DailyDose

ఏపీ కేబినేట్ లో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం

ఏపీ కేబినేట్ లో  పలు కీలక నిర్ణయాలకు ఆమోదం

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సమావేశమైన కేబినెట్‌ భేటీ ముగిసింది. ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకొని కోనసీమ జిల్లాను అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాగా పేరు మార్పు చేస్తూ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. దాదాపు మూడు గంటలపాటు సాగిన ఈ భేటీలో కేబినెట్‌ అజెండాలోని దాదాపు 42 కీలక విషయాలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

కేబినెట్‌ ఆమోదించిన అంశాలివే..
►ఈ నెల 27న అమలు చేయబోతోన్న అమ్మఒడి పథకానికి కేబినెట్‌ ఆమోదం
♦ 43 లక్షల 96వేల 402 మంది తల్లుల ఖాతాల్లోకి అమ్మఒడి నిధులు
►మరో 4 సంక్షేమ పథకాలకు కేబినెట్‌ ఆమోదం
►రాష్ట్రంలో రూ.15వేల కోట్లతో ఏర్పాటు కానున్న గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్ట్‌కు కేబినెట్‌ ఆమోదం
►జులైలో అమలు చేసే జగనన్న విద్యా కానుక, వాహన మిత్ర, కాపు నేస్తం పథకాలకు ఆమోదం
►వైద్య శాఖలో భారీగా ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్
►3,530 ఉద్యోగాలు మెడికల్ కాలేజీలు, ఆస్పత్రుల లో భర్తీ కి ఆమోదం
►15 వేల కోట్ల పెట్టుబడి పెట్టె ఆదాని గ్రీన్ ఎనర్జి ప్రాజెక్ట్ కు ఆమోదం
►దేవాలయాల కౌలు భూములు పరిరక్షణ చర్యలపై కేబినెట్ ఆమోదం
►వంశధార ప్రాజెక్ట్‌ నిర్వాసితులకు రూ.216 కోట్లు మంజూరుకు ఆమోదం
►అర్జున అవార్డు గ్రహీత జ్యోతి సురేఖకు గ్రూప్‌-1 డిప్యూటీ కలెక్టర్‌ ఉద్యోగం ఇచ్చేందుకు కేబినెట్‌ ఆమోదం
►జగనన్న ఎంఐజీ లే అవుట్ల అభివృద్ధి పాలసీకి కేబినెట్‌ ఆమోదం​
►మెడికల్‌ కాలేజీలు, ఆస్పత్రుల్లో 3,530 ఉద్యోగాల భర్తీకి ఆమోదం
►సంక్షేమ కేలండర్‌కు మంత్రి మండలి ఆమోదం
►ఆక్వాసాగు సబ్సిడీ 10 ఎకరాలు ఉన్నవారికి సైతం వర్తింపు
►పాత జిల్లాల జడ్పీ ఛైర్మన్ల కొనసాగింపునకు ఆమోదం
►సత్యసాయి జిల్లాలో 2వ పట్టణ పోలీస్‌స్టేషన్‌ ఏర్పాటు