రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపతి ముర్ముపై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు అబిడ్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటు రాంగోపాల్ వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ఆ గ్రహం వ్యక్తం చేశారు. ఆర్జీవీని వేస్ట్ ఫెలోతో పోల్చారు. ఆర్జీవీపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఆదివాసీ మహిళ రాష్ట్రపతిగా ఎన్నికకానున్న సమయంలో వర్మ ట్వీట్ బాధాకరమన్నారు. కాగా వర్మ తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకున్నారు. కించపర్చడం తన ఉద్ధేశం కాదన్నారు.