NRI-NRT

అనిల్ నియామకం పట్ల తెరాస మలేషియా హర్షం

అనిల్ నియామకం పట్ల తెరాస మలేషియా హర్షం

హర్షం వ్యక్తం చేసిన తెరాస మలేషియా : గౌరవ అనిల్ కుర్మాచ‌లంకు తెలంగాణ చ‌ల‌న‌చిత్ర అభివృద్ధి సంస్థ చైర్మ‌న్ ప‌ద‌వి వ‌రించ‌డం ప‌ట్ల తెరాస మలేషియా అధ్య‌క్షుడు చిట్టి బాబు చిరుత హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్భంగా చిట్టి బాబు గారు మాట్లాడుతూ .. కార్పొరేష‌న్ చైర్మ‌న్ ప‌ద‌వి ఇవ్వ‌డం ఉద్య‌మ‌కారుడికి ద‌క్కిన గౌర‌వం అని పేర్కొన్నారు. అదేవిదంగా టీఆర్ఎస్ పార్టీలో ప‌ని చేసే ప్ర‌తి కార్య‌క‌ర్త‌ స్వదేశంలో ఉన్న లేదా విదేశాలలో ఉన్న స‌రైన స‌మ‌యంలో స‌ముచిత స్థానం క‌ల్పిస్తార‌న‌డానికి ఇది ఒక మంచి ఉదాహరణగా చెప్పొచ్చు అని చెప్పారు. ఈ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్‌ గారికి తెరాస మలేషియా ప‌క్షాన ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు ఈ కార్య క్రమంలో టి ఆర్ యస్ మలేషియా ఉపాధ్యక్షులు మారుతి కుర్మ, కార్యదర్శి గుండా వెంకటేశ్వర్లు, కోర్ కమిటీ సభ్యులు మునిగల అరుణ్, బొయిని శ్రీనివాస్, బొడ్డు తిరుపతి,గద్దె జీవన్ కుమార్, రమేష్ గౌరు, సందీప్ కుమార్ లగిశెట్టి, సత్యనారాయణరావ్ నడిపెల్లి, రవితేజ, రఘునాత్ నాగబండి, రవిందర్ రెడ్డి , హరీష్ గుడిపాటి, నవీన్ పాల్గొనడం జరిగింది.