TNI చెప్పిందే జరిగింది. కొద్ది నెలల క్రితం తానాలో నూతనంగా చేరిన 35వేల మంది సభ్యులకు వచ్చే ఎన్నికల్లో ఓటు హక్కు లేకుండా పోయింది. నూతన సభ్యులకు ఓటు హక్కు కల్పించే విధంగా తానా బైలాలు సవరించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. గురువారం రాత్రి జరిగిన పాలకవర్గ సమావేశంలో అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి వర్గం ప్రవేశపెట్టిన తీర్మానం వీగిపోయింది. మొత్తం15మంది పాలకవర్గ సభ్యులలో ఏడుగురు సభ్యులు బైలా సవరణకు వ్యతిరేకంగా ఓటు వేశారు. ఆరుగురు సభ్యులు అనుకూలంగా ఓటు వేశారు. బండ్ల హనుమయ్య, జంపాల చౌదరిలు తటస్థంగా ఉండిపోయారు. దీంతో తీర్మానం వీగిపోయింది. దీనితో రానున్న ఎన్నికలలో పాల్గొందాం అని ఎంతో ఆశగా తానాలో సభ్యత్వం తీసుకున్న వారి ఆశలు నెరవేరకుండా పోయాయి.
తానాలో నూతన సభ్యులకు ఓటు హక్కు లేదు
Related tags :