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే స్వల్పశ్రేణి క్షిపణి వీఎల్-ఎస్ఆర్ సామ్‌ను భారత్ శుక్రవారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా రాష్ట్రంలోని చాందీపూర్ తీరంలోగల ఇండియన్ నావల్ షిప్ (ఐఎన్ఎస్) నుంచి ఈ క్షిపణిని నిట్టనిలువుగా పరీక్షించినట్లు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ ఒక ప్రకటనలో తెలిపింది.
*తెలంగాణ రాష్ట్ర రెడ్‌కో చైర్మన్‌గా వై సతీశ్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ పదవిలో సతీశ్ రెడ్డి మూడేండ్ల పాటు కొనసాగనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు ఆరూరి రమేశ్, దానం నాగేందర్‌తో పాటు పలువురు పాల్గొన్నారు. బాధ్యతల స్వీకరణ అనంతరం సతీశ్ రెడ్డి మంత్రులు, ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.
*ఓపెన్ ఎమర్జెన్సీ నడుస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. గురువారం నెల్లూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో శ్యామా ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ నాడు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టి ఇష్టానుసారంగా కేసులు నమోదు చేసి జైలుకు పంపితే, నేడు వైసీపీ ప్రభుత్వంలో ప్రశ్నించిన ప్రతి ఒక్కరిపై కేసులు నమోదు చేస్తున్నారని ధ్వజమెత్తారు. దీనిపై శనివారం మండల స్థాయి నుంచి నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. సర్పంచులకు కేంద్రం ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందని, ఆ నిధులను ఇప్పటివరకు సర్పంచుల ఖాతాల్లో వేయలేదన్నారు. రాష్ట్రంలో ఈ నెలాఖరు లోపల జిల్లా, రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. విశాఖలో శుక్రవారం రాష్ట్ర కోర్ కమిటీ సమావేశం, హైదరాబాద్‌లో జూలై 2, 3 తేదీల్లో జాతీయకార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రపతి అభ్యర్థి దౌపది ముర్ము ఉభయ తెలుగు రాష్ట్రాల్లో త్వరలో పర్యటించనున్నారని తెలిపారు.
*1998 డీఎస్సీ అభ్యర్థులను కాంట్రాక్టు పద్ధతిలో ఎస్జీటీలుగా తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గురువారం పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసింది. 1998 అభ్యర్థులకు మినిమం టైమ్ స్కేలు వర్తింపజేయనున్నట్లు తెలిపింది. అంటే నెలకు రూ.33వేల వేతనం వారికి లభిస్తుంది. వీరిని డీఈవో పూల్‌లో ఉంచి, అవసరమైన చోట్లకు సర్దుబాటు చేయనుంది. కేజీబీవీల్లో ఉపాధ్యాయులుగా, సీఆర్‌పీలుగా, మోడల్ స్కూల్స్‌లో గెస్ట్ లెక్చరర్లుగా వీరిని వినియోగించుకోనున్నట్లు తెలిపింది. అయితే సుదీర్ఘకాలం తర్వాత వారిని విధుల్లోకి తీసుకోవాలని నిర్ణయించినందున ఎంతమంది ఉద్యోగాలు చేసేందుకు ఆసక్తిగా ఉన్నారో వివరాలు తీసుకోవాలని జిల్లాల అధికారులను ఆదేశించింది. డీఎస్సీ 2008 అభ్యర్థుల తరహాలోనే వీరిని తీసుకుంటున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.
* జాతీయ విద్యా విధానం ప్రకారం డిగ్రీ కోర్సుల్లో నిర్మాణాత్మక మార్పులు తీసుకొస్తామని సాంకేతిక విద్యశాఖ కమిషనర్ పోలా భాస్కర్ తెలిపారు. గురువారం పలు ప్రైవేటు సంస్థలతో ‘పరిశ్రమలు- విద్యాసంస్థల కనెక్ట్’ అనే కార్యక్రమాన్ని విజయవాడలో నిర్వహించారు. కమిషనర్ మాట్లాడుతూ.. డిగ్రీ కోర్సులు చదివే వారు మొదటి ఏడాది తర్వాత 8 వారాల పాటు కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్టు, రెండవ సంవత్సరం తర్వాత 8 వారాల పాటు ఇంటర్న్‌షిప్, మూడో సంవత్సరంలో ఒక సెమిస్టర్ సమయం పూర్తిగా ఏదైనా శిక్షణ పొందాలని వివరించారు.
