NRI-NRT

2023 తానా సభల కన్వీనర్‌గా పొట్లూరి రవి

Potluri Ravi As TANA 2023 Conference Convenor

2023 తానా మహాసభలు ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటరులో 2023 జులై 7 నుండి 9 వరకు నిర్వహించనున్నట్లు తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి తెలిపారు. ఈ మేరకు తానా కార్యవర్గం, బోర్డు ఆమోదం తెలిపాయని, కన్వీనర్‌గా పొట్లూరి రవి నియామకానికి కూడా ఆమోదం లభించిందని వెల్లడించారు. తానా ప్రాంతీయ ప్రతినిధిగా, కార్యదర్శిగా తానాలో రవి పలు పదవుల్లో సేవలందించారు. దాతలు, సభ్యుల సహకారంతో సభలను విజయవంతం చేయడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.