*రాష్ట్రంలోని వివిధ సంక్షేమ కార్పొరేషన్ల ద్వారా అమలుచేస్తున్న విదేశీ విద్య పథకం అమలుతీరు, ఫలితాలను మదింపు చేయాలని రాష్ట్రప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుందని మైనారిటీ సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి హైకోర్టులో అఫిడవిట్ దాఖలుచేశారు. కొవిడ్ ప్రభావంతోపాటు ఈ పథకాన్ని ప్రభుత్వం సమీక్షిస్తున్న నేపఽథ్యంలో 2020-21 సంవత్సరానికిగాను పథకం అమలును తాత్కాలికంగా పక్కనపెట్టాలని అన్ని సంక్షేమ కార్పొరేషన్లకు ప్రభుత్వం సూచనలు చేసిందన్నారు. సంక్షేమ పథకాల అమలు ఆర్థిక వ్యవహారాలతో ముడిపడిన వ్యవహారమని, దానిని న్యాయసమీక్ష పరిధిలోకి తీసుకురావడానికి వీల్లేదన్నారు. సంక్షేమ పథకాల అమలు పూర్తిగా ప్రభుత్వ పరిధిలోని వ్యవహారమని తెలిపారు.
*సాధారణంగా, ప్రమాదంలో మరణించిన పోలీస్ కుటుంబాలకు నష్టపరిహారాన్ని భారీగా పెంచారు. ప్రమాదంలో మరణించిన కానిస్టేబుల్, హెడ్‌కానిస్టేబుల్, ఏఎస్సై ర్యాంకు వారికి రూ.16 లక్షలు, ఎస్సై నుంచి డీజీపీ ర్యాంకు అధికారులకు రూ.32 లక్షలకు పెంచారు. సాధారణంగా మరణించిన ఏఎస్సై లోపు వారికి రూ.8 లక్షలు, ఎస్సై, ఆపై అధికారులకు రూ.16 లక్షలుగా నిర్ణయించారు. ఈ మేరకు డీజీపీ మహేందర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ప్రమాదంలో మరణిస్తే ఏఎస్సై ర్యాంకు వరకు 8 లక్షలు, ఎస్సై, ఆపై ర్యాంకు అధికారులకు రూ.16 లక్షలుగా ఉండేది. సాధారణంగా మరణిస్తే రూ.4 లక్షలు, ఎస్సై, ఆపై ర్యాంకు వారికి రూ.8 లక్షలుగా ఉండేది. అంటే నష్టపరిహారాన్ని డబుల్ చేశారు. ఈ ఏడాది ఏపిల్ర్1 నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయి.
*కృష్ణా నదిలో మిగులు జలాలు, జలవిద్యుత్తుకు సంబంధించి రిజర్వాయర్ మేనేజ్‌మెంట్ కమిటీ(ఆర్‌ఎంసీ) జూలై 1 మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్‌లోని జలసౌధలో సమావేశం కానుంది. ఈ మేరకు కృష్ణానది యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ) తెలుగు రాష్ట్రాలకు సమాచారం ఇచ్చింది. అయితే, ఇంతకుముందు జరిగిన రెండు సమావేశాలకు తెలంగాణ అధికారులు హాజరు కాకుండానే రూల్‌కర్వ్ ముసాయిదాను బోర్డు రూపొందించింది. ప్రధానంగా రూల్‌కర్వ్, మిగులు జలాలు, జలవిద్యుత్తును ఏ సమయంలో ఉత్పత్తి చేయాలనే అంశాలపై విధాన నిర్ణయాలు తీసుకోవడానికి బోర్టు ఆర్‌ఎంసీని ఏర్పాటు చేసింది. నిబంధనల ప్రకారం ఈనెల 6వ తేదీ లోపలే ఆయా అంశాలపై నిర్ణయం తీసుకోవలసి ఉంది. అయితే, ఆర్‌ఎంసీ సమావేశాల పట్ల తెలంగాణ ఆగ్రహంతో ఉండి హాజరుకాలేదు. ఈ నేపథ్యంలో ఈ సమావేశానికి తెలంగాణ అధికారులు హాజరవుతారా? లేదా? అనేది ఇంకా స్పష్టంగా తెలియదు.
*కాంగ్రెస్ అత్యున్నత విధాన నిర్ణాయక కమిటీ అయిన వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)లో కేంద్ర మాజీ మంత్రి టీ సుబ్బిరామిరెడ్డికి స్థానం దక్కింది. సీడబ్ల్యూసీ శాశ్వత సభ్యుడిగా ఆయన్ను నియమించినట్టు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం వర్కింగ్ కమిటీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు లేరు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సుబ్బిరామిరెడ్డి నియామకంతో తెలుగువారికి చోటు లభించినట్లయింది. కాగా కేంద్ర మాజీ మంత్రి కుమారి సెల్జా ఎంపీ అభిషేక్ మను సింఘ్వీ సీడబ్ల్యూసీ సభ్యులుగా యూపీసీసీ మాజీ అధ్యక్షుడు అజయ్ కుమార్ లల్లూ ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమితులయ్యారు.
*రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్లు నగరపాలక సంస్థలు నగర పంచాయతీల్లో పనిచేస్తున్న దాదాపు వేల మంది కార్మికులు జూలై అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వెళుతున్నారు. మున్సిపల్ కార్మికులు ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శించటాన్ని నిరసిస్తూ గురువారం మున్సిపల్ కార్మిక ఉద్యోగ సంఘాల జేఏసీ సమ్మెకు పిలుపు ఇచ్చింది. పారిశుఽధ్య కార్మికులకు హెల్త్ అలవెన్స్ ఇవ్వాలని సమాన పనికి సమాన వేతనం ఉద్యోగుల క్రమబద్ధీకరణ సీపీఎస్ రద్దు తదితర డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి గత మూడు సంవత్సరాలుగా తీసుకువెళుతున్నా కనీస స్పందన కూడా ఉండటం లేదని జేఏసీ నేతలు చెప్పారు. ఉద్యమిస్తే తప్ప ప్రభుత్వం కదిలే పరిస్థితి లేదని అన్ని సంఘాలు జేఏసీగా ఏర్పడ్డామని తెలిపారు. ఈమేరకు జేఏసీ నేతలు కె.ఉమామహేశ్వరరావు ఎ.రంగనాయకులు పి.సుబ్బారాయుడు మధుబాబు ఎస్.శంకరరావు జి.ప్రసాద్ .సుబ్బారావు గురువారం మీడియా సమావేశంలో ప్రకటించారు.
*కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం అంగలూరులో తెలుగుదేశం తలపెట్టిన మినీ మహానాడు సభా వేదిక ప్రాంతంలో… ఆ పార్టీ నేతలు భూమి పూజ చేశారు. మహానాడును విజయవంతం చేసి కృష్ణా జిల్లాలో తెలుగుదేశం సత్తా ఏమిటో చాటుతామని అన్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి పార్టీ అధినేత చంద్రబాబు ప్రయాణించే రోడ్డు మార్గాన్ని పసుపుమయం చేస్తామని తెలిపారు. గుడివాడలో చంద్రబాబు రోడ్షోలో పాల్గొంటారని వెల్లడించారు.
* వచ్చే నెల ఒకటో తేదీన హైదరాబాద్ జల సౌధలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) సమావేశం జరగనున్నది. ఈ సమావేశం ఈ నెల 16న జరగాల్సి ఉండగా.. దీనిని వచ్చే నెల ఒకటో తేదీకి మార్చారు. ఈ సమావేశానికి హాజరు కావాలని రెండు తెలుగు రాష్ట్రాలనూ కోరింది.
*ఆసియా హ్యాండ్‌బాల్ పురుషుల క్లబ్ లీగ్ చాంపియన్‌షి్‌పలో గురువారం జరిగిన మ్యాచ్‌ల్లో బహ్రెయిన్, కువైట్ జట్లు గెలుపొందాయి. బహ్రెయిన్‌కు చెందిన అల్ నజ్మా క్లబ్ 31-25 స్కోరుతో ఇరాన్ క్లబ్ మెస్‌కెర్మన్‌ను చిత్తు చేసింది. మరో మ్యాచ్‌లో అల్ కువైట్ 33-23తో ఖతార్‌కు చెందిన అల్ వక్రాపై విజయం సాధించింది.
*వరంగల్‌లో నిర్వహించనున్న కాకతీయ ఉత్సవాలకు కాకతీయ వంశస్థుల వారసుడు బస్తర్ మహారాజ్ కమల్ చంద్ర భంజ్‌దేవ్ హాజరుకానున్నారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌విప్ వినయ్ భాస్కర్ తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరిక్రిష్ణ, టార్చ్ సంస్థ కార్యదర్శి అరవింద్ ఆర్య ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని జగదల్పూర్‌లో కమల్ చంద్ర భంజ్‌దేవ్‌ను కలిశారు. వచ్చే నెల 7 నుంచి వరంగల్‌లో వారం రోజుల పాటు నిర్వహించే కాకతీయ ఉత్సవాలకు హాజరుకావలసిందిగా ఆహ్వానించారు. ఇందుకు భంజ్‌దేవ్ అంగీకరించారు. ఈ సందర్భంగా భంజ్‌దేవ్ మాట్లాడుతూ.. తన పూర్వీకుల పుట్టినిల్లయిన వరంగల్‌ను 7 వందల సంవత్సరాల తర్వాత సందర్శించే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. కాగా, బస్తర్‌లో మలికాకతీయ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసిన అన్నమదేవుడి వారసుడే మహారాజా కమల్ చంద్ర భంజ్‌దేవ్. 1323లో ప్రతాపరుద్రుడి మరణం తర్వాత ఆ ఏడాదే ఆయన సోదరుడు అన్నమదేవుడు దంతేవాడ కేంద్రంగా 13వేల చ.కి.మీ విస్తీర్ణంలో మలికాకతీయ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు.
*ఎన్టీఆర్ జిల్లా కంకిపాడులో క్యాసినో నిర్వహించేందుకు ప్రయత్నించిన వారిని విచారించి ఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య డీజీపీని కోరారు. ఈమేరకు గురువారం డీజీపీకి లేఖ రాశారు.
*దేశ రాజకీయాల్లో పచ్చి అబద్ధాల కోరుగా జగన్‌రెడ్డి గిన్నిస్ రికార్డులెక్కుతారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ ఎద్దేవా చేశారు. పల్నాడులో లోకేశ్ పర్యటనను అడ్డుకునేందుకు కుట్ర చేశారని ఆరోపించారు.
*కాంగ్రెస్ అత్యున్నత విధాన నిర్ణాయక కమిటీ అయిన వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)లో కేంద్ర మాజీ మంత్రి టీ సుబ్బిరామిరెడ్డికి స్థానం దక్కింది. సీడబ్ల్యూసీ శాశ్వత సభ్యుడిగా ఆయన్ను నియమించినట్టు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం వర్కింగ్ కమిటీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు లేరు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సుబ్బిరామిరెడ్డి నియామకంతో తెలుగువారికి చోటు లభించినట్లయింది. కాగా కేంద్ర మాజీ మంత్రి కుమారి సెల్జా ఎంపీ అభిషేక్ మను సింఘ్వీ సీడబ్ల్యూసీ సభ్యులుగా యూపీసీసీ మాజీ అధ్యక్షుడు అజయ్ కుమార్ లల్లూ ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమితులయ్యారు.
*కాకినాడకు చెందిన న్యాయవాది కాల నాగేశ్వరరావుపై ఆయన చాంబర్‌లో దుండగులు జరిపిన దాడిని ఏపీ బార్ కౌన్సిల్ ఖండించింది. తన కక్షిదారు హక్కుల కోసం పోరాడుతున్న న్యాయవాదిపై దాడి చేయడం దురదృష్టకరమన్నారు. ఈ వ్యవహారం పై దర్యాప్తు చేసి సాధ్యమైనంత త్వరగా దుండగులను న్యాయస్థానం ముందు నిలబెట్టేలా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరింది.
*రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భిణీ స్త్రీలకు పాలిచ్చే తల్లులకు వండిన ఆహారాన్ని వేడిగా అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర మహిళాభివృద్ధి శిశు సంక్షేమశాఖ డైరెక్టర్ సిరి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో జూలై ఒకటి నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామన్నారు. కరోనా నేపథ్యంలో మార్చి నుంచి ఈ కార్యక్రమాన్ని నిలిపి వేయగా ప్రస్తుతం తిరిగి ప్రారంభిస్తున్నామని తెలిపారు. ఇంటి వద్దనే పోషకాహార సామాగ్రిని అందించే కార్యక్రమం జూన్ వరకే కొనసాగుతుందన్నారు.
*పాఠశాలల్లో నిర్వహిస్తున్న యాప్‌లకు సంబంధించిన సమాచారాన్ని మానిటరింగ్ చేసే బాధ్యతలను గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి అప్పగించారు. గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. పాఠశాలల్లో వివిధ కార్యక్రమాలకు సంబంధించి ప్రభుత్వం స్కూల్ సుందర్ యాప్ కన్సిస్టెంట్ రిథమ్స్ ఇన్ స్కూల్స్ అనే ఎస్‌ఓఎస్‌ను రూపొందించింది. ప్రతి వారం సచివాలయ సిబ్బంది పాఠశాలలకు వెళ్లి డేటా సేకరించి పర్యవేక్షించాలని గ్రామ, వార్డు సచివాలయ శాఖ సూచించింది. కాగా పాఠశాలలపై వార్డు సెక్రటరీల పర్యవేక్షణపై మున్సిపల్ టీచర్ల అసోషియేషన్ అధ్యక్షుడు రామకృష్ణ అభ్యంతరం వ్యక్తం చేశారు. గెజిటెడ్ హోదా గల ప్రధానోపాధ్యాయులపై సాధారణ వార్డు సెక్రటరీలు పర్యవేక్షణ చేయవచ్చునా? అని ఒక ప్రకటనలో ఖండించారు.
*గుంటూరు: జిల్లాలోని వినుకొండ నియోజకవర్గంలో టీడీపీ నేత నారా లోకేష్ పర్యటించారు. లోకేష్‌కు జీవీ ఆంజనేయులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. పల్నాడు జిల్లాలో ఉదయం నుంచి నిర్విరామంగా లోకేష్ పర్యటన సాగుతుంది. 7గంటల ఆలస్యంగా లోకేష్ పర్యటన కొనసాగుతుంది. లోకేష్ పర్యటనలో పాల్గొనేందుకు రోడ్లపైకి పెద్దఎత్తున ప్రజలు తరలివస్తున్నారు. కార్యకర్తలు తరలిరావడంతో పల్నాడు ప్రాంతం జనసంద్రంగా మారింది. టీడీపీ నేతల మధ్య నెలకొన్న విభేదాలపై కమిటీ ఏర్పాటు చేశారు. సీనియర్ నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు కమిటీ వేశారు. సభ్యులుగా బచ్చుల అర్జునుడు యనమల జనార్ధన్దా మచర్ల సత్యను నియమించారు. నేతల మధ్య సమస్యలు పరిష్కరించేలా కమిటీకి బాధ్యతలు అప్పగించారు. అలాగే పార్టీ క్రమశిక్షణ నిబంధనలు ఉల్లంఘించినవారిపై చర్యలు తీసుకునేలా కమిటీకి అధికారాలిచ్చారు.
* వ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్లు నగరపాలక సంస్థలు నగర పంచాయతీల్లో పనిచేస్తున్న దాదాపు వేల మంది కార్మికులు జూలై అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వెళుతున్నారు. మున్సిపల్ కార్మికులు ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శించటాన్ని నిరసిస్తూ గురువారం మున్సిపల్ కార్మిక ఉద్యోగ సంఘాల జేఏసీ సమ్మెకు పిలుపు ఇచ్చింది. పారిశుఽధ్య కార్మికులకు హెల్త్ అలవెన్స్ ఇవ్వాలని సమాన పనికి సమాన వేతనం ఉద్యోగుల క్రమబద్ధీకరణ సీపీఎస్ రద్దు తదితర డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి గత మూడు సంవత్సరాలుగా తీసుకువెళుతున్నా కనీస స్పందన కూడా ఉండటం లేదని జేఏసీ నేతలు చెప్పారు. ఉద్యమిస్తే తప్ప ప్రభుత్వం కదిలే పరిస్థితి లేదని అన్ని సంఘాలు జేఏసీగా ఏర్పడ్డామని తెలిపారు. ఈమేరకు జేఏసీ నేతలు కె.ఉమామహేశ్వరరావు ఎ.రంగనాయకులు పి.సుబ్బారాయుడు మధుబాబు ఎస్.శంకరరావు జి.ప్రసాద్ జి.సుబ్బారావు గురువారం మీడియా సమావేశంలో ప్రకటించారు.
*ప్రజామోదం లేని పథకాలతో సీఎం కేసీఆర్ నియంతలా పాలన కొనసాగిస్తున్నారని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా 103వ రోజైన గురువారం సూర్యాపేట జిల్లా నడిగూడెం, మునగాల మండలాల్లో ఆమె 10 కిలోమీటర్లు నడిచారు. నడిగూడెం మండలంలోని సిరిపురం, నారాయణపురం, మునగాల మండలంలోని బరాకత్‌గూడెం, కృష్ణానగర్ గ్రామాల మీదుగా పాదయాత్ర కొనసాగింది. మునగాల మండలం కృష్ణానగర్‌లో నిర్వహించిన మాటముచ్చట కార్యక్రమం లో ఆమె మాట్లాడారు.
*ఏక్‌నాథ్ షిండేనే తమ నాయకుడని గువహాటిలో ఉన్న శివసేన రెబెల్ ఎమ్మెల్యేల కూటమి ఏకగ్రీవంగా ఆమోదించింది. గురువారం సాయంత్రం ఒక హోటల్‌లో సమావేశమైన వీరంతా షిండేను తమ నాయకుడిని ఎన్నుకుంటున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అనంతరంషిండే మాట్లాడుతూ తాము తీసుకున్న నిర్ణయానికి బీజేపీ మద్దతు ఉందని అవసరమైనప్పుడు వారి మద్దతు ఇస్తారని ఎమ్మెల్యేలతో అన్నారు. షిండే మాట్లాడుతుండగా ఎమ్మెల్యేలు అంతా మద్దతుగా చప్పట్లు కొట్టారు.
*తెలంగాణ రాష్ట్ర పవర్ జనరేషన్ కార్పొరేషన్(జెన్‌కో) 250 అసిస్టెంట్ ఇంజనీర్(ఏఈ) పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయాలని నిర్ణయించింది. ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్, టెలికమ్యూనికేషన్ విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేస్తారు. 150 అసిస్టెంట్ ఇంజనీర్(ఎలక్ట్రికల్), 88 అసిస్టెంట్ ఇంజనీర్(సివిల్)పోస్టులు, మిగిలినవి మెకానికల్, టెలికమ్యూనికేషన్ విభాగాల్లో ఉన్నాయి. నోటిఫికేషన్‌ను రెండు నెలల్లో విడుదల చేసే అవకాశం ఉంది. కొత్తగా నిర్మించిన 1080 మెగావాట్ల భద్రాద్రి థర్మల్ విద్యుత్తు ప్లాంట్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్(ఓ అండ్ ఎం) కోసం ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.
*ఓల్డ్ అల్వాల్ ప్రెసిడెన్సీ కాలనీలో పిచ్చికుక్కలు స్వైరవిహారం చేశాయి. కుక్కల దాడిలో దాదాపు 20 మందికి పైగా కాలనీ వాసులు తీవ్రంగా గాయపడినట్లు స్థానికులు తెలిపారు. బుధవారం రాత్రి కాలనీలో పాదచారులు, బయట ఆడుకుంటున్న చిన్నారులపై దాదాపు మూడు పిచ్చి కుక్కలు దాడి చేశాయి. ఫలితంగా కాలనీలో నివసించే వారితో పాటు అటుగా వెళ్తున్న పాదచారులు సైతం తీవ్ర గాయాల పాలయ్యారు. దాదాపు 20 మందికి పైగా కుక్కల దాడిలో గాయపడ్డారు. గాయత్రి అనే అయిదేళ్ల చిన్నారిపై పిచ్చి కుక్క విచుకుపడటంతో ఆమె ముఖంపై తీవ్ర గాయమై పెద్ద ఎత్తున రక్తస్రావం జరిగింది. కాలనీలో గురువారం ఉదయం వరకు పిచ్చికుక్కలు వీరంగం చేశాయి. దీంతో జీహెచ్‌ఎంసి సిబ్బంది కుక్కలను పట్టుకువెళ్లారు